Homeఅంతర్జాతీయంసింగపూర్ లో స్వలింగ సంపర్కాన్ని నేరం కాదు… నిషేధం

సింగపూర్ లో స్వలింగ సంపర్కాన్ని నేరం కాదు… నిషేధం

అంతేకాదు.. అక్కడి ప్రభుత్వం ఎన్నో దశాబ్దాలుగా వివాదాస్పద 377 ఏ చట్టాన్ని అమలు చేస్తూ.. వచ్చింది.. తాజాగా మారుతున్న కాలానికి తగినట్లుగా సింగపూర్ ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసింది..

ఎన్నో దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న 377ఏ చట్టాన్ని సింగపూర్ ప్రభుత్వం ఎందుకు అమలు చేసింది..?ఆ చట్టం బ్రిటీష్ వలస పాలన నుంచే సంక్రమించిందా…? 377 ఏ చట్టం రద్దుతో ఎల్జీబీటీ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందా…?

సింగపూర్‌ లో ఒకానొక సమయంలో కేవలం గే అన్న కారణంగా రసెల్ హెంగ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 1980లలో ఇంటర్నెట్, డేటింగ్ యాప్స్ లేని కాలంలో సింగపూర్‌ లోని ఎస్‌ప్లనేడ్ పార్క్ గే వ్యక్తులకు మీటింగ్ ప్లేస్‌గా ఉండేది. పార్క్ వద్దే రసెల్ హెంగ్‌ ను అరెస్ట్ చేశారు.

సింగపూర్‌ లో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించేవారు. ఎస్‌ప్లనేడ్ పార్క్‌లో చెట్లు తమకు రక్షణ కవచంగా నిలుస్తూ, ఏకాంతానికి చోటిచ్చేవని రసెల్ హెంగ్ గుర్తుచేసుకున్నారు. 71 ఏళ్ల రసెల్ నాటక రచయిత, యాక్టివిస్ట్ కూడా. ఒకరోజు సరదాగా బయటకు వెళ్లిన రసెల్ పై ఒక పోలీస్ అధికారి గట్టిగా అరిచాడని.. అంతేకాదు.. రసెల్, అతనితో వెళ్లిన వారందరిని వరుసలో నిలబెట్టి.. తీవ్రంగా దూషించడం జరిగిందని రసెల్ తన ఆవేదనను వెల్లగక్కాడు..

సింగపూర్ ప్రభుత్వం ఎన్నో దశాబ్దాలుగా వివాదాస్పద 377ఏ చట్టాన్ని అమలు చేస్తోంది. ఇది బ్రిటిష్ పాలన నుంచి సంక్రమించిన చట్టం. ఈ చట్టం ప్రకారం ఇద్దరు పురుషుల మధ్య స్వలింగ సంపర్కం నిషేధం. స్వలింగ సంపర్కం ఆమోదయోగ్యం కాదన్నది సింగపూర్ సమాజం అభిప్రాయమని, ఈ చట్టం దాన్ని ప్రతిబింబిస్తుందని అధికారులు ఏళ్ల తరబడి చెబుతూ వచ్చారు.

కానీ, గత వారం సింగపూర్ పార్లమెంట్ ఈ చట్టాన్ని రద్దు చేసింది. అంతకు కొన్ని నెలల క్రితం సింగపూర్ ప్రధానమంత్రి లీ షెన్ లోంగ్ ఈ చట్టాన్ని రద్దు చేయనున్నట్టు ప్రకటించారు. ప్రజల ఆలోచాన సరళి, వైఖరి మారుతున్న కాలంలో దీన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టం రద్దు సింగపూర్ ఎల్జీబీటీ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.

ఈ చట్టం రద్దుకు ముందు వరకు సింగపూర్ లో పోలీసులు యాంటీ – గే దాడులు చేసేవారు. నైట్‌ క్లబ్బులపై, బీచ్‌లు, పార్కులపై దాడి చేసి గే వ్యక్తులను అదుపులోకి తీసుకునేవారు. పోలీసులు ఇందుకోసం ఒక రకమైన వల పన్నేవారు. గే వ్యక్తులు తరచుగా కలుకునే ప్రదేశాలలో మఫ్తీలో ఉండి పోలీసులు కూడా గే లాగానే నిల్చునేవారు. స్నేహహస్తం చాస్తూ దగ్గరకు వచ్చిన వారిని అరెస్ట్ చేసేవారు. అరెస్ట్ చేసిన అనంతరం గే లపై అసభ్యకర చర్యలకు పాల్పడ్డారని, నిర్లజ్జగా ప్రవర్తించారని అభియోగాలు మోపేవారు. వార్తాపత్రికలలో అరెస్ట్ అయిన వారి పేర్లు, వయసు, వృత్తి వివరాలను ప్రచురించేవారు. చాలామందికి జరిమానా లేదా కొన్ని నెలల జైలు శిక్ష విధించేవారు.

993లో ‘ది ఫ్రంట్ రోడ్ ర్రైడ్’ పేరుతో జరిగిన దాడిలో చాలా మంది పురుషులను అరెస్ట్ చేశారు. వారికి కఠినమైన క్యానింగ్ శిక్ష విధించారు. ఈ శిక్షను సవాలు చేస్తూ కోర్టులో కేసు వేశారు. వారిని అరెస్ట్ చేసి అభియోగాలు మోపడం “ఆందోళన కలిగించే విషయం” అని పేర్కొంటూ కోర్టు శిక్షను రద్దు చేసింది. ఈ దాడులు, గే వ్యక్తులకు స్పష్టమైన సందేశాన్ని పంపాయి.

