Homeసినిమాట్రైలర్స్గాంధీ-గాడ్సే ట్రైలర్ విడుదల

గాంధీ-గాడ్సే ట్రైలర్ విడుదల

రాజ్‌కుమార్‌ సంతోషి స్క్రీన్‌ప్లే దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గాంధీ-గాడ్సే.. ఏక్‌ యుద్ధ్‌ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌ చూస్తుంటే మహాత్ముడు బతికి ఉంటే ఏమై ఉండేదో అనే రీతిలో కథ సాగుతున్నట్లుగా అర్థమవుతుంది. అయితే ఈ ట్రైలర్ లో కొన్ని ఆసక్తికర విషయాలు చాలానే ఉన్నాయి..

రాజ్‌కుమార్‌ సంతోషి స్క్రీన్‌ప్లే దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గాంధీ-గాడ్సే.. ఏక్‌ యుద్ధ్‌ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌ చూస్తుంటే మహాత్ముడు బతికి ఉంటే ఏమై ఉండేదో అనే రీతిలో కథ సాగుతున్నట్లుగా అర్థమవుతుంది. 3 నిమిషాల నిడివి గల ట్రైలర్‌లో గాంధీ, గాడ్సే తమ ఆలోచనల యుద్ధంలో పోరాడుతున్నట్లు కనిపించారు.

స్వాతంత్ర్యం, దేశ విభజన అనంతరం జరిగిన అల్లర్లతో ట్రైలర్‌ మొదలవుతుంది. విభజనకు గాంధీని బాధ్యుడిని చేసి హత్య చేయాలని గాడ్సే ప్లాన్ చేసి అమలు చేస్తాడు. అయితే ప్రధాని నెహ్రూ వచ్చి బాపు బతికే ఉన్నారని చెప్పడంతో ట్రైలర్‌లో ట్విస్ట్‌ వస్తుంది. కోలుకున్న తర్వాత గాడ్సేను కలిసేందుకు బాపు జైలుకెళ్లడం.. అక్కడ ఇద్దరి మధ్య ఆలోచనల యుద్ధం జరుగుతుంది. అహింసా దృక్పథాలకు గాంధీ కట్టుబడి ఉండగా.. తన అభిప్రాయాలను బలంగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు గాడ్సే.

జనవరి 26 న గణతంత్ర దినోత్సవం రోజున థియేటర్లలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో బాగా చర్చనీయాంశమైంది. దాదాపు 9 ఏండ్ల తర్వాత రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకుడిగా మరోసారి మెగాఫోన్‌ పట్టి గాంధీ-గాడ్సే.. ఏక్‌ యుద్ధ్‌ సినిమాను సిద్ధం చేశారు.

రాజ్‌కుమార్‌ సంతోషి కుమార్తె తానీషా సంతోషి ఓ ప్రధాన పాత్రతో ఈ సినిమా నుంచి తెరంగేట్రం చేస్తుంది. ఈ విషయాన్ని తానిషానే స్వయంగా సోషల్‌ మీడయాలో వెల్లడించారు. ఆమెకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కూడా చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ సినిమాకు ఏఆర్‌ రహమాన్‌ సంగీతం, అస్ఘర్‌ వజాహత్‌, రాజ్‌కుమార్‌ సంతోషి మాటలను అందిస్తున్నారు. సినిమాకు మనీలా సంతోషి నిర్మాతగా ఉన్నారు. బాక్సాఫీస్‌ వద్ద షారుఖ్‌ ఖాన్‌ సినిమా పఠాన్‌తో ఈ సినిమా పోటీ పడబోతుంది. అందుకే ఈ సినిమాకు చాలా హైప్‌ వచ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు.

Must Read

spot_img