Homeఅంతర్జాతీయంగౌతం ఆదానీకి షాక్ ఇచ్చిన.. క్రెడిట్ సూట్

గౌతం ఆదానీకి షాక్ ఇచ్చిన.. క్రెడిట్ సూట్

  • గౌతం ఆదానీకి .. క్రెడిట్ సూట్స్ .. షాకిచ్చిందా..?
  • ఆదానీ గ్రూప్ బాండ్లను అంగీకరించేది లేదని తేల్చి చెప్పిందా..?
  • ఈ ప్రకటన ఈక్విటీ మార్కెట్లో సెగలు పుట్టిస్తోందా…?
  • దీని పర్యవసానం ఏమిటి..? అసలు ఆదానీ గ్రూప్ పై ఈ ప్రకటన ఎటువంటి ప్రభావాన్ని చూపించనుంది..?
  • అసలు దీనిపై నిపుణులు ముఖ్యంగా ఆర్బీఐ ఏం చేయనుంది..?
  • గౌతం ఆదానీ .. వ్యాపార ప్రపంచంలో మేరు పర్వతం.. ఇప్పుడీ కొండ .. డీలా పడక తప్పదా..?
  • అంతటి షాక్ .. కు కారణమేంటి..?
  • అసలు ప్రపంచ కుబేరుల జాబితాలో పదిమందిలో ప్లేస్ సాధించిన ఆదానీకి .. క్రెడిట్ సైట్స్ .. ప్రకటన .. మింగుడు పడడం లేదా…?
  • దీనికి ఆయన అవలంభించిన వ్యాపార సూత్రమే కారణమా..?

ఆర్థిక సేవలను అందించే అంతర్జాతీయ సంస్థ క్రెడిట్‌ సూయిస్‌, గౌతమ్‌ అదానీకి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చింది. అదానీ గ్రూప్ కంపెనీలు జారీ చేసే బాండ్లను అంగీకరించమని ప్రకటించింది. అంటే, ఈ బాండ్లను గ్యారెంటీగా పెట్టుకుని క్రెడిట్‌ సూయిస్‌ మార్జిన్‌ లోన్లు ఇవ్వదు. క్రెడిట్ సూయిస్ తీసుకున్న నిర్ణయంతో, బుధవారం బాండ్ & ఈక్విటీ మార్కెట్లలో సెగలు పుట్టించింది. బుధవారం ట్రేడింగ్‌ సెషన్‌లో అదానీ కౌంటర్లు $23 బిలియన్లు నష్టపోయాయి. 2024లో మెచ్యూర్ అయ్యే అదానీ గ్రీన్ ఎనర్జీ డాలర్ బాండ్స్‌ తో పోలిస్తే 76.83 సెంట్ల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

2027లో మెచ్యూర్ అయ్యే $750 మిలియన్ల APSEZ బాండ్లు డాలర్‌తో పోలిస్తే 81.53 సెంట్లు పెరిగాయి. $1 బిలియన్ విలువైన అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్‌ పేపర్ బాండ్‌ డాలర్‌తో పోలిస్తే 75.34 సెంట్ల వద్ద ట్రేడవుతోంది. ఆదానీ గ్రీన్ బాండ్స్‌కు మూడీస్ Ba3 రేటింగ్‌ ఇవ్వగా, APSEZ,అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై పేపర్లను Baa3గా రేట్ చేసింది. బాండ్ మార్కెట్ మొత్తం లీవరేజ్‌ మీద పని చేస్తుంది.

ఉదాహరణకు, BB రేట్ ఉన్న బాండ్లకు ప్రైవేట్ బ్యాంకులు 50-80% వరకు రుణాలు అందిస్తాయి. దీంతో ఒకదానికి ఒకటి సంబంధం లేని గ్రూప్‌ల్లో పెట్టుబడులు పెడుతున్న అదానీ గ్రూప్‌.. తన మార్క్ ఏంటో బిజినెస్ వర్గాలకు పరిచయం చేస్తోంది. అయితే వ్యాపారాల కోసం కావాల్సిన డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది.. అప్పుల మీదే ఎక్కువగా ఆధారపడుతోందా..? ఇది ఇలానే కొనసాగితే దివాళా తీయక తప్పదా..? అసలు అప్పుల మీద ఇంతటి సామ్రాజ్యం నిలబడుతుందా? అది సాధ్యమేనా.. ?ఇంతకీ ఆ క్రెడిట్ సైట్స్ రిపోర్టులో ఏముంది..? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదానీ గ్రూప్‌ తీవ్రమైన అప్పులభారంలో ఉందని.. పెట్టుబడుల కోసం రుణాలనే ఎక్కువగా ఉపయోగిస్తోందని క్రెడిట్‌సైట్స్ పేర్కొంది.

