Homeజాతీయంక్రిప్టో కరెన్సీపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందా..?

క్రిప్టో కరెన్సీపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందా..?

ఎట్టకేలకు క్రిప్టో కరెన్సీపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందా..?దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోన్న క్రిప్టోకు .. తనదైన శైలిలో ముక్కుతాడు వేసిందా..? ఇంతకీ క్రిప్టో కరెన్సీపై భారత్ తీసుకున్న .. నిర్ణయం ఏమిటి..? కేంద్ర నిర్ణయంతో .. క్రిప్టో లావాదేవీలపై ఎటువంటి ప్రభావం కనిపించనుందన్నదే ఆర్థిక వేత్తల్లో ఆసక్తికరంగా మారింది. దీంతో క్రిప్టో కరెన్సీ దూకుడుకు బ్రేక్ పడినట్లేనా.?

ఎటువంటి రూపం లేని కరెన్సీ .. దేశప్రజలకు ప్రమాదకరమని, దీంతో ముప్పు తప్పదని ఆర్బీఐ ఆది నుంచి చెబుతూనే ఉంది. దీంతో క్రిప్టో కరెన్సీపై కేంద్రం సైతం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే 30 శాతం పన్ను విధించిన కేంద్రం .. తాజాగా వీటిని మనీలాండరింగ్ పరిధిలోకి తీసుకువచ్చింది. తద్వారా .. హవాలా మార్గంలో క్రిప్టో జోరుకు బ్రేక్ వేసినట్లేనని విశ్లేషకులు అంటున్నారు.

క్రిప్టో కరెన్సీలు, వర్చువల్ డిజిటల్ ఆస్తుల విషయంలో కేంద్రం అణచివేత ధోరణిని కొనసాగిస్తోంది. దేశంలో సామాన్య ఇన్వెస్టర్లను వీటికి దూరంగా ఉంచేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. డిజిటల్ ఆస్తుల పర్యవేక్షణను కఠినతరం చేసేందుకు కేంద్రం తాజా చర్యగా క్రిప్టో ట్రేడింగ్, సేఫ్టీ సంబంధిత ఆర్థిక సేవలను మనీలాండరింగ్ని రోధక చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. భారత ప్రభుత్వ తాజా గెజిట్ ప్రకారం క్రిప్టో
ఎక్స్ఛేంజీలు, మధ్యవర్తులు ఇప్పుడు తమ క్లయింట్లు, ప్లాట్‌ఫారమ్ వినియోగదారుల KYCని తప్పక నిర్వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనుమానాస్పద ట్రాన్సాక్షన్లను గుర్తించినట్లయితే వాటి వివరాలను సదరు ఎక్స్ఛేంజీలు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియాకు తెలియజేయాల్సి ఉంటుంది. VDAలో వ్యవహరించే సంస్థలు PMLA-బ్యాంకుల క్రింద “రిపోర్టింగ్ ఎంటిటీ”గా పరిగణించబడతాయని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. దేశంలోని ఆర్థిక సంస్థలు, రియల్ ఎస్టేట్, ఆభరణాల రంగాల్లో
నిమగ్నమైన సంస్థలు, కాసినోలు ఇకపై ‘రిపోర్టింగ్ ఎంటిటీలు’ అని గెజిట్ ద్వారా వెల్లడైంది. అందువల్ల చట్టం ప్రకారం.. ప్రతి రిపోర్టింగ్ సంస్థ అన్ని లావాదేవీల రికార్డులను నిర్వహించాల్సి ఉంటుంది.

