Homeజాతీయంవిశాఖలో మూడు రోజుల పాటు జీ-20 సదస్సు...

విశాఖలో మూడు రోజుల పాటు జీ-20 సదస్సు…

మనదేశంలోని పలు నగరాలలో జీ 20 సమిట్ సమావేశాలు జరుగుతున్నాయి. దేశాధినేతలంతా పొలోమని భారతదేశంలో వాలిపోతున్నారు. దేశంలోని పర్యాటక స్థలాలతో పాటు ఇక్కడి ప్రజల జీవనశైలిని దగ్గర నుంచి పరిశీలిస్తున్నారు. అయితే వారందరినీ బాగా ఆకట్టుకుంటోంది ఇక్కడి డిజిటల్ పేమెంట్ విధానం. జేబులో రూపాయి లేకుండా కేవలం మొబైల్ ఫోన్ తో అన్ని పనులు చేసుకుంటున్నతీరును ఆశ్చర్యంతో చూస్తున్నాయి అగ్రదేశాలు.. అసలే మన దేశంలో 145 కోట్ల మంది జనాభా ఉంది. అందులో మెజారిటీ పక్షం ప్రజలు నిరక్షరాస్యులుగానే ఉన్నారు. అయినా డిజిటల్ చెల్లింపులు చిటికెల్లో పూర్తి చేస్తున్నారు. 5 రూపాయల నుంచి లక్ష రూపాయల దాకా సునాయాసంగా దేశవ్యాప్తంగా ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ ఫర్ చేసేసుకుంటున్నారు. ఇదంతా క్షణాలలో జరిగిపోతోంది. గతంలో ఇదే పని కోసం బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. చాలా సేపు ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడా పనిలేదు. కేవలం ఓ స్మార్ట్ మొబైల్ దాంతో పాటు ఇంటర్నెట్ ఉంటే చాలు.

ఊపిరి తీసుకునేలోగానే పని పూర్తయిపోతోంది. ఇప్పుడు ఇంటర్నెట్ అవసరం లేకుండానే డిజిటల్ చెల్లింపులు చేసేవిధంగా టెక్నాలజీని అప్ డేట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం మేరకు భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల ఆవిష్కరణ భారత ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పును తీసుకు వచ్చిందనడంలో సందేహం లేదు. పెద్ద నోట్ల రద్దు తరువాత ఆర్థిక లావాదేవీలన్నింటినీ పరివర్తన చెందించిన గొప్ప విప్లవ ఆవిష్కరణగానే ఈ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఏర్పడింది. దేశీయంగా మొదలైన ఈ సరికొత్త సాంకేతిక వ్యవస్థ కోట్లాది మందిని సంప్రదాయక ఆర్థిక వ్యవస్థ చట్రం నుంచి బయటకు లాగడమే కాదు..దేశీయ వాణిజ్యాన్ని కూడా పునర్నిర్మించింది. మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇది ఓ గేమ్ చేంజర్ లా పనిచేసింది. ప్రజాజీవితంలో, బ్యాంకింగ్ రంగంలో, నగదు లావాదేవీల్లో సరికొత్త మార్పును తీసుకువచ్చింది భారతీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ.

ఈ విధానం ఇప్పుడు ప్రపంచం మొత్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు భారత్ అందించిన టెక్నాలజీ రెవెల్యున్, డిజిటల్ పేమెంట్ సిస్థం, భారత్ రూపొందించిన దేశీయ తక్షణ చెల్లింపుల వ్యవస్థ వాణిజ్య కార్యకలాపాలను పునర్నిర్మించడమే కాదు..కోట్లాది మంది ప్రజలను సంప్రదాయక ఆర్థిక వ్యవస్థ నుంచి బయటపడేసింది. కేంద్ర ప్రభుత్వం ద్రుడమైన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో దీన్ని రూపొందించింది. ఇది రోజువారీ జీవితాన్ని సౌకర్యవంతం చేసింది. రుణాలు, పొదుపు వంటి బ్యాంకింగ్ సేవలను మరింతగా విస్తరింపజేసింది. కోట్లాది మంది భారతీయులకు ప్రభుత్వ కార్యక్రమాలను మరింతగా అందుబాటులోకి తీసుకువచ్చింది. పన్నుల సేకరణ కూడా సులభతరం చేసిందనడంలో సందేహం లేదు. ప్రధాని నరేంద్రమోదీ జీ 20 ఆర్థిక మంత్రులతో ముచ్చటిస్తున్నప్పుడు వారితో మాట్లాడుతూ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పాలనను మౌలికంగానే మార్చేసిందని చెప్పారు.

డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను అతి తక్కువ ఖర్చుతో ఏర్పరచిన సాంకేతిక ఆవిష్కరణగా చూడవచ్చు. దీంతో మునుపు ెన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిలో అభివ్రుద్ది చెందిన దేశాలను సైతం ఎలా ప్రభావితం చేయవచ్చో అన్నది భారత్ నిరూపించింది. ఇది ఎలాంటి పబ్లిక్ ప్రైవేట్ మోడల్అంటే..ప్రపంచంలోకెల్లా నిరుపేద దేశాలను కూడా పైకి లేపేటువంటి ఆలోచనల ఇంక్యూబేటర్ గా భారత్ ఎగమతి చేయాలనుకుంటున్న మోడల్ గా నిలిచిపోతుంది. భారత్ ప్రారంభించిన ఈ గొప్ప ఆవిష్కరణ కేంద్రభాగంలో జేఏఎమ్ త్రయం ఉన్నాయ. జనధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ ఈ మూడు మూల స్థంబాలు భారత ఆర్థిక పర్యావరణ వ్యవస్థను సమూలంగా విప్లవీకరించాయంటున్నారు నిపుణులు. మొదటిది ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన జన్ ధన్ యోజనా ప్రతీ వయోజన భారతీయుడికి ఒక బ్యాంక్ ఖాతాను గ్యారంటీగా పైసా ఖర్చు లేకుండా అందిస్తుంది. 2022 నాటికే ఈ పథకం కింద 46.25 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరిచారు. వీటిలో 56శాతం మహిళల ఖాతాలు కాగా 67శాతం ఖాతాలు గ్రామీణ, అర్ద పట్టణ ప్రాంతాల్లో తెరిచారు.

ఈ ఖాతాలో లక్షా 73వేల 954 కోట్లు జమ అయ్యాయి. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో పథకం ఆధార్ పరివ్తిత ఐడెంటిటీ సేవలని చెప్పుకోవచ్చు. ఆధార్ ఐడీని రెండు అంశాల ప్రామాణికరణ లేదా బయోమెట్రిక్ విధానంలో ఉపయోగించుకోవచ్చు ఆధార్ ప్రామాణీకరణ బ్యాంకులు, టెల్కో వంటి సంస్థలకు మూలాధారంగా మారింది. ఈ రోజు దేశంలోని 99శాతం వయోజనులు బయోమెట్రిక్ గుర్తింపు నెంబర్ ను సొంతం చేసుకున్నారు. ఇంతవరకు 1.3 బిలియన్ ఐడీలు జారీ అయ్యాయి. ఈ ఐడీలు బ్యాంక్ ఖాతాల రూపకల్పనను సరళతరం చేసి, సత్వర చెల్లింపుల వ్యవస్థకు పునాదిగా మారాయి. ఇకపోతే మూడవ అతి ముఖ్యమైన మాద్యమం మొబైల్.. ఇది భారతీయ టెలికాం రంగంలో కీలకమైన డిజిటల్ ఆవిష్కరణ.