అదానీ గ్రూప్‌.. డీప్లీ ఓవర్‌ లివరేజ్డ్‌ పేరుతో రిపోర్టులో బయటపెట్టిన విషయాలు సంచలనంగా మారాయి. అదానీ గ్రూప్‌కు గడ్డు పరిస్థితులు ఎదురైతే..ఆసంస్థ తీవ్ర అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. అదే జరిగితే.. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గ్రూప్‌ కంపెనీలు ఎగవేతలకు పాల్పడే చాన్స్ ఉందని రిపోర్టులో వివరించింది. దాదాపు 40 ఏళ్ల కింద కమోడిటీస్ ట్రేడింగ్‌తో అదానీ వ్యాపారం మొదలైంది. ఆ తర్వాత గనులు, పోర్టులు, పవర్ ప్లాంట్లు, ఎయిర్‌పోర్టులు, డేటా సెంటర్లు, డిఫెన్స్.. ఇప్పుడు మీడియా రంగంలోకి కూడా అదానీ గ్రూప్‌ విస్తరించింది.

ఒకదానితో ఒకటి సంబంధం లేని వ్యాపారాల్లో అదానీ గ్రూప్ అడుగు పెడుతూనే ఉంది. వ్యాపార విస్తరణపై ఆ సంస్థ దూకుడు చూపిస్తోంది. దీంతో కంపెనీ క్రెడిట్​మెట్రిక్స్ అంటే రుణ పరిమితులు ముఖ్యంగా క్యాష్ ఫ్లోపై ఎఫెక్ట్ పడుతోందని క్రెడిట్​సైట్స్​అంటోంది. తనకు పరిచయం లేని, సంబంధం లేని రంగాల్లోకి అదానీ గ్రూప్​ఎంటర్ అవుతోందని.. ఐతే ఈ బిజినెస్‌లు అన్నీ డబ్బు చాలా ఎక్కువ మొత్తంలో అవసరమైనవేనని, కొత్త బిజినెస్‌ల ఎగ్జిక్యూషన్‌లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సమస్యగా మారే ఛాన్స్​ఉంటుదని తన రిపోర్టులో వివరించింది.

అదానీ గ్రూప్‌లోని ఆరు కంపెనీలు స్టాక్‌ఎక్స్చేంజీలో లిస్ట్ అయ్యాయ్. గ్రూప్‌లోని కొన్ని కంపెనీలు.. డాలర్​బాండ్స్​అప్పులను తీర్చాల్సి ఉంది. ఈ ఆరు లిస్టెడ్​కంపెనీలకూ కలిపి 2022 ఆర్థిక సంవత్సరం చివరినాటికి.. 2వేల 309 బిలియన్లు అంటే దాదాపు 2లక్షల 30వేల 9వందల కోట్ల అప్పులు ఉన్నాయి. చేతిలోని క్యాష్‌ను మినహాయించి లెక్కేసినా.. నికర అప్పులు వెయ్యి 729 బిలియన్లు అంటే లక్షా 72వేల 9వందల కోట్లు ఉంటాయి. ఇప్పటికే ఉన్న వ్యాపారాల్లో పెట్టుబడులతో పాటు కొత్త రంగాల్లోకి అడుగు పెట్టడానికీ డబ్బును అప్పుల రూపంలోనే అదానీ గ్రూప్ సమీకరిస్తోంది.

  • ఇదే ఫ్యూచర్‌లో సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని క్రెడిట్‌ సైట్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది..

    ఇండియాలో వ్యాపారం అంటే ఒకప్పుడు టాటాల పేర్లు.. ఆ తర్వాత అంబానీల పేర్లు వినిపించాయ్. వీళ్లద్దరిని పక్కకు నెట్టి ఇప్పుడు అదానీ గ్రూప్ అతిపెద్ద కార్పొరేట్‌ గ్రూప్‌గా నిలిచింది. ఐతే అదానీ గ్రూప్ అప్పులపై చాలామంది క్లయింట్లు, ఇన్వెస్టర్లు ఆందోళనతో ఉన్నారని క్రెడిట్‌సైట్స్ సంస్థ చెప్తోంది. తమకు ఏ మాత్రం అనుభవం లేని కాపర్​ రిఫైనింగ్​, పెట్రో కెమికల్స్​, టెలికాం, అల్యూమినియం ప్రొడక్షన్​రంగాల్లోకి అదానీ ఎంటర్‌ కావడమే ఆందోళనకు కారణమని అంటోంది. ఈ రంగాల్లోని కంపెనీలు తీసుకున్న అప్పులను వెంటనే తీర్చడానికి తగినంత లాభాలను సంపాదించలేవు.

