Homeఅంతర్జాతీయంయుద్దతంత్రంలో ఆరితేరిన ఇజ్రాయెల్..

యుద్దతంత్రంలో ఆరితేరిన ఇజ్రాయెల్..

దక్షిణాసియాలో చిన్న దేశమైన ఇజ్రాయెల్.. తన యుద్దతంత్రంతో ప్రపంచాన్నే తనవైపు చూసేలా చేసింది.. శాస్త్రసాంకేతిక రంగంలో దూసుకుపోతున్న ఇజ్రాయెల్.. టెక్నాలజీ సహాయంతో యుద్దం చేసి.. అగ్రరాజ్యాలను సైతం షాక్ కు గురిచేసింది..

యుద్దతంత్రంలో ఆరితేరిన ఇజ్రాయెల్.. పాలస్తీనాకు చెందిన గాజ ను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించింది.. ఇజ్రాయెల్ యుద్దంలో ఎలాంటి నైపుణ్యాన్ని ఉపయోగిస్తోంది..? చిన్న దేశమైన ఇజ్రాయెల్ ప్రపంచానికి యుద్దరీతుల్ని ఎలా చెప్పగలుగుతుంది..?

కళ్ళు ఉన్నవాడు ముందు చూస్తాడు. దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు. దీనిని ఇజ్రాయెల్ నిజం చేసి చూపింది.. దక్షిణ ఆసియాలో చిన్న దేశం ఇజ్రాయెల్.. దీనికి పాలస్తీనా కు అసలుపడదు.. యాసర్ అరాఫత్ అధ్యక్షుడుగా ఉన్న వరకూ ఇజ్రాయెల్ ఆటలు సాగ లేదు. పైగా అతడు ఇజ్రాయెల్ కాళ్ళల్లో కట్టెలు పెట్టేవాడు. అతడు గతించిన తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనా మీద ఎటాక్ చేయడం
షురూ చేసింది. కీలక ప్రాంతాలు స్వాధీనం చేసుకోవటం మొదలు పెట్టింది. కానీ ఇక్కడే పాలస్తీనా అసలు గేమ్ స్టార్ట్ చేసింది.

ఇజ్రాయెల్ నుంచి కాచుకునేందుకు పాలస్తీనా.. హమాస్ తీవ్ర వాదులతో జట్టు కట్టింది.

ఇక అప్పటి నుంచి రెండు దేశాల మధ్య నిత్యం రావణ కాష్టం. ఈ ఇద్దరి మధ్యలో అమెరికా వచ్చి చేరింది..
అప్పటికే ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య ఉన్న వివాదాలను మరింతగా జఠిలంగా మార్చింది.. మరోవైపు ఇజ్రాయెల్ శాస్త్ర సాంకేతిక రంగం వైపు దృష్టి సారించింది.. ప్రయోగాలకు పెద్దపీట వేసింది. వ్యవసాయంలోనూ సమూల మార్పులకు బీజం వేసింది.. సూక్ష్మ సేద్యాన్ని, బిందు సేద్యాన్ని అమలు లోకి తెచ్చింది. ఎందుకంటే ఇజ్రాయల్ దేశంలో వర్షపాతం చాలా తక్కువ.. అంతటి బీడు భూముల్లోనూ బంగారం
పండిస్తోంది.. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి హయాంలో ఇజ్రాయిల్ దేశంలో అమలులో ఉన్న బిందు సేద్యాన్ని పరిశీలించి, రాష్ట్రంలోనూ అమలు చేశారు.

ఇక.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమెరికాను మించిపోయింది ఇజ్రాయిల్.. ఆ మధ్య భారత దేశంలో వివాదానికి కారణమైన పెగాసాస్ లాంటి స్పై వేర్ ను కనిపెట్టింది కూడా ఇజ్రాయిల్ దేశమే. చూస్తేచిన్న దేశంగా కనిపిస్తుంది కానీ.. టెక్నాలజీ పరంగా అగ్రస్థానంలో ఉంది.. ఇక ఇదే సమయంలో పాలస్తీనా కేవలం యుద్ధం మీద మాత్రమే దృష్టి సారించింది. అక్కడి తోనే ఆగిపోయింది.. సొంత బలం లేకపోవడంతో హమాస్ తీవ్రవాదులతో జట్టు కట్టింది. ఇజ్రాయెల్ ను కాచుకునేందుకు నానా తిప్పలు పడుతున్నది. వేల మందిని హతం చేసింది.
యుద్ధం అంటే గెలుపు, ఓటమి మాత్రమే. ఇందులో మానవత్వానికి చోటు ఉండదు. అసలు యుద్ధం అంటేనే గిట్టని వాడిని కొట్టడం. రాళ్లు రువ్వినా, రాకెట్ విసిరినా అందుకోసమే.. ఇక ఇజ్రాయిల్ కూడా పాలస్తీనా విషయంలో అదే చేసింది. చేస్తోంది కూడా. ఇన్ని యుద్ధాలు చేసినా పాలస్తీనాకు సంబంధించిన గాజా నగరాన్ని ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకోలేకపోయింది..

