Homeఅంతర్జాతీయంజీవితంలో ఇంతటి ప్రధాన పాత్ర పోషిస్తున్న గూగుల్‌కు ఇక కాలం చెల్లిపోయినట్టేనా..?

జీవితంలో ఇంతటి ప్రధాన పాత్ర పోషిస్తున్న గూగుల్‌కు ఇక కాలం చెల్లిపోయినట్టేనా..?

ఇంట్రో యాంకర్: డిజిటల్‌ ప్రపంచంలో గూగుల్‌ పేరు లేకుండా, సాయం తీసుకోకుండా కోట్లమందికి రోజు గడవటం లేదు. మనిషిజీవితంలో ఈ సెర్చ్‌ ఇంజిన్‌ అంతలా భాగమైంది. కనీస కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారు ఎవరైనా ఏ సందేహం వచ్చినా, సమాచారం కావాలన్నా గూగులమ్మను తట్టడంసర్వసాధారణమైపోయింది. ప్రస్తుత ఇంటర్నెట్‌ సెర్చ్‌ ఇంజిన్లలో గూగుల్‌ నంబర్‌ వన్‌.. కొంతకాలంగా ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ రంగం వేగంగా అభివృద్ధి సాధిస్తూ సాంకేతిక రంగాన్ని సమూలంగా మార్చివేస్తోంది.. ఆ టెక్నాలజీ ఆధారంగా పుట్టుకొచ్చిందే చాట్‌ జీపీటీ.. ఓపెన్ ఏఐ సంస్థ తీసుకొచ్చిన ఈ ఏఐ ఆధారిత చాట్ బోట్ సక్సెస్ అవటంతో చాలా కంపెనీలు ఆ దిశగా ఆలోచిస్తున్నాయి.

ప్రపంచమంతా చాట్‍ జీపీటీ విపరీతంగా పాపులర్ అయింది. ఓపెన్ ఏఐ సంస్థ తీసుకొచ్చిన ఈ ఏఐ ఆధారిత చాట్ బోట్ సక్సెస్ అవటంతో చాలా కంపెనీలు ఆ దిశగా ఆలోచిస్తున్నాయి. తాజాగా టెస్లా,ట్విట్టర్ కంపెనీల బాస్ ఎలాన్ మస్క్ కూడా చాట్‍జీపీటీకి పోటీగా ఏఐ చాట్ బోట్ ప్లాట్‍ఫామ్‍ను రూపొందించేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నారు.

ఇందుకోసం ఏఐ రీసెర్చర్లతో కొన్ని వారాలుగా చర్చలు జరుపుతున్నారని రిపోర్టులు వెల్లడయ్యాయి. ఏఐ ప్లాట్‌‍ఫామ్ కోసం టీమ్‍ను కూడా నియమించుకోవడం మస్క్ మొదలుపెట్టారట. ఇందుకు సంబంధించిన వివరాలు బయటికి వచ్చాయి.చాట్ జీపీటీకి పోటీగా ప్లాట్‍ఫామ్‍ను రూపొందించేందుకు ఇగోర్ బాబుస్కిన్‍ ను ఎలాన్ మస్క్ నియమిస్తున్నారని ఆ రిపోర్ట్ వెల్లడించింది. గూగుల్‍కు చెందిన డీప్ మైండ్ ఏఐ యూనిట్‍ నుంచి ఇగోర్ ఇటీవలే బయటికి వచ్చారు. ఇగోర్ ను మస్క్ నియమించుకున్నారని తెలుస్తోంది.. అయితే, ఇగోర్ ఇంకా అధికారికంగాసైన్ చేయలేదని తెలుస్తోంది.

