అందరి మృతి వెనుక కామన్ గా హార్ట్ ఎటాక్….
క్షణాల్లో కుప్పకూలి చనిపోతున్న వైనం
తారల మరణాలు తెచ్చిపెడుతున్న తీరని లోటులు..
హార్ట్ ఎటాక్.. కార్డియాక్ అరెస్ట్..గుండెపోటు.. కారణమేదైనా చాలా మంది ప్రాణం తీస్తోంది. అకస్మాత్తుగా ఊపిరి ఆగిపోతోంది. సుఖవంతమైన జీవనం కోసం సమకూర్చుకుంటున్న సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానాలే మనిషి ఆయువును తగ్గించేస్తున్నాయి. ఎక్కువ యవ్వనంగా కనిపించాలనే ఆశ ఓ వైపు చాలా మంది ప్రాణాల మీదకు తెస్తుంది. మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ అభివృద్ది చెందుతు…వైద్య రంగంలో నూతన పద్దతులు కనిపెట్టినప్పటికీ..ఒక్క సావుకు మాత్రం ఎంత డబ్బు ఖర్చుపెట్టిన ప్రాణం నిలపలేకపోతుంది. గతంలో గుండె పోటు వచ్చి చనిపోయిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పట్టుమని 50 ఏండ్లు దాటని వారు కూడా హార్ట్ ఎటాక్ భారీన పడి చనిపోతున్నారు. వారు ఆరోగ్యంగా ఉల్లాషంగా కనిపించిన క్షణాల్లో కుప్పకూలి ప్రాణాలు వదిలేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికైన గుండెపోటు వచ్చిందంటే వారు మీద ఆశలు వదిలేసుకునే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా 40 ఏండ్లలోపు వారినీ హృద్రోగం మింగేస్తున్నదని తాజా సర్వేలు కూడా చెప్తున్నాయి. చిన్నవయసులో గుండె సమస్యలకు అనేక కారణాలు ఉన్నా..చాలా వరకు హార్ట్ ఎటాక్ భారీన ఎక్కువ జిమ్ లో వర్కౌట్స్ చేసే వాళ్లకే వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ స్టార్లు 18 నెలలలోనే పదుల సంఖ్యలో మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. వారు వద్ద ఎంత డబ్బు, పలుకుడి ఉన్న గాల్లో కలుస్తున్న ప్రాణాన్ని ఆపలేకపోతున్నారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నుంచి నందమూరి తారక రత్న వరకూ కామన్ గా వారికి హార్ట్ ఎటాక్ కారణమనే విషయాన్ని వైధ్యులు దృవీకరిస్తున్నారు. అతి చిన్న వయస్సులోనే వారు మృతి చెందడానికి కారణాలపై ఇప్పటికే చాలా వరకు స్పష్టం చేస్తున్నారు. గడిచిన 18 నెలల కాలంలోనే ఏడుగురు సెలబ్రెటీలు ఇలా తుదిశ్వాస వదిలాడంతో అభిమానుల్లో అలజడి మొదలైంది. చాలా మంది తమ అభిమాన హీరోలు వెండి తెరపై బాగా కనిపించాలనే కోరికతో ఎకువ టైం జిమ్ లలో వర్కౌట్స్లు చేస్తున్నారు. తాజాగా భాడీ స్లిమ్ గా ఉంచుకోవడంతో పాటు సిక్స్ ఫ్యాక్, ఎయిట్ ఫ్యాక్ ల కోసం తెగ కసర్తులు చెస్తున్నారు.
రాజు శ్రీవాత్సవ (బెస్ట్ కమెడియన్)
స్టాండప్ కామెడీ ఆర్టిస్ట్, ప్రముఖ నటుడు రాజు శ్రీవాత్సవ గుండెపోటుతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో 41 రోజులు చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 58 సంవత్సరాలు. గతంలో ఒకసారి గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతుండగా డాక్టర్లు అప్పట్లో తనకు స్టంట్ వేశారు. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కొంచెం కోలుకున్నాక జిమ్ లో వర్కౌట్లు చేస్తుండగా 2022 ఆగష్టు 10న శ్రీవాత్సవ గుండెపోటుకు గురయ్యారు. తీవ్ర స్థాయిలో ఆయనకు గుండె పోటు రావడంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అంధించారు. చాలా రోజులు మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచారు. ఆయన ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ ద్వారా బెస్ట్ కమెడియన్ గా గుర్తింపు పోందారు.
సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ (హిందీ టీవీ నటుడు)
హిందీ టీవీ నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ కూడా గుండె పోటుతో మృతి చెందారు. 46 ఏళ్ల వయస్సున్న వీర్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఒక్కసారీగా కుప్పకూలీ పోయాడు. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినా ఉపయోగంలేకుండా పోయింది. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈయన కూడా తన శరీరాకృతిని మంచిగా ఉంచుకోవాలనే ఉద్దేశ్యంతో జిమ్ లో ఎక్కువగా వర్కౌట్స్ చేశాడు. దీనితో పాటు శరీరానికి కావాల్సిన ఫౌష్టికాహారం సరిగా తీసుకోకపోవడం తీవ్రంగా ఒత్తిడికి గురికావడం, సరైన నిద్ర లేకపోవడంతోనే చిన్న వయస్సులో హార్ట్ ఎటాక్ కు గురైనట్లు సమాచారం.
