Homeఆంధ్ర ప్రదేశ్గంటా మళ్లీ యాక్టీవ్ అవుతున్నారా..?

గంటా మళ్లీ యాక్టీవ్ అవుతున్నారా..?

  • సమ్మిట్..వేళ గంటా లేఖాస్త్ర్రం..కీలకంగా మారింది.?
  • ఏపీకి రాబోయిన పరిశ్రమలపై..వైసీపీ సర్కార్ కు ప్రశ్నలు సంధించారు..దీంతో గంటా..దూకుడు షురూ అయిందా..?

విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఓ లేఖ సంధించారు. గంటా శ్రీనిసరావు చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారుతోంది. ఈ అంశంపై ఆయన తెలుగులో వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఇరవై అంశాలపై సూటిగా ప్రశ్నించారు. అందులో రాజధాని లేకపోవడం దగ్గర్నుంచి జాకీ పరిశ్రమను తరిమి వేయడం వరక అనేక కీలక సందేహాలు ఉన్నాయి. వాటన్నింటికీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దావోస్ పెట్టుబడుల సదస్సుకు ఏపీ ప్రభుత్వం వెళ్లకపోవడానికి కారణం ఏమిటో చెప్పాలని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు.

దావోస్‌కు వెళ్లకపోవడం వల్ల జరిగిన నష్టం ఏమిటో ఇప్పటికైనా గుర్తించారా అని లేఖలో ప్రశ్నించారు. కియా అనుబంధ పరిశ్రమలు ఒక్క దానిని కూడా ఎందుకు ఏర్పాటు చేయించలేకపోయారు, లూలూ పరిశ్రమను వెళ్లగొట్టిన అంశం పెట్టుబడిదారుల సదస్సులో చెబుతారా ? భోగాపురం ఎయిర్ పోర్టును నాలుగేళ్ల పాటు పట్టించుకోకుండా.. ఇప్పుడు శంకుస్థాపన పేరుతో హడావుడి చేయడం ఎందుకు ?, లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి పెట్టుబడులు ఆకర్షిస్తారా?, జీతాలు ఇవ్వలేని రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా ? అదానీ డేటా సెంటర్‌కు గతంలోనే శంకుస్థాపన చేసినా ఇంత వరకూ పనులు మొదలు పెట్టలేదని, ఇంకా ఎందుకు భూములు కేటాయించారో చెప్పాలని గంటా డిమాండ్ చేశారు.

టీడీపీ హయాంలో విశాఖలో 50వేల మంది ఐటీ ఉద్యోగులు ఉండేవారు..ఇప్పుడు రెండు మూడు వేల మంది కూడా లేరు..ఐటీ కంపెనీలను ఎందుకు తరిమేశారు ? హెచ్‌ఎస్‌బీసీ వెళ్లిపోకుండా ఎందుకు ఆపలేకపోయారు ? సరైన ఉపాధి అవకాశాలు లేని రాష్ట్రంలో సగటు పౌరుడి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందన్న విషయాన్ని గుర్తించారా ? నాలుగేళ్ల వరకూ పట్టించుకోకుండా..ఎన్నికలకు ఏడాది ముందు పెట్టుబడుల సదస్సు పేరుతో హడావుడి చేయడానికి కారణం ఏమిటో చెప్పాలని గంటా శ్రీనివాసరావు డమాండ్ చేశారు.

ఇవన్నీ రాజకీయ దురుద్దేశంతో రాస్తున్న ప్రశ్నలు కాదని ఏపీలో సగటు పౌరుడుకి ఉన్న సందేహాలని గంటా స్పష్టం చేశారు. గంటా శ్రీనివాసరావు లేఖపై పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. దావోస్ వెళ్లి తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్ని పెట్టుబడులు తెచ్చారని ప్రశ్నించారు. అసలు ఏపీకి రాజధాని లేకుండా చేసింది చంద్రబాబేనని ఆరోపించారు. చంద్రబాబు రాసిన లేఖపై గంటా శ్రీనివసరావు సంతకం పెట్టినట్లుగా ఉందని అమర్ నాథ్ అన్నారు.

  • గంటా దూకుడు నెక్ట్స్ ఏమిటన్నదే ఆసక్తికరం..

గంటా సంధించిన ప్రశ్నలన్నీ స్పష్టంగా ఉండటంతో సింపుల్‌గా వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం ఈ అంశాలపై క్లారిటీ ఇవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. నాలుగేళ్ల పాటు ఓ కులాన్ని మాత్రమే ధ్వంసం చేస్తున్నాననుకుని ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని నాకించేసిందని .. గంటా సంధించిన ఈ ఇరవై ప్రశ్నలతోనే తేటతెల్లం అవుతుంది. అయితే వీటికి సమాధానంగా మాత్రం వైసీపీ దగ్గర ఉంది.. అదే చంద్రబాబు. రాజధాని లేకుండా చేసింది చంద్రబాబేనని.. చంద్రబాబు లేఖ రాస్తే గంటా సంతకం పెట్టారని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. రాజకీయ నాయకులు యాక్టివ్ అవడం అంటే ప్రత్యర్ధి పార్టీలను విమర్శించడమే. ఆ విషయంలో చాలా కాలంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు.

