Homeతెలంగాణతెలంగాణ‌లో గ‌వ‌ర్న‌ర్ పాల‌న‌!.. కేసీఆర్ క‌న్నెర్ర‌!

తెలంగాణ‌లో గ‌వ‌ర్న‌ర్ పాల‌న‌!.. కేసీఆర్ క‌న్నెర్ర‌!

తెలంగాణలోనూ గవర్నర్ అధికారాల కోత దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందా..? అయితే తన అధికారాల కట్ కు గవర్నర్ ఆమోద ముద్ర వేస్తారా..? తెలంగాణలో ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ రచ్చ పరాకాష్టకు చేరిందా..? అసలు కేసీఆర్ నిర్ణయం వెనుక .. కథేంటి..? లెట్స్ వాచ్..

టీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ నేరుగా విమర్శలు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బిల్లులను ఆపేస్తూ వెనక్కి పంపేస్తూ సతాయిస్తున్న గవర్నర్ తమిళిసైకి షాకిచ్చేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. ఈ మేరకు ఆమె అధికారాల కత్తెరకు రెడీ అయ్యారు. ఇప్పటికే రాజ్ భవన్ ప్రగతిభవన్ మధ్య ఉప్పు నిప్పులా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ నేరుగా విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు అలానే కౌంటర్ ఇస్తున్నారు.

ఈ లొల్లి తారాస్థాయికి చేరింది. తెలంగాణ ప్రభుత్వం తీరుపై పలుమార్లు కేంద్రం పెద్దలను సైతం గవర్నర్ కలిసి ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల
క్రమంలోనే గవర్నర్ తమిళిసై ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు ప్రచారం సాగుతోంది.

ఇతర రాష్ట్రాల తరహాలోనే గవర్నర్ ను యూనివర్సిటీల ఛాన్సలర్ పదవి నుంచి తప్పించే యోచనలో కేసీఆర్ సర్కార్ ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు త్వరలోనే జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది. డిసెంబర్ 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోంది.

ఈ సమావేశాల్లోనే కేంద్రప్రభుత్వ తీరుతో పాటు గవర్నర్ వ్యవహారశైలిపై చర్చించే అవకాశం ఉంది. దాదాపు 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సమావేశాల్లోనే గవర్నర్ ను వైస్ ఛాన్స్ లర్ పదవి నుంచి తప్పించే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని చూస్తున్నారు. అయితే అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ సంతకం పెడితేనే ఆ బిల్లు అమల్లోకి వస్తుంది.

తనకు వ్యతిరేకంగా తెచ్చిన బిల్లును గవర్నర్ ఆమోదించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. కాకపోతే గవర్నర్ తీరును నిరసిస్తూ ఈ బిల్లు
తేవాలని కేసీఆర్ సర్కార్ చూస్తోంది. ఇప్పటికే బీజేపీ గవర్నర్ల వ్యవహారశైలితో కేరళ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు కూడా గవర్నర్లను విశ్వవిద్యాలయ చాన్సలర్ల పదవుల నుంచి గవర్నర్లను తొలగిస్తూ అసెంబ్లీలో బిల్లులను తెచ్చాయి. కానీ అవి ఇప్పటివరకూ ఆమోదం పొందలేదు.

ఇప్పుడు తెలంగాణ గవర్నర్ పై దేశవ్యాప్తంగా చర్చ జరిగేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా బిల్లు తెచ్చే యోచనలో కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళి సై మధ్య నెలకొన్న విబేధాలు రాష్ట్రంలో హీట్ పుట్టిస్తున్నాయి. ఈ పరిణామాలు చివరికి రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య బిగ్ గ్యాప్‌కు దారితీశాయి. నేరుగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ పలుమార్లు తీవ్ర విమర్శలు చేయడం, అదే రీతిలో ఆమె ఆరోపణలకు టీఆర్ఎస్ నేతలు రియాక్ట్ అవ్వడంతో.. గవర్నర్ వర్సెస్ గవర్న్‌మెంట్ పోరు తారాస్థాయికి చేరుకుంది.