అలాగే క్రిప్టో ఎంటిటీలు కూడా రికార్డులను నిర్వహించటం తప్పనిసరి. బ్యాంకులు లేదా ఇతర నియంత్రిత సంస్థలు అనుసరించే విధంగా
మనీలాండరింగ్ నిరోధక ప్రమాణాలకు అనుసరించాలని డిజిటల్-ఆస్తి ప్లాట్‌ఫాంలను వివరాలను అడగటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధోరణికి అనుగుణంగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మనీ లాండరింగ్‌ చట్టం కిందకు క్రిప్టో వ్యాపారాలు, లావాదేవీలను తీసుకొస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

దీని ప్రకారం క్రిప్టో ఎక్సేంజీలు, వాటి సంరక్షకులు, వ్యాలెట్‌ ప్రొవైడర్లుసహా యావత్తు క్రిప్టో బిజినెస్‌ ట్రేడింగ్‌.. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం 2002 కిందకు వస్తుంది.

దీంతో అన్ని లావాదేవీల వివరాలను తప్పక పేర్కొనాల్సిందే. కనీసం ఐదేళ్లపాటు అన్ని లావాదేవీల రికార్డులను నిర్వహించాలి. ముఖ్యంగా రూ.10 లక్షలకుపైగా ఉన్న లావాదేవీలను భద్రపర్చాల్సిందే. క్రిప్టోకరెన్సీ ఆస్తులు, ఫియట్‌ కరెన్సీల మధ్య ఎక్సేంజ్‌, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రూపాల్లో వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్‌ మధ్య ఎక్సేంజ్‌, వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్‌ బదిలీ, వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్‌ ప్రమేయమున్న సాధనాల్లో పెట్టుబడులు, క్రిప్టోకరెన్సీల నిర్వహణ, వాటిని భద్రపర్చడం, వర్చువల్‌ డిజిటల్‌ అసెట్‌ అమ్మకం, ఇతరత్రా లావాదేవీల్లో పాల్గొనడం వీటిని నేరుగాగానీ లేదా ఎవరి తరఫునైనాగానీ నిర్వహించినా తెలియపర్చాలి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను నిరుడు
ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్రిప్టో లావాదేవీలపై 30 శాతం పన్నును వేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ డిజిటల్‌ అసెట్స్‌ను పన్ను పరిధిలోకి తేవడమేగాక, పరిమితి దాటితే వీటి లావాదేవీలపై 1 శాతం టీడీఎస్‌నూ విధించారు. చివరకు క్రిప్టో, డిజిటల్‌ ఆస్తుల్లో బహుమతులపైనా పన్నుంటుందని స్పష్టం చేశారు. దీంతో క్రిప్టోకరెన్సీని చట్టబద్ధం చేసినట్టెంది. తాజాగా మనీ లాండరింగ్‌ కిందకూ ఈ లావాదేవీలను తేవడంతో ఈ రంగానికి మరింత గుర్తింపును ప్రభుత్వం ఇచ్చినట్టెంది. నిజానికి క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎప్పట్నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి విదితమే. బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీల ద్వారా జరిగే అక్రమాలపై మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది.

కేవైసీ వివరాలు అందుబాటులో లేకపోతే కనీసం వారి గుర్తింపునకు దోహదం చేసే డాక్యుమెంట్లు, ఖాతాల ఫైళ్లు, వ్యాపార లావాదేవీల వివరాలను ఐదేళ్ల పాటు భద్రపరచాలని కోరింది.

ప్రస్తుతం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, స్థిరాస్తి సంస్థలు, నగల వ్యాపారులు, జూద గృహాలు మాత్రమే ఒక స్థాయికి మించిన అనుమానిత ఆర్థిక లావాదేవీలను పీఎంఎల్‌ఐ చట్టం కింద తెలియజేస్తున్నాయి. ఇక క్రిప్టో కరెన్సీ లావాదేవీల సంస్థలు కూడా ఈ జాబితాలో చేరాయి. ఈ చర్యలతో క్రిప్టోల ద్వారా జరిగే ఆర్థిక నేరాలకు చాలా వరకు తెరపడుతుందని భావిస్తున్నారు. తీవ్రవాదులు, ఆర్థిక నేరస్థులు హవాలాకు బదులు, క్రిప్టోల ద్వారా విదేశాల నుంచి నిధులు అందుకోవడం, లేదా విదేశాలకు పంపించడం చేస్తున్నారు. దీంతో వీరి లావాదేవీలను పసిగట్టడం దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాల్‌గా మారింది. దేశంలోని ఉగ్రవాదులకూ క్రిప్టోల రూపంలో పెద్ద మొత్తంలో నిధులు
అందుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో క్రిప్టో లావాదేవీలను మనీలాండరింగ్‌ పరిధిలోకి తేవడం ద్వారా వారికి చెక్‌పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అమెరికా, ఐరోపా సమాఖ్యలోని దేశాలు క్రిప్టోకరెన్సీలను నిషేధించక పోయినా, వాటి లావాదేవీలపై పటిష్ఠమైన పర్యవేక్షణ ఏర్పాటు చేశాయి. దీంతో ఆ దేశాల్లో జరిగే క్రిప్టో లావాదేవీల వివరాలన్నీ దర్యాప్తు సంస్థలకు ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. మన దేశంలో మాత్రం ఇప్పటి వరకు ఆ అవకాశం లేకుండా పోయింది.

