ఈ పురుషాధిక్య ప్రపంచంలో ఎన్నో వింత ఆచారాలు సంప్రదాయాలు మత విశ్వాసాలు రాజ్యమేళుతున్నాయి. అందులో ఒకటి బహు భార్యత్వం. చాలా దేశాలలో భర్తలు తమ అర్హతలను బట్టి నలుగురు భార్యలను కలిగి ఉండేందుకు అనుమతులున్నాయి. అయితే ఇందుకు పూర్తి విరుద్ధంగా మహిళలకు ఒకరికన్నా ఎక్కువ భర్తలు కలిగి ఉండటమనే ఆచారం కూడా ఇంకా కొనసాగుతోంది. ఇది ప్రపంచంలో ఓ అయిదు దేశాలలో కనిపిస్తుంది.
నైజీరియా, నేపాల్, టిబెట్, చైనాలోని కొన్ని ప్రాంతాలు, భారతేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో ఇద్దరు సోదరులు ఒకే మహిళలను పెళ్లి చేసుకోవడం ఆచారంగా వస్తోంది. వారితో సహజీవనం అన్నది అక్కడ సాధారణ విషయంగానే పరిగణిస్తున్నారు. ఉత్తర నైజీరియాలో కొన్ని గిరిజన ప్రాంతాలలో పాలియాండ్రీ ఇప్పటికీ కొనసాగుతోంది. అక్కడ సంప్రదాయం మేరకు ఎక్కువ మంది భర్తలను కలిగి ఉంటారు. వారిని కో హస్బెండ్స్ అని వ్యవహరిస్తారు.
ఇది అక్కడ 1968లో చట్టంగా రూపొందింది. మహిళ తన భర్తలకు సంబంధించిన వేరు వేరు ఇళ్లలో తనకు ఇష్టమున్నట్టుగా కాపురాలు చేస్తుంది. ఎవరికి జన్మించిన పిల్లలకు ఆ తండ్రులకే బాధ్యత ఉంటుంది. అది మహిళ నిర్ణయించిన భర్తనే నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో తగాదాలు రావడం అక్కడ జరుతూ ఉంటుంది. ఇందుకు సమ్మతించిన దక్షిణాఫ్రికా జనం.. ఇప్పుడు భార్య ఒకరిని మించి భర్తల్ని కలిగి ఉండే అధికారాన్ని ససేమిరా అంటున్నారు. ఇప్పటికే ఇక్కడ బహు భార్యత్వం చట్టంగా ఉంది.
ఇప్పుడు కొత్తగా అది మహిళలకు కూడా వర్తింపచేయాలనే ఆలోచన..సౌతాఫ్రికాలో పెళ్లిళ్ల వ్యవస్థకు భారీ సంస్కరణగానే అంతా చూస్తున్నారు. ప్రభుత్వ ప్రతిపాధనను కన్జర్వేటివ్ లు, కొన్ని మతపరమైన గ్రూపులు వ్యతిరేకిస్తున్నాయి. మగవారికి ఉండే పాలిగమీ లాంటి హక్కును మహిళలకు కూడా ఇస్తే వ్యవస్థ సర్వనాశనమౌతుందని నేతలు చెబుతున్నారు.
వారికి పుట్టే పిల్లలకు తండ్రి ఎవరనే ప్రశ్నకు సమాధానం ఎవరిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఏ విధానంలో ఆ పిల్లలకు తండ్రిని నిర్ణయించడంలో సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఓ మహిళ పురుషుడి పాత్ర పోశించడం ఆచరణలో సాధ్యం కాదని అంటున్నారు.. రేపు కన్యాశుల్కం లాంటిది రావడంతో పాటు ఇంటిపేరు నిర్ణయించడం అసాధ్యంగా మారుతుందన్నారు. మేధావులు సైతం ఈ ప్రతిపాధన పట్ల అయిష్టత చూపిస్తున్నారు.