ఈ పరిణామాల క్రమంలో గవర్నర్ తమిళి సై విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. విశ్వవిద్యాలయాల్లో పోస్టులను భర్తీ చేయడానికి తెచ్చిన ఉమ్మడి రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుతో పాటు అనేక బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్

వాటిని ఆమోదించేందుకు గవర్నర్ మరింత ఆలస్యం చేస్తోన్నారనే ఆరోపణలు టీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తోన్నాయి. ఇటీవల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి ఉమ్మడి రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుపై గవర్నర్ అనుమానాలను నివృత్తి చేశారు. అయినా ఇప్పటివరకు ఇంకా గవర్నర్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కాగా చాలా రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం మధ్య వార్ నడుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లుల వివరాలు తెలుసుకోవాల్సి ఉందని ఇంకా ఆమోదం తెలుపలేదు గవర్నర్. దీనిపై ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది.

అందులో యూనివర్శిటీల్లో నియామకాల బిల్లు కూడా ఉంది. విశ్వవిద్యాలయాల చాన్సలర్‌గా గవర్నర్ వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్‌తో గవర్నర్‌కు ఉన్నఅధికారులను కట్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న బెంగాల్, కేరళల్లో గవర్నర్ల నుంచి చిక్కులు ఎక్కువగా ఉండటంతో ఆ రాష్ట్రాలు చాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

యూనివర్సిటీకి ఇప్పటి వరకు ఉన్న నియమ నిబంధనలను మారుస్తూ చట్టాలు చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఇక నుంచి గవర్నర్ సారథ్యం అవసరం లేదని కేరళ, బెంగాల్ ప్రభుత్వాలు ప్రకటించాయి. తెలంగాణలోనూ సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై మ‌ధ్య అంతరం పెరిగిపోయాయి.

కేరళ, బెంగాల్‌ తరహాలో కులపతిగా గవర్నర్‌ను తప్పించి సీఎంకు బాధ్యతలను కట్టబెట్టేలా విశ్వవిద్యాలయాల చట్టాన్ని సవరించాలన్న నిర్ణయానికి
దాదాపుగా వచ్చినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న‌ విశ్వవిద్యాలయాల చట్టాన్నే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ చట్టం ప్రకారం విశ్వవిద్యాలయాల చాన్స్‌లర్‌గా గవర్నర్‌ వ్యవహరిస్తారు.

వైస్ చాన్స్‌లర్‌ నియామకంలో గవర్నర్‌దే కీలకపాత్ర. ప్రభుత్వం అన్వేషణ కమిటీలను ఏర్పాటు చేసి వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి అనుభవం, యోగ్యతలున్న విద్యావేత్తల పేర్లను ఎంపిక చేసే సంప్రదాయం ఉంది. ప్రభుత్వం ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను రాజ్‌భవన్‌కు పంపిస్తే అందులో ప్రభుత్వం ప్రతిపాదించిన పేరును ఉపకులపతిగా గవర్నర్ చాన్స్‌లర్‌ హోదాలో ఆమోదం తెలపాల్సి ఉంటుంది.

ప్రభుత్వం ఖరారు చేసిన విద్యావేత్తకు సంబంధించిఎటువంటి ఆరోపణలున్నా గవర్నర్‌ ఆ పేరును నిలుపుదల చేసి మరో పేరును ప్రతిపాదించే అవకాశముంది. ఇక్కడే ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య విభేదాలు పొడసూపుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం పది మంది ఉపకులపతులను ఎంపిక చేస్తూ తుది ఆమోదం కోసం గవర్నర్‌కు పంపగా తమిళిసై కొన్ని అభ్యంతరాలను వ్యక్తం
చేశారు. తర్వాత కేసీఆర్ జోక్యంతో అనుమతించారు.

విశ్వవిద్యాలయాలు చేపట్టే అధ్యాపకుల నియామకాల్లో గవర్నర్‌ పాత్ర కీలకం.

