Homeఅంతర్జాతీయంవేలుపిళ్లై ప్రభాకరన్ చరిత్ర..

వేలుపిళ్లై ప్రభాకరన్ చరిత్ర..

అది 90వ దశకంలో..అంటే ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం శ్రీలంకలో సింహళీయులకూ, మైనార్టీ తమిళులకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రోజులు. అప్పడు జరిగిన భీకర పోరుతో ప్రపంచానికి పరిచయమైంది ఎల్టీటీఈ..దాని ఛీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ 2009లో ఆర్మీ బలగాల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఎల్టీటీఈ పీక్స్ దశలో శ్రీలంకలో పలు ప్రాంతాల్ని ఆక్రమించుకుని, దేశంపై పట్టు సంపాదించే లెవెల్లో ఎదిగిన ప్రభాకరన్.. విదేశాల నుంచి అందిన సాయంతో ఎంత ఎదురొడ్డి పోరాడినా ప్రభుత్వం ముందు నిలవలేకపోయారు.

అయితే ప్రభాకరన్ మరణించి 14 ఏళ్ల తర్వాత తాజాగా ‘ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు నెడుమారన్’ అనే పెద్దాయన ఇప్పుడు అకస్మాత్తుగా రంగ ప్రవేశం చేసి ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నారంటూ సంచలన ప్రకటన చేశారు. దీంతో దేశంలో కలకలం రేగుతోంది. నెడుమారన్ చేసిన ఈ ప్రకటనపై శ్రీలంక ప్రభుత్వం కూడా స్పందించింది. ప్రభాకరన్ బతికే ఉన్నారన్న వార్తల్ని లంక ప్రభుత్వం ఖండించింది. ఈ మేరకు శ్రీలంక రక్షణమంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో నెడుమారన్ ప్రకటనను ఓ జోక్ అని అభివర్ణించింది.

ప్రభాకరన్ 2009 మే 19న శ్రీలంక ఆర్మీ చేతిలో ప్రాణాలు కోల్పోయారని, ఇందుకు ఆయన డీఎన్ఏ రిపోర్టే సాక్ష్యమని, ఆయన బతికొచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని తెలిపింది. దీంతో నెడుమారన్ ప్రకటన వెనుక కారణాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 1983లో శ్రీలంకలో మెజార్టీ సింహళీయులకు, మైనార్టీ తమిళులకు మధ్య మొదలైన పోరు 2009లో ప్రభాకరన్ సహా ఎల్టీటీఈ అగ్రనేతల మరణాలతో ముగిసింది. ఆ తర్వాత ఇప్పటి వరకు సింహళీయుల పాలనే కొనసాగుతోంది. ఈ మూడు దశాబ్దాల్లో ఎల్టీటీఈ శ్రీలంకలో ఓ రేంజ్ లో మారణహోమం సృష్టించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాలతో లంక ప్రభుత్వానికి చుక్కలు చూపించింది.

  • అంతే కాదు ఈ వ్యవహారంలో తలదూర్చినందుకు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని సైతం మానవ బాంబుతో ఆత్మాహుతి దాడి చేసి పొట్టనపెట్టుకుంది..

అప్పట్లో లంకలో జాఫ్నాతో పాటు పలు ప్రాంతాల్ని ఆక్రమించి చాలా సంవత్సరాల పాటు లంక ఆర్మీ దానిపై పట్టు సాధించకుండా చేసింది. చివరికి అదే విదేశీ సాయంతో లంక ప్రభుత్వం ఆయుధాలు సమకూర్చుకుని ప్రభాకరన్ సహా ఎల్టీటీఈ కీలక నేతల్ని మట్టుబెట్టింది. అయితే ప్రభాకరన్ ఇప్పటికీ తన కుటుంబసభ్యులతో టచ్‌లో ఉన్నట్టు కూడా నెడుమారన్ తెలిపారు. ప్రభాకరన్‌ చనిపోయినట్టు వచ్చిన వార్త అవాస్తవమని అన్నారు నెడుమారన్‌.

