రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ ఆదానీ .. స్పందించారు. రాహుల్ ను గౌరవనీయ నేతగా పేర్కొన్న ఆయన .. ఈ వ్యాఖ్యలన్నీ బిజినెస్ ఆఫ్ పాలిటిక్స్ లో భాగమేనని అంటున్నారు.. ఇంతకీ రాహుల్ చేసిన వ్యాఖ్యలేమిటి.. అన్నదే చర్చనీయాంశంగా మారింది.
మోడీ కార్పొరేట్ల కోసమే పనిచేస్తున్నారంటూ, ప్రముఖ వ్యాపారవేత్త ఆదానీకి వెన్నుదన్నుగా మారుతున్నారని .. రాహుల్ గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆదానీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

రాజకీయ నాయకుల అండ లేకుండా కంపెనీల వ్యాపారాల మనుగడ కష్టతరమని మనందరికీ తెలిసిందే. ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటుంటారు. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్న వేళ దీనికి సంబంధించిన విషయాలు మళ్లీ చర్చల్లోకి వస్తున్నాయి. 2014 ఎన్నికల్లోనూ, ఆ తర్వాత కూడా రాహుల్ గాంధీ నిరంతరం తమపై దాడి చేస్తున్నారని అదానీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారంగా మారాయి.
రాహుల్ జీ చేసిన దాడితో ప్రజలకు అదానీ అంటే ఎవరో తెలుసుకున్నారని అన్నారు. అంతకు ముందు చాలా మంది అదానీ అనే పేరును విని ఉండరని.. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో గుజరాత్‌కు చెందినవాడినని.. అక్కడి ప్రజలు తనకు తెలుసుని అన్నారు. 2014 ఎన్నికలు సమీపించినప్పడు కూడా రాహుల్ గాంధీ పదేపదే తనపై విరుచుకుపడ్డారని అన్నారు.
రాహుల్ గాంధీని గౌరవనీయమైన నేతగా అభివర్ణిస్తూ.. ఆయన కూడా రాజకీయ పార్టీని అలాగే నడపాలని ఆదానీ అన్నారు. అయితే.. మోదీ అండతోనే అదానీ విస్తరిస్తోందని, మోదీ కార్పొరేట్ల కోసం పనిచేస్తున్నారంటూ రాహుల్ గాంధీ పలు మార్లు ఇప్పటికే తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అదానీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని రాహుల్ చాలాసార్లు ఆరోపణలు చేశారు.
రాహుల్ జీ గౌరవనీయమైన నాయకుడు. రాజకీయ పార్టీని కూడా నడపాలి. వారి సిద్ధాంతాల యుద్ధం జరుగుతోంది. అందులో ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉన్నాయి. నేను సాధారణ వ్యాపారవేత్తను. ఒక వ్యాపారవేత్తంగా నా పని నేను చేసుకుపోతుంటానంటూ అదానీ బదులిచ్చారు. మెుదటగా తన ప్రస్థానం 1985లో రాజీవ్ గాంధీ తెచ్చిన ఎగ్జిమ్ పాలసీ తన కంపెనీని గ్లోబల్ ట్రేడింగ్ హౌస్‌గా మార్చేందుకు సహాయపడిందని అన్నారు.
ఆ తర్వాత పివి.నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు చివరగా మోదీ సర్కార్ లోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం తెస్తున్న పాలసీలు వ్యాపార విస్తరణకు అవకాశాలను తెచ్చిపెట్టాయని అన్నారు. అయితే ఈ క్రమంలో ప్రధాని మోదీ నుంచి ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలను పొందలేదని.. జాతీయ ప్రయోజనాల కోసమే కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చే పాలసీలు దేశంలోని అందరు వ్యాపారవేత్తలకూ ప్రయోజనాన్ని కల్పించేందుకు రూపొందిస్తున్నవని అన్నారు. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. అదానీ, అంబానీ అందరినీ కొన్నారని.. కానీ తన అన్నయ్య రాహుల్ గాంధీని ఎప్పటికీ కొనలేరని అన్నారు. తన అన్న సత్యం కోసం నిలబడతారని చెప్పారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీలను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పించారు.
వారు అగ్ర నాయకులను కొనుగోలు చేశారు, ప్రభుత్వ రంగ యూనిట్లను కొనుగోలు చేయగలిగారు, మీడియాను కొనుగోలు చేశారు.. కానీ తన అన్నను మాత్రం వారు కొనుగోలు చేయలేకపోయారని అన్నారు. తన అన్న సత్యం కోసం నిలబడతాడని.. అందుకే అది వారి వల్ల అయ్యే పని కాదని అన్నారు.
అయితే దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానికి చెందిన అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు శ్రీలంకలో కేటాయించిన పవన విద్యుత్ ప్రాజెక్ట్.. ఇప్పుడు కలకలం రేపుతోంది. దీనిపై రాజకీయంగానూ దుమారం చెలరేగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఒత్తిళ్ల వల్లే ఈ ప్రాజెక్ట్‌ను అదానికి కట్టబెట్టాల్సి వచ్చిందంటూ సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు దీనికి కారణం అయ్యాయి. 500 బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్.. 2021లో శ్రీలంక ప్రభుత్వం.. అదాని గ్రూప్స్‌కు కేటాయించిన పవన విద్యుత్ ప్రాజెక్ట్ ఇది.
