Homeఅంతర్జాతీయంఆదానీ టార్గెట్ గా హిండర్ బర్గ్ సంస్థ..

ఆదానీ టార్గెట్ గా హిండర్ బర్గ్ సంస్థ..

ఆదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికా రీసెర్చి సంస్థ హిండర్ బర్గ్ .. నివేదిక సంచలనంగా మారింది.. ఈ సంస్థ నివేదికతో ఆదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ఆదానీ గ్రూప్ .. దిద్దుబాటు చర్యలకు సమాయాత్తం అవుతోంది. నివేదికపై న్యాయపరంగా పోరాటానికి సిద్ధమవుతోంది.

  • ఆదానీ టార్గెట్ గా హిండర్ బర్గ్ సంస్థ రిపోర్టు .. మార్కెట్లో కాక రేపుతోంది.
  • ఇప్పటివరకు తిరుగులేని ఆధిపత్యంతో పెచ్చరిల్లిన కంపెనీ షేర్లు..ఇప్పుడు ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి.
  • దీంతో షేర్ల పతనంతో .. హిండర్ బర్గ్ కంపెనీ షార్ట్ సెల్ కు పాల్పడుతోందంటూ మండిపడుతోంది.
  • దీనిపై చట్టపర చర్యలకు సన్నద్ధమవుతోంది.

అమెరికా రీసెర్చ్ సంస్థ హిండర్ బర్గ్ అదానీ గ్రూప్ కంపెనీలపై సంచలన రిపోర్ట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది భారత స్టాక్ మార్కెట్లలో పెద్ద కుదుపుకు కారణమైంది. దీనివల్ల అదానీ గ్రూప్ లోని 10 కంపెనీలు దాదాపు 5.5 బిలియన్ డాలర్ల విలువను కోల్పోయాయి. తమను సంప్రదిం,ొ వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా అమెరికా సంస్థ రిపోర్టు విడుదల చేసిందని అదానీ గ్రూప్ వెల్లడించింది.

ఎలాంటి ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలను వక్రీకరిస్తూ, దురుద్ధేశంతో ఇచ్చిన రిపోర్టుగా కంపెనీ దీనిని కొట్టిపడేసింది. కంపెనీ తీసుకొస్తున్న రూ.20 వేల కోట్ల ఎఫ్పీవోను టార్గెట్ చేసి ఈ రిపోర్ట్ రిలీజ్ చేసినట్లు గ్రూప్ పేర్కొంది. అదానీ షేర్ల పతనం నుంచి హిండెన్‌బర్గ్ ప్రయోజనం పొందుతుందని అదానీ గ్రూప్ ఆరోపించింది. అందుకే ఈ రీసెర్చ్ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ముందుకు సాగుతోంది.

దేశీయ మార్కెట్లలో అస్థిరతను సృష్టించి షార్ట్ సెల్ చేయటం ద్వారా హిండెన్‌బర్గ్ లాభపడుతుందని అదానీ గ్రూప్ హెడ్ – లీగల్ జతిన్ జలంధ్వాలా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందుకే దీనిపై చట్టపరమైన చర్యలను పరిశీలిస్తున్నట్లు గ్రూప్ పేర్కొంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన గేమ్ స్టార్ట్ చేసినట్లు కనిపిస్తోంది. సీజన్డ్ షార్ట్ సెల్లర్ భారత వ్యాపార దిగ్గజాల్లో ఒకటైన అదానీ గ్రూప్ కంపెనీ షేర్లను టార్గెట్ చేసింది.

దీనివల్ల మెుదటిరోజు అంటే జనవరి 25న అదానీ గ్రూప్ కంపెనీలు 1-8 శాతం మధ్య నష్టపోయాయి. అమెరికా మార్కెట్లలో సైతం ఇలాంటివి చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఇంత భారీగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అదానీ గ్రూప్ కు చెందిన అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ పవర్, అదానీ విల్మార్ షేర్లు భారీగా నష్టపోయాయి.

ఈ క్రమంలో మెుత్తం గ్రూప్ కంపెనీలు దాదాపు రూ.97,000 కోట్లు కోల్పోయాయి. దీంతో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టాలను చవిచూశారు. భారత వ్యాపార దిగ్గజం దశాబ్దాలుగా స్పష్టమైన స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాల్లో పాల్గొన్నట్లు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన నివేదించింది.