గత మంగళవారం గాజ నగరాన్ని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించింది ఇజ్రాయెల్. .

ప్రపంచం కూడా అలాగే అనుకుంది. ఇజ్రాయిల్ కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని పాలస్తినా నిర్ణయించుకుంది.
బంకర్లలో వేలాది ఆయుధాలతో, హమాస్ తీవ్రవాదులతో కాపు కాసింది. కానీ ఇంతకీ ఇజ్రాయిల్ రంగంలోకి దిగలేదు. ఏదో ఉతిత్తి ప్రకటన చేసింది అని అనుకున్నారు. కే జి ఎఫ్ 2 లో అదిరపై కాల్పులు జరిపేందుకు రాఖీ కళాష్ నికాన్ ను ఉపయోగించినట్టు.. పాలస్తీనా బంకర్లలో తలదాచుకున్న హమాస్ తీవ్రవాదులపై 450 కి పైగా స్పైస్ _2000 లేజర్ గైడెడ్ బాంబులతో ఎఫ్ఏ18 యుద్ద విమానాలతో
150 టార్గెట్ల పై దాడులు చేసింది. ఈ ఆపరేషన్ ను కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేసింది. అప్పట్లో పాక్ లోని బాలా కోట్, బంకర్ బ్లాంక్డ్ బాంబులు వేసి ఎలా చిత్తు చిత్తు చేసిందో… అలాగే ఇజ్రాయిల్ కూడా పాలస్తీనా కు బుద్ధి చెప్పింది.. త్వరలో గాజా నగరాన్ని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించింది..

ఏడాది క్రితం దాదాపు పన్నెండు రోజుల పాటు ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనాకు చెందిన హమాస్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ మధ్య రాకెట్ దాడులు జరిగాయి. తొలుత ఓ మసీదు ఏరియాపై ఆంక్షలతో మొదలైన దాడుల పర్వం.. ఆ తర్వాత రాకెట్ బాంబర్ల వినియోగం దాకా.. ఉగ్రస్థావరాల పేల్చివేత దాకా వెళ్ళింది. అయితే.. ఈ యుద్ధం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ యుద్దతంత్రంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ
మొదలైంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ యుద్ద తంత్రంపై అమెరికా అధ్యయనానికి పూనుకోవడంతో సంచలనం రేపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పదుల సంఖ్యలో రాకెట్ బాంబర్లు తమ దేశం వైపు దూసుకు వస్తున్నా.. ఇజ్రాయెల్ సైన్యం కంగారు పడలేదు. సరికదా.. ఒక్కో రాకెట్ బాంబర్‌ను గురి చూసి మరీ కూల్చి వేసింది ఇజ్రాయెల్ సైన్యం. ఈ సామర్థ్యాన్ని ఐరెన్ డోమ్‌గా పిలుస్తుండగా.. ఈ విధానంపై అమెరికా సహా పలు దేశాలు ఇప్పుడు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. యూరోపియన్ దేశాలు కూడా ఈ విషయంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాయి..

ఏడాది క్రితం దాదాపు పన్నెండు రోజుల పాటు ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనాకు చెందిన హమాస్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ మధ్య రాకెట్ దాడులు జరిగాయి.

తొలుత ఓ మసీదు ఏరియాపై ఆంక్షలతో మొదలైన దాడుల పర్వం.. ఆ తర్వాత రాకెట్ బాంబర్ల వినియోగం దాకా.. ఉగ్రస్థావరాల పేల్చివేత దాకా వెళ్ళింది. అయితే.. ఈ యుద్ధం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ యుద్దతంత్రంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ
మొదలైంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ యుద్ద తంత్రంపై అమెరికా అధ్యయనానికి పూనుకోవడంతో సంచలనం రేపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పదుల సంఖ్యలో రాకెట్ బాంబర్లు తమ దేశం వైపు దూసుకు వస్తున్నా.. ఇజ్రాయెల్ సైన్యం కంగారు పడలేదు. సరికదా.. ఒక్కో రాకెట్ బాంబర్‌ను గురి చూసి మరీ కూల్చి వేసింది ఇజ్రాయెల్ సైన్యం. ఈ సామర్థ్యాన్ని ఐరెన్ డోమ్‌గా పిలుస్తుండగా.. ఈ విధానంపై అమెరికా సహా పలు దేశాలు ఇప్పుడు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. యూరోపియన్ దేశాలు కూడా ఈ విషయంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాయి..