మేకపాటి గౌతమ్ రెడ్డి (ఆంధ్రా ఐటి శాఖ మంత్రి)
ప్రముఖ యువ రాజకీయ నాయకుడు ఆంధ్రాప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా నాలుగు పదుల వయస్సులోనే మృతి చెందారు. 49 ఏళ్ల వయస్సులో కూడా తన బాడీని ఫిట్ గా ఉంచుకునే వారు. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ..చేస్తూనే హఠాన్మరణం పాలయ్యారు. నిత్యం తన ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ద చూపించే గౌతమ్ మరణం కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, అనుచరులను షాక్ కు గురిచేసింది. తనకు గతంలో ఎప్పుడూ గుండెకు సంబంధించిన సమస్యలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. 2022 ఫిబ్రవరి 20న హైదరాబాద్ లో ఓ వివాహ కార్యాక్రమానికి హాజరైన మరుసటి రోజు ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అప్పట్లో ఆయన మరణం అందర్నీ శోక సంద్రంలో ముంచెత్తింది.
పునీత్ రాజ్ కుమార్ (కన్నడ సూసర్ స్టార్)
కన్నడ కంఠీరవ, లెజండరీ నటుడు ప్రముఖ సినీ హీరో తనయుడు పునీత్ రాజ్ కుమార్ కూడా జిమ్ లో కసరత్తు పూర్తిచేసిన మంచినీరు తాగి విశ్రాంతి తీసుకుంటుండగా ఒక్కసారి చాతీలో నొప్పిరావడంతో ఉన్నట్టుండి కుప్పకూలారు. ఆయన్ను ఆసుపత్రికి తరలించేలోపే తుదిశ్వాస వదిలారు. 46 ఏళ్ల వయసు
లోనే పునీత్ కన్నుమూశారు. అప్పూ అని ప్రేమగా పిలుచుకునే అభిమానుల గుండెల్లో చెప్పలేనంత దుఃఖాన్ని మిగిల్చి వెళ్లిపోయాడు. 2021 అక్టోబరు 29న ఆయన తుది శ్వాస విడిచి తీరిగిరాని లోకానికి వెళ్లారు. ఈయన రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న వర్థమాన నటుడు. పునీత్ కర్నాటక రాష్ర్టంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఎంతో మందికి ఉచితంగా విధ్యను అంధించారు.
సిద్ధార్థ్ శుక్లా (బిగ్ బాస్ ఫేమ్)
ప్రముఖ బాలీవుడ్ టెలివిజన్ నటుడు, బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా మరణం ఇప్పటికీ అభిమానులను కలచివేస్తోంది. ఆయన మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. వెండితెరపై కూడా తన నటన ద్వారా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే క్రమంలో ఆ స్టార్ చుక్కల్లో కలిసిపోయాడు. 40 ఏళ్లకే నూరేళ్లు నిండటంతో కుటుంబ సభ్యులతో పాటు ప్యాన్స్ ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోయారు. చిన్నవయస్సులోనే గుండెపోటుతో మరణించడంతో అంతా షాక్ అవుయ్యారు. 2022 సెప్టెంబర్ 2న రాత్రి 10 గంటల వరకు దాదాపు 3 గంటలు జిమ్ చేసి, డిన్నర్ చేసి పడుకున్న శుక్లా నిద్రలోనే చనిపోయారు. మొదట్లో ఆయన మరణంపై ఎన్నోఅనుమానాలు తలెత్తిన ఆ తర్వాత వైధ్యులు అధిక వర్కౌట్స్ మరణానికి కారణం అని తేల్చి చెప్పారు.
సింగర్ కెకె ( ప్రసిద్ద గాయకుడు)
కెకె గా ప్రసిద్ధుడైన కృష్ణకుమార్ కున్నత్ ప్రసిద్ద భారతీయ గాయకుడు. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 200లకు పైగా పాటలు పాడారు. ఈయన కూడా హార్ట్ స్ట్రోక్ తోనే చనిపోయారు. 2022, మే 31న కలకత్తాలోని ఓ కాలేజీ ఫెస్ట్ లో లైవ్ ప్రదర్శన ఇస్తుండగా చనిపోయారు. ఫర్పామెన్స్ ఇస్తున్న స్టేజి మీదనే హార్ట్ స్ట్రోక్ తో కుప్పకూలిపోయారు. హుటాహుటీన ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. ఆయన చనిపోయిన నాటీకి ఆయన వయస్సు 53 ఏళ్లు.
నందమూరి తారకరత్న (తెలుగు నటుడు)
ఇక తాజాగా నందమూరి తారకరత్న కూడా 40 ఏళ్ల వయసులోనే హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. అతి చిన్న వయస్సులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 27న కుప్పంలో ప్రారంభించిన యువగళం పాదయాత్రలో ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే ఆయనను కుప్పం ఆసుపత్రికి, అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించేందుకు విదేశాల నుంచి నిపుణులను పిలిపించారు. ఆసుపత్రిలో 23 రోజుల చికిత్స తర్వాత శనివారం తారకరత్న కన్నుమూశారు. తారకరత్న 2001లో ఒకేసారి 9 సినిమాలు మొదలు పెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. తాత మీద ఉన్న ప్రేమాభిమానంతోనే తారకరత్న ఆయన పిల్లలకు ఎన్టీఆర్ పేరు కలిసేలా పేర్లు పెట్టారు.