- మనం తీసుకునే ఆహారంలో ఎనర్జీని క్యాలరీల్లోనే ఎందుకు కొలుస్తారు..?
- మనం ఖచ్చితంగా ఎన్ని క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తిన్నామో చెప్పడం సాధ్యమేనా..?
సుమారు శతాబ్దంకు పైగా వాడుకలో ఉన్న క్యాలరీ రాకతో ఆహారంపై మన ఆలోచనల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయా..? ఇంతకూ క్యాలరీ అంటే ఏమిటి? దీని ప్రభావం ఏమిటి…? మనం ఆహారం తీసుకునే సమయంలో ఉన్న క్యాలరీలు పూర్తిగా శరీరానికి ఉపయోగపడతాయా..?
కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు.. చాలా మంది వ్యక్తులు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఎక్కువ మంది కొత్త సంవత్సరంలో తీసుకొనే నిర్ణయాల్లో బరువు తగ్గించుకోవడం కూడా ఒకటి. దీని కోసం కొంతమంది తాము ఏం తింటున్నాం..? అనే విషయంలో జాగ్రత్త వహిస్తారు. మరికొందరు వ్యాయామం చేస్తుంటారు.
మనం తీసుకునే ఆహారంలో ఎనర్జీని క్యాలరీల్లో కొలుస్తారు. క్యాలరీలను లెక్కించడం ద్వారా మనం తీసుకొనే ఆహారాన్ని తగ్గించుకోవచ్చని, ఫలితంగా బరువు తగ్గొచ్చని చాలా మంది భావిస్తారు. అయితే, ఇది సరైన విధానం కాదా..? ఈ విషయంలో మనం మరోసారి ఆలోచించి
నిర్ణయం తీసుకోవాలా?

‘‘ఇది చాలా పాత పద్ధతి. అంతేకాదు ప్రమాదకరమైనది కూడా’’ అని కొందరు నిపుణులు చెబుతున్నారు. శక్తిని క్యాలరీల్లో కొలుస్తారు. ఒక ఆహారంలో పోషక విలువలను క్యాలరీలను పరిశీలించి తెలుసుకోవచ్చు. లాటిన్ పదం క్యాలర్ నుంచి క్యాలరీ వచ్చింది. క్యాలర్ అంటే ఉష్ణం. దాదాపు శతాబ్దం నుంచి ఈ పదం వాడుకలో ఉంది.
‘‘ఒక లీటరు నీటిలో ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణాన్ని పెంచేందుకు అవసరమయ్యే ఉష్ణాన్ని క్యాలరీగా నికోలస్ క్లీమాంట్ నిర్వచించారు’’అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని మాలిక్యులర్ న్యూరోఎండోక్రైనాలజీ ప్రొఫెసర్ డా. గిల్స్ యోవో వెల్లడించారు.. 19వ శతాబ్దంలో క్యాలరీ అనే పదాన్ని ఫ్రెంచ్ శాస్త్రవేత్త క్లీమాంట్ తొలిసారి తన ప్రసంగాల్లో ఉపయోగించారు. ఆహారంలో క్యాలరీలను కొలవడం అనేది సమాజంలో ఒక విప్లవాత్మక మార్పుగా మొదలైంది.
‘‘మనం తీసుకునే ఆహారానికి మన జాతి, చుట్టుపక్కల వాతావరణంతో సంబంధం ఉండేది. ఇక్కడ సదరు వ్యక్తి తరగతి, జెండర్ కూడా ప్రధాన పాత్ర పోషించేవి. ఏ రెండు జాతుల ఆహారాన్ని మనం పోల్చలేం కానీ, క్యాలరీల కొలతలతో ఈ విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. రెండు ఆహారాల మధ్య పోలిక కూడా
సాధ్యపడింది’’అని బ్లూమింగ్టన్‌లోని ఇండియానా యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్టడీస్, హిస్టరీ విభాగం ప్రొఫెసర్ నిక్ కల్లాథెర్ వివరించారు.
క్యాలరీల రాకతో ఆహారంపై మన ఆలోచనల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఆహారాన్ని ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, మైక్రోన్యూట్రియంట్లు, కొవ్వులు ఇలా చూడటం మనం మొదలుపెట్టాం. నేడు శరీరాన్ని ఒక యంత్రంగా చూస్తున్నాం. ఇక్కడ ఆహారమే ఇంధనం. ఈ ఆలోచనా విధానంతో మనం ఆహారాన్ని చూసే తీరులో చాలా మార్పులు వచ్చాయి. 20వ శతాబ్దంలో ప్రభుత్వ విధానాలనూ క్యాలరీలు ప్రభావితం చేయడం మొదలుపెట్టాయి.