అయితే ఆఫ్రికా అంతటా ఈ సంస్కృతి కారణమో లేక మతం రీత్యానో బహుభార్యత్వం ఇంకా కొనసాగుతోంది. అనేక ఆఫ్రికా సమాజాలలో పిల్లలను సంపదగా భావించడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. మహిళలు, పురుషుల మధ్య సమానత్వం దిశగా దక్షిణాఫ్రికా చేసిన ఈ సంచలనాత్మక ప్రతిపాదన మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఓ కొత్త డిబేట్ కు దారి తీసింది.
ఇప్పటికే స్వలింగ వివాహాలు, బహు భార్యత్వం చట్టబద్ధమైన ఆ దేశంలో బహు భర్తృత్వాన్ని కూడా అనుమతించాలన్నదే తాజా ప్రతిపాదన. ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండేందుకు మహిళలకు చట్టపరంగా అనుమతిన్వివడం వివాహ వ్యవస్థను మరింత సమ్మిళితం చేస్తుందంటూ ఆ దేశ హోంశాఖ వ్యాఖ్యానించడాన్ని దేశవ్యాప్త పురుషజనం ఏమాత్రం అంగీకరించలేకపోతున్నారు. పైగా ఈ ప్రతిపాదనను కొట్టిపడేస్తున్నారు.
ఆఫ్రికా సంస్క్రుతిని దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలు భవిశ్యత్తులో చేయకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచదేశాలలో అమలవుతున్న రాజ్యాంగాలలో సౌతాఫ్రికా ఇప్పటికే చాలా ఉదారంగా వ్యవహరిస్తోంది. దానికి తగ్గట్టు ఒకరికంటే ఎక్కువ మంది భర్తలున్న మహిళలు, ఒకే కుటుంబంలోని సోదరులందరికీ ఒక్కరే భార్య విధానాలను చట్టబద్దం చేయాలని పలువురు ప్రభుత్వానికి అనేకసార్లు పిటిషన్లు సమర్పించారు.
దాంతో అన్ని రకాల వివాహాలతో పాటు పాలియాండ్రీని చట్టబద్దం చేసే క్రమంలో గ్రీన్ పేపర్లో ఈ వివాహాలకు చోటు కల్పించింది.
ముస్లిం, హిందూ, యూదు, రాస్తాఫేరియన్ పెళ్లిళ్లకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలి..!
అదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అయితే ముస్లిం, హిందూ, యూదు, రాస్తాఫేరియన్ పెళ్లిళ్లకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని కూడా ఇదే గ్రీన్ పేపర్ లో ప్రతిపాధించగా సంబంధిత వర్గాలు దానిని స్వాగతించాయి. అటు 1988లో టిబెట్ లో జరిగిన ఓ సర్వేలో అక్కడ 753 కుటుంబాలు ఇలా పాలియాండ్రీని పాటిస్తున్నారు. దక్షిణాఫ్రికాలోని కెన్యాలో ఓ మహిళ ఒకరిని మించి భర్తలను కలిగి ఉండే చట్టం గురించి ప్రతిపాదించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికి ఇది ప్రపోజల్ మాత్రమే..కానీ పురుషాధిక్య ప్రపంచం దీనిని ఎందుకో అంగీకరించడం లేదు.
మగవారు ఒకరిని మించి భార్యల్ని కలిగిఉండటాన్ని పాలిగమీ అంటారు. అంటే.. మన భాషలో బహుభార్యత్వం.. అయితే ఇదేమీ కొత్త విషయమేమీ కాదు..మన పురాణాలలోనే దీనిని గురించి మనం విన్నాం. ఒక్కసారి మహా భారత గ్రంధాన్ని గుర్తు చేసుకుంటే అందులో ద్రౌపదికి అయిదుగురు భర్తలున్నారు. దీనినే నేటి ఆధునిక ప్రపంచం పాలియాండ్రీ అని పిలుస్తోంది.
