Homeఅంతర్జాతీయంజార్జియా ఆర్థిక వృద్ధిరేటు అమాంతం పెరిగిందా..?

జార్జియా ఆర్థిక వృద్ధిరేటు అమాంతం పెరిగిందా..?

కొన్ని నెలల ముందు వరకు అంతంత మాత్రంగా ఉన్న ఆ దేశ ఆర్థిక వృద్ధి రేటు.. ఇటీవలి కాలంలో ఘననీయంగా పెరిగింది.. గతంతో పోలిస్తే.. రెండింతలు పెరిగింది.. ఇంతకూ ఆ దేశ ఆర్థిక వృద్ధి అనూహ్యంగా పెరగడానికి గల కారణం ఏంటి…?

ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్న యుద్దం కారణంగానే జార్జియా ఆర్థిక వృద్ధిరేటు అమాంతం పెరిగిందా..? ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు డాలర్ తో పోల్చితే… లారి విలువ ఎంత శాతం పెరిగింది..?

జార్జియాకు రష్యన్ నగదు రాక భారీగా పెరిగిందా..?

ఉక్రెయిన్, రష్యాల యుద్ధం మొదలవడానికి ముందు జార్జియా ఆర్థిక వృద్ధి రేటు సుమారు 5 శాతం.. కానీ, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అది 10.2% ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. దేశంలోకి రష్యన్న గదు రాక భారీగా పెరిగింది.. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ మధ్య కాలంలో దేశంలోకి 140 కోట్ల డాలర్లు వచ్చినట్టు ఈ ఆర్థికవేత్త అంచనా వేశారు. 2021లో ఇదే కాలంతో పోలిస్తే ఇది 3.6 రెట్లు ఎక్కువని చెప్పారు.

మరోవైపు జార్జియా దేశ కరెన్సీ అయిన లారి విలువ కూడా భారీగా పెరిగింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు డాలర్‌ తో పోల్చితే లారి విలువ 15 శాతం పెరిగింది. యుక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత 70 వేల నుంచి లక్ష మంది రష్యన్ పౌరులు జార్జియాకు తరలి వెళ్లినట్లు అంచనా..
రష్యా, యుక్రెయిన్, బేలారస్ వంటి దేశాల నుంచి ఎంత మంది జార్జియాకు వచ్చారో కచ్చితంగా చెప్పడం కష్టమైనప్పటికీ, అక్కడి నుంచి వచ్చే వారు తాము విహారయాత్రకు వస్తున్నారా…? లేక జార్జియాలో బతకడానికి వస్తున్నారా…? అన్నది మాత్రం తెలియదు..

జార్జియాకు వచ్చిన తరువాత వారు ఏడాది పాటు ఎలాంటి సమస్యా లేకుండా ఇక్కడే ఉండవచ్చు. జీవించడం కోసం ఏదైనా పని కూడా చేసుకోవచ్చు. అంతేకాదు, ఏడాది పూర్తయిన తరువాత ఒకసారి తిరిగి వెళ్ళి మళ్ళీ రావచ్చు. అలా వేల సంఖ్యలో జనం జార్జియాకు వస్తున్నారు. ఇది చాలా సరళతరమైన ఇమ్మిగ్రేషన్ విధానంగా భావిస్తున్నారు.

యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి జార్జియాకు తరలివెళ్లే వారి సంఖ్య స్థిరంగా పెరిగినప్పటికీ, మనం రెండు దశలను గుర్తించవచ్చు. ఒకటి మే నెలలో, రెండోది సెప్టెంబర్‌లో. యుద్ధంలో ప్రతి పురుషుడు తప్పనిసరిగా పాల్గొనాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బిల్లును తీసుకురావడంతో, పెద్ద ఎత్తున ప్రజలు రష్యా నుంచి జార్జియాకు తరలివెళ్లడం మొదలైంది. టిలిబిసి వంటి నగరాలలో బ్యాంకుల వద్ద క్యూ లైన్లు పెరిగాయి. ఆ ప్రాంతాల్లో రెంట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో అంతకు ముందు ఎన్నడూ చూడని రీతిలో ధరలు పెరిగాయి.

ఈ స్థాయిలో ధరలు పెరుగుతండడంతో తట్టుకోలేక స్థానికులలో అసహనం పెరుగుతోంది. ఈ సంఘటనలు రష్యన్లు ఎంతగా జార్జియా నగరాలకు తరలివెళ్లారో చెప్పకనే చెబుతున్నాయి.

జార్జియాలో ఒక విదేశీయుడు కంపెనీని ఏర్పాటు చేయడం చాలా తేలిక.

రెండు మూడు రోజుల్లోనే కంపెనీని రిజిస్టర్ చేసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి రష్యన్ పౌరులు నమోదు చేసిన కంపెనీల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021తో పోలిస్తే ఇక్కడ కంపెనీలు పదింతలు ఎక్కువగా నమోదయ్యాయి. జనవరి – సెప్టెంబర్ మధ్య కాలంలోనే, జార్జియాలో 9,500 సిగ్నేచర్లను రష్యన్ పౌరులు నమోదు చేసినట్టు ఆర్థికవేత్తలు చెబుతున్నారు.. మెజార్టీ ప్రజలు సొంతంగా వ్యాపారాలను ప్రారంభించుకునేందుకు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకున్నారు. అయితే, వారు నిజానికి ఏం చేయదలుచుకున్నారో తెలియడం లేదు. దీనితో పాటు, జార్జియాలో రష్యన్ పౌరుల కొత్త బ్యాంకు అకౌంట్లు కూడా బాగా పెరిగాయి.