దీని ఉత్పాదక సామర్థ్యం 500 మెగావాట్లు. సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడంలో ఈ ఒప్పందం కుదిరింది. శ్రీలంక తీర ప్రాంత జిల్లా మన్నార్‌లో దీన్ని నెలకొల్పడానికి గౌతమ్ అదానితో సిలోన్ ఎలక్ట్రసిటీ బోర్డ్, సస్టెయినబుల్ ఎనర్జీ అథారిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ వ్యయం 500 బిలియన్ డాలర్లు. ఈ ప్రాజెక్టు కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వ సంస్థలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం నిర్వహించిన విచారణలో పలు కీలక అంశాలు బహిర్గతం అయ్యాయి.
దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒత్తిడిని తీసుకురావడం వల్లే అదానీకి ఈ ప్రాజెక్టును కట్టబెట్టాల్సి వచ్చిందని సిలోన్ ఎలక్ట్రసిటీ బోర్డ్ ఛైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాండో కుండబద్దలు కొట్టారు. ఈ ప్రకటనపై గొటబయ రాజపక్స స్పందించడం.. ప్రాధాన్యతను సంతరించుకుంది. దీన్ని ఆయన తోసిపుచ్చారు. దీనిపై వివరణాత్మక సమాధానం వెలువడుతుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.
తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో దీన్ని పోస్ట్ చేశారు. రాజపక్స వివరణ కోరిన నేపథ్యంలో- పార్లమెంటరీ కమిటీ సమక్షంలో తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ఎంఎంసీ ఫెర్డినాండో చెప్పారు. 2022 గ్లోబల్ టెండర్లకు భిన్నంగా శ్రీలంకలో విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపుల కోసం గ్లోబల్ టెండర్లను పిలిచే వ్యవస్థ ఉంది.
దీనికి భిన్నంగా నామినేషన్ పద్ధతిన మన్నార్ విండ్ పవర్ ప్రాజెక్ట్‌ను అదానికి కేటాయించిందంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. తాజాగా పార్లమెంటరీ కమిటీ ముందు ఎంఎం ఫెర్డినాండో చేసిన ప్రకటనతో ఈ ఆరోపణలు నిజమేనంటూ వార్తలొచ్చాయి. 2022 బీజేపీ వైఖరిని తప్పుపట్టిన రాహుల్ గాంధీ.. దీనిపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ సైతం స్పందించారు.
- మోడీ తనకు మద్ధతు పలుకుతున్నారన్న వ్యాఖ్యలపై ఆదానీ ఇచ్చిన వివరణ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది..

శ్రీలంక పవర్ ప్రాజెక్టులో మోడీ ప్రభుత్వం జోక్యం చేసుకుందంటూ విమర్శించారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన ఓ క్లిప్పింగ్‌ను పోస్ట్ చేశారు. బీజేపీ కుటిల రాజకీయాలు ఇప్పుడు పాక్ జలసంధిని కూడా దాటాయంటూ వ్యాఖ్యానించారు. అదానీకి రెండో అతిపెద్ద ప్రాజెక్ట్.. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు శ్రీలంకలో లభించిన రెండో అతిపెద్ద ప్రాజెక్ట్.. మన్నార్ పవన విద్యుత్.
ఇదివరకు ఆ కంపెనీకి కొలంబోలో వ్యూహాత్మక పోర్టు టెర్మినల్ నిర్మాణం దక్కింది. శ్రీలంక, భారత్, జపాన్ సంయుక్తంగా నిర్మించ తలపెట్టిన ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ అది. వెస్ట్ కంటైనర్ టెర్మినల్ ప్రాజెక్టు నిర్వహణలోకి అత్యధిక వాటా అదానీ సాధించుకుంది. అయితే కేపిటలిస్టులకు మాత్రమే మోడీ ప్రభుత్వం సాయపడుతుందని విపక్షాలు.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు.
తనకేదో ఈ సర్కార్ నుంచి వ్యక్తిగతంగా సహాయం లభిస్తుందన్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. మోడీ, తాను ఒకే రాష్ట్రానికి చెందినవారిమైనందువల్లే కొన్ని పార్టీలు సులువుగా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని అదానీ విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తమ పట్ల చేస్తున్న ఆరోపణలను ఆయన ‘బిజినెస్ ఆఫ్ పాలిటిక్స్’ లో భాగంగా తోసిపుచ్చారు. మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ మాటేమిటి అని ప్రశ్నించారు.
‘ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ఆహ్వానంపై నేను అక్కడ జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొనడానికి వెళ్ళాను.. ఆ తరువాత ఆ రాష్ట్రంలో మా పెట్టుబడుల విషయమై రాహుల్ సైతం ప్రశంసించారని ఆయన వివరించారు. రాజస్థాన్ లో అదానీ గ్రూప్ 68 వేల కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలపై అదానీ స్పందన ఆసక్తికరంగా మారింది.