Homeఅంతర్జాతీయంభారత్ లో మరో నగరం కాలుష్య సాకారంగా మారిందా..?

భారత్ లో మరో నగరం కాలుష్య సాకారంగా మారిందా..?

  • ఇప్పటికే దేశ రాజధాని కాలుష్య కోరల్లో చిక్కుకుని అల్లాడుతోంది.

ఇప్పుడు అదే బాటలో దేశ ఆర్థిక రాజధాని సైతం చిక్కుకుపోయిందా..?

అంతర్జాతీయ కాలుష్య సర్వే సంస్థ వెల్లడించిన గణాంకాలు .. భారత నగరాలపై కాలుష్య పంజా ప్రభావాన్ని వెల్లడిస్తున్నాయా..?

నిర్మాణ వ్యర్థాలు, వాహనాల నుంచి వచ్చే పొగ .. ముంబైలో గాలి కాలుష్యానికి కారణమవుతున్నాయి. దీంతో ఢిల్లీని దాటేసి, మరీ ముంబై నగరం తొలిస్థానంలోకి వచ్చేసింది. ఈ తాజా జాబితాతో భారత్ లో కాలుష్యం పెరుగుతోందన్న వాదనలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితులు భారతావనికి గడ్డుకాలాన్ని తెచ్చిపెట్టనున్నాయని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.

దేశంలో వాయుకాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల్లో ముంబై తొలిస్థానంలో నిలిచింది. అత్యంత కాలుష్య నగరంగా ఉన్న ఢిల్లీని దాటి తొలిస్థానంలో
నిలవడం గమనార్హం. ఈ ఏడాది జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8 వరకు భారత్‌లో వివిధ నగరాల్లో నమోదైన వాయుకాలుష్యాన్ని అంచనా వేయగా ముంబై తొలిస్థానంలో ఉన్నదని స్విస్‌ ఎయిర్‌ ట్రాకింగ్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చూసినైట్లెతే ముంబై రెండోస్థానంలో ఉన్నదని తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా టాప్‌-10 నగరాల్లో ఢిల్లీ లేదని పేర్కొంది. తొలిస్థానంలో పాకిస్థాన్‌లోని లాహోర్‌ నిలిచిందని వివరించింది. ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల లిస్ట్ లో ముంబై కొత్త రికార్డ్ నమోదు చేసింది. దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబై మహానగరం తాజాగా ఓ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8వ తేదీల మధ్య నమోదైన కాలుష్యం ఆధారంగా ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల జాబితాను.. ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ ఐక్యూ ఎయిర్ ఈ తయారు చేసింది.

ఈ లిస్ట్ లో ముంబై 225 పాయింట్స్ తో రెండో స్థానంలో నిలిచింది. జనవరి 29న ర్యాంకింగ్స్‌ లో 10వ స్థానంలో ఉన్న ముంబై.. ఫిబ్రవరి 2న ప్రపంచంలోనే రెండో అత్యంత కాలుష్య నగరంగా మారింది. ఆ తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడినా.. ఫిబ్రవరి 8న మళ్లీ రెండో స్థానానికి చేరింది. ఫిబ్రవరి 13న మరలా మూడో స్థానంలో నిలిచింది. గతేడాది నవంబర్‌తో పాటు ఈ ఏడాది జనవరి నెలల్లో ముంబైలో గాలి నాణ్యత ఎక్కువగా పూర్, వెరీ పూర్ కేటగిరీలోనే నమోదైందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గణంకాలు వెల్లడిస్తున్నాయి. వాహనాల నుంచి వెలువడే కాలుష్యం, దుమ్ము, ధూళి కారణంగా గాలి నాణ్యత పడిపోయిందని నిపుణులు చెబుతున్నారు.

చలికాలం కావడం, నిర్మాణ వ్యర్థాలు కూడా పరిస్థితికి కారణమని అంటున్నారు. గాలి వేగం నెమ్మదించడం వల్ల కూడా ఎయిర్ క్వాలిటీ పడిపోయిందని నిపుణులు వెల్లడించారు. లా నినా సైక్లోన్ ఎఫెక్ట్ తో గాలి వేగం నెమ్మదించడం వల్ల కూడా ఎయిర్ క్వాలిటీ పడిపోయిందని పేర్కొన్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ సర్వే చేపట్టారు. ఇదిలా ఉంటే.. ముంబైలో గాలి నాణ్యత పడిపోవడంతో బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ చర్యలు చేపట్టింది. రాబోయే 10 రోజుల పాటు నగరంలో నిర్మాణ కార్యకలాపాలను నిషేధించింది.

ప్రపంచంలో రెండో అత్యంత కలుషిత నగరంగా ముంబై నిలిచింది. మన దేశంలో మోస్ట్​ పొల్యూటెడ్ సిటీ కూడా ఇదే. స్విట్జర్లాండ్​ కు చెందిన ఎయిర్​ క్వాలిటీ మానిటరింగ్​ సంస్థ ఐక్యూ ఎయిర్ తాజాగా నిర్వహించిన వీక్లీ సర్వేలో ఈవివరాలు వెల్లడయ్యాయి. జనవరి 29-ఫిబ్రవరి 8 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల గాలి నాణ్యతను తనిఖీ చేసి ఎయిర్​ ట్రాకింగ్​ ఇండెక్స్​ను ఐక్యూ ఎయిర్​ రూపొందించింది. ఇంతకుముందు వరకు దేశంలో అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ ఉండగా, ఇప్పుడా స్థానంలోకి ముంబై వచ్చింది.