దీనికి తోడు అదానీ గ్రూప్ కంపెనీ షేర్లను షాట్ చేయాలని సూచించింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక పెను సంచలనానికి దారితీసింది. దీంతో బిలియనీర్ అదానీకి చెందిన కంపెనీల షేర్లు రెడ్ జోన్‌లో ట్రేడ్ అవుతున్నాయి. పైగా ఇన్వెస్టర్లకు చెందిన వేల కోట్ల సంపద ఆవిరైంది.

ఈ వ్యవహారంలో రెండేళ్లుగా ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చ్ సంస్థ తన విచారణను నిర్వహిస్తోంది. హిండెన్‌బర్గ్ ప్రకారం అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ సుమారు 120 బిలియన్లు డాలర్లని తెలుస్తోంది.

పైగా గడచిన మూడేళ్ల కాలంలో కుబేరుడి సంపద ఏకంగా 100 బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని నివేదిక తెలిపింది. ప్రధానంగా గ్రూప్ లోని లిస్టెడ్ కంపెనీ షేర్ ధరలు పెరుగుదల అదానీ సంపదను పెంచింది. కంపెనీల షేర్లు సగటున 819 శాతం లాభపడ్డాయి. అదానీ గ్రూప్ వాస్తవ పరిస్థితులను లెక్కగట్టేందుకు రీసెర్చ్ సంస్థ అదానీ గ్రూప్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా అనేక మంది వ్యక్తులు పరిశోధన కోసం ఇంటర్వ్యూ చేసింది.

కంపెనీకి చెందిన అనేక డాక్యుమెంట్లను పరిశీలించింది. వీటిని పక్కనపెట్టి గ్రూప్ ఆర్థిక స్థితిని ఫేస్ వ్యాల్యూతో తీసుకున్నా, ఏడు కీలకమైన లిస్టెడ్ కంపెనీలు 85% నష్టాలను కలిగి ఉన్నాయి. కంపెనీల వాల్యూయేషన్ సైతం ఆకాశానికి తాకినట్లు అభిప్రాయపడింది. కీలకమైన లిస్టెడ్ అదానీ కంపెనీలు కూడా భారీగా రుణాలను పొందాయి. రుణాల కోసం కంపెనీ తన వాటాలను పెట్టడం గ్రూప్ ఆర్థిక పరిస్థితిని ప్రమాదంలో పడేసినట్లు నివేదిక వెల్లడించింది.

  • అదానీ గ్రూప్ మనీలాండరింగ్, డాలర్లపై పన్ను దొంగతనంతో పాటు అవినీతి ఆరోపణలకు భారీగా డబ్బు వెచ్చించినట్లు చెప్పబడింది..

మారిషస్, యూఏఈ, కరేబియన్ దీవులు వంటి టాక్స్ హెవెన్ ప్రాంతాల్లో షెల్ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు అదానీ కుటుంబ సభ్యులు సహకరించినట్లు
ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు నకిలీ దిగుమతి/ఎగుమతి డాక్యుమెంటేషన్‌, నకిలీ టర్నోవర్, కంపెనీల నుంచి డబ్బు దారి మళ్లించటం గురించి హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది.

ఇంత భారీగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అదానీ గ్రూప్ కు చెందిన అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ పవర్, అదానీ విల్మార్ షేర్లు 1-4 శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈ వార్తలతో ఏడు అదానీ గ్రూప్ కంపెనీలు బుధవారం ఏకంగా రూ.46,086 కోట్ల మార్కెట్ క్యాప్ ను కోల్పోయాయి.

ఆదానీ టోటల్ గ్యాస్ రూ.12,366 కోట్లు, అదానీ పోర్ట్స్ రూ.8,342 కోట్లు, అదానీ ట్రాన్స్‌మిషన్ రూ.8,039 కోట్ల మేర ట్రేడింగ్ లోనష్టపోయాయి. ఇజ్రాయిల్‌ నుంచి మొరాకో వరకూ పలు దేశాల్లో విస్తరణ ప్రణాళికల్ని ప్రకటించిన తరుణంలోనే ఈ రిపోర్ట్‌తో గౌతమ్‌ అదానీ అనుకున్నట్టు సానుకూలంగా కాకుండా ప్రతికూలంగా మారిందని బ్లూంబర్గ్ వెల్లడించింది.

