Homeఅంతర్జాతీయంప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఎలా సంపాదిస్తారు..?

ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఎలా సంపాదిస్తారు..?

రాజకుటుంబం నుంచి ప్రిన్స్ హ్యారీ, మేఘన్ లు ఎందుకు బయటకొచ్చారు…? ఆ కుటుంబం నుంచి వైదొలిగినప్పుడు హ్యారీ, మేఘన్ లు ఏం కోల్పోయారు..? మేఘన్, హ్యారీలను ఏమని సంభోధిస్తారు..?

మేఘన్, హ్యారీలు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు…? మేఘన్, హ్యారీ డబ్బులు ఎలా సంపాదిస్తారు..? వారికి రాజకుటుంబం నుంచి డబ్బు ఇక ఎప్పటికీ అందదా..?

హ్యారీ, మేఘన్‌ ల వద్ద ఇంకా ఏమేం నిధులు ఉన్నాయి..?

డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ ససెక్స్.. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్‌ ల కొత్త డాక్యుమెంటరీ సిరీస్ మొదటి భాగం గురువారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.ఈ జంటకు ఇకపై రాజకుటుంబం నుంచి డబ్బు అందదు.. వాణిజ్య కార్యక్రమాల ఆధారంగానే వారు డబ్బు సంపాదించనున్నారు. ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌ లకు కామన్ ఫ్రెండ్ ద్వారా 2016లో పరిచయమైంది. ఆ తరువాత 2018లో వారు పెళ్లి చేసుకున్నారు. 2020 జనవరిలో హ్యారీ, మేఘన్ లు రాజకుటుంబ హోదాలను వీడి ఆ కుటుంబం నుంచి బయటకొచ్చారు.

రాచ హోదాలను వీడినప్పుడు వారు అందుకు కారణాలు చెబుతూ.. మీడియా చొరబాటు తమకు ఆగ్రహం తెప్పిస్తోందని.. అలాగే తమ ‘ససెక్స్ రాయల్’ బ్రాండ్ అభివృద్ధిని బకింగ్‌హామ్ ప్యాలస్ అడ్డుకుంటుండంతో విసుగు చెందినట్లు చెప్పారు.. దీని తరువాత హ్యారీ యువరాజుగా మిగిలిపోయారు. ఈ జంట తమ డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ ససెక్స్ బిరుదులను కొనసాగించారు.

అయితే, అప్పటి నుంచి హ్యారీ, మేఘన్ లను సంభోధించేటప్పుడు ‘హిజ్/హర్ రాయల్ హైనెస్’ అని వాడరు. అంతేకాదు, రాచహోదాలు వదులుకున్న తరువాత హ్యారీ తన సైనిక బిరుదులనూ వదులుకున్నారు. అందుకే క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలలో ఆయన యూనిఫాం ధరించలేదు. కాకపోతే హ్యారీ, డ్యూక్ ఆఫ్ యార్క్ లకు రాణి శవపేటిక దగ్గర సైనిక దుస్తులు ధరించి నిల్చునే అనుమతి దక్కింది. వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో స్నేహం కారణంగా ఏర్పడిన వివాదంతో ప్రిన్స్ ఆండ్రూ 2019లో రాయల్స్ నుంచి వైదొలిగారు.

డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ ససెక్స్ జూన్ 2020లో కాలిఫోర్నియాకు వెళ్లారు. తమ కుమారుడు ఆర్చీ పెంపకానికి, తమ కొత్త ఆర్కివెల్ ఫౌండేషన్‌పై దృష్టి పెట్టడానికి తమకంటూ సమయం కావాలని వారు చెప్పారు. ఈ జంట 2022 జూన్‌లో క్వీన్ ప్లాటినం జూబ్లీ వేడుకకు, సెప్టెంబర్‌లో జరిగిన ఆమె అంత్యక్రియల కోసం బ్రిటన్ తిరిగి వచ్చారు. అయితే హ్యారీ, మేఘన్‌లు కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి హాజరవుతారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు.

మేఘన్, హ్యారీ డబ్బులు ఎలా సంపాదిస్తారంటే మాత్రం టెలివిజన్, పాడ్‌ క్యాస్ట్‌ లు నుంచే అని తెలుస్తుంది.. ససెక్స్ మీడియా సంస్థ, ఆర్కివెల్ ప్రొడక్షన్‌ లు నెట్‌ఫ్లిక్స్ కోసం అనేక రకాల ప్రోగ్రామ్‌ లు చేస్తున్నాయి. ఇది సుమారు కోటి డాలర్ల విలువైన డీల్‌గా తెలుస్తోంది. ఆర్కివెల్ స్పాటిఫై కోసం పాడ్‌ క్యాస్టులే కాకుండా మహిళల గురించి ఆర్కిటైప్స్ సిరీస్ కూడా చేస్తోంది. 2021 మార్చిలో యూఎస్ ప్రెజెంటర్ ఓప్రా విన్‌ఫ్రేతో హ్యారీ, మేఘన్‌లు ఒక ఇంటర్వ్యూ చేశారు. అయితే దాని కోసం తమకు డబ్బులు చెల్లించలేదని వారు చెప్పారు.

హ్యారీ, మేఘన్‌ లు మానవ హక్కుల అవార్డు ను సైతం గెలుచుకున్నారు. మేఘన్ 2021లో ‘ది బెంచ్’ అనే పిల్లల పుస్తకాన్ని ప్రచురించారు. హ్యారీ ఆత్మకథ అయిన స్పేర్ 2023 జనవరి 10న ప్రచురించనున్నారు.పెంగ్విన్ రాండమ్ హౌస్ అనే ప్రచురణ సంస్థ.. ఒప్పందం ప్రకారం సెంటెబేల్, వెల్‌చైల్డ్ అనే స్వచ్ఛంద సంస్థలకు దాదాపు రూ. 13 కోట్లు , రూ. 3 కోట్లు విలువైన రెండు విరాళాలను అందజేస్తుంది.

ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌లు రాజకుటుంబం నుంచి వార్షిక ఆదాయం కోల్పోతున్నారు.

2021 మార్చిలో కాలిఫోర్నియా లైఫ్ – కోచింగ్ కంపెనీ బెటర్‌ అప్‌కి హ్యారీ “చీఫ్ ఇంపాక్ట్ ఆఫీసర్”గా నియమితులయ్యారు. ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌లు రాజకుటుంబం నుంచి వైదొలగినప్పుటి నుంచి వార్షిక ఆదాయం కోల్పోతున్నారు. రాచకుటుంబ హోదాల్లో ఉన్నపుడు హ్యారీ, మేఘన్‌లు తమ వార్షిక ఆదాయంలో 95 శాతం హ్యారీ తండ్రి చార్లెస్, అప్పటి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుంచి పొందేవారు.

2018-2019 ఆర్థిక సంవత్సరంలో.. చార్లెస్‌కు చెందిన డచీ ఆఫ్ కార్న్‌వాల్ ఎస్టేట్.. ససెక్స్, డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్‌ల ప్రైవేటు ఖర్చులు, పబ్లిక్ డ్యూటీస్ కోసం సుమారు రూ. 50 కోట్లు కంటే ఎక్కువ చెల్లించింది.అంతే కాకుండా పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చే సావరిన్ గ్రాంట్ నుంచి అదనంగా 5 శాతం లభించింది.. చార్లెస్ కార్యాలయం ప్రకటన ప్రకారం.. ఆర్థిక స్వాతంత్య్రం, వారి పరివర్తనకు మద్దతుగా “గణనీయమైన మొత్తాన్ని” వారికి ఇచ్చారు.

ప్రిన్స్ విలియం, కేట్‌లతో పాటు మేఘన్, హ్యారీ దంపతులు 2020 ఏప్రిల్, జూన్‌ల మధ్య సుమారు రూ. 45 కోట్లు అందుకున్నారని డచీ ఆఫ్ కార్న్‌వాల్ ఖాతాలు ధ్రువీకరిస్తున్నాయి. అయితే “ఆ నిధులు 2020 వేసవిలో నిలిచిపోయాయి.. అధికారిక విధుల నుంచి వైదొలిగితే డ్యూక్ అండ్ డచెస్ సీనియర్ రాజ కుటుంబీకుల కోసం ఎటువంటి భద్రత ఏర్పాట్లు ఉండవు. మొదటిసారి తను యూకేను వదిలి వెళ్లినపుడు పోలీసు రక్షణ లేకుండా తన కుటుంబాన్ని తీసుకురావడం చాలా ప్రమాదకరమని హ్యారీ వ్యాఖ్యానించారు.

2022 జూలైలో ఆ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేయడానికి హ్యారీకి అనుమతి లభించింది. 2018లో వివాహం చేసుకున్నప్పుడు హ్యారీ, మేఘన్‌ లకు క్వీన్ విండ్సర్‌ లోని ఫ్రాగ్‌మోర్ కాటేజీని ఇచ్చారు. పునర్నిర్మాణాలకు రూ.24 కోట్లను క్రౌన్ ఎస్టేట్ చెల్లించింది. అయితే ఆ జంట రాయల్స్ నుంచి వైదొలిగాక ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించారు.

1997లో తల్లి ప్రిన్సెస్ డయానా మరణించినప్పుడు మిగిలి ఉన్న దాదాపు రూ. 130 కోట్ల సంపదలో ఎక్కువ భాగాన్ని విలియం, హ్యారీ పొందారు. ఓప్రా విన్‌ఫ్రేతో హ్యారీ మాట్లాడుతూ.. ఆ డబ్బు తను అమెరికా వెళ్లడానికి సాయపడిందని తెలిపారు. “మా అమ్మ నా కోసం ఉంచిన డబ్బును నేను పొందాను. అది లేకుండా, మేం ఇదంతా చేయలేం.” అన్నారు. క్వీన్ తల్లి నుంచి లక్షల పౌండ్లను హ్యారీ వారసత్వంగా పొందారని కూడా భావిస్తున్నారు.

అయితే రాణి.. హ్యారీ కోసం డబ్బు ఉంచారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. కాగా, రాణి నటనకు గానూ డచెస్ ఆఫ్ సస్సెక్స్‌కు లీగల్ డ్రామా సూట్స్ ప్రతి ఎపిసోడ్‌కు దాదాపు రూ. 41 లక్షలను చెల్లించారు. ఆమె ఏడు సిరీస్‌లలో 100 కంటే ఎక్కువ ఎపిసోడ్‌లలో రాచెల్ జేన్‌గా నటించారు. ఇక మేఘన్ మార్కెల్ ఒక లైఫ్‌స్టైల్ బ్లాగ్‌ను నడుపుతున్నారు. కెనడియన్ఫ్యా షన్ బ్రాండ్ కోసం వస్తువులను సైతం రూపొందిస్తున్నారు మేఘన్..

ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌ లు రాజకుటుంబం నుంచి వైదొలిగారు.. వారికి రాజకుటుంబం నుంచి ఎలాంటి డబ్బు అందదు.. వాణిజ్య కార్యక్రమాల ఆధారంగానే వారు డబ్బు సంపాదించనున్నారు.

Must Read

spot_img