Homeఅంతర్జాతీయంతుఫాన్‌లను ఎలా గుర్తిస్తారు..? ఎలా అంచనా వేస్తారనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

తుఫాన్‌లను ఎలా గుర్తిస్తారు..? ఎలా అంచనా వేస్తారనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారింది. ఈ తుఫానుకు మాండూస్ అనే నామకరణం చేసిన వాతావరణ శాఖ అధికారులు.. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అయితే తుఫాన్‌ ఎలా వస్తుందనే విషయం అందరికి ఆసక్తికరంగా ఉంటుంది. తుఫాన్‌లను ఎలా గుర్తిస్తారు..? ఎలా అంచనా వేస్తారనే సందేహం చాలా మందిలో ఉంటుంది. వాతావరణ నిపుణులు తుఫాన్‌ను ఎలా తెలుసుకుంటారో చూద్దాం.

వాతావరణ శాఖ అధికారులు వర్షాల గురించి ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వాతావరణంలో జరుగుతున్న మార్పులను గమనిస్తుంటారు. కొన్ని సార్లు అధికారులు వాతావరణంలోకి బెలూన్లను వదులుతారు. ఆ బెలూన్‌లలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. వాటి ద్వారా అవి గాలి తీవ్రతను పసిగట్టి వాతావరణ కేంద్రంలోఉన్న కంప్యూటర్లకు సమాచారం చేరవేస్తాయి. అలాగే వాతావరణ కేంద్రాల్లో ట్రాపికల్‌ మీటర్లు ఉంటాయి. వాటి ద్వారా కూడా వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటారు. డాప్లర్‌ రాడార్‌ సిస్టమ్‌ ద్వారా గాలిలోని తేమ శాతాన్ని గుర్తిస్తారు. ఇక తీవ్ర ప్రాంతాల్లో ప్రతి వంద కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్లు ఉంటాయి.

అయితే వాటి పరిధిలోని ఎక్కడైనా ఒక్క మిల్లీ మీటర్‌ వర్షం పడినా వెంటనే రికార్డు చేసి వాతావరణ కేంద్రాలకు చేరవేస్తాయి. ఇది కాకుండా భారత వాతావరణ కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటుంది. వర్షాలు, తుఫాన్లపై సమాచారాన్ని ప్రకటిస్తూ ప్రజలను, అధికారులను అప్రమత్తం చేస్తుంటుంది.వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాతావరణ కేంద్రాలు కూడా ఎప్పటికప్పుడు వాతావరణంలో జరుగుతున్న మార్పులపై ప్రకటన విడుదల చేస్తుంటాయి.

వర్షాకాలం, తుఫాన్ల సమయంలో మరింత అప్రత్తంగా వ్యవహరిస్తుంటాయి. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా ముందస్తుగా ప్రత్యేక బులిటెన్‌ను విడుదల చేస్తుంటాయి. తుఫాన్‌లను ప్రాంతాల వారీగా పిలుస్తారు. దక్షిణ పసిఫిక్‌ సహాసముద్రం, హిందూ మహాసముద్రంలో ఏర్పడే అలజడులను సైక్లోన్‌ అంటారు.

లాగే ఉత్తర అట్లాంటిక్‌, మధ్య ఉత్తర పసిఫిక్‌, తూర్పు ఉత్తర పసిఫిక్‌ మహాసముద్రాలలో ఏర్పడే తుఫాన్‌లను హరికేన్‌లుగా పిలుస్తారు వాతావరణ నిపుణులు. ఇక వాయవ్య పసిఫిక్‌ మహాసముద్రంలో పుట్టే తుఫాన్‌లను టైఫూన్లుగా వ్యవహరిస్తారు. ఎక్కడైతే గాలులు ఉంటాయో ఆ ప్రాంతాన్ని అధిక పీడనం అంటారు. అతి తక్కువ గాలులు ఉంటే దానిని అల్పపీడనం అంటారు. ఈ రెండు పీడనాలు కూడా గాల్లో కదలికల వల్లే ఏర్పడతాయని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు.

అయితే గాలుల్లో రెండు రకాల గాలులు ఉంటాయి. అవి వేడిగాలి, చల్లగాలి. వేడి గాలి తేలికగా ఉండి పైకి వెళ్తుంది. అదే చల్లగాలి నెమ్మదిగా కిందికి దిగుతుంది. భూ వాతావరణాన్ని సమీపించే కొలది ఈ గాలి చల్లబడుతుంది. గాల్లో ఉంటే ఆవిరి ఘనీభవించి మంచు స్పటికాలుగా ఏర్పడతాయి.

దట్టమైన మేఘాలు ఏర్పడతాయి. కొన్ని చోట్ల సుడులు తిరుగుతూ మరింత గాలిని గ్రహిస్తాయి.

ఈ అల్పపీడనం మరింతగా తీవ్రమైనట్లయితే వాయుగుండంగా మారుతుంది. ఇది బలపడిన తర్వాత తుఫాన్‌గా మారుతుంది. సముద్రంలో వేడెక్కి నీటి ఆవిరిని తుఫాన్లు గ్రహిస్తాయి. సముద్రంలో ఏర్పడే సుడుల వల్ల చల్లబడి దట్టమైన మేఘాలుగా ఏర్పడి తుఫాన్‌తో కలిసి ప్రయాణిస్తాయి. ఇక సముద్రంలో సుడులు రూపంలో ఉండే తుఫాన్‌.. భూ వాతావరణంలోకి ప్రవేశించడాన్ని తీరాన్ని తాకడం అంటారు. తుఫాన్‌ తీరాన్ని తాకగానే సుడుల రూపంలో ఉన్న మేఘాలు చెల్లచెదురై భారీ వర్షాలు కురుస్తాయి. ఈ సుడులకు కారణమైన గాలులు తీరంపైకి గంటకు 61 నుంచి 250 కిలోమీటర్ల కంటే వేగంగా ప్రయాణించగలవని చెబుతున్నారు.

తుఫాన్లు ప్రాంతాలు, వాటి ప్రభావం ఆధారంగా వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఆగ్నేయాసియా ప్రాంతాల్లో సైక్లోన్ అని, ఈశాన్య పసిఫిక్, అట్లాంటిక్ ప్రాంతాల్లో హరికేన్లు అని పిలుస్తుంటారు. హరికేన్‌లు, టైపూన్‌ల మధ్య తేడాని గాలి వేగాన్ని బట్టి అంచనా వేస్తారు. గాలి వేగం గంటకు 100 కిలోమీటర్లు మించినట్లయితే అది హరికేన్‌ అని, గాలి వేగం అంతకన్నా తక్కువగా ఉంటే టైపూన్ అని పిలుస్తుంటారు. ఇవి ఎక్కువగా బంగాళాఖాతం, హిందూ మహా సముద్రాల్లో ఏర్పడుతుంటాయి.

ఈ ప్రక్రుతి వైపరీత్యాలు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా తీవ్రరూపం దాలుస్తున్నాయి. గతంలో కన్నా భారీగా అపారమైన శక్తి కలిగి ఉంటున్నాయి. అకాల వర్షాలు మెరుపు వరదల కారణంగా పెద్ద సంఖ్యలో జనం ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

Must Read

spot_img