Homeఅంతర్జాతీయంస్వీడన్ కు అధిక ద్రవ్యోల్భణం ప్రధాన సమస్యగా మారిందా..?

స్వీడన్ కు అధిక ద్రవ్యోల్భణం ప్రధాన సమస్యగా మారిందా..?

ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలలో స్వీడన్ ఒకటి.. ఇటీవల కాలంలో ఆ దేశ ప్రజల జీవన వ్యయం పెరుగుదల ప్రభావాలను ప్రత్యక్షంగా చూస్తోంది.. ఆ దేశంలో ద్రవ్యోల్భణం వార్షిక పెరుగుదల తారాస్థాయికి చేరింది..

స్వీడన్ కు అధిక ద్రవ్యోల్భణం ప్రధాన సమస్యగా మారిందా..? మాంద్యంలోకి వెళ్తుందని ప్రభుత్వం హెచ్చరించడం వెనక ఉద్దేశ్యం ఏంటి..? ఇంతకూ స్వీడన్‌లో పేదరికాన్ని ఎలా కొలుస్తారు?

స్వీడన్‌ గత నాలుగు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతటి అత్యధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది.

ప్రపంచంలోని సంపన్న దేశాలలో ఒకటైన స్వీడన్ దేశ ప్రజల జీవన వ్యయం పెరుగుదల ప్రభావాలనూ ప్రత్యక్షంగా చూస్తోంది.అక్కడ ద్రవ్యోల్బణం వార్షిక పెరుగుదల నవంబర్‌ లో తార స్థాయికి చేరింది.నవంబర్‌ లో 11.5 శాతం పెరుగుదల నమోదైంది. దీని కారణంగా దేశంలోని కోటి 40 లక్షల
మంది జనాభాలో చాలా మందిని ఆహారం, ఎనర్జీ ధరలు ఇబ్బందుల్లోకి నెట్టాయి. భవిష్యత్తు ప్రోత్సాహకరంగా కనిపించడం లేదు.”స్వీడిష్ ఆర్థిక వ్యవస్థ, కుటుంబాలు రాబోయే రోజుల్లో ఒత్తిడికి లోనవుతాయి”అని ఆ దేశ ఆర్థిక మంత్రి ఎలిజబెత్ స్వాంటెస్సన్ క్రిస్మస్‌ కు ముందే చెప్పారు.

గతంలో అంచనా వేసిన కంటే 2023లో దేశం మరింత మాంద్యంలోకి వెళ్తుందని స్వీడన్ ప్రభుత్వం హెచ్చరించింది.

రికార్డు స్థాయిలో విద్యుత్ ధరలు పెరగడం.. ఆహార ధరల పెరుగుదల.. రుణ చెల్లింపుల వాయిదాల మొత్తంలోనూ భారీ పెరుగుదల కారణంగా స్వీడన్‌లోని అనేక కుటుంబాలు తమకు అలవాటు లేని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. స్టాక్‌ హోమ్‌లోని సోషల్ సూపర్‌ మార్కెట్చై న్ ‘మ్యాట్‌మిషనెన్’ అధినేత జోహన్ రిండేవాల్ ఈ పరిస్థితులను ధ్రువీకరించారు. ఈ సంవత్సరంలో కస్టమర్ల సంఖ్య రెట్టింపైంది. “చాలా మంది వ్యక్తులకు సహాయం అవసరం ఉందని మాకు మా సంస్థ ద్వారా తెలిసింది’’ అని రిన్‌డేవాల్ తెలిపారు.. ఈ సూపర్ మార్కెట్లలో సభ్యత్వం ఆధారంగా డిస్కౌంట్ ధరలు పొందొచ్చు. అల్పాదాయ వర్గాలకే ఈ డిస్కౌంట్లు లభిస్తాయి. రిండేవాల్ మాట్లాడుతూ తమఖాతాదారుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోందని వెల్లడించారు.. కనీసం కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు కూడా తమ వద్ద సభ్యత్వ నమోదు కోసం, సాయం కోసం సంప్రదిస్తున్నారని తెలిపారు..

పేదరిక లెక్కలకు ఇతర అనేక దేశాలలో పాటించే విధానాలు, ప్రమాణాలను స్వీడన్ అనుసరించదు. ఉదాహరణకు ప్రపంచ బ్యాంకు చేసిన అంచనాల ప్రకారం స్వీడన్‌లో పేద ప్రజలే లేరు. పేదరిక కొలమానంగా స్వీడన్.. యూరోపియన్ యూనియన్ ‘పావర్టీ రిస్క్’ నిర్వచనాన్నే ఉపయోగిస్తుంది.

ఆ లెక్క ప్రకారం… దేశ సగటు తలసరి ఆదాయంలో 60 శాతం కంటే తక్కువ ఆదాయం ఉన్నవారిని పేదలుగా పరిగణిస్తారు. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఇటీవలి వెల్లడించిన గణాంకాల ప్రకారం స్వీడన్ జనాభాలో 15 శాతం మంది ప్రస్తుతం అలాంటి పేదరిక అంచులో ఉన్నారు. అయితే 20 సంవత్సరాల క్రితం ఇది కేవలం 9.6 శాతం మాత్రమే. అయితే, వీరందరి జీవన ప్రమాణాలు మిగతావారి కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఆకలితో అలమటించే పరిస్థితులు లేవు..

