మెగా పవర్ స్టార్ రామ్ చరణ్…ఇప్పడు ఈ పేరు ఓ సంచలనం. ఇండియా గర్వించదగ్గ విధంగా ఎదిగిన తెలుగు నటుడు. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన చరణ్.. ఇప్పుడు చరణ్ తండ్రి చిరంజీవి అనే స్థాయికి ఎదిగాడు. గత కొంత కాలంగా పాన్ ఇండియా స్టార్ గా ఉన్న చెర్రీ ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తుల జాబీతాలో చేరాడు. తాజాగా త్రిపుల్ ఆర్ మూవీతో ఆస్కార్ రేసులో ఉన్నాడు. హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డుకు హాజరైన మొట్ట మొదటి భారతీయుడు రామ్ చరణ్. దానికన్నా ముందు జరగబోయే ఇంటర్వ్యూ కోసం చరణ్ రెండు రోజులు ముందే అమెరికాలో ఎంట్రీ ఇచ్చాడు. ఇక తాజాగా న్యూయార్క్ లో జరుగుతున్న ఇంటర్వ్యూకి అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. చరణ్ ను ఒక్కసారిగా చూస్తే హాలీవుడ్ స్టార్ అనుకోకుండా మానరు.
నిత్యం అయ్యప్ప స్వామి దీక్షలో చెర్రీ..
రామ్చరణ్ తను ఎంత బిజీగా ఉన్నా సరే ఆధ్యాత్మిక విషయాల్లో ఎప్పుడూ ముందుంటారు. పెద్దల పట్ల గౌరవం, తల్లిదండ్రులు మీద ప్రేమ ఎప్పుడూ కనబరుస్తుంటాడు. దీంతో పాటు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఎక్కువసార్లు అయ్యప్ప మాలలో కనిపించిన హీరో ఎవరంటే అది చరణ్ మాత్రమే అని చెప్పొచ్చు. రీసెంట్ గా మాల ధరించినట్టు కనిపించిన చరణ్ ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి యూఎస్ వెళ్లాడు. వెళ్లేప్పుడు.. యూఎస్ లో కూడా మాలతో కనిపించాడు చరణ్. అయితే సడెన్ గా నిన్న ఈవెనింగ్ మళ్లీ సివిల్ డ్రెస్లో సూటు బూటు వేసుకొని కనిపించాడు. ఇక్కడ నుంచి మాలతో వెళ్లి అక్కడ ఎలా చరణ్ అలా మారిపోయారని అందరు అనుకున్నారు.
న్యూయార్క్ గుడిలో మాల తీసిన చరణ్..!
అదేంటంటే..గత కొన్నిరోజులుగా చరణ్ స్వామి మాలలో ఉన్నారు. ఎక్కడికి వెళ్లిన పాదరక్షలు విడిచి.. నల్ల దుస్తుల్లోనే కనిపించారు. నిన్న కూడా అమెరికాకు మాలలోనే వెళ్లారు..చెర్రీ న్యూయార్క్ గుడిలో తన మాల తీసినట్టు సమాచారం. మొన్నటికి చరణ్ మాల ధరించి 21 రోజులు పూర్తి కావడంతో అక్కడ గుడిలో మాల తీసి ప్రత్యేక పూజలు నిర్వహించారట చరణ్. అయితే ఆ విజువల్స్ మాత్రం బయటకు రాలేదు. సాదారణంగా అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు 41 రోజులు దీక్షలు చేస్తారు. ఏదైన జరగరానిది జరిగితే తప్పా మద్యలో మాలను తీయరు. మొత్తానికి తను ఎంత పెద్ద స్టార్ అయినా కూడా చరణ్ తన భక్తి భావనని కొనసాగిస్తున్నారు. చరణ్ రెగ్యులర్ గా అయ్యప్ప మాలలో కనిపిస్తూ ఉంటారు. ఆస్కార్ అవార్డుల వేడుకలకు ఇండియా నుంచి మాలతో వెళ్లినా న్యూయార్క్ టెంపుల్ లో మాల తీసి సివిల్ డ్రెస్ లో దర్శనమిచ్చాడు చరణ్. స్వామి మాల తీసివేశాకనే చరణ్ ఈ లుక్ లో కనిపించాడు అన్నమాట. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు చరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎలాంటి వివాదాలకు రాకుండా చరణ్ మంచి పని చేసినట్లు చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం చరణ్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.