HomePoliticsగంటా పార్టీ మార్పు .. రచ్చ కొనసాగుతూనే ఉంది.....

గంటా పార్టీ మార్పు .. రచ్చ కొనసాగుతూనే ఉంది…..

గంటా పార్టీ మార్పు .. రచ్చ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ దఫా ఓ క్లారిటీ వచ్చిందట.. అదేంటంటే, ఎన్నికలయ్యేలోగా .. ఆయన పార్టీ మారడం మాత్రం ఖాయమని తేలిందట. మరి ఇక ఈ రచ్చకు ఫుల్ స్టాప్ పడేదెప్పుడన్నదే చర్చనీయాంశంగా మారింది.

గంటా శ్రీనివాసరావు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రాజకీయవేత్త గురించి తెలియనివారుండరు. వాస్తవానికి ఆయన ఏ రాజకీయ పార్టీకి చెందరు. అధికారానికి మాత్రమే చెందుతారు. అధికారం ఏ పార్టీవైపు ఉంటే ఆయన కూడా ఆ పార్టీలోనే ఉంటారు. తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యం, ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి మళ్లీ తెలుగుదేశం, ఇప్పుడు తెలుగుదేశం నుంచి వైసీపీ అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన తాజాగా ఒక స్పష్టత ఇచ్చారు.

పార్టీ మారితే మీకు చెప్పే మారతాను అన్నారు. డిసెంబరు 26 వంగవీటి రంగా వర్థంతిని పురస్కరించుకొని రాధా-రంగా రాయల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆరోజు కాపునాడు జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను ఆయన ఆవిష్కరిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. కాపుల అభివృద్ధి కోసం ఏ కార్యక్రమం పెట్టినా తాను ముందుంటానన్నారు. దీంతో రాజకీయ విశ్లేషకులంతా గంటా శ్రీనివాసరావు ఈసారి రంగాను వాడుతున్నాడంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మూడున్నర సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ నియోజకవర్గంలో ఒక్కరోజు కూడా ఆయన పర్యటించలేదు.

ఆయనకు సంబంధించిన మనుషులే ఏమైనా పనులుంటే కార్యాలయంలో చక్కబెట్టేస్తున్నారు. వైఎస్ జగన్ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో గంటా సెలెంటయ్యారేమో అనుకున్నారు. అనుకోకుండా ఒకరోజు రాజీనామా చేస్తున్నానంటూ స్పీకర్ కార్యాలయానికి స్పీకర్ ఫార్మాట్ లో రిజైన్ చేసిన లేఖను పంపించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్నానని, అందుకే ఈ రాజీనామా అన్నారు. దీంతో గంటా ఈసారి విశాఖ ఉక్కును వాడనున్నారనే టాక్ వెల్లువెత్తింది. అయితే అకస్మాత్తుగా రంగా-రాధా రాయల్ ఆర్గనైజేషన్ వచ్చి చేరింది. విశాఖ ఉక్కు వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదనే అంచనా ఉండటంతో ఈసారికి వంగవీటి రంగాను వాడేస్తున్నారన్న టాక్ హాట్ టాపిక్ గా మారింది.

రానున్న ఎన్నికల్లో కాపుల ఓట్లే కీలకం కాబోతున్నాయి. కాపు నేతలకు కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాపులు మారబోతుండటంతోనే అటువైపుగా తన రాజకీయాన్ని గంటా తిప్పారనడంలో అతిశయోక్తి లేదు. పార్టీ మార్పుపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీ‌నివాస‌రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ మార్పుపై మీడియానే ర‌క‌ర‌కాల ముహూర్తాలు పెడుతూ వార్త‌లు రాసింది, రాస్తోంద‌ని చెప్పుకొచ్చారు. తానెప్పుడూ పార్టీ మారుతాన‌ని చెప్ప‌లేద‌న్నారు.