అయితే.. అక్కడ “ఖర్చులను తగ్గించుకునే అవకాశం లేని కుటుంబాలు ఉన్నప్పటికీ.. వారిదగ్గర సేవింగ్స్ మొత్తాలు కూడా లేవు. ఇది వారి జీవన ప్రమాణాలను తగ్గిస్తుంది.. వేల మందిని ఆదుకొంటున్న పేదవారి సూపర్ మార్కెట్లు.. మ్యాట్‌మిషనెన్ ఒక సామాజిక సంస్థ. ఆహార వ్యర్థాలను తగ్గించడం దాని ప్రధాన లక్ష్యాలలో ఒకటి.

ఫుడ్ కంపెనీలు విరాళంగా ఇచ్చిన వాటిని వృథా కాకుండా విక్రయిస్తుంది. అందువల్ల కస్టమర్లు ఇక్కడి వస్తువులను అసలు ధరలో మూడో వంతుకే కొనుగోలు చేయగలుగుతారు. వీరి కస్టమర్లలో అత్యధికులు రిటైరైనవారు, నిరుద్యోగులు, వలస వచ్చినవారు ఉంటారు.వివిధ నగరాల్లో ఈ సంస్థకు ఎనిమిది స్టోర్స్ ఉన్నాయి. వాటిలో 25 వేల మందికి సేవలందిస్తుంటారు. 25 షెల్టర్లకు సంస్థ ఆహారాన్ని పంపిణీ చేస్తుంది. ఇవే పేదవారి సూపర్ మార్కెట్లు.

ఈ సంవత్సరం వారి సేవలకు ఎక్కువ డిమాండ్ రావడంతో కొత్త స్టోర్స్ తెరిచారు. యుక్రెయిన్ నుంచి ఎక్కువ మంది శరణార్థులు రావడం, ద్రవ్యోల్బణం పెరుగుదల దీనికి కారణాలని రిండెవాల్ అభిప్రాయపడ్డారు..

స్వీడన్ యొక్క తలసరి స్థూల జాతీయ ఉత్పత్తి ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది..

అయితే దాని పన్నులు కూడా అంతే. చాలా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ యాజమాన్యం, మార్కెట్ – ఆధారితమైనవి.. అయితే బదిలీ చెల్లింపులు-పెన్షన్‌లు, అనారోగ్య చెల్లింపులు, చైల్డ్ అలవెన్స్‌లు వంటివి చేర్చబడినప్పుడు, స్థూల జాతీయోత్పత్తి లో దాదాపు మూడు వంతులు ప్రభుత్వ రంగం గుండా వెళుతుంది.. విద్య, ఆరోగ్య సంరక్షణ, పిల్లల సంరక్షణ ఖర్చులు ప్రధానంగా పన్నుల ద్వారా తీర్చబడతాయి. జాతీయ ఆదాయం పంపిణీలో ప్రభుత్వ ప్రమేయం 20వ శతాబ్దం చివరి రెండు దశాబ్దాలలో తగ్గింది.

గుమతుల విలువ దాని GDP లో మూడింట ఒక వంతు ఉన్నందున, స్వీడన్ తన జీవన ప్రమాణాన్ని కొనసాగించడానికి స్వేచ్ఛా అంతర్జాతీయ వాణిజ్యంపై ఎక్కువగా ఆధారపడి ఉంది. 1991లో స్వీడన్ తన కరెన్సీ అయిన క్రోనాను ecu కి జతచేసింది.. కానీ 1992లో స్వీడన్ తన పెగ్‌ని ecuకి వదిలివేసి, క్రోనా వాల్యుయేషన్‌ను తేలడానికి అనుమతించింది. 1995లో దేశం యూరోపియన్ యూనియన్ లో పూర్తి సభ్యత్వం పొందిన తర్వాత కూడా స్వీడన్ కరెన్సీ స్వతంత్రంగానే ఉంది. 1999లో స్వీడన్ యొక్క రిక్స్‌బ్యాంక్ యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డు ద్రవ్య విధానాన్ని సెట్ చేయడానికి.. ధర స్థిరత్వాన్ని
కొనసాగించడానికి స్థాపించబడింది. పోటీతత్వ సమస్యలతో పరిశ్రమలు స్వదేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువ పెట్టుబడి పెట్టాయి. స్వీడన్‌లోని చాలా పెద్ద పారిశ్రామిక సంస్థలు అంతర్జాతీయంగా ఉన్నాయి..

కొన్ని ఉత్పత్తి ఖర్చులు ఎక్కువగా ఉన్న స్వీడన్‌లో కంటే విదేశాలలో ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకున్నాయి.

ప్రపంచంలోని అత్యధిక ధనిక దేశాలలో స్వీడన్ ఒకటిగా కొనసాగుతోంది.. ఇటీవల కాలంలో స్వీడన్ లో అధిక ద్రవ్యోల్భణం కారణంగా ఆ దేశ ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. గతంలో అంచనా వేసిన కంటే 2023లో దేశం మరింత మాంద్యంలోకి వెళ్తుందని స్వీడన్ ప్రభుత్వం హెచ్చరించింది.

Must Read

spot_img