తాను బతికే ఉన్నట్టు ప్రజలకు చెప్పమన్నారనీ , అందుకే తాను మీడియా ముందుకు వచ్చినట్టు చెప్పారు. 2009లో ముల్లైతీవు ప్రాంతంలో శ్రీలంక సైన్యంతో జరిగిన పోరులో ప్రభాకరన్‌ చనిపోయినట్టు ప్రకటించారు. 18 మే 2009 న ప్రభాకరన్ కుమారుడు చార్లెస్ ఆంథోనీ కూడా అదే పోరులో చనిపోయారు. ప్రభాకరన్‌ చనిపోయారని , ఆయన మృతదేహం ఫోటోలను కూడా శ్రీలంక సైన్యం విడుదల చేసింది.

కాని 14 ఏళ్ల తరువాత ఆకస్మాత్తుగా ఆయన బతికే ఉన్నారని నెడుమారన్‌ నుంచి స్టేట్‌మెంట్‌ రావడం సంచలనం రేపింది. అయితే, ప్రస్తుతం శ్రీలంకను భారత్ వ్యతిరేక స్థావరంగా మార్చేందుకు చైనా ప్రయత్నిస్తోంది. దీనికి తోడు హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్న చైనా నుంచి ప్రమాదం ఉందని, దానిని అరికట్టాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ ముఖ్యమైన కాలంలో తమిళనాడు ప్రభుత్వం, తమిళనాడులోని అన్ని పార్టీలు, తమిళనాడు ప్రజలు ఐక్యంగా నిలబడి తమిళ ఈలం జాతీయ అధ్యక్షుడు ప్రభాకరన్‌కు మద్దతు ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాం.. అంటూ నెడుమారన్ తెలిపారు.

ఆయన సరైన సమయంలో ప్రజల ముందుకు వస్తారని టీఎన్ఎం లీడర్ నేడుమారన్ స్పష్టం చేశారు. ఇప్పుడా సరైన సమయం వచ్చేసిందనీ ప్రజల ముందుకు ప్రభాకరన్ రాబోతున్నారని నెడుమారన్ అన్నారు. ప్రభాకరన్ ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నారని చెప్పారు. ఆయన కుటుంబం ప్రభాకరన్‌తో టచ్‌లో ఉందని ఐతే ఆయన ఎక్కడున్నారనే విషయాన్ని మాత్రం ఇప్పుడే వెల్లడించలేనన్నారు.

తాను ఈ ప్రకటన ప్రభాకరన్ కుటుంబ సభ్యుల అనుమతితోనే చేస్తున్నట్టు నెడుమారన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శ్రీలంకలో ఆందోళనలు చెలరేగుతున్నాయని ప్రభాకరన్‌ను మళ్లీ బయటి ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని నేడుమారన్ వివరించారు. ప్రభాకరన్ సరైన సమయంలో ప్రజల ముందుకు వస్తారని, ప్రత్యేక తమిళ్ ఈలంను ఏర్పాటు చేయడానికి తన వద్ద ఉన్న స్పష్టమైన ప్రణాళికలను తెలియజేస్తాడని తెలిపారు. 2009లో శ్రీలంకలో తమిళ ఈలంను హస్తగతం చేసుకోవడానిఇకి యుద్ధం జరిగింది. ఇందులో ఎంతోమంది లంకన్ తమిళులు చనిపోయారు.