ఈ స్థాయి స్క్రూటినీని .. అదానీ తన స్వదేశం ఇండియాలోనైతే చాలావరకూ మేనేజ్‌చేసుకునేవారని బ్లూంబర్గ్‌ పేర్కొంది. భారత్‌లో అదానీపై విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సన్నిహితత్వం కారణంగా అవేవీ కూడా ఆయన అపార వృద్ధికి అడ్డంకి కాలేదని తెలిపింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారవచ్చన్న అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.

హిండన్‌బర్గ్‌ ఒక చిన్న షార్ట్‌సెల్లింగ్‌ సంస్థ కావొచ్చని, అమెరికా ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ నికోలా కార్పొరేషన్‌ వంటి కంపెనీలను దించివేసిన చరిత్ర ఆ సంస్థకు ఉందని బ్లూంబర్గ్ తెలిపింది. 2020 నుంచి హిండన్‌బర్గ్‌ 30 కంపెనీలను టార్గెట్‌ చేయగా, ఆయా షేర్లు ఆ మరుసటి రోజే 15 శాతం వరకూ పతనమయ్యాయి. ఆరు నెలల తర్వాత ఆ షేర్లు సగటున 26 శాతం క్షీణించాయి.

హిండన్‌బర్గ్‌ సామర్థ్యాన్ని ఇప్పటికే చూసి ఉన్నందున, అదానీ గ్రూప్‌పై చేసిన ఆరోపణలు పూర్తిగా పరిశోధించినవేనని భావిస్తున్నట్టు జర్మనీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ పేర్కొంది. హిండెన్‌బర్గ్‌ వివరణాత్మకంగా రూపొందించిన పరిశోధనా నివేదిక బహిరంగమైనందున, భారత ప్రభుత్వం అందులో ఆరోపణల్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని బ్లూంబర్గ్‌ తెలిపింది.

గత ఏడాది ఆగస్టులో అంతర్జాతీయ డెట్‌ రీసెర్చ్‌ సంస్థ క్రెడిట్‌సైట్స్‌ అదానీ గ్రూప్‌ తీసుకున్న భారీ రుణాల్ని ప్రశ్నించింది. కానీ అదానీ రుణ నిష్పత్తులు సబబుగానే ఉన్నాయంటూ నెలరోజుల తర్వాత క్రెడిట్‌సైట్స్‌ వివరణ ఇచ్చింది. అయితే హిండన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలు భిన్నమైనవి. ఖాతా పుస్తకాల్లో నకిలీ లెక్కలు చూపించారని, విదేశాల్లో డొల్లకంపెనీలు ఏర్పాటుచేసి, మనీ లాండరింగ్‌ పాల్పడ్డారని, కృత్రిమంగా షేర్ల ధరల్ని పెంచివేసి, వాటిపై రుణాలు తీసుకున్నారని విరుచుకుపడింది.

క్రెడిట్‌సైట్స్‌లా హిండెన్‌బర్గ్‌ వెనక్కుతగ్గదని, ఇది 60 ఏళ్ల అదానీకి పెద్ద సవాలని బ్లూంబర్గ్‌ పేర్కొంది. అదానీ గ్రూప్‌పై అమెరికా హెడ్జ్‌ ఫండ్‌ హిండెన్‌బర్గ్‌ చేసిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఇరు పక్షాలు గురువారం ఘాటుగా స్పందించాయి. హిండన్‌బర్గ్‌ తగిన పరిశోధన చేయకుండా, దురుద్దేశ్యపూర్వకంగా నివేదిక విడుదల చేసిందని, అమెరికా, ఇండియా చట్టాలను అనుసరించి లీగల్‌ చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆదానీ గ్రూప్ పేర్కొంది.

అంతర్జాతీయ స్థాయిలో నివేదిక వెలువడడంతో, ఆదానీ గ్రూప్ కంపెనీలకు కష్టాలు తప్పడం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లేనిపక్షంలో ..ఆదానీ .. వీటికి చెక్ పెట్టి ఉండేవారన్న చర్చ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది..


Must Read

spot_img