    ఆ వ్యాపారాల్లో లాభాలు వెంటనే రావు. దీంతో మొదట్లో రీ ఫైనాన్సింగ్​మీదే ఆధారపడాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు డబ్బు సమకూర్చుకోవాలంటే బ్యాంకింగ్​ సంబంధాలు పటిష్టంగా ఉండాలి. ఏమైనా ఇలా మితిమీరి అప్పులు చేయడంతో గ్రూప్‌లోని ఏదైనా ఒకటి లేదా ఎక్కువ కంపెనీలు డిఫాల్ట్​ అయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తోంది. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్ అయిన ఆరు కంపెనీలకు అదానీనే చైర్మన్‌గా ఉన్నారు. ఒకదానికొకటి సంబంధం లేని రంగాల్లో పెట్టుబడులు పెడుతూ.. తన దూకుడు చూపిస్తున్నారు. ఐతే గ్రూప్‌లో ఆయన లేకపోతే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. బోర్డులో ఎవరిలోనూ ఆస్థాయిలో మేనేజ్‌మెంట్‌ సామర్థ్యం లేదు అన్నది మరికొందరి అభిప్రాయం. పదేళ్లలో గ్రూప్ పగ్గాలు వేరేవాళ్లకు అప్పజెప్పాల్సి వస్తుంది. మరి అప్పుడు పరిస్థితి ఏంటన్నది మరో అనుమానం. ఇలాంటి సమయంలో క్రెడిట్‌సైట్స్ రిపోర్టు మరింత టెన్షన్‌ పెడుతోంది. ఈ రిపోర్టుతో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు కూడా డీలా పడ్డాయి.

    కొద్దిపాటి అప్పు ఉందంటేనే మనకు నిద్ర పట్టదు. ఆ అప్పు ఎలా తీర్చాలన్న భయం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటిది.. లక్షల కోట్ల అప్పులు
    చేస్తూ.. వాటిని తీర్చకుండానే మరికొన్ని కంపెనీలను కొనడానికి.. లాక్కోవడానికి మళ్లీ అప్పుల్నే అదానీ నమ్ముకోవడం ఆందోళన కలిగిస్తోంది. అప్పుల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయకపోతే మాత్రం అదానీ సామ్రాజానికే ముప్పు తప్పదన్న అభిప్రాయం ఆర్థిక విశ్లేషకుల్లో వెల్లువెత్తుతోంది. తాజాగా అదానీ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన అప్పుల వివరాలను ఇవ్వాలని స్థానిక బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది.

    ఇటీవలే ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం అదానీ గ్రూప్ పై ఓ కన్నేసినట్టు ప్రకటించ‌డం గ‌మ‌నార్హం. అదానీ గ్రూప్ లోని 9 సంస్థ‌ల‌కు పీఎన్‌బీ రూ.7,000 కోట్ల రుణాలిచ్చింది. అదానీ ఎయిర్‌పోర్ట్స్ విభాగానికే ఇందులో పెద్ద ఎత్తున మంజూరు చేసింది. ఇప్పుడు ఆర్బీఐ కూడా అదానీ అప్పుల గురించి ఆరా తీస్తుండ‌టంతో స‌ద‌రు గ్రూప్ ఆర్థిక సామ‌ర్థ్యంపై స‌ర్వ‌త్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి.

    స్విస్ బ్రోక‌రేజీ దిగ్గ‌జం క్రెడిట్ సూసీ.. అదానీ బాండ్ల‌కు విలువే లేద‌ని చెప్ప‌డమే ఇందుకు కార‌ణం. ఈ క్ర‌మంలోనే రూ.20,000 కోట్ల ఎఫ్‌పీవోను అదానీ అనూహ్యంగా ర‌ద్దు చేయ‌డం కూడా సంచ‌ల‌నంగా మారింది. ఈ ఎఫెక్ట్‌తోనే స్టాక్ మార్కెట్ల‌లో అదానీ షేర్లు నేల‌చూపులు చూస్తున్నాయ‌ని మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ స‌ర‌ళిని విశ్లేషిస్తున్నారు. తాజా పరిణామాలతో ఆదానీ గ్రూప్ షేర్లు మరింత నష్టాలపాలవుతాయన్న అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. అదే జరిగితే, రుణాల చెల్లింపుల నిమిత్తం .. బ్యాంకులకు చెల్లించాల్సిన సొమ్ము సంగతేంటన్న చర్చ దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతోంది.

    అప్పు .. ఎప్పటికైనా ప్రమాదమే.. అన్నది పెద్దల సూక్తి.. మరి ఆ అప్పులతోనే వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపితే, మరింత ప్రమాదాన్ని నెత్తిన పెట్టుకున్నట్లే.. తాజాగా ఆదానీ కంపెనీలకు అదే పరిస్థితి తలెత్తనుందని క్రెడిట్ సైట్స్ ప్రకటన వెల్లడిస్తోంది.

    Must Read

    spot_img