పాలియాండ్రీలో మహిళ ఇద్దరు పురుషులను లేదా మరికొంతమందిని భర్తలుగా స్వీకరించవచ్చు. ఉత్తరాది గిరిజన ప్రాంతాలైన హిమాచల్ ప్రాంతంలో పాలీయాండ్రీ విధానం కనిపిస్తుంది. కిన్నౌర్ లోని మైనారిటీ ప్రజలు దీనిని పాటిస్తున్నారు.
ఇక్కడ పాండవుల జీవన విధానాన్ని పాటిస్తుంటారని చెబుతున్నారు. అంటే పాంచాల రాజు కూతురైన ద్రౌపది అయిదుగురు భర్తలను పెళ్లి చేసుకున్న సంప్రదాయాన్ని వారు కంటిన్యూ చేస్తున్నారు. త్రేతాయుగంలో శ్రీ రాముడు ఏక పత్నివ్రతుడుగా ఆదర్శ పురుషుడైతే రాముడి తండ్రి, దశరథుడు ముగ్గురు భార్యలను కలిగి ఉంటాడు, కాని రాముడు మాత్రం ఒక భార్యనే పెళ్లాడతానని ప్రతిజ్ఞ చేశాడు.
కృష్ణుడు.. విష్ణువు యొక్క 8వ అవతారం, ఆయన 16 వేల మంది భార్యలను కలిగి ఉండటం గురించి చెబుతుంటారు. వేద కాలం అనంతరం, హిందూమతంలో బహుభార్యాత్వం కనుమరుగైందనే చెప్పాలి.
ఇప్పుడు దీన్ని అనైతికంగానే అంతా భావిస్తున్నారు, అయితే టిబెట్, నేపాల్, అరుణాచల్ ప్రదేశ్ లోని కొండ ప్రాంతాలలో బహుభార్యాత్వం ఇప్పటికీ ఆచరణలో ఉంది. అయితే భారత్ లోని వివాహ చట్టాలు వ్యక్తికి సంబంధించిన మతంపై ఆధారపడి పరిశీలించబడుతుంటాయి.
వేదాలు, హిందూ మతం తమకు తాముగా బహుభార్యాత్వాన్ని నిషేధించనప్పటికీ, హిందూ వివాహ చట్టం కింద హిందువులు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవులు, సిక్కులలో బహుభార్యాత్వం చట్ట వ్యతిరేకంగా చూస్తారు. భారత్‌లో ముస్లిం మతానికి చెందిన పురుషులు.. షరియా చట్టంని పాటిస్తున్నందు వల్ల బహు భార్యలను కలిగి ఉండటానికి అనుమతించబడుతోంది. ఏది ఏమైనా చివరాఖరున ‘సృష్టికి స్త్రీ పురుషుల అవసరాన్ని గుర్తించకతప్పదు.
నిజానికి ఆయా ప్రాంతాల్ని బట్టి, ఆ దేశాల అవసరాన్ని బట్టి సదరు సంప్రదాయాలు కొనసాగుతూ ఉంటాయి. కొన్ని దేశాలలోని గిరిజన తెగల్లో మగవారి జనాభా ఎక్కువగా ఉన్నప్పుడు ఆడవారి సంఖ్య తగ్గినప్పుడు.. అక్కడ బహు బర్త్రుత్వం తప్పనిసరిగా పాటిస్తుంటారు. మరో చోట మగవారి సంఖ్య తగ్గినప్పుడు ఆడవారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు బహు భార్యత్వాన్ని అంగీకరించే పరిస్తితి అనివార్యమౌతుంది.
సమాజం అవసరం కోసమే కొత్త సంప్రదాయాలు వెలుగు చూస్తాయి. పరిణామ క్రమంలో ఇలాంటి అపసవ్యతలు అనివార్యమనే చెబుతున్నారు మేధావులు.