2016లో రిలయెన్స్ జియో టెలికాం రంగంలోకి దూసుకొచ్చిన తరువాత డేటా ఖర్చులు 95 శాతం వరకు పడిపోయాయి. ప్రతీ భారతీయుడికి ఇంటర్నెట్ అతి తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చింది. ఈ కామర్స్, ఫుడ్ డెలివరీ, ఓటీటీ కంటెంట్ లాంటి సమాంతర వ్యవస్థలకు ప్రాణం పోసింది. ఇంకా ముఖ్యమైన విషయం మేరకు అత్యంత మారుమూల ప్రాంతంలోని చిట్ట చివరి వ్యక్తికి కూడా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది జనవరిలో రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయి. ఈ రోజు అన్ని రకాల చెల్లింపుల్లో 40 శాతం చెల్లింపులు డిజిటల్ గా జరుగుతున్నాయి. గత సంవత్సరం దేశంలో జరిగిన డిజిటల్ లావాదేవీల విలువ అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల మొత్తం డిజిటల్ లావాదేవీల కంటే ఎక్కువని కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. దేశంలోని 30కోట్ల మంది వర్తకులు యూపీఐని ఉపయోగిస్తున్నారు. అత్యంత చిన్న చిన్న లావాదేవీలను కూడా డిజిటల్ చెల్లింపులతోనే చేస్తున్నారు. 10 రూ.ల విలువ చేసే కప్పు టీ నుంచి 200 రూ.లు విలువ చేసే కూరగాయల దాకా అన్నీ డిజిటల్ విధానంలోనే జరుగుతున్నాయి.

పెద్ద నోట్ల రద్దు, కోవిడ్ మహమ్మారి కాలంలో సామాజిక దూరం పాటించడం వంటివి కూడా డిజిటల్ పేమెంట్ వ్యవస్థను మరింతగా ముందుకు నెట్టాయి. టీ స్టాల్ నుంచి పెద్ద పెద్ద మాల్స్ వద్ద కూడా అమర్చిన పేమెంట్ యాప్స్ ద్వారా అందించిన చిన్న వాయిస్ బాక్సుల వంటి ఆసక్తికరమైన ఆవిష్కరణల్లో కూడా వీటి విజయం దాగి ఉంది. వీటి ద్వారా ప్రతీ చిన్న లావాదేవీ తరువాత అమ్మకం దారులు ఫోన్ మెసెజ్ లు తనిఖీ చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు. క్యూ ఆర్ కోడ్ ద్వారా ప్రతీ పేమెంట్ ద్వారా తక్షనం అందుకునే డబ్బు ఎంత ఉంటుందో అది ఓ వాయిస్ మెసెజ్ ద్వారా బయటకు వినిపిస్తుంది. దాంతో నగదు లావాదేవీలను దీర్ఘకాలంగా ఉపయోగిస్తున్న వర్తకులలో ఏర్పడే అవిశ్వాసాన్ని తొలగించడంలో ఇది సాయపడుతుంది.

గతంలో భారతదేశంలో 120 డాలర్ల సబ్ ఫోన్లకు మార్కెట్ వాటా రెండేళ్లకు ముందు 41శాతం ఉండగా, 2022లో అది 26శాతం పడిపోయింది. ఇదే కాలానికి 30 వేల రూ.లకు పైబడి ధర కలిగిన ప్రీమియం ఫోన్ల వాటా రెట్టింపై 11శాతానికి చేరుకుంది. ఫోన్ల కోసం రుణాల వంటి ఫైనాన్స్ ప్రోడక్ట్ అవిష్కరణలు ప్రీమియం ఫోన్లను చిన్న చిన్న పట్టణాలలోని సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆధార్ ప్రామాణికత మొబైల్ ఇంటర్నెట్ ఉపయోగంపై ఆధారపడిన సమీక్రుత ఆర్థిక వ్యవస్థ కారణంగా ఇది సాధ్యమైంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవన్నీ మన దేశంలో వ్యాపారాలను, ఎంటర్ ప్రెన్యూయర్ షిప్ ని, వినియోగ నమూనాలను విప్లవీకరించి భారతీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను గేమ్ చేంజర్ గా మార్చాయి. ఇప్పుడు భారత్ దేశంలోనే కాకుండా సమీప దేశాలలో సైతం మన యూపీఐ విధానం పనిచేసేలా చేయడంతో భారతీయులు ఆ దేశాలలో పర్యటించేవారికి చెల్లింపులు సులభతరం అయ్యాయి. మొత్తానికి డిజిటల్ పేమెంట్ సిస్టం మన దేశంలోనే కాకుండా ప్రపంచానికే స్పూర్తిగా నిలిపాయి.. అందులో సందేహం లేదు..

Must Read

spot_img