1920, 1930లలో తమ నావికులు పాటించాల్సిన ఆహార నియమాలలపై జపాన్ నౌకా దళం ఒక నియమావళిని కూడా విడుదల చేసింది. ఇది యూరోపియన్ ఆహార ప్రమాణాలకు అనుగుణంగా ఉండేది. గోదుమలు, పంది మాంసం, కోడి మాంసాలను కూడా వారి ఆహారంలో చేర్చారు. దీనిపై జపాన్‌లో పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చారు. నేడు మనం ఆస్వానిస్తున్న జపాన్ వంటకాల్లో చాలా వరకు ఈ మార్పుల నుంచే వచ్చినట్లుగా కొందరు విశ్లేషకులు చెబుతుంటారు.
కరవుతో ప్రభావితం అవుతున్న ప్రాంతాలకు ఎంత ఆహారం అవసరమో లెక్కించేందుకు క్యాలరీలను ప్రభుత్వ విధానాల్లో కలపడాన్ని అమెరికా మొదలుపెట్టింది. దీని నుంచే ఒక వయోజనుడు రోజుకు 2,500 క్యాలరీలు తీసుకోవాలనే నిబంధన వచ్చింది. పురుషులకు 2,500, మహిళలకు 2,000 క్యాలరీలు రోజుకు అవసరం అనే ప్రమాణాన్ని నేడు చాలా దేశాలు అనుసరిస్తున్నాయి. క్యాలరీలను లెక్కించే విధానం పాతబడిందని కొందరు నిపుణులు అంటున్నారు.
భిన్నమైన ఆహారాలకు ఒకేలాంటి క్యాలరీ విలువ ఉండేటప్పటికీ, వీటి నుంచి వచ్చే ఆరోగ్య లేదా పోషక ప్రయోజనాలు ఒకేలా ఉండకపోవచ్చు. ఉదాహరణకు ఒక గ్లాసు పాలలో 184 క్యాలరీలు ఉంటాయి. అదే గ్లాసు బియర్‌లో క్యాలరీలు 137 మాత్రమే ఉంటాయి. ‘‘మనం ఆహారాన్ని తింటాం. క్యాలరీలు కాదు. క్యాలరీలు శరీరానికి అందాలంటే మన శరీరం పనిచేయాల్సి ఉంటుంది. అసలు మీరు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ ముఖ్యం. క్యారట్, డోనట్, మాంసం ఇలా ఒక్కో ఆహారం నుంచి కేలరీలను శరీరం తీసుకునే విధానం ఒక్కోలా ఉంటుంది..
- సూపర్ మార్కెట్‌లో కనిపించే ప్యాకెట్లపై దానిలో ఎన్ని క్యాలరీలు ఉన్నాయో రాసి వుంటుంది..
కానీ, అది తీసుకోవడంతో మన శరీరానికి ఎన్ని క్యాలరీలు అందుతాయో లేదా ఎన్ని క్యాలరీలను మన శరీరం తీసుకోగలుగుతుందో దానిపై ఉండదు.
‘‘ఉదాహరణకు మనం తీసుకునే 100 క్యాలరీల ప్రోటీన్లలో 70 క్యాలరీలు మాత్రమే శరీరానికి అంతాయి. మిగతా 30 శాతం ప్రోటీన్ క్యాలరీలు ఆ 70 శాతం
క్యాలరీలను శరీరం తీసుకునే ప్రక్రియలో ఖర్చు అవుతాయి.. ‘‘అదే సమయంలో కొవ్వుల్లో ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఇవి మెరుగ్గా శరీరానికి అందుతాయి. ప్రతి వంద క్యాలరీల కొవ్వులో మన శరీరం 98 క్యాలరీలను తీసుకోగలుగుతుంది..
సాధారణ పరిభాషలో చెప్పుకోవాలంటే.. వంద క్యాలరీల క్యారెట్ తీసుకున్నప్పటి కంటే వంద క్యాలరీల చిప్స్ తీసుకున్నప్పుడు ఎక్కువగా శరీరానికి క్యాలరీలు అందుతాయి. అసలు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో తెలుసుకోకుండా, క్యాలరీలను లెక్క పెట్టుకోవడం వృథా ప్రయాస అవుతుంది.. అయితే, ఈ సమస్య ఇక్కడితో ఆగిపోలేదు. ఒక ఆహారం నుంచి ఎన్ని క్యాలరీలను మన శరీరానికి అందుతాయి అనే దానిపై మన వయసు, నిద్రపోయే సమయం, మన కడుపులోని బ్యాక్టీరియా, శరీరంలోని హార్మోన్ స్థాయిలు, ఆహారాన్ని ఎలా నములుతున్నాం….? లాంటి చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి.