ఎంత సైలెంట్ అంటే ఒక దశలో ఆయన పార్టీలు మారుతారు అని ప్రచారం వచ్చినా ఖండించనంతగా మౌనవ్రతం పాటించారు. టీడీపీ ఓడిన నాలుగేళ్ల తరువాత ఆయనకు ఏపీ రాజకీయాల మీద క్లారిటీ వచ్చినట్లుంది. అందుకే టీడీపీలో చినబాబు లోకేష్ ని కలసివచ్చారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ తాను రీ యాక్టివ్ అవుతున్నా అని చెప్పారు. తెలుగుదేశాన్ని వీడిపోలేదు, వదిలేది లేదు అని స్పష్టం చేశారు. అది జరిగిన తరువాత కూడా మళ్ళీ కొన్నాళ్ళు మౌనం పాటించిన గంటా విశాఖలో వైసీపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్న వేళ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు అంటూ ఒక లేఖ సంధించారు.

ఆ లేఖలో ఇవి తన సందేహాలు కాదు, ఏపీలో సగటు పౌరుడికి వచ్చిన డౌట్లు అని చెప్పుకున్నారు. నాలుగేళ్ళు ఆగి ఇపుడే ఎందుకు సమ్మిట్ అని హడావుడి చేస్తున్నారు అని గంటా అడుగుతున్నారు. దావోస్ కి వెళ్ళకుండా విశాఖలో పెట్టుబడుల సదస్సు ఏంటి అని మరో ప్రశ్న వేశారు. టీడీపీలో హయాంలో పారిశ్రామిక ప్రగతి పచ్చగా ఉంటే ఇపుడు ఏమీ లేదని పసుపు పార్టీ నేత మాదిరిగా ఆవేదన చెందారు.

జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం పెట్టుబడిదారులలో ఎలా విశ్వాసం పెంపొందిస్తుందని మరో డౌట్ అడిగారు. ఇలా గంటా తాను టీడీపీ తరఫున యాక్టివ్ అయ్యాను అని గట్టిగా చెప్పేందుకు లేఖ రూపంలో ప్రశ్నలను చాలా వదిలారు. అయితే ఈ లేఖకు వైసీపీ మంత్రి గుడివాడ ఇచ్చిన సమాధానం కూడా వెరైటీగానే ఉంది. చంద్రబాబు రాసిన లేఖకు గంటా సంతకం పెట్టారు అంటూ సెటైర్లు వేసిన మంత్రి కడుపు మంటతో రాసిన లేఖ ఇది అని విమర్శించారు.

ఏపీకి రాజధాని లేదని అంటున్నారు అంటే ఉమ్మడి ఏపీ నుంచి పారిపోయి వచ్చి అమరావతి పేరిట ఏమీ కాకుండా చేసిన పాపం అంతా చంద్రబాబుదే అని గుడివాడ అంటున్నారు. దావోస్ కి వెళ్తేనే పెట్టుబడులు తెచ్చినట్లా. అలా అయితే మీరెన్ని తెచ్చారు అని గంటాకే సూటిగా ప్రశ్నించారు. అక్కడకు వచ్చిన కార్పోరేట్ దిగ్గజాలే ఏపీకి వస్తూంటే మళ్లీ దావోస్ కి వెళ్లలేదు అనడంలో అర్ధమే లేదు గంటా వారూ అని కౌంటర్ ఇచ్చారు. ఇక పెట్టుబడుల సదస్సు ఫలానా టైంలోనే నిర్వహించాలని ఏమైనా ఉందా గంటా గారూ అని వైసీపీ నేతలు అంటున్నారు.

ఎపుడు వచ్చాం కాదన్నయా ఏమి తెచ్చామన్నది ముఖ్యమని పోకిరి లో మహేష్ డైలాగు నే వైసీపీ నేతలు గంటాకు అప్పచెబుతున్నారు. అంతా ఆర్భాటం హడావుడి చేసి అరచేతిలో వైకుంఠం చూపించిన టీడీపీ మాదిరిగా మా పెట్టుబడుల సదస్సు ఉండదని మేము రెండు లక్షల కోట్లు టార్గెట్ గా పెట్టుకున్నాం, అదృష్టం బాగుంటే ఆ నంబర్ అయిదు పది లక్షల కోట్లకు చేరినా చేరవచ్చి ఇదే మా నమ్మకం అని గంటాకు సరైన జవాబే చెబుతున్నారు గుడివాడ. వీరిద్దరి
వాదోపవాదాలతో..సర్వత్రా చర్చోపచర్చలు సాగుతున్నా, మళ్లీ గంటా యాక్టీవ్ అవుతున్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గంటా లేఖాస్త్ర్రం వైరల్ కావడంతో..ఉత్తరాంధ్రలో గంటా దూకుడు షురూ అయిందన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ లేఖాస్త్ర్రంతో గంటా నెక్ట్స్ స్టెప్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పార్టీ మార్పుపై వార్తలు వెల్లువెత్తుతున్న వేళ..గంటా ఇండైరెక్టుగా..పార్టీలోనే కొనసాగుతానన్న క్లారిటీ ఇచ్చినట్లేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో మళ్లీ పసుపుజెండాతో రాజకీయాలకు గంటా రెడీ అయినట్లేనని టాక్ వినిపిస్తోంది. మరోవైపు గంటా లేఖపై అమర్ నాథ్ కౌంటర్ కు..రివర్స్ ఎటాక్ ఎలా ఉండనుందన్న ఆసక్తి జిల్లావ్యాప్తంగా వెల్లువెత్తుతోంది. దీంతో గంటా..వ్యూహం ఏమిటన్నదే..ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గంటా వ్యాఖ్యలతో అమర్ నాథ్..కౌంటర్ తో..విశాఖ రాజకీయాలు..సందడిగా మారుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరి గంటా దూకుడు నెక్ట్స్ ఏమిటన్నదే ఆసక్తికరంగా మారింది..

Must Read

spot_img