బ్లాక్‌ చెయిన్‌ వంటి ఆధునిక టెక్నాలజీ సాయంతో జరిగే వీటి లావాదేవీల వివరాలు కనుక్కోవడం దర్యాప్తు సంస్థలకూ సవాల్‌గా మారింది. దీంతో గొలుసు కట్టు పథకాల్లా మారిన క్రిప్టో కరెన్సీలను నిషేధించాలని ఆర్‌బీఐ కోరుతోంది.

క్రిప్టోలపై వేటు అంతర్జాతీయ స్థాయిలో జరగాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ విషయాన్ని ఇప్పటి వరకు అన్చారు. ఇప్పుడు పీఎంఎల్‌ఏ పరిధిలోకి తెస్తున్నట్టు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. జీ-20 సమావేశాల్ల్లో అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని కూడగట్టేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు. పెచ్చు మీరుతున్న అవినీతిని సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో క్రిప్టో కరెన్సీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ సంపదపై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం
చేసే లక్ష్యంతో క్రిప్టో కరెన్సీ రంగానికి మనీలాండరింగ్ చట్టాన్ని వర్తింప చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

క్రిప్టో ట్రేడింగ్, సేఫ్ కీపింగ్ సంబంధిత ఫైనాన్షియల్ సర్వీసెస్ కు యాంటీ మనీ లాండరింగ్ చట్టాన్ని వర్తింప చేసినట్లు తెలిపింది. క్రిప్టో కరెన్సీ రంగంపై గతేడాది కఠినమైన పన్ను నిబంధనలను అమలు చేసింది. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లెవీని విధించింది. ప్రభుత్వ నిబంధనలతోపాటు అంతర్జాతీయంగా డిజిటల్ అసెట్స్ దెబ్బ తినడంతో మన దేశంలో క్రిస్టో ట్రేడింగ్ పరిణామం తగ్గింది. బ్యాంకులు,
స్టాక్ బ్రోకర్లు యాంటీ మనీ లాండరింగ్ ప్రమాణాలను పాటిస్తారు. ఇదేవిధంగా డిజిటల్ అసెట్స్ ప్లాట్ ఫామ్స్ కూడా ఈ ప్రమాణాలను పాటించాలని ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు గట్టిగా చెబుతున్నాయి. భారత ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని అమలు చేయాలంటే పకడ్బంది వ్యూహాన్ని అమలు చేయాల్సిందేనని చెబుతున్నాయి. దీనివల్ల దేశంలో క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై ఉక్కుపాదం మోపినట్లేనని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం తాజా నిర్ణయంతో దేశంలో బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ డీలా పడిందన్న వాదనలు సైతం వెల్లువెత్తుతున్నాయి.

గాల్లో దీపం లాంటి క్రిప్టో కరెన్సీపై కేంద్రం ఉక్కుపాదం మోపడం .. ఆర్థిక నిపుణుల్లో, క్రిప్టో సంస్థల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిద్వారా పలు మోసాలకు చెక్ పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. .

Must Read

spot_img