Homeఅంతర్జాతీయంఎలాన్ మ‌స్క్ కి షాక్.. ఒక్క‌రోజే రూ.63వేల కోట్లు న‌ష్టం

ఎలాన్ మ‌స్క్ కి షాక్.. ఒక్క‌రోజే రూ.63వేల కోట్లు న‌ష్టం

ఏ ముహూర్తంలో ట్విట్టర్ ను కొన్నాడో కానీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ ను సమస్యలు చుట్టుముట్టి వేదిస్తున్నాయి. నిజానికి తనకు ఏమాత్రం సూట్ కాని ఈ వ్యాపారం కారణంగా తన సంపద విషయంలో నెంబర్ వన్ స్థానాన్ని కూడా కోల్పోయారు. తాజాగా ఈ మంగళవారం ఒక్కసారిగా 63 వేల కోట్ల రూపాయలు హరించుకుపోయాయి.

బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని ఊరికే అనలేదు పెద్దలు..ట్విట్టర్ కొనాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో కానీ ఎలాన్ మస్క్ సమస్యలు నానాటికీ తనను చట్టుముడుతూ చీకాకుపరుస్తున్నాయి. ఎక్కడో విశ్వాంతరాల గురించి ఆలోచిస్తూ అక్కడికి మానవాళిని తరలించాలనే ఆశయంతో ఉన్న మస్క్ ఇప్పుడు ట్విట్టర్ బాగోగులు, ఉద్యోగుల తొలగింపులు వాటి ద్వారా వచ్చే చీకాకుల గురించి మధనపడుతున్నారు.

ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం తన సంపదపై కూడా పడుతోంది. టెస్లా షేర్లు భారీగా పతనం కావడంతో మంగళవారం ఎలన్‌మస్క్ సంపద 7.7 బిలియన్ డాలర్లు నష్టపోయి, రెండేండ్ల కనిష్టం 148 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంటే రెండేండ్ల కనిష్టానికి ఎలన్‌మస్క్ సంపద పడిపోయింది. గత అక్టోబర్ తర్వాత టెస్లా స్టాక్స్ ఒక్కరోజులో అత్యధికంగా పతనం కావడం ఇదే ప్రధమం.

గతేడాది ఎలన్‌మస్క్ సంపాదించిన దానికంటే ఎక్కువగా ఈ ఏడాది 122.6 బిలియన్ల డాలర్ల వ్యక్తిగత సంపదను కోల్పోయారు. 2021లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సంపద కూడగట్టుకున్న వ్యక్తిగా నిలిచారు. ప్రస్తుతం ఎలన్‌మస్క్ వ్యక్తిగత సంపద 148 బిలియన్ల డాలర్లు మాత్రమే. ఇది రెండేండ్ల కనిష్టానికి సమానం. బ్లూంబర్గ్ బిలియనీర్ల సూచీ ప్రకారం ఎలన్ మస్క్‌.. బిలియనీర్ల జాబితాలో రెండో స్థానానికి పరిమితం అయ్యారు.

ప్రపంచంలోనే తొలి కుబేరుడిగా లగ్జరీ వస్తువుల బ్రాండ్ ఎల్వీఎంహెచ్ చైర్మన్ బెర్నార్డ్ అరాల్ట్ నిలిచారు. బెర్నార్డ్‌ ఆర్నాల్ట్ వ్యక్తిగత సందప 161 బిలియన్‌ డాలర్లు. భారత్‌కు చెందిన అదానీ గ్రూప్ చీఫ్ గౌతం అదానీ వ్యక్తిగత ఆదాయం 127 బిలియన్ డాలర్లతో మూడో ర్యాంకులో కొనసాగుతున్నారు.

ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాతోపాటు అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్‌మస్క్‌.. ట్విట్టర్‌ను టేకోవర్ చేసినప్పటి నుంచి కష్టాల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.. సోషల్ మీడియా దిగ్గజం జెయింట్ ట్విట్టర్ టేకోవర్ చేయడానికి టెస్లా షేర్లు విక్రయించిన ఎలన్‌మస్క్ వ్యక్తిగత సంపద హరించుకుపోతూనే ఉన్నది. అందుకే వరల్డ్ బిలియనీర్ల జాబితాలో తొలి కుబేరుడన్న పేరు సంపాదించుకున్న ఎలన్‌మస్క్‌..

ఇటీవలే ఆ లిస్ట్‌లో నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయారు. టెస్లా షేర్లు, ఆప్షన్ల రూపంలోనే ఎలన్‌మస్క్ సంపద అత్యధికంగా ఉంది. గత అక్టోబర్‌లో ట్విట్టర్‌ను సొంతం చేసుకోవడానికి ఎలన్‌మస్క్.. అందుకు అవసరమైన నిధుల కోసం టెస్లా షేర్లు విక్రయించారు. ఇటీవల 3.58 బిలియన్ డాలర్ల విలువ గల షేర్లు విక్రయించారు.

ఎందుకు విక్రయించరాదన్న సమాచారం తెలియకున్నా.. ట్విట్టర్ కొనుగోలు బకాయిలు చెల్లించడానికేనని వార్తలొచ్చాయి. ట్విట్టర్ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఎలన్‌మస్క్‌.. తన టైంలో అత్యధిక భాగం పట్టుదలగా ట్విట్టర్ బాగోగుల కోసమే కేటాయిస్తున్నారని ఆందోళనలో వాటాదారులు ఉన్నారు. టెస్లాను పూర్తిగా ఎలన్‌మస్క్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే భయం ఇన్వెస్టర్లలో నెలకొంది.

ట్విట్టర్ భవితవ్యంపై ఎలన్‌మస్క్ నిర్ణయాలు వివాదాస్పదం కావడంతో, దాని ప్రభావం టెస్లా షేర్ విలువ పడిపోతుందని భావిస్తున్నారు. అయితే నిజం అర్థం చేసుకున్న మస్క్ ‘ట్విట్టర్ సీఈవో పదవి నుంచి తప్పుకోవాలా?’ స్వయంగా ఎలాన్ మస్క్ పెట్టిన పోల్‭లో యూజర్లు గట్టి షాక్ ఇచ్చారు. సగానికి పైగా యూజర్లు ‘అవును.. తప్పుకోమనే సలహా ఇచ్చారు.

ఈ నిర్ణయం ప్రకారం తాను ట్విట్టర్ సీఈవో పదవి నుంచి దిగిపోనున్నట్లు మస్క్ ప్రకటించారు. సీఈఓగా వేరే వ్యక్తికి బాధ్యతలు అప్పగించిన తరువాత నేను ఆ పదవి నుంచి వైదొలుగుతానని మస్క్ తెలిపారు. ఆ తర్వాత సాప్ట్‌వేర్ అండ్ సర్వర్‌ల బృందాలను నడుపుతానంటూ ట్విటర్‌లో మస్క్ పేర్కొన్నారు. అయితే ఈ విషయమై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం స్పందించారు. వాస్తవానికి మస్క్ తీసుకున్న నిర్ణయం మంచిదేనని, పదవీ విరణ చేయడమే ఉత్తమమని తాను భావిస్తున్నట్లు ట్రంప్ అన్నారు. అయితే తాను ఓడిపోతానని తెలిసి కూడా ట్విట్టర్ సీఈవోగా కొనసాగాలా వద్దా అని మస్క్ పోల్ నిర్వహించారని ట్రంప్ తెలిపారు.

మంగళవారం వన్ అమెరికా న్యూస్ ఛానల్‭తో మాట్లాడిన సందర్భంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Must Read

spot_img