ఎయిర్​ క్వాలిటీ సర్వే చేయడంలో ఐక్యూ ఎయిర్ కు యునైటెడ్​ నేషన్స్​ఎన్విరాన్మెంట్​ ప్రోగ్రామ్, గ్రీన్​ పీస్​ సంస్థలు సహకరించాయి. ఈ స్టడీ కోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి కాలుష్యం, గాలి నాణ్యతకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు. ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీని వెనక్కి నెట్టి ముంబై రెండో స్థానంలో నిలిచింది. భారత్‌లో అత్యంత కలుషిత నగరంగా ఇప్పటివరకు చెప్పుకునే ఢిల్లీని కూడా ముంబై నగరం అధిగమించడం గమనార్హం. జనవరి 29న ఇదే ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న ముంబై, ఫిబ్రవరి 2న ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా తొలిస్థానానికి చేరుకుంది.

  • ముంబైలో కాలుష్యం పెరగడంతో, స్థానిక ప్రభుత్వం అప్రమత్తమైంది..

తర్వాత ఫిబ్రవరి 8న మళ్లీ రెండో స్థానానికి చేరింది. ఫిబ్రవరి 13న, వాయు నాణ్యతలో ప్రపంచ వ్యాప్తంగా మూడో అత్యంత అనారోగ్యకరమైన నగరంగా నిలిచింది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతతో.. ముంబైవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజా పరిశోధనల్లో దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ఆ నగరం.. ఓ చెత్త రికార్డును మూటగట్టుకుని వార్తల్లో నిలించింది. ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో ముంబై రెండో స్థానంలో ఉన్నట్లు తెలిసింది. వాహనాల నుంచి వెలువడే కాలుష్యం, రోడ్లపై ఎగిసిపడే దుమ్ముధూళి వల్ల గాలి నాణ్యత పడిపోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చలికాలం కావడం, నిర్మాణ వ్యర్థాలు ఈ పరిస్థితికి కారణమని వెల్లడించారు. లా నినా సైక్లోన్ ఎఫెక్ట్ తో గాలి వేగం నెమ్మదించడం వల్ల కూడా ఎయిర్ క్వాలిటీ పడిపోయిందని పేర్కొన్నారు. మొన్నటివరకు మనదేశంలో అత్యంత కలుషిత నగరం ఏది అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ఢిల్లీ. ఆ నగరంలో కాలుష్యం అధికమవ్వ‌డంతో దానిని తగ్గించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరికి దీపావళి పండుగను కూడా ఆ రాష్ట్ర ప్రజలు జరుపుకోలేదు. ఇళ్ల నిర్మాణాలను నిలిపివేశారు.

రోడ్లపై తిరిగే వాహనాల సంఖ్యను కూడా తగ్గించారు. అయితే ఇప్పుడు కాలుష్యంలో ఢిల్లీని ముంబై నగరం దాటేసింది. మనదేశంలో అత్యంత కలుషిత నగరంగా నిలవడమే కాకుండా ప్రపంచంలో అత్యంత కలుషిత నగరాల్లో రెండో స్థానంలో నిలిచింది. వాహనాల నుంచి వెలువడే కాలుష్యం, రోడ్లపై ఉండే దుమ్మూ ధూళి వల్ల ముంబైలో ఇటీవల కలుషితం బాగా పెరిగిపోయింది. నిర్మాణాలు కూడా అధికమయ్యాయి. చలికాలం కూడా కావడంతో ముంబైలో కాలుష్యం తీవ్రమైనట్లు నిపుణులు తెలుపుతున్నారు.

ముంబైలో కాలుష్యం తీవ్రమైన నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దుమ్ము, ధూళి నియంత్రణకు అధికారులకు మార్గదర్శకాలు ఇచ్చింది. ఢిల్లీయే కాదు.. ముంబై కూడా కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఇక్కడ గాలి నాణ్యత 300 పాయింట్ల తీవ్రస్థాయికి పడిపోయింది. వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 315 పాయింట్లు నమోదు అయింది.

దీంతో ముంబై నగరవాసులు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. విధిగా మాస్క్‌లు ధరించాలని చెప్పారు. ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవాళ్లు బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని, పిల్లలు తరచుగా మాస్క్‌లను మారుస్తుండాలని వైద్యులు తెలియజేశారు. ముఖ్యంగా ఆస్తమా ఉన్న పిల్లలు బయట ఆడుకునేటప్పుడు ఇన్‌హేలర్ అందుబాటులో పెట్టుకోవాలని వైద్య నిపుణులు చెప్పారు. గాలిలో కాలుష్యం ఎక్కువగా ఉండడంతో ముంబైవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పైగా ఇది చ‌లికాలం కావడంతో చాలామంది శ్వాస‌ సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా జ‌లుబు, ద‌గ్గు నుంచి కొందరు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. దాంతో ఆస్త‌మా, గుండె సంబంధిత స‌మ‌స్యలు ఉన్న‌వాళ్లు ఎన్ 95, కే 95 మాస్కులు ధ‌రించాలని, గాలి నాణ్య‌త త‌క్కువ ఉన్నప్పుడు బయటకు రాకుండా ఉండడం మంచిదని చెబుతున్నారు.

కాగా ఢిల్లీలో పరిస్థితి ఇలాగే ఉంది. అక్కడ గాలి నాణ్యత రోజురోజుకు క్షీణిస్తుంది. దీంతో అక్కడ ఇప్పటికే వాహనాలపై నిషేధం కూడా విధించారు. అలాగే అక్కడి ప్రజలను కూడా జాగ్రత్తగా ఉండమని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ముంబైలో కాలుష్యం పెరగడంతో, స్థానిక ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలో లా .. కాలుష్య నివారణ చర్యల్ని చేపట్టింది. ముఖ్యంగా నిర్మాణాలకు తాత్కాలికంగా నిలిపివేసి, కాలుష్య నియంత్రణ చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.

Must Read

spot_img