2008లో ఈ మాజీ సోవియట్ రిపబ్లిక్‌ దేశానికి రష్యాతో యుద్ధం జరిగింది. ఆ తరువాత రెండు దేశాల మధ్య సత్సంబంధాలు లేకుండాపోయాయి. రష్యా నుంచి ప్రస్తుతం తరలి వస్తున్న వలస వాదులతో జార్జియన్లు భయపడుతున్నారు. రష్యన్ ఇమిగ్రేషన్ సామాజిక-రాజకీయాల అంశాలపై ప్రభావం చూపుతుందని కొందరు జార్జియన్లు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో జార్జియాలో ఆర్థిక ప్రగతి, వేగం పుంజుకుంది.

అయితే, ఈ పురోగతి గాలి బుడగలా పేలిపోవచ్చని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది డెవలప్‌మెంట్ ఆఫ్ ఫ్రీడం ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ ఆర్థిక, సామాజిక విధానాల అధిపతి మిఖాయిల్ కుకవ అన్నారు. ఇక్కడ గాలి బుడగలా పేలిపోవడమంటే, ఇప్పుడు యుక్రెయిన్ మీద చేసినట్లుగానే రేపు జార్జియా మీద కూడా రష్యా దాడి చేయడమన్నమాట. “ఒకవేళ వారు ఆక్రమించుకోవాలని నిర్ణయిస్తే, ప్రస్తుత ఆర్థికాభివృద్ధి సంక్షోభంతోనే అంతం కానుందనేది పలువురి అభిప్రాయం.

ద్రాక్ష తోటలు, బత్తాయి పండ్లు, నట్స్ వంటి వ్యవసాయోత్పత్తులు, మాంగనీస్, కాపర్, గోల్డ్ వంటి మైనింగ్, వైన్ పరిశ్రమ, స్టీల్, ఎరువుల కర్మాగారం మొదలైన వాటి మీద ఆధారపడే జార్జియా ఆర్థిక వ్యవస్థను తాజా వలసలు వేగవంతం చేశాయి. నల్ల సముద్రం తీరంలో తూర్పు ఐరోపా, పశ్చిమాసియా సరిహద్దుల నడుమ ఉండే జార్జియాకు ఇటీవల కాలంలో పర్యాటకుల సంఖ్య కూడా బాగా పెరిగింది. ఇది కూడా దేశానికి అదనపు ఆదాయ వనరుగా మారింది. ప్రస్తుతం నమోదవుతున్న ఈ అనూహ్య వృద్ధి 2023లో నెమ్మదించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అది యుద్ధానికి ముందున్న స్థాయికి, అంటే 5 శాతానికి పడిపోవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా వేసింది.

అయితే, ఈ వలసదారులు ఎంత కాలం ఈ దేశంలో ఉంటారన్న ప్రశ్నకు ఇప్పుడైతే సమాధానం లేదు. రిమోట్ వర్క్ చేసుకునే వారు ఇక్కడే కొనసాగవచ్చు. కానీ, వారు జార్జియాలో ఉద్యోగం పొందాలనుకుంటే మాత్రం, అది అంత తేలిగ్గా జరిగే పని కాదు. “ఈ ఆర్థికాభివృద్ధి ఎక్కువ కాలం పాటు ఉండదని అభిప్రాయపడే విశ్లేషకులు ఉన్నారు.. ఏది ఏమైనా, ఈ మార్పు యుక్రెయిన్ యుద్ధంలో ఏం జరుగుతుందనే దానిపైనే ఆధారపడి ఉందని తెలుస్తోంది.. ఈ పెట్టుబడులు దీర్ఘకాలం కొనసాగకపోవచ్చని కూడా భావిస్తున్నారు.

రష్యాతో జార్జియాకు ఉన్న వైరుధ్యాల మూలంగా సామాజిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఏమైనా, ఇటీవలి పరిణామాలతో ఇక్కడ ధరలు భారీగా పెరిగాయి. ఇది తాత్కాలికమేనని అనుకున్నా, పెద్ద నగరాల్లో ఆదాయ వనరులు తక్కువగా ఉన్నవారిపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

గత కొన్ని నెలలుగా జార్జియా దేశ ఆర్థిక వృద్ధి రేటు ఎవరూ ఊహించని విధంగా ఘననీయంగా పెరిగింది.. రష్యా, యుక్రెయిన్, బేలారస్ వంటి దేశాల నుంచి జార్జియాకు వలసలు పెరగడమే ఇందుకు కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు..

ఈ ఆర్థికాభివృద్ధి ఎంతకాలం పాటు ఉంటుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే..

Must Read

spot_img