- ఆయన కొత్త సినిమా గురించి ప్రొడ్యూసర్ ఓ కబురు చెప్పారు.
- బాలీవుడ్ దర్శకుడితో మన బాహుబలి సినిమా చేయనున్నారని చెప్పారు.
- ఎవరితో ప్రభాస్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు? ఏమిటి?
ఇండియాలో మోస్ట్ బిజియెస్ట్.. కాస్ట్‌లీయెస్ట్ హీరో ప్రభాస్. ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్న ఈయన.. ప్రస్తుతం 8 సినిమాలతో బిజీగా ఉన్నారు. కొన్ని నిర్మాణ సంస్థలు 150 కోట్లు ఇస్తామని ముందుకొస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న ప్రభాస్.. టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే హీరో. ఒకేసారి నాలుగైదు సినిమాలకు ఓకే చెప్పిన డార్లింగ్.. వరుస షూటింగ్ లతో తెగ బిజీగా మారిపోయాడు.
బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో ఎప్పటి నుంచో ఓ ప్రాజెక్టు ప్లానింగ్ లో ఉండగా… మైత్రీ మూవీ మేకర్స్ దీని కోసం ప్రణాళికల్లో ఉంది. ఒకవేళ మిస్ అయితే యష్ రాజ్ బ్యానర్ కు వెళ్లే అవకాశం ఉంది. అయితే కేవలం ఓవర్ ది టాప్ యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప కథా కథనాల మీద అంత దృష్టి పెట్టడమే కంప్లయింట్ సిద్ధార్థ్ ఆనంద్ మీద ఉంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమాపై కాస్త టెన్షన్ పడుతున్నారు.
ప్రభాస్ నటించిన సాహో తాలుకా అనుభవాలను అభిమానులు ఎవరూ మర్చిపోలేదు. దీని వల్లే వీరిద్దిరి కాంబోలో యాక్షన్ మూవీ అంటే అందరూ టెన్షన్ పడుతున్నారు. కానీ తాజాగా వచ్చిన పఠాన్ సినిమాతో ఈ టెన్షన్ కాస్త తీరింది. ఎలాగంటారా.. స్టార్ పవర్ ను వాడుకొని ఎలివేషన్లను పండించడంలో సిద్ధార్థ్ ఆనంద్ మేటి. ఇలా చేసే అతడు మూడు హిట్లను కొట్టాడు. అయితే తాజాగా ఆయన హృతిక్ రోషన్ తో ఫైటర్ అనే సినిమాను చేయబోతున్నాడు. ఇది పూర్తి కాగానే ప్రభాస్ తో తన నెక్స్ట్ మూవీ పట్టాలెక్కనుంది..
అయితే ఈ సినిమాకు ముందే హృతిక్ ప్రభాస్ కాంబోలో వార్ 2 తీయాలనుకున్నప్పటికీ సాధ్య పడలేదు. దీంతో ముందు ఫైటర్ తీయబోతున్నాడు. వచ్చే ఏడాదిలోగా ఈ సినిమాను పూర్తి చేసుకొని ప్రభాస్ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. అలాగే ఆది పురుష్, సలార్, మారుతి సినిమా, ప్రాజెక్ట్ కే, స్పిరిట్… ఇవన్నీ పూర్తయ్యాకే సిద్దార్థ్ ఆనంద్ ప్రభాస్ ల కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది.