భూమిపై మామూలు టెలిస్కోపుల కాలం నుంచి ఇప్పుడు అంతరిక్షంలో హాబుల్ టెలిస్కోప్ కాలంలోకి వచ్చాం..ఇప్పుడు అంతరిక్షంలోనే మరింత దూరంలో ఉండే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపులో బిలియన్ల కొద్దీ సంవత్సరాల క్రితం ఏం జరిగిందో చూడగలుతుతున్నాం..తాజాగా జేమ్స్ వెబ్ టెలిస్కోపును కూడా తలదన్నేలా మరో కొత్త టెలిస్కోప్ అసెంబ్లింగ్ మొదలుపెట్టింది నాసా. దీనిపేరే నాన్సీ రోమన్ టెలిస్కోప్.
ఒక మాట జాగ్రత్తగా వినండి.. ఇది జేమ్స్ వెబ్ కన్నా వంద రెట్లు నాణ్యతతో పనిచేస్తుంది. ఈ మాట మామూలు మాట కాదు..చాలా పవర్ ఫుల్ మాటగానే చెప్పుకోవాలి. అసలు హాబుల్ టెలిస్కోప్ కన్నా జేమ్స్ వెబ్ చాలా పవర్ ఫుల్ అనుకుంటే దానికన్నా అత్యంత శక్తివంతమైనది నాన్సీ రోమన్ టెలిస్కోప్. దీని వివరాలు తెలుసుకునే ముందు కొన్ని విషయాలు పునశ్చరణ చేసుకోవాలి.

అదేమిటంటే మనం ఇప్పుడు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ లాంచ్ అయిన తరువాత వస్తున్న ఫలితాలను అనుభవిస్తున్నాం.. ఫిజిక్స్ సూత్రాలను తారుమారు చేసే విషయాలెన్నో జేమ్స్ వెబ్ బయటపెడుతోంది. జేమ్స్ వెబ్ ఇప్పుడు ఫుల్ సైంటిఫిక్ ఆపరేషన్ మోడ్ లో పనిచేస్తోంది.
చాలా కొత్త విషయాలను శాస్త్రవేత్తలకు అందించి వారికి చేతినిండా పని కల్పించింది. ఇదిలా ఉంటే శాస్త్రవేత్తలు మరో కొత్తది జేమ్స్ వెబ్ కన్నా మెరుగైనదాని కోసం ప్లాన్ చేస్తున్నారు.
అదో మేజర్ లాంచ్ అని చెప్పుకోవచ్చు. మనం ముందు చెప్పుకున్నట్టు నాసా ఆ పనిలోనే ఉంది. ఆ కొత్త స్పేస్ టెలిస్కోప్ కూడా జేమ్స్ వెబ్ మాదిరగానే లాంగ్రాంజ్ కక్షలోనే ఉండబోతోంది. అంటే 15 లక్షల కి.మీల దూరపు కక్షలో ఉంటూ జేమ్స్ వెబ్ చూడని దూరాలను కూడా చూసి మనకు ఆ వివరాలను అందించనుంది.
ఆ కొత్త స్పేస్ టెలిస్కోపు పేరే ‘నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్’..షార్ట్ గా ‘నాన్సీ రోమన్ టెలిస్కోప్’ అని అంటున్నారు. ఇది జేమ్స్ వెబ్ కు కనిపించని ఎక్సో ప్లానెట్ గ్రహాలపై ఏం జరుగుతుందో కూడా చూడగలుగుతుంది.
సోలార్ ఫ్యామిలీ జనన రహస్యాలను చూడగలుగుతుంది. ఈ టెలిస్కోప్ కు నాన్సీ అని పెరు పెట్టడం వెనుక ఓ స్టోరీ ఉంది. నాన్సీ అనే మహిళ 1960 నుంచి1970 కాలంలో నాసాలో చీఫ్ ఆఫ్ ఆస్ట్రోనమీగా పనిచేసారు. స్పేస్ ఎక్స్ ప్లోరేషన్ విషయంలో మహిళలు అంతగా ఆసక్తి చూపని కాలంలో ఆమె అంతరిక్షంపై మక్కువ పెంచుకున్నారు. అందులోనూ ఆమె టెలిస్కోప్ సంబంధిత విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపించేవారు.
నిజానికి ఆమె ప్రోద్బలం వల్లనే నాసా… ‘హాబుల్ స్పేస్ టెలిస్కోప్’ గురించి సెనెట్ ముందు ప్రతిపాదించడం జరిగింది. భూమిపై ఏర్పాటు చేసిన అతిపెద్ద టెలిస్కోపులకు భూమిని ఆవిరించుకుని ఉండే వాతావరణం అడ్డంకిగా ఉండేది. పరిశోధనలలో స్పష్టత లోపించడం జరిగేది. అందుకే ఏ అడ్డూ లేని అంతరిక్షంలో ఓ టెలిస్కోపు ఉండటం వల్ల ఆ సమస్య ఉండదని నాన్సీ ప్రయత్నించారు..దానికి అమెరికా ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
అందుకే ఇప్పటికీ అంతరిక్షంలో పనిచేస్తున్న హాబుల్ టెలిస్కోప్ కు ఆమెను తల్లిగా చెబుతారు. మదర్ ఆఫ్ హాబుల్ అని నాన్సీని సంబోదిస్తారు. అయితే జేమ్స్ వెబ్ గానీ ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించిన నాన్సీ రోమన్ టెలిస్కోప్ కానీ..అవన్నీ నేటి తరం వైజ్నానికులు తలపెట్టిన ప్రాజెక్టులు మాత్రమే. వాటి క్రెడిట్ మాడర్న్ జనరేషన్ సైంటిస్టులకే దక్కుతుంది. ఆమె గౌరవార్తం మాత్రమే ప్రస్తుతం జేమ్స్ వెబ్ తరువాతి స్పేస్ టెలిస్కోప్ కు ఆమె పేరు పెట్టడం జరిగింది.
నాన్సీ రోమన్ టెలిస్కోపులో జేమ్స్ వెబ్ లో లేని కొత్త పరికరాలను బిగించడం జరిగింది. వాటి వల్ల అనవసరపు కాంతిని తగ్గించి ఎక్సో ప్లానెట్లను కూడా గమనించేందుకు వీలుగా ఉంటుంది. అంతే కాదు నాన్సీ టెలిస్కోప్ ప్రయోగం పూర్తయితే సదరు ఎక్సో ప్లానెట్ పై బుద్దిజీవులు ఆడుకునే ఆటల్ని కూడా స్పష్టంగా చూసే అవకాశం ఉంటుందని అంటున్నారు. అంటే నిజంగా బుద్దిజీవులున్నారని ఇప్పటివరకైతే ఎటువంటి శాస్త్రీయ ఆధారాలైతే లేవు.
- టెలిస్కోప్ ప్రయోగాన్ని నాసా కాకుండా ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రయోగించనుంది..
ఒక వేళ ఉంటే మాత్రం వారిని స్పష్టంగా గమనించేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. ఈ టెలిస్కోప్ ప్రయోగాన్ని నాసా కాకుండా ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రయోగించనుంది. ఆ కాంట్రాక్టును స్పేస్ ఎక్స్ కే అప్పజెప్పింది నాసా. ఎందుకంటే ఇంతకు ముందు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపును స్పేస్ ఎక్స్ కంపెనీ భద్రంగా సురక్షితంగా ప్రయోగించడం జరిగింది.
ఆ అనుభవం వల్లనే స్పేస్ ఎక్స్ రాకెట్లతోనే నాన్సీ రోమన్ టెలిస్కోప్ పంపించబోతున్నారు. అందుకు ఇందుకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. బహుషా అన్నీ అనుకున్నట్టు జరిగితే 2026 లేదా 2027లో నాన్సీ రోమన్ నింగిలోకి దూసుకుపోతుంది. జేమ్స్ వెబ్ ఉన్న లాంగ్రాంజ్ కక్షలోనే నాన్సీ స్పేస్ టెలిస్కోప్ స్థిరకక్షలో ఉండిపోతుంది. నాసా ఈ కక్షనే ఎంచుకోవడం వెనుక ఓ కారణం ఉంది.
అంతరిక్షంలో సూర్యుడి వెలుగు టెలిస్కోపు వీక్షణానికి అంతరాయం కలిగించే అవకాశం ఉంటుంది. అంత ప్రకాశంలో సుదూర తీరాల నుంచి వచ్చే కాంతి బోసిపోతుంది. అందుకే ఏ ఆటంకం లేని కక్ష దీని కొసం ఎంచుకోవడం జరిగింది. సూర్యుడు భూమి ఒకేవరుసలో ఉండే స్థిరకక్ష..అంటే టెలిస్కోపుకు సూర్యకాంతి నుంచి భూమి అడ్డుపడేలా చూసారు. అందువల్ల ఏ అడ్డంకులూ లేని విధంగా పనిచేసే చోటును ఎంచుకున్నారు.
హాబుల్ టెలిస్కోప్ లో ఉండే సైజులోనే నాన్సీ రోమన్ టెలిస్కోపులో అద్దం ఉండబోతోంది. అయితే హాబుల్ మాదరిగా కాకుండా ఇందులో వైడర్ ఫీల్డ్ వ్యూ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇది చూసే పరిధి విశాలంగా ఉంటుందన్న మాట. చాలా పెద్ద కెమెరాలు ఇందులో ఉంటాయి. తాను చూసే ప్రతీ విషయాన్ని ఈ కెమరాలు రికార్డు చేయడం భూమికి పంపించడం జరిగిపోతుంది. హబుల్ కన్నా వందల రెట్ల స్పష్టత నాన్సీలో ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద కెమెరాలు ఇందులో అమర్చబోతున్నారు. ఒక్కో పరికరాన్ని అసెంబుల్ చేయడం నాసాలో ఇప్పటికే మొదలైంది.
ఈ ప్రాజెక్టు కాల వ్యవధి ప్రయోగించి పనిచేసిన కాలం నుంచి 5 సంవత్సరాలని అనుకుంటున్నారు. ఈ కాల వ్యవధిలో 15 వందల ఎక్సో ప్లానెట్లను పరిశీలించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అది ఎక్కువ కూడా కావచ్చు..హాబుల్ పనిచేసినట్టుగా మరింత ఎక్కువ కాలం కూడా పనిచేయవచ్చు. సరికొత్త గ్రావిటేషనల్ మైక్రోలెన్సింగ్ విధానంలో నాన్సీ రోమన్ పనిచేయనుంది. దీనివల్ల అదనంగా మరెన్నో విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఆ వివరాలు పోను పోను మనకు తెలియనున్నాయి. ముఖ్యంగా సౌరకుటుంబం ఆవిర్భావం గురించి వినూత్న టెక్నాలజీగా చెబుతున్న మైక్రోలెన్సింగ్ ద్వారా స్పష్టంగా తెలిసిపోనుంది. విశ్వం ఎంత విశాలమైనదో ఇంకా మనకు తెలియదు..కొంత మేరకే మనకు తెలుసు..ఆ కొంత ఎంతంటే ఎడారిలో ఇసుకరేణువంత అంటే అతిశయోక్తి కాదు..ఇప్పటివరకు మనం అబ్జర్వెబుల్ స్పేస్ గురించి మాత్రమే తెలుసుకున్నాం. తెలియాల్సింది ఇంకా చాలా ఉంది.
ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీల ఆవిర్భావం జరుగుతూనే ఉంది. తరాలు మారినకొద్దీ మరిన్ని కొత్త విశేషాలు తెలుస్తూనే ఉన్నాయి. ఇంకా ఎంతో తెలుసుకోవాల్సినవి కూడా మిగిలే ఉన్నాయి. నాన్సీ రోమన్ స్పేస్ టెలిస్కోప్ ప్రయోగం తరువాత ఇటు నాసాకు అటు ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ కు మంచి పేరు రానుంది.