కానీ పార్టీ మారాల్సిన ప‌రిస్థితి వ‌స్తే… మీడియాకు తానే స్వ‌యంగా త‌ప్ప‌క‌ చెబుతాన‌ని ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

పార్టీ మార‌న‌ని మాత్రం ఆయ‌న చెప్ప‌క పోవ‌డం గ‌మ‌నార్హం. టీడీపీ త‌ర‌పున గెలిచిన‌ప్ప‌టికీ, ఆ పార్టీ అధికారంలోకి రాక‌పోవ‌డంతో గంటా శ్రీ‌నివాస‌రావు మౌనాన్ని ఆశ్ర‌యించారు. గ‌తంలో టీడీపీ హ‌యాంలో ఆయ‌న మంత్రిగా ప‌ని చేశారు. విశాఖ నుంచి 2019లో గెలిచిన త‌ర్వాత టీడీపీ కార్య‌క్ర‌మాలకు దూరంగా వుంటున్నారు. రాజ‌కీయంగా ఆయ‌న ఎక్క‌డా క‌నిపిస్తున్న దాఖ‌లాలు లేవు. వైసీపీలో చేరుతార‌ని విస్తృత ప్ర‌చారం సాగుతోంది. ఎప్పుడూ ఆయ‌న ఆ వార్త‌ల్ని ఖండించిన దాఖ‌లాలు లేవు.

విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేటీక‌రించాల‌నే నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా ఎమ్మెల్యే ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేశారు. దాన్ని ఆమోదించ‌లేదు. ఏడాదిన్న‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ ఆయ‌న పొలిటిక‌ల్‌గా యాక్టీవ్ అవుతున్నారు. దివంగ‌త వంగ‌వీటి రంగా వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని కాపునాడు బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తున్నార‌ని, అన్ని రాజ‌కీయ పార్టీల నేత‌ల్ని ఆహ్వానిస్తున్న‌ట్టు గంటా తెలిపారు. కాపుల‌కు సంబంధించిన స‌మావేశం కావడంతో జ‌న‌సేనకు మ‌ద్ద‌తుగా కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం వుంది.

విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేటీక‌రించాల‌నే నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా ఎమ్మెల్యే ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేశారు. దాన్ని ఆమోదించ‌లేదు. ఏడాదిన్న‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ ఆయ‌న పొలిటిక‌ల్‌గా యాక్టీవ్ అవుతున్నారు. దివంగ‌త వంగ‌వీటి రంగా వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని కాపునాడు బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తున్నార‌ని, అన్ని రాజ‌కీయ పార్టీల నేత‌ల్ని ఆహ్వానిస్తున్న‌ట్టు గంటా తెలిపారు. కాపుల‌కు సంబంధించిన స‌మావేశం కావడంతో జ‌న‌సేనకు మ‌ద్ద‌తుగా కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం వుంది.

గంటా వైసీపీలో చేరుతారు అని జనసేన వైపు మళ్ళుతారు అని ప్రచారం పీక్స్ లో సాగినా మాజీ మంత్రి నుంచి కనీస ఖండన లేదు.

పైగా ఆయన తెలుగుదేశం పార్టీకి దూరం పాటిస్తున్నారు అన్నది కూడా హైలెట్ అవుతూ వచ్చింది. దాంతో అలాంటిదేమి లేదు అని ఒక ప్రకటన గంటా వర్గం నుంచి రాలేదు. ఇపుడు కూడా ఆయన పాత పాటే పాడారు అంటున్నారు. తాజాగా తాను పార్టీ మారుతాను అని ఎక్కడైనా చెప్పానా అని మీడియానే ఎదురు ప్రశ్నిస్తున్నారు. తాను ఒకవేళ పార్టీ మారితే స్వయంగా మీడియాకు చెబుతాను అని ఆయన చెప్పడం విశేషం.

అంటే పార్టీ మారను అని ఒక్క స్పష్టమైన ప్రకటన అయితే ఆయన నుంచి రాలేదు అని అంటున్నారు. అంటే గంటా పార్టీ మారుతారు అన్న సస్పెన్ అయితే అలా కంటిన్యూ అవుతోంది అంటున్నారు. గంటా టీడీపీలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వారికే టికెట్లు అని చంద్రబాబు ప్రకటించారు. ఆ లెక్కన చూస్తే గంటాకి టికెట్ కన్ ఫర్మ్. అయినా ఆయన తాను ఎప్పటికీ టీడీపీ అని ఒక్క స్టేట్మెంట్ ఇవ్వకపోవడమేంటని టీడీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే వచ్చే ఎన్నికల దాకా గంటా పార్టీ మార్పు అని మీడియా వార్తలు రాసుకునేందుకు మాత్రం ఎలాంటి ఢోకా లేదనే అంటున్నారు.

మరి గంటా పార్టీ మార్పు రచ్చ ఎప్పటికి ఆగుతుందన్నదే చర్చనీయాంశంగా మారింది.

Must Read

spot_img