ఇప్పటికీ ములుగు ఉద్యానవన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రిని చాన్స్‌లర్‌గా నియమించే బిల్లు కూడా గవర్నర్‌ ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంది. విశ్వవిద్యాలయాలు చేపట్టే అధ్యాపకుల నియామకాల్లో గవర్నర్‌ పాత్ర కీలకం. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పది విశ్వవిద్యాలయాలకు సంబంధించిన 1500లకుపైగా నియామకాలను చేపట్టేందుకు సన్నద్ధయింది.

ఇందు కోసం ప్రత్యేకంగా నియామక బోర్డు ఏర్పాటు చేస్తూ చట్టం చేసినా గవర్నర్ ఆమోదించలేదు. ప్రభుత్వం భారీగా బోధనా సిబ్బందిని నియమిస్తుండడంతో గవర్నర్‌ కీలకం కానున్నారు. అక్కడా గవర్నర్ వైపు నుంచి చిక్కులు వచ్చే అవకాశం ఉంది.

అందుకే వర్సిటీల చాన్సలర్‌ పదవి నుంచి గవర్నర్‌ను తప్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదం పొందినా, దానిపై సంతకం చేయాల్సింది గవర్నరే కావడం అసలు ట్విస్ట్. అయితే ఈ విషయంలో గవర్నర్‌కు ఉండే అధికారాలు పరిమితం. ఓ సారి తిరస్కరిస్తే.. మరోసారి బిల్లు ఆమోదించుకోవచ్చు. గవర్నర్ అంగీకరించకపోయినా చట్టం అయిపోతుంది. కానీ.. అటు ఆమోదించకుండా… ఇటు తిరస్కరించకుండా పెండింగ్‌లో ఉంచితేనే అసలు సమస్య.

ఇప్పుడు తమిళిసై అదే చేస్తున్నారు. ఇదిలా ఉంటే, తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు రెగ్యులర్‌ వైస్‌ ఛాన్సలర్‌ల నియామకం జరగలేదు. ప్రధానంగా కోవిడ్‌ కారణాలు, వర్షాలు-వరదలు, ఎన్నికల కోడ్‌తో ఆగిపోయింది. అయితే ఇప్పుడు అన్నీ పనులు పూర్తి కావడంతో యూనివర్సిటీలకు వీసీలను నియమించేందుకు అడుగులు పడుతున్నాయి.

రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు వైస్‌-ఛాన్సిలర్‌ల నియామకం ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు.యూనివర్సిటీలకు వైస్‌-ఛాన్సిలర్‌లను ఎన్నుకోవడానికి ముగ్గురు సభ్యులతో కూడిన శోధన కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

వీరు నియామక ప్రక్రియలో దరఖాస్తుల పరిశీలన చేసి.. ముగ్గురు అర్హత గల అభ్యర్థుల జాబితాను ప్రభుత్వానికి పంపుతాయి. ఇవన్నీ రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌ అయిన గవర్నర్‌కు పంపుతారు. ఈ మూడు పేర్ల నుండి వీసీ పోస్టుకు గవర్నర్‌ ఒకదాన్ని ఆమోదిస్తారు.

అయితే ఈ అంశంపై అనుమానాలున్నాయంటూ గవర్నర్ .. తమిళి సై మెలిక పెట్టడంతో, ఇవి ఆమోద ముద్ర పడడం లేదు. దీంతో ఈ బిల్లు అమోదం కోసం .. రాష్ట్ర సర్కార్ ఎదురుచూస్తోంది. అయితే సంప్రదాయం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి గవర్నర్‌ వర్శిటీల వైస్‌ ఛాన్సలర్లను నియమిస్తారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా గవర్నర్లు దాన్ని తమ ప్రత్యేక హక్కు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని రాష్ట్రప్రభుత్వాలు మండిపడుతున్నాయి.

మరి దీనిపై ఎలాంటి వివాదం చెలరేగుతుందో చూడాలి

Must Read

spot_img