నాన్ ప్రాఫిట్ స్టార్టప్‍గా ఓపెన్ ఏఐ సంస్థ ను 2015లో సామ్ ఆల్టమన్ స్థాపించినప్పుడు ఎలాన్ మస్క్ దాంట్లో పెట్టుబడులు పెట్టారు. అయితే 2018లో ఆ కంపెనీ నుంచి వైదొలిగారు. ఆ ఓపెన్ ఏఐ సంస్థనే ఇప్పుడు చాట్‍జీపీటీని సృష్టించింది. ప్రస్తుతం ఓపెన్ ఏఐలో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ప్రధాన పెట్టుబడిదారుగా ఉంది.చాట్‍జీపీటీ కొంతకాలంలోనే కోట్లాది మంది యూజర్లను సంపాదించుకుంది. ఏ ప్రశ్నకైనా వివరంగా టెక్స్ట్ రూపంలో సమాధానాలు చెబుతుండడంతో ఈ ఏఐ చాట్ బోట్ ప్లాట్‍ఫామ్‍ పాపులర్ అయింది. వ్యాసాలు, కంప్యూటర్ కోడింగ్, సాహిత్యం, మ్యాథమ్యాటిక్స్ ఇలా ఏ విషయంపై అయినా చాట్ జీపీటీ ఆన్సర్లు ఇచ్చేస్తుంది. అది కూడా వివరంగా ఒకే సమాధానాన్ని టెక్స్ట్ రూపంలో ఇస్తుంది. ప్రశ్నను టెక్స్ట్ రూపంలో టైప్ చేస్తే చాలు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అణ్వాయుధాల కంటే ప్రమాదకరమైనది అంటూ 2018లో ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. అందరికీ సురక్షితంగా ఉండేలా ఏఐ ప్లాట్‍ఫామ్‍లు తయారవుతున్నాయా లేదా అని పరిశీలించేందుకు ప్రభుత్వ విభాగాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ఏఐ తనను భయపెడుతోందని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు చాట్ జీపీటీకి వస్తున్న ఆదరణతో మస్క్ కూడా ఏఐ బాటపట్టారు. ఏఐ చాట్ బోట్‍ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు గూగుల్ కూడా బార్డ్ పేరుతో ఏఐ చాట్‍బోట్‍ను తీసుకొస్తోంది. దీన్ని ప్రపంచానికి కూడా పరిచయం చేసింది. ప్రస్తుతం గూగుల్ బార్డ్ టెస్టింగ్ జరుగుతోంది. రానున్న వారాల్లో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ చెబుతోంది..

బిగ్‌ టెక్‌ కంపెనీల మధ్య ఏఐ వార్‌ మొదలైంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌ చాట్‌జీపీటీతో ముందుకు వస్తుండగా.. గూగుల్‌ మాతృ సంస్థఅల్ఫాబెట్‌ బార్డ్‌ పేరిట చాట్‌జీపీటీ తరహా ఏఐ టూల్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ విషయంలో తామేమీ తక్కువ కాదంటోంది ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా. ఇందుకోసం కంపెనీలో ఓ ఉన్నత స్థాయి ప్రొడక్ట్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మెటా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మార్గ్‌ జుకర్‌బర్గ్‌ తాజాగా ప్రకటించారు. ఇందులో భాగంగా తొలుత వాట్సాప్‌, ఇన్‌స్టాలో చాట్‌జీపీటీ తరహా సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.

కృత్రిమ మేధకు సంబంధించి ఓ టీమ్‌ను ఏర్పాటు చేశామని, దానికి మెటా చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ క్రిస్‌ కాక్స్‌ నేతృత్వం వహిస్తారని జుకర్‌బర్గ్‌ తెలిపారు. ఈ టీమ్‌ భవిష్యత్‌లో వివిధ రూపాల్లో ప్రజలకు సంబంధించి అన్ని అవసరాలు తీర్చేవిధంగా ఏఐ పర్సనాస్‌ను రూపొందించనుందని తెలిపారు. ఇందుకోసం కొంత ఫౌండేషన్‌ వర్క్‌ అవసరమన్నారు. ప్రస్తుతానికి టెక్ట్స్‌ , ఇమేజెస్‌ , వీడియో, బహుళ మోడల్‌ రూపంలో అందించగలిగే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.

ఓ వైపు మాంద్యం భయాలు వెంటాడుతుండడం, వృద్ధి నెమ్మదించడం వంటి కారణాలతో వేలాది ఉద్యోగాలను బిగ్‌ టెక్‌ కంపెనీలు తొలగిస్తున్నాయి. మరోవైపు… ఏఐ పైనా దృష్టి పెడుతున్నాయి. ఈ విషయంలో ఒకదాన్ని మించి మరొకటి పోటీ పడుతున్నాయి. మైక్రోసాఫ్ట్‌ బింగ్‌ చాట్‌బాట్‌ను తీసుకురాగా.. గూగుల్‌ సైతం బార్డ్‌ను ప్రకటించింది. స్నాప్‌చాట్‌ సైతం తమ యాప్‌లో చాట్‌జీపీటీ తరహా బాట్‌ను జోడిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. గత వారం LLaMA పేరిట కొత్త లాంగ్వేజ్‌ మోడల్‌ ను ఆవిష్కరించిన మెటా.. తాజాగా దీనిపై పరిశోధనా బృందాన్ని ఏర్పాటు చేసింది.

ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో చాట్ జిపిటి ఓ సంచలనంగా మారింది. కృత్రిమ మేధస్సుతో కూడిన ఈ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత గూగుల్, మైక్రోసాఫ్ట్ మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది.ఇప్పటికే మైక్రోసాఫ్ట్ తన సెర్చ్ ఇంజిన్ బింగ్‌లో ఏఐతో కూడిన చాట్ బాట్‌ ను లాంచ్ చేసింది. గూగుల్ కూడా తన సొంత చాట్ బాట్‌ ను రూపొందించే పనిలో పడింది. ఈ తరుణంలో టెక్ నిపుణులు ఓ కీలక విషయం వెల్లడించారు. సమీప భవిష్యత్తులో చాట్ జీపీటీని వాట్సాప్‌లో ఉపయోగించే వీలుంది.

పూర్తిగా కృత్రిమ మేధాతో అభివృద్ధి చేసిన చాట్ జీపీటీ ఇంటర్నెట్ యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.అన్ని ప్రశ్నలకు చాలా కరెక్టు, పర్ఫెక్ట్ ఆన్సర్స్ ను ఇస్తూ ప్రజల సమయాన్ని చాలా సేవ్ చేస్తోంది. చాట్ జీపీటీ విడుదల చేసిన కొన్ని రోజుల్లోనే కంపెనీకి భయం పట్టుకుంది. గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ కంపెనీకి గూగుల్ సెర్చ్ ఇంజిన్ ప్రధాన ఆదాయ వనరు.

చాట్ జీపీటీ ఫౌండర్స్ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన బింగ్ సెర్చ్ ఇంజిన్ తో ఒక ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇదే కనుక జరిగితే గూగుల్ పతనం తప్పకపోవచ్చు. ఇదే విషయంపై స్పందిస్తూ జీ మెయిల్ ఇన్వెంటర్ పాల్ బుచ్చెయట్ చాట్ జీపీటీతో గూగుల్ కు భారీ నష్టం తప్పదని, ఇందుకు రెండు లేదా మూడేళ్లు సమయం పట్టొచ్చని అంచనా వేశారు.. గతంలో గూగుల్ ఎల్లో పేజెస్ ను ఎలా దెబ్బతీసిందో ఇప్పుడు గూగుల్
పరిస్థితి కూడా అలాగే అవ్వొచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేసారు.

ఇకపోతే… చాట్ జీపీటీ అనేది హ్యూమన్ లైక్ టెక్స్ట్ రూపొందించగల లాంగ్వేజ్ మోడల్. అయితే, ఇది గూగుల్ లేదా మరే ఇతర శోధన ఇంజిన్‌ ను భర్తీ చేయడానికి తీసుకు రాలేదని దానికి అదే చెబుతోంది. గూగుల్, ఇతర సెర్చ్ ఇంజన్‌లు యూజర్లకు సంబంధిత, కచ్చితమైన సెర్చ్ ఫలితాలను అందించడానికి ఇండెక్స్, ర్యాంకింగ్ అల్గారిథమ్‌లతో సహా అనేక రకాల టెక్నాలజీలను ఉపయోగిస్తాయి.చాట్ జీపీటీ ఈ విధులను నిర్వహించడానికి తీసుకు రాలేదు. అయితే చాట్‌బాట్‌లు, వర్చువల్ అసిస్టెంట్లు, భాషా అనువాదం వంటి వివిధ అప్లికేషన్‌లలో టెక్స్ట్-ఆధారిత కంటెంట్, ప్రతిస్పందనలను రూపొందించడానికి ChatGPTని ఉపయోగించవచ్చు. చాట్ జీపీటీ పూర్తిగా గూగుల్‌ని భర్తీ చేస్తుందా లేదా అనేది కాలమే చెబుతుంది.

టెక్నాలజీ రంగంలో సంచలనంగా మారిన చాట్ జీపీటీ… గూగుల్ సెర్చ్ ఇంజిన్ కు సవాల్ విసురుతోంది.. ఈ క్రమంలోనే పోటీగా చాలా కంపెనీలు ఆ దిశగా ఆలోచిస్తున్నాయి. తాజాగా టెస్లా,ట్విట్టర్ కంపెనీల బాస్ ఎలాన్ మస్క్ కూడా చాట్‍జీపీటీకి పోటీగా ఏఐ చాట్ బోట్ ప్లాట్‍ఫామ్‍ను రూపొందించేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది..

Must Read

spot_img