‘ఆపరేషన్‌ గార్డియన్‌ ఆఫ్‌ ది వాల్స్‌’ పేరిట హమాస్‌పై ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ నిర్వహించిన యుద్ధతంత్రం చరిత్రలోనే పెద్ద ముందడుగుగా పలు దేశాలు అభివర్ణిస్తున్నాయి. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌ పూర్తిగా కృత్రిమ మేధపై ఆధారపడినట్లు తెలుస్తోంది. లక్ష్యాలను ఐడెంటిఫై చేయడం.. వాటిని టార్గెట్ చేయడం వంటి కీలక పనులన్నీ ప్రత్యేక అల్గారిథమ్స్‌‌తో కంప్యూటర్లే పూర్తి చేశాయి. చివరికి
హమాస్‌ రహస్య టన్నెల్‌ నెట్‌వర్క్‌లను ధ్వంసం చేయడంలో కూడా వీటి పాత్ర చాలా ఉంది. ఒక రకంగా మిషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌లే ఈ యుద్ధాన్ని శాసించాయి. ప్రపంచంలో పూర్తిస్థాయిలో కృత్రిమ మేధను వాడిన తొలి యుద్ధం ఇదేనని అమెరికా తదితర దేశాల మిలిటరీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. హమాస్‌ ఉగ్రవాద సంస్థ నుంచి ఎప్పటికైనా ముప్పు తప్పదని ఇజ్రాయెల్‌ ఏనాడో
గుర్తించింది. కొన్ని సంవత్సరాల ముందు నుంచే రహస్యంగా శత్రువు ఊహకందని రీతిలో సిద్ధమైపోయింది. ఆ దేశానికి ప్రత్యేక ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ‘8200’ అల్కమిస్ట్‌’,‘గాస్పెల్‌’,‘డెప్త్‌ ఆఫ్‌ విజ్‌డమ్‌’ అనే స్పెషల్ అల్గారిథమ్స్‌, కోడింగ్‌లను తయారు చేసుకుంది. వీటికి ప్రత్యర్థులు వాడే ఎలక్ట్రానిక్‌ పరికరాల సిగ్నల్స్‌, విజువల్‌ ఇంటెలిజెన్స్‌, హ్యూమన్‌ ఇంటెలిజెన్స్‌ ఇన్ఫర్మేషన్, జియోగ్రాఫికల్‌
ఇంటెలిజెన్స్‌ వంటి డేటాను సమీకరించారు. వీటిని క్రోఢీకరించి లక్ష్యాలను గుర్తించారు.

డివిజెన్‌ ఆఫ్‌ మిలటరీ ఇంటెలిజెన్స్‌లో ఉన్న ‘గాస్పెల్‌’ అనే అల్గారిథం ఈ డేటాను విశ్లేషించి నమ్మకమైన లక్ష్యాలను గుర్తిస్తుంది.

వాటిని ఇజ్రాయెల్‌ వాయుసేనకు అందిస్తుంది. ఇందు కోసం ఒక మల్టీ డిసిప్లైనరీ సెంటర్‌ను ఇజ్రాయెల్ మిలిటరీ ఏర్పాటు చేసుకుంది. ఇది గాజాలోని వందల కొద్దీ లక్ష్యాలను గుర్తించి ఇజ్రాయెల్‌ మిలిటరీకి ఇచ్చింది. దీంతో కచ్చితమైన లక్ష్యాలపై తగినంత సామర్థ్యంతో
దాడిచేసేందుకు వీలు కలిగింది. వీటిల్లో హమాస్‌ రాకెట్‌ లాంఛర్లను భద్రపర్చిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఫలితంగా లక్ష్యాలను వెతుక్కుంటూ సుదీర్ఘకాలం పోరాడాల్సిన అవసరం రాలేదు. హమాస్‌, పాలస్తీనా ఇస్లామిక్‌ ఉగ్రవాద స్థావరాలు, రాకెట్‌ లాంఛర్లు, రాకెట్‌ తయారీ కేంద్రాలు, నిల్వ కేంద్రాలు, వారి మిలటరీ ఇంటెజెన్స్‌ ఆఫీస్‌లు, డ్రోన్లు, కమాండర్ల ఇళ్లు, హమాస్‌ నేవల్‌ కమాండో యూనిట్లు ఈ దాడుల్లో ధ్వంసమైపోయాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్‌ గ్యాస్‌ క్షేత్రాలకు ముప్పు కల్గించే హమాస్‌ డ్రోన్‌ జలాంతర్గాములను భారీగా ధ్వంసం చేసింది.

