Homeసినిమాత్వరలో హరి శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’

త్వరలో హరి శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’

టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకోవాలని హరీష్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక పవన్‌తో ఈ సినిమాను పూర్తి చేయాలంటే సమయం పడుతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుండగా, హరీష్ ఈలోగా మరో హీరోతో సినిమాను చేస్తాడనే వార్త జోరుగా వినిపిస్తోంది.

తమిళ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ తెలుగు లో ప్రిన్స్ సినిమా తో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాకు జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహించాడు. మరో జాతిరత్నాలు రేంజ్ హిట్ దక్కడం ఖాయం అని.. శివ కార్తికేయన్ కు తెలుగు లో మంచి మార్కెట్ క్రియేట్ అవ్వడం పక్కా అని అంతా భావించారు. కానీ ఎక్కువ శాతం మంది ప్రిన్స్ సినిమా ను ఒక తెలుగు సినిమా అన్నట్లుగా కాకుండా తమిళ డబ్బింగ్ సినిమా అన్నట్లుగా భావించారు. ఆ సినిమా అక్కడ, ఇక్కడ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

తెలుగు లో మరో సినిమా ను చేయాలనే పట్టుదలతో శివ కార్తికేయన్ ఉన్నాడు. ఇటీవల గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ చేయాల్సిన ఉస్తాద్ గబ్బర్ సింగ్ సినిమా ప్రారంభం అవ్వడానికి చాలా ఆలస్యం అయ్యేలా ఉంది. ఆ గ్యాప్ లో ప్రిన్స్ తో ఒక సినిమాను కానిచ్చే విధంగా హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పటి వరకు శివ కార్తికేయన్ ,హరీష్ శంకర్ ల యొక్క కాంబో మూవీ గురించి కనీసం చర్చ లు కూడా జరగలేదు. పవన్ కళ్యాణ్ సినిమా తప్ప మరే సినిమాను చేయాలనే ఉద్దేశ్యంతో కూడా హరీష్ శంకర్ లేడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్క్రిప్టు పనుల్లో ఆయన ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కూడా త్వరలోనే ప్రారంభించాలని హరీష్ ఫిక్స్ అయ్యాడట. మొత్తానికి శివకార్తికేయన్‌తో హరీష్ సినిమా అనేది కేవలం పుకారుగానే మిగిలిపోయింది.

Must Read

spot_img