అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా బయ్యర్లకు లాభదాయకమైన వెంచర్ గా నిలిచింది. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ…తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడవి శేష్. ఇందులో భాగమే ఈ హిట్ 2 హిట్ కూడా. సీన్ కట్ చేస్తే.. రానున్న రోజుల్లో అల్ రౌండర్ గా మారబోతున్నాడు ఈ క్రియేటివ్ హీరో.
అమెరికా సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అడివి శేష్ సినిమాల మీద ఆసక్తితో ఇండియాకు వచ్చేశాడు. తనలోని రైటర్ ని నిద్రలేపి తన సినిమాలను తానే తీస్తూ వచ్చాడు. అయితే మొదట్లో అతన్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే క్షణం సినిమా వచ్చిందో అప్పటి నుంచి ఆడియన్స్ అటెన్షన్ ని పట్టేయగలిగాడు అడివి శేష్. క్షణం సినిమా అడివి శేష్ కెరీర్ ని టర్న్ తిప్పింది. ఇక అప్పటి నుంచి అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. యువ హీరోల్లో సొంత కథలతో దూసుకెళ్తున్న హీరోల్లో అడివి శేష్ ముందుంటాడు.

రీసెంట్ గా రిలీజైన హిట్ 2తో డబుల్ హ్యాట్రిక్ సక్సెస్ లు అందుకున్న అడివి శేష్ తన నెక్స్ట్ సినిమా గూఢచారి సీక్వెల్ గూఢచారి 2తో రాబోతున్నాడు. ఆ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగానే ఉంటుందని అంటున్నారు. ఇక నేటితో 39వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు అడివి శేష్. ఎలాగైనా సినిమాల్లో రాణించాలన్న ఆలోచనతో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చాడు అడిగి శేష్. తన మొదటి సినిమా సొంతం అన్న సంగతి ఎంతమందికి తెలుసు.. సొంతం సినిమా నుంచి సినిమాల్లో తన ఇష్టాన్ని అలాగే కొనసాగిస్తూ ఇప్పుడు యంగ్ హీరోల్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ పిల్లర్ గా నిలబడ్డాడు అడివి శేష్.
ప్రతి సినిమాతో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించాలి అన్నదే అడివి శేష్ ప్రయత్నం ఉంటుంది. అందుకే అతని సక్సెస్ రేటు అలా ఉందని చెప్పొచ్చు. కెరీర్ మొదట్లో అతన్ని ప్రేక్షకులు నమ్మడానికి కొంత టైం తీసుకున్నారు కానీ క్షణం నుంచి అతను ఒక్కో మెట్టు ఎక్కుతూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అడివి శేష్ సినిమా అంటే తప్పకుండా అందులో కంటెంట్ ఉంటుంది అనేలా ప్రూవ్ చేసుకున్నాడు. అతను చేస్తున్న సినిమాలు అందుకుంటున్న విజయాలు అతన్ని మరింత స్ట్రాంగ్ గా మారేలా చేశాయి.