ఇజ్రాయెల్‌ మిలిటరీ దళాల్లో యూనిట్‌ ‘9900’కు ప్రత్యేక స్థానం ఉంది. వీరు జియోగ్రాఫీ ఇంటెలిజెన్స్‌ను సేకరిస్తారు. ఉపగ్రహాల నుంచి వచ్చిన చిత్రాలను విశ్లేషించి.. ఆ ప్రదేశంలో జరిగిన మార్పులను అంటే నిర్మించిన కట్టడాలు, వాహనాల కదలికలను గుర్తించి మిలిటరీ
అధికారులకు చేరవేస్తారు. దీంతో హమాస్‌ మోహరించిన రాకెట్‌ లాంఛర్లను ఇట్టే పసిగట్టింది ఇజ్రాయెల్ మిలిటరీ. ఒక స్కూలు పక్కనే మోహరించిన 14 రాకెట్‌ లాంఛర్లను ఇజ్రాయెల్ మిలిటరీ ఇట్టే గుర్తించింది. ఈ సారి చేసిన దాడుల్లో ఇజ్రయెల్‌ మిలిటరీ హమాస్‌ ఉగ్రవాద సంస్థ నాయకత్వంపై గురిపెట్టింది. ఈ దాడుల్లో మొత్తం 150 మంది హమాస్‌, ఇస్లామిక్‌ జిహాద్‌ ఆఫ్‌ పాలస్తీనా సంస్థల మిలిటెంట్లు
చనిపోయారు. వీరిలో చాలా మంది అతిముఖ్యమైన, అరుదుగా రిక్రూట్ అయ్యే స్థాయి నేతలుండడంతో హమాస్‌కు తీరని నష్టం వాటిల్లిందని అంఛనా వేశారు..

యుద్ధరంగంలో ఉన్న ఇజ్రాయెల్‌ మిలిటరీ దళాలను కాపాడే బాధ్యత యూనిట్‌ 8200 వద్ద ఉన్న ‘అల్కమిస్ట్‌’ అనే అల్గారిథమ్‌ చూసుకుంది. వివిధ మార్గాల్లో వస్తున్న ఇన్ఫర్మేషన్ క్షణాల్లో క్రోఢీకరించి మిలిటరీకి అందజేసింది. హమాస్‌, పీఐజీ దళాలు ఎక్కడ దాడి చేసే అవకాశం ఉందో గుర్తించి.. అక్కడి దళాలను అలర్ట్ చేశాయి. ఫలితంగా ఇజ్రాయెల్‌ దళాల వైపు ప్రాణనష్టం చాలా తక్కువ
స్థాయిలో జరిగింది. 12 రోజుల యుద్ధంలో ఒమర్‌ తబీబీ అనే ఒక్క సైనికుడు మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. యాంటీ ట్యాంక్‌ క్షిపణి వారి వైపు వస్తోందని హెచ్చరించారు. కానీ, అతడు ఆ దాడిలో మరణించాడు. ఇక ఐరన్‌డోమ్‌ పనితీరులో కూడా లక్ష్యాలను గుర్తించే కీలకమైన పనిమొత్తం ప్రత్యేక సాఫ్ట్‌వేర్లే చేశాయి. నవీన కాలంనాటి యుద్ధ విధానాల్లో డేటా ఎంత ముఖ్యమైనదో తాజాగా జరిగిన ఇజ్రాయెల్,
హమాస్ ఉగ్రవాద సంస్థల మధ్య యుద్దం చాటి చెబుతోంది. ఇంకోరకంగా చెప్పాలంటే ఆధునిక యుద్ధాల్లో డేటానే ప్రధాన ఇంధనమని యుద్ద నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇజ్రాయెల్.. ఒక చిన్న దేశం.. కానీ.. టెక్నాలజీ, యుద్దతంత్రంలో తన సత్తాను చాటుతూ… ప్రపంచాన్ని తనవైపు చూసేలా చేస్తోంది.. శక్తి కన్నా యుక్తి గొప్పదని నిరూపిస్తూ ప్రపంచాన్నే అవాక్కయ్యేలా చేస్తోంది..

Must Read

spot_img