“ఎప్పుడూ భయపడుతూ ఉండేవాళ్లం. బయటికొస్తే మనపై నిఘా ఉంటుందన్న విషయం మనసులో మెదులుతూ ఉండేది” అని బాధితులు మొరపెట్టుకుంటున్నారు..

2000ల నాటికి ఈ దాడులు తగ్గుముఖం పట్టాయి. స్వలింగ సంపర్కంపై బహిరంగంగా చర్చించడం మొదలుపెట్టారు. 2007లో 377ఏ చట్టంపై పార్లమెంట్‌ లో పెద్ద చర్చ జరిగింది. ఆ సందర్భంగా సింగపూర్ ప్రభుత్వం చట్టాన్ని రద్దు చేయదు గానీ, అమలు చేయదని హామీ ఇచ్చింది. క్రమక్రమంగా సింగపూర్ సమాజం ఎల్జీబీటీ వ్యక్తులను ఆమోదించడం మొదలుపెట్టింది.

అయితే, ఇప్పటికీ చాలామంది స్వలింగ సంపర్కం “తప్పు” అని అనుకుంటున్నప్పటికీ, గే హక్కులకు మద్దతు పెరుగుతోందని ఇటీవల ఒక సర్వేలో తేలింది.

సింగపూర్ ప్రభుత్వం ఎల్జీబీటీ సమూహానికి అనుకూలంగా సంస్థలు ఏర్పాటు చేయడం, వైవిధ్యాలను ప్రోత్సహించే విధానాలను అమలుచేయడం ప్రారంభించింది. గతంలో గే వ్యక్తులు బయట కలిసినా నేరంగా పరిగణించే దేశంలో, క్రమంగా ఎల్జీబీటీ సమూహానికి మద్దతుగా ర్యాలీలు, సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎల్జీబీటీ కార్యకర్తలకు విశేషంగా మద్దతు లభించింది. గే హక్కుల సంస్థలు ఉనికిలోకి వచ్చాయి. రసెల్ హెంగ్ సింగపూర్‌లో ఎప్పటి నుంచో ఉన్న ఎల్జీబీటీ సంఘం వ్యవస్థాపక సభ్యుడు. 1990లలో దీని రిజిస్ట్రేషన్‌ను రెండు సార్లు తిరస్కరించారు. తమ సంఘంపై పోలీసులు నిఘా పెట్టేవారని రసెల్హెం గ్ చెప్పారు.

నేడు సింగపూర్‌ లో టూరిస్టులకు గే చరిత్ర వివరించే గైడ్స్ ఉన్నారు. అక్కడికి వెళ్లే టూరిస్టులకు ఈ చరిత్రను తప్పకుండా చెబుతారు. 19వ శతాబ్దంలో చైనా నుంచి వచ్చిన వలసదారులలో పురుషులు వ్యభిచారం వృత్తిలోకి దిగేవారని చెబుతూ, నగరంలో ఉన్న పాపులర్ గే మీటింగ్ ప్రదేశాలను చూపిస్తారు.

అంతేకాదు.. ప్రత్యేకంగా ఎల్జీబీటీ టూర్లు నిర్వహిస్తారు. ఇవి కేవలం ఆ దేశంలో ఎల్జీబీటీ చరిత్రని వివరించే టూర్లు. సింగపూర్‌లో ప్రజలకు ముఖ్యంగా యువతకు అమ్నీషియా” ఉందని గ్రహించారు., అందుకే ఎల్జీబీటీ టూర్లు నిర్వహిస్తున్నారు.. ఈ టూర్ల కారణంగా స్వలింగ సంపర్కులను, స్ట్రెయిట్ప్ర జలు కూడా ఆకర్షిస్తుంటాయి.

“377ఏ చట్టం ఉండి, దాన్ని అమలు చేయకపోవడం వలన, గే హక్కుల గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. కానీ, ఇటీవల కాలంలో ఈ చట్టం గురించి చర్చ, ఇప్పుడు దానికి రద్దు కారణంగా ప్రజలలో ఎల్జీబీటీ చరిత్ర పట్ల ఆసక్తి, కుతూహలం పెరిగాయి. 377ఏ రద్దుతో గే సమూహం పట్ల వ్యతిరేకత చరిత్రలో కలిసిపోయినప్పటికీ… ఎల్జీబీటీ సమూహాలలో పూర్తిగా భయం పోలేదు. వేడుకలు జరుపుకుంటున్నప్పటికీ, జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే, 377ఏ రద్దుతో పాటు సింగపూర్ ప్రభుత్వం మరో చిన్న మెలిక పెట్టింది. ప్రస్తుతానికి గే వివాహాలకు అనుమతి లేకుండా రాజ్యాంగంలో సవరణ తీసుకురావాలని యోచిస్తోంది.

“మిలిటెంట్ హోమోసెక్సువల్స్” పెరుగుతారని, మతపరమైన స్వేచ్ఛ పెరిగిపోతుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ వాదన అర్థరహితమని ఎల్జీబీటీ సముహం అంటోంది.

“377ఏ రద్దు చేసినప్పటికీ, ఈ అంశం మరింత సున్నితంగా మారిపోతుందని ఆందోళంగా ఉంది. ఈ నిర్ణయం ఇప్పటికే చాలా ఆలస్యమైం ఆలస్యమైంది. యాంకర్ ఎండ్: సింగపూర్ లో 377ఏ రద్దుతో ఎల్జీబీటీ ల పట్ల ఉన్న వ్యతిరేకత పోయినప్పటికీ.. వారికి పూర్తిగా భయం పోలేదనే చెప్పాలి.. అయినప్పటికీ.. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఎల్జీబీటీ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Must Read

spot_img