HomePoliticsఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఏమేరకు సక్సెస్ అవుతుంది..?

ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఏమేరకు సక్సెస్ అవుతుంది..?

ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఏమేరకు సక్సెస్ అవుతుందన్నదే హాట్ టాపిక్ గా మారింది. క్రిస్మస్ తర్వాతి నుంచి విస్తరిస్తామన్న వార్తలు .. చర్చనీయాంశంగా మారాయి. మరి ఏపీలో బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటన్న చర్చ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

భారత రాష్ట్ర సమితికి సంబందించిన కిసాన్ సెల్ కార్యకలాపాలను ముందుగా ఆరు రాష్ట్రాల్లో ప్రారంభించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో ముందుకు పోవాలని పార్టీ అధికారిక ఆవిర్భావం నాడు హైద్రాబాద్లో ప్రకటించిన అధినేత కేసీఆర్
అందుకు అనుగుణంగా ముందస్తుగా 6 రాష్ట్రాల్లో బిఆర్ఎస్ కిసాన్ సెల్ లను ప్రారంభించాలని నిర్ణయించారు.

ఈ మేరకు కసరత్తులు పూర్తి చేసుకుని క్రిస్మస్ పండగ అనంతరం ఆయా రాష్ట్రాల్లో కార్యకలాపాలను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఉత్తర భారతం, ఇటు తూర్పు, మధ్య భారతాలకు చెందిన పలు రాష్ట్రాలనుంచి అనేకమంది మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ రాజకీయ నాయకులు, తమ టీం లతో, అనుచరులతో వచ్చి స్వయంగా అధినేత కేసీఆర్ తో సంప్రదింపులు జరిపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆయా రాష్ట్రాల్లోని భౌగోళిక సామాజిక సాంస్కృతిక పరిస్థితులను అనుసరించి అక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు ఎటువంటి విధానాలను అవలంభించాలో వారికి కేసీఆర్ వివరిస్తున్నారు. ఈ నెలాఖరుకల్లా పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిస్సా, సహా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బిఆర్ఎస్ కిసాన్ సెల్ లను ప్రారంభించనున్నారు.

భారత రాష్ట్ర సమితి కిసాన్ సెల్ బాధ్యతలు చేపట్టేందుకు ఏపీ నుంచి కూడా పలువురు ఆసక్తి చూపిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. సిఎం
కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీలో పనిచేయడానికి తమకు అవకాశం కల్పించాలని ఇప్పటికే ఢిల్లీలో ఇటు హైద్రాబాద్ లో అధినేత కేసీఆర్ తో
ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు చర్చలు సంప్రదింపులు జరుపుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

ఆంధ్రాలోని పలు జిల్లాల్లో బిఆర్ ఎస్ కిసాన్ సెల్ ను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు. అధినేత ప్రకటన అనంతరం ఆంధ్రాలో బిఆర్ కె ఎస్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు కన్నడ, ఒరియా, మరాఠా,వంటి పలు భారతీయ భాషలకు చెందిన రచయితలు, సాహితీవేత్తలు, పాటల రచయితలతో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు.

బిఆర్ఎస్ పార్టీ చేపట్టబోయే కార్యాచరణ గురించి భావజాల వ్యాప్తి కోసం సన్నాహాలు చేస్తున్నారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో
అందుకోవాల్సిన గుణాత్మక మార్పులు ఏమిటి.? ఈ దేశ సకల జనులకు సబ్బండ వర్గాల ఆకాంక్షలకు చిరునామాగా బిఆర్ఎస్ ఎట్లా నిలవనుంది ?
వంటి అంశాలను భాషా సాహిత్యాలు రచనలు పాటల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించారు.

అంతేగాక బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడలేదు. డిసెంబర్ నెలాఖరున ఢిల్లీ వేదికగా జాతీయ మీడియాతో కెసిఆర్ భేటీ కానున్నారు. ఢిల్లీ లో నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసి బిఆర్ఎస్ పార్టీ సిద్దాంతాలు భవిష్యత్తు కార్యాచరణ సహా విధి విధానాలను ప్రకటించనున్నారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు లక్ష్యంవైపు దూసుకుపోతున్నారు.


ఒకవైపు కేంద్రం దర్యాప్తు సంస్థలతో దూకుడు పెంచుతున్నా.. గులాబీ బాస్‌ మాత్రం ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు. ఇటీవల దేశ రాజధానిలో భారత్‌
రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్‌.. తాజాగా పార్టీ విస్తరణపై దృష్టి సారించారు. డిసెంబర్‌ నెలాఖరు నుంచి బీఆర్‌ఎస్‌
కార్యకలాపాలు దేశ వ్యాప్తంగా నిర్వహించేలా ప్లాన్‌ రూపొందిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాలు ప్రారంభించాలని బీఆర్‌ఎస్‌ అధినేత
భావిస్తున్నారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి పార్టీ కేంద్ర కార్యలయంలో వివిధ పార్టీల నేతలు రైతు సంఘాల నేతలతో వరుస భేటీలు జరిపే అవకాశం ఉంది.


అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అన్న నినాదంతో ముందుకు పోవాలని పార్టీ ఆవిర్భావం రోజు హైదరాబాద్‌లో కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇందుకు అనుగుణంగా ముందుగా ఆరు రాష్ట్రాల్లో పార్టీ అనుబంధంగా భారత రాష్ట్ర కిసాన్‌ సమితి విభాగాలను ప్రారంభించాలని నిర్ణయించారు.
కేసీఆర్‌ జాతీయ పార్టీపై ఇప్పటివరకు ఎవరూ పెద్దగా స్పందించడం లేదు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రమే కేసీఆర్‌కు మద్దతు ఇస్తున్నారు. కేంద్ర కార్యాలయం ప్రారంభం తర్వాత బీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు ఉంటాయని గులాబీ బాస్‌ భావించారు. కానీ పరిస్థితి భిన్నంగా ఉంది. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం పంపినా చాలామంది దూరంగా ఉన్నారు.

దీంతో పార్టీని విస్తరించాలంటే ముందు చేరికలు జరపాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. వచ్చే ఏడాది మొదటి నెల నుంచే చేరికలు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. అప్పుడే మరింత వేగంగా బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలు విస్తారిస్తాయని చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్‌ తన వాణి వినిపిస్తూ.. దేశ ప్రజలను ఆకర్షిస్తూ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి..!

ఇతర రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రమైన ఏపీ ప్రజలు, రాజకీయ నాయకులను ఆకర్షిస్తోందని బీఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌లో తాము భాగస్వాములమవుతామని ఏపీతోపాటు పలు రాష్ట్రాల నేతలు ముందుకు వస్తున్నారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లోని పలు జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ను ప్రారంభించడానికి రంగం సిద్దం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.


ఉత్తరాంధ్ర సహా పలు జిల్లాల నుంచి ఇప్పటికే 70–80 మంది ప్రముఖులు కేసీఆర్‌ను సంప్రదించినట్లు వెల్లడించాయి. ఏపీతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూడా పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సుముఖత చూపుతున్నారని పేర్కొన్నాయి. చంద్రబాబు తెలంగాణలో అడుగుపెడుతున్న సమయంలో కేసీఆర్ తాము ఏపీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయాన్ని మీడియాకు లీక్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి బీఆర్ఎస్ లో చేరేందుకు.. పని చేసేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారని.. బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఓ
ప్రముఖుడ్ని బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్ష పదవికి ఖరారు చేశామని.. క్రిస్మస్ తర్వాత ప్రకటిస్తామని చెబుతున్నారు. అయితే మిగతా రాష్ట్రాల
సంగతేమో కానీ.. ఏపీలో బీఆర్ఎస్ కిసాన్ సెల్ కార్యకలాపాలు ప్రారంభమైతే.. అక్కడ బీఆర్ఎస్ రాజకీయం ప్రారంభమైనట్లే అనుకోవచ్చు.

క్రిస్మ‌స్ త‌రువాత ఏపీలో బీఆర్ ఎస్ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించేలా కేసీఆర్ ఇప్పటికే ఓ ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. ఆ ప్రణాళికలో భాగంగానే బీఆర్ఎస్ ఏపీ
బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు అప్పగించారు. ఏపీలో ప్ర‌స్తుతం అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు బీజేపీకి
అనుకూలంగానే ఉన్నాయి. ఈ క్ర‌మంలో బీజేపీ వ్యతిరేక వర్గాన్ని క‌లుపుకొని బీఆర్ఎస్‌ను ఏపీలో విస్త‌రించాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు.

క్రిస్మ‌స్ త‌రువాత బీఆర్ఎస్ ఏపీ కిసాన్ సెల్ ను ఏర్పాటు చేయ‌నుబోతున్న‌ట్లు కేసీఆర్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ఏపీలో ముఖ్యంగా
తెలుగుదేశం ను టార్గెట్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. టీడీపీలోని కీల‌క నేత‌లతో కేసీఆర్‌కు ఎప్ప‌టినుంచో మంచి సంబంధం ఉంది. ఈ క్ర‌మంలో
వారిలో కొంద‌రిని బీఆర్ ఎస్‌లోకి తీసుకొస్తారన్న ప్రచారం గత కొంత కాలంగా జ‌రుగుతోంది.

అయితే కేసీఆర్ నేరుగా ఏపీకి వెళ్లి కిసాన్ సెల్ ను ఏర్పాటు చేస్తారా? లేదా అక్క‌డి నేత‌లే కిసాన్ సెల్ గా ఏర్పాట‌వుతారా అన్న విషయంలో స్పష్టత లేదు. కానీ కేసీఆర్ ఏపీకి వ‌స్తే రాజ‌ధానిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. కేసీఆర్ ఏపీ రాజ‌ధానిపై ఓ స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చారని అంటున్నారు. అయితే ఆ నిర్ణయం ఏమిటన్నదే ఇంకా తేలాల్సి ఉంది. అంతేగాక దీనిపై ఏపీ ప్రజల మద్ధతు లభిస్తుందా అన్నది వంద డాలర్ల ప్రశ్నగా సర్వత్రా వినిపిస్తోంది.

మరి బీఆర్ఎస్ కిసాన్ సెల్ ఏమేరకు ప్లస్ అవుతుందో వేచి చూడాల్సిందే..

Must Read

spot_img