విలక్షణమైన సినిమాలు పాత్రలతో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న హీరో సత్యదేవ్. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’లో విలన్ గా నటించిన ఆ పాత్రలోనూ మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమా తరువాత సత్యదేవ్ కన్నడ నటుడు ‘పుష్ప’ విలన్ డాలి ధనుంజయతో కలిసి తొలిసారి ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.
సరికొత్త కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించడంలో ముందుంటాడు హీరో సత్యదేవ్. ఆయన నటించిన సినిమాలు వరుస విజయాలు సాధిస్తున్నాయి. హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ యంగ్ హీరో, మరో ప్రతిష్టాత్మక మూవీలో నటించబోతున్నారు. తన కెరీర్‌లో 26వ సినిమాగా పాన్ ఇండియన్ మూవీలో నటిస్తున్నారు. ఈశ్వర్ కార్తిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్ లపై ఎస్. ఎన్. రెడ్డి బాల సుందరం దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.క్రైమ్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీకి ‘జీబ్రా’ అనే టైటిట్ ని ఖరారు చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం టైటిల్ పోస్టర్ ని చిత్ర బృందం విడుదల చేసింది.
ధైర్య వంతులకే లక్ ఫేవర్ చేస్తుంది అనే క్యాప్షన్ ఆకట్టుకుంటోంది. చెస్ పీజెస్ వైట్ హార్స్ బ్లాక్ హార్స్ లని సింబాలిక్ గా చూపిస్తూ అలాంటి మనస్థత్వం వున్న ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే సమరం నేపథ్యంలో ఈ మూవీ వుండనుందని ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ తో మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.
మధ్యలో జీబ్రా క్రాసింగ్ లైన్స్.. రెండువేల రూపాయల నోటు ఆకాశంలో ఎగురు తున్న ఫ్లైట్ .. టైటిల్ మద్యలో స్పీడో మీటర్ ని చూపించిన తీరు సినిమా ఓ రేంజ్ లో సరికొత్త నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. రేస్ సత్యదేవ్, డాలీ ధనుంజయ్ ల మధ్య సాగుతుందని, వైట్ హార్స్ సత్యదేవ్ అయితే బ్లాక్ హార్స్ గా ధనుంజయ్ పాత్ర వుంటుందని ఫస్ట్ లుక్ పోస్ట్ తో తెలుస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బాస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.