ఇక.. బాగా ప్రాసెస్ చేసిన ఆహారంలో ప్రోటీన్లు, ఫైబర్లకు బదులుగా కొవ్వులు, షుగర్‌లు ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి మనకు క్యాలరీలు అందుతాయి. కానీ, వీటిలో పోషక విలువలు ఉండవు. ‘‘క్యాలరీలు మీకు లెక్కలు చెబుతాయి. అంతేకానీ, పోషక విలువల వెల్లడించవు. అందులో కొవ్వు ఎంత? షుగర్ ఎంత? ఫైబర్ ఎంత? కార్బోహైడ్రేడ్లు ఎన్ని? విటమిన్లు ఎన్ని? లాంటి వివరాలు తెలియజేయవు.
నిజానికి క్యాలరీలను కొలవడం అనేది ఒక బండ లెక్క లాంటిది..ఇలా లెక్కించుకుంటూపోతే మనం అనారోగ్యకర విధానాలకు అలవాటుపడే ముప్పుంది.. ప్రమాదకరం’’ అని కార్నెల్ యూనివర్సిటీలోని అమెరికన్ ఫుడ్ కల్చర్, హిస్టరీ నిపుణులు ఆండ్రినే రోజ్ బిటార్ కూడా హెచ్చరించారు. క్యాలరీలు తగ్గించుకునే చర్యలతో మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని ఆమె వెల్లడించారు..
‘‘ఆల్కహాల్ తరహాలో ఆహారాన్ని మీరు తీసుకోవడం మానేయకూడదు. క్యాలరీలను ఒక్కసారిగా తగ్గించేస్తే అనారెక్సియా, బులిమియా, ఆర్థోరెక్సియా లాంటి రుగ్మతలు వస్తాయి’’ అని ఆమె హెచ్చరించారు. కొంతమంది ఒక్కసారిగా ఆహారం తీసుకోవడం తగ్గించేయాలని సూచిస్తారని, లేదా తక్కువ క్యాలరీల ఆహారానికి మారాలని చెబుతున్నారని.. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని ఆమె అన్నారు.
ఆహారంలో క్యాలరీలను పక్కన పెడితే, సాధారణంగా ఎనర్జీని జౌల్స్‌లో కొలుస్తారు. కొన్ని ఆహార కంపెనీలు కూడా ప్యాకెట్లపై జౌల్స్‌లో లెక్కలు ఇస్తున్నాయి.
అయితే, క్యాలరీలు అనేవి ప్రజల్లోకి చాలా ఎక్కువగా వెళ్లిపోయాయి. అసలు వీటి గురించి ఏమీ తెలియని వారు కూడా క్యాలరీలు ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుందని తెలుసుకుంటున్నారు. అందుకే క్యాలరీ లెక్కలను పూర్తిగా పక్కన పెట్టేయకూడదని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ కు చెందిన బ్రిడ్జెట్ బెనెలమ్ లాంటి నిపుణులు చెబుతున్నారు .
‘‘నేడు దేశాలను పీడిస్తున్న ప్రధాన సమస్యల్లో ఊబకాయం ఒకటి. ప్రజలను ఊబకాయులుగా మారుస్తున్నది ఏమిటో తెలుసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. కొంతమంది బరువు తగ్గాలని భావించేవారికి ఈ లెక్కలు చాలా ఉపయోగపడతాయి.. ప్రజలు ఏం తింటున్నారు? క్యాలరీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనేవి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు ప్రజలు చాలా సంతృప్త కొవ్వులను తీసుకుంటే మనం ఆ కొవ్వుల నుంచి వారికి శరీరానికి ఎన్ని క్యాలరీలు అందుతున్నాయో లెక్కపెట్టాలి. అంటే ఇక్కడ క్యాలరీలతో పాటు వారు తీసుకునే ఆహారాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది..
మనం తీసుకునే క్యాలరీలు ఖర్చుపెడుతున్న క్యాలరీలకు అనుగుణంగా ఉండాలని బ్రిటన్‌లోనే నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది. ఒకవేళ మనం ఒక రోజు ఎక్కువగా ఆహారం తీసుకుంటే.. మరుసటి రోజు ఆహారం కాస్త తగ్గించాలని సూచిస్తోంది.
ఆహారంలో శక్తిని
క్యాలరీలలో కొలవడం మొదలైనప్పటి నుంచి మన ఆలోచనల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఆహారాన్ని ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, మైక్రోన్యూట్రియంట్లు, కొవ్వులు ఇలా చూడటం మనం మొదలుపెట్టాం. నేడు శరీరాన్ని ఒక యంత్రంగా చూస్తున్నాం. ఇక్కడ ఆహారమే ఇంధనం. ఈ ఆలోచనా విధానంతో మనం ఆహారాన్ని చూసే తీరులో చాలా మార్పులు వచ్చాయి.