హీరో విజయ్ నటిస్తున్న చిత్రం లియో భారీ అంచనాలతో మొదలైంది. సినిమా షూటింగ్ ఇటీవల గ్రాండ్ గా ప్రారంభమైంది. భారీ అంచనాలతో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, మిస్కిన్, గౌతమ్ మీనన్, లాంటి నటులు నటిస్తున్నారనే విషయం ఆసక్తిని రేపింది. అంతేకాకుండా హీరోయిన్ త్రిష అనే సరికి అభిమానులకు వారి ఇద్దరి కాంబినేషన్లో 12 ఏళ్ల క్రితం హిట్ అయిన మూవీ గిల్లి గుర్తుకువచ్చింది. ఇక అభిమానులు సోషల్ మీడియాలో వారి ఇరువురి జోడి గురించి తెగ ట్రెండింగ్ చేశారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో త్రిష కృష్ణన్ విజయ్‌తోపాటు కాశ్మీర్ షూటింగ్‌కు వెళ్లింది. ప్రస్తుతం కాశ్మీర్ లో చలి తీవ్రత బాగా ఉండటంతో షూటింగ్ కాస్త లేట్ అవుతుంది. దీంతో పాటు లోకేష్ కనకరాజ్‌తో త్రిషకు విభేదాలు తలెత్తాయని వినికిడి. ఇంత వరకు బాగానే ఉన్న త్రిష షూటింగ్ పూర్తి కాకముందే చెన్నై రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు త్రిష మద్యలో ఎందుకు వచ్చింది అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. దీంతో పాటు చెన్నై ఎయిర్ ఫోర్ట్ లో త్రిష వచ్చిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. వాతావరణం పడటం లేదనే కారణంతో సినిమా నుంచి తప్పుకొన్నదనే విషయం మీడియాలో వైరల్ అయింది.
విజయ్ సినిమా నుంచి త్రిష తప్పుకొన్నదనే వార్త మీడియాలో ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో ఆమె తల్లి ఉమ కృష్ణన్ స్పందించారు. త్రిష గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని కవర్ చేయడానికి ప్రయత్నించారు. ఆమె ప్రస్తుతం కాశ్మీర్ షూటింగులోనే ఉన్నారని… ఇలాంటి వార్తలను నమ్మకండి అంటూ ఉమ కృష్ణన్ తెలిపారు.
అయితే త్రిష విషయంలో మాత్రం ఓ విషయం చక్కర్లు కోడుతుంది. ఆమె రావడానికి చలి కారణం కాదని, చిత్రంలో త్రిష పాత్ర పరిధి తక్కువగా ఉందనే ప్రచారం మొదలైంది. త్రిషతో పాటు మరో హీరోయిన్ ప్రియా ఆనంద్ కూడా ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో కథ విషయంలో మరో హీరోయిన్ కు ఎక్కువ ప్రియారిటి ఉందనే ప్రియానే ప్రధాన హీరోయిన్ అని టాక్ వైరల్ అవుతోంది. త్రిష ఫ్లాష్‌బ్యాక్‌లో మాత్రమే కనిపిస్తుందని తెలియడంతో ఆమె దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌తో గొడవ పడినట్లు తెలుస్తుంది. దీంతో చిత్రం నుంచి వైదొలగినట్లు మరో పక్క ప్రచారం వైరల్ అవుతోంది. మొత్తానికి లియో చిత్రంలో నటి త్రిష ఊ అంటుందో.. ఊ ఊ అంటుందో చూడాలి.