Homeఅంతర్జాతీయందక్షిణ కొరియాలో పెళ్లంటే చాలు..

దక్షిణ కొరియాలో పెళ్లంటే చాలు..

అదేంటో కానీ దక్షిణ కొరియాలో 30 దాటుతున్నా యువకులు పెళ్లంటే చాలు ఆమడ దూరంలో ఉంటున్నారు. దక్షిణ కొరియాలో రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు పడిపోవడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఇది ఒక్క ఈ దేశంలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో యువత పెళ్లి సంతానం విషయంలో విముఖత ప్రదర్శిస్తున్నారు. దీంతో ఆ దేశాలలో జనాభా సంక్షోభం తలెత్తే అవకాశం కనిపిస్తోంది..

దక్షిణ కొరియాలో 30 దాటినా పెళ్లికి నో నో అంటూండటంతో రికార్డు స్థాయిలో తక్కువ పెళ్లిల్లు నమోదవుతున్నాయి. నిజానికి ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట.. ఆ వయస్సులో జరిగితేనే బాగుటుందని పెద్దలు చెబుతుంటారు.. అయితే, ఇది క్రమంగా గాడి తప్పుతుందేమో అనిపిస్తోంది..నేటి యువతరం తమ క్యారీర్ ను అడ్డు పెడుతూ పెళ్లిని వాయిదా వేస్తున్నారు. ఉద్యోగం, సెటిల్‌మెంట్‌.. ఇలా చూస్తూ.. పెళ్లికి కామాలు పెడుతూ పోతున్నారు. కొన్ని దేశాల్లో మరీ ఇది తీవ్రంగా ప్రభావం చూపుతోంది.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పాపులేషన్‌ భారీగా పెరిగిపోతుంటే.. కొన్ని దేశాల్లో మాత్రం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.. జనాభా తగ్గుముఖంతో ఇప్పటికే చైనా, జపాన్‌లు సతమతమవుతుండగా.. దక్షిణ కొరియాకు సైతం ఈ పరిస్థితి సవాలుగా మారింది.

ఎందుకంటే.. పెళ్లిళ్ల్లు చేసుకునే వారి సంఖ్య 2022లో రికార్డు స్థాయిలో పడిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అతితక్కువ జననాల రేటున్న దేశాల్లో దక్షిణ కొరియా ఒకటిగా ఉంది.. అక్కడి యువత పెళ్లిళ్లు ఆలస్యంగా చేసుకోవడం వంటి కారణాలు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. గత సంవత్సరం వివాహం చేసుకున్న దక్షిణ కొరియన్ల సంఖ్య రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరుకుంది. ప్రపంచంలోనే అత్యల్ప జనన రేటు ఉన్న దేశంలో జనాభా సమస్యలను మరింత పెంచింది. కొరియా గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం, ఒక దశాబ్దం క్రితం 2012లో 3 లక్షలా 27వేల జంటలు వివాహం చేసుకోగా గత సంవత్సరం మాత్రం కేవలం 1లక్షా 92వేల జంటలు మాత్రమే వివాహం చేసుకున్నారు. అంటే ఆ సంఖ్య 40 శాతానికి పైగా తగ్గిందన్నమాట..

దక్షిణ కొరియా 1970 నుంచి దేశవ్యాప్తంగా వివాహాల నమోదును క్రమం తప్పకుండా నమోదు చేస్తూ వస్తుంది. మొదటి సారి వివాహం చేసుకునే పురుషుల సగటు వయస్సు 33.7 సంవత్సరాలుగా ఉంది.. ఇది రికార్డు స్థాయిలో గరిష్టమనే చెప్పాలి. అయితే వధువుల వయస్సు కూడా వివాహానికి 31.3 సంవత్సరాల గరిష్ట రికార్డును తాకింది. వారు ఒక దశాబ్దం క్రితం నుండి మొదటిసారి వివాహం చేసుకున్న పురుషులకు 1.6 సంవత్సరాలు మరియు మహిళలకు 1.9 సంవత్సరాల పెరుగుదలను సూచిస్తోంది.. గత ఏడాది పెళ్లి చేసుకున్న దాదాపు 80 శాతం జంటలు తొలిసారిగా పెళ్లి చేసుకున్నారు. దక్షిణ కొరియా తన జనన రేటులో దీర్ఘకాలిక క్షీణతతో పోరాడుతున్నందున, గత సంవత్సరం అత్యల్ప సంఖ్యలో అంటే 2 లక్షలా 49వేల మంది పిల్లలను కన్నారు.

దక్షిణ కొరియా చాలా కాలం క్రితం రీప్లేస్‌మెంట్ రేట్ అని పిలవబడే స్థాయిని ఆమోదించింది. ఆ తర్వాత గత సంవత్సరం ఒక మహిళకు రికార్డు స్థాయిలో 0.78 జననాలు సంభవించడంతో జనాభా తగ్గిపోవడం ప్రారంభమైంది. జననాల రేటును పెంచే ప్రయత్నంలో ప్రభుత్వం 2006 నుండి దాదాపు 280 ట్రిలియన్ల ($213 బిలియన్లు) ఖర్చు చేసింది, అయితే 2067 నాటికి జనాభా 52 మిలియన్ల నుండి 39 మిలియన్లకు పడిపోతుందని అంచనా వేయబడింది. సగటు జనాభా వయస్సు 62 సంవత్సరాలుగా ఉంది. పని చేసే తల్లులు తమ వృత్తిని కొనసాగిస్తూనే ఇంటి పనులు మరియు పిల్లల సంరక్షణ భారాన్ని మోయడానికి రెట్టింపు భారం పడటం మరొక ముఖ్య అంశం అని నిపుణులు అంటున్నారు. ఒకరకంగా సంసార బాధ్యతలు మోయడానికి నేటి తరం జంటలు ఇష్టపడటం లేదు.

కొన్ని దశాబ్దాలుగా దక్షిణ కొరియా జనాభా గణనీయంగా తగ్గిపోతోంది. ప్రస్తుతం 5.2కోట్ల జనాభా ఉండగా.. 2067 నాటికి అది 3.9కోట్లకు పడిపోనున్నట్లు అంచనాలు ఉన్నాయి.. ఈ క్రమంలో జనాభా సంక్షోభాన్ని నివారించేందుకు దక్షిణకొరియా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా జననాల రేటు పెంచేందుకుగాను 2006 నుంచి సుమారు 213 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ద.కొరియాలో జీవన వ్యయంతోపాటు నివాస ఖర్చులు భారీగా పెరగడం కారణంగా తక్కువగా వివాహాలు జరుగుతున్నాయి. జననాల రేటు క్షీణించేందుకు కూడా ఇదే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉద్యోగాలు చేసే మహిళలు తమ పిల్లల్ని చూసుకునేందుకు సరైన సమయం కేటాయించలేకపోవడమూ వారిపై ఒత్తిడికి కారణమవుతోందని చెబుతున్నారు. ఇలా భిన్న కారణాలతో అక్కడి యువతీ, యువకులు వివాహాలకు దూరంగా ఉంటున్నారని విశ్లేషిస్తున్నారు.

Must Read

spot_img