ఈ వార్‌ చివరి దశలో ఎల్‌టీటీఈ నేత ప్రభాకరన్ మరణించినట్టు ప్రకటించారు. అంతేకాదు, అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సే యుద్ధ నేరాలకు గాను అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ఎదుర్కోవాలని భావించాయి. 2009, మే 18న ప్రభాకరన్ మృతి చెందారని శ్రీలంక సైన్యం ప్రకటించింది. అయితే అప్పుడు ప్రభాకరన్ మరణించాడని లంక ప్రభుత్వం చూపించిన డెడ్ బాడీ నిజంగా ప్రభాకరన్‌దే అని ఇప్పటికీ నిరూపించలేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఈ విషయాలను నెడుమారన్ తంజావూరులోని ముల్లివైక్కల్ మెమోరియల్‌లో మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించారు.

ఆయన ఎంత సేపూ ప్రభాకరన్ సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నారని మాత్రమే చెప్పారు తప్ప ప్రభాకరన్ ఎక్కడ ఉన్నారనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేదు. ఇంతకీ శ్రీలంక చే గువేరా అని పిలుచుకునే వేలుపిళ్లై ప్రభాకరన్ ఎవరు? తమిళుల చరిత్రలో ఎందుకు ఆయనకు ఇంత ప్రాముఖ్యత లభించింది అన్న విషయాలు నేటి తరానికి అంతగా తెలియవు. దానికంటే ముందు శ్రీలంకలో మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఉద్యమం గురించి ప్రస్తావించుకోవాలి..

అణచివేత ఏ రూపంలో ఉన్నా.. ఏదో ఒకనాటికి అది అగ్గిని రాజేయడం ఖాయం.. అలా లంక గడ్డపై అక్కడి సింహళీయుల చేతుల్లో దారుణంగా అవమానాలకు గురైన తమిళులకు అండగా నిలిచారు ప్రభాకరన్.. వారి మన్ననను చూరగొని ఆరాధ్య దైవంగా మారారు. శ్రీలంకలోని జాఫ్నా నేలపై తమిళులకు ఆయనో తలైవర్‌ గా నిలిచారు..అంటే తెలుగులో నాయకుడు అని అర్థం. ఇంతకీ ప్రభాకరన్‌ నేపథ్యం ఏంటి? హీరోగా కొందరు.. విలన్‌గా మరికొందరు ఎందుకు ఆయన్ని ఎందుకు బేరీజు వేసుకుంటారు?.

అన్న ప్రశ్నల విషయానికొస్తే.. శ్రీలంక ఉత్తర తీర పట్టణం వాల్వెట్టితురైలో 26 నవంబర్ 1954 న ప్రభాకరన్ జన్మించారు. నలుగురు పిల్లలలో చిన్నవాడు ప్రభాకరన్. తండ్రి ప్రభుత్వ అధికారి. సంపన్న కుటుంబం వాళ్లది. కానీ, లంక ప్రభుత్వాలు తమిళులపై చూపించే వివక్ష ఆయన్ని బడి చదువును పక్కన పెట్టించింది. పదిహేనేళ్ల వయసులో.. సత్యసీలన్‌ ఏర్పాటు చేసిన తమిళ మనవర్‌ పెరవై అనే గ్రూప్‌లో చేరాడు. ఆపై తమిళులకు స్వయంప్రతిపత్తిని పిలుపుతో ముందుకు సాగాడు. పెరవై నుంచి విడిపోయి.. తమిళ న్యూ టైగర్స్‌ పేరుతో భాగస్వామ్య కూటమిని ఏర్పాటు చేశాడు.

అదే సమయంలో.. తమిళులకు సింహళీయులతో సమానంగా హక్కులను కల్పించాలని, తమిళులు అధికంగా ఉండే చోట్లను స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతాలుగా మార్చాలని ఒక వర్గం వారు కోరగా.. ఇంకో వర్గం ఏకంగా తమిళ ప్రాంతాన్నిటినీ కలిపి తమిళ్ ఈళం అనే ప్రత్యేక దేశాన్ని తమకు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు. అప్పుడు శ్రీలంక ప్రభుత్వంతో జరిగిన గెరిల్లా పోరాటానికి నాయకత్వం వహించారు ఎల్‌టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్.

Must Read

spot_img