Homeసినిమాసంక్రాంతికి నలుగురు స్టార్ హీరోలు అమి తుమీ తేల్చుకోనున్నారు..

సంక్రాంతికి నలుగురు స్టార్ హీరోలు అమి తుమీ తేల్చుకోనున్నారు..

బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రంతో పాటు మెగాస్టార్ చిరంజీవీ నటించి వాల్తేరు వీరయ్య చిత్రాలు విడుదల కానున్నాయి. ఇక వీరితోపాటు.. డబ్బింగ్ సినిమాలు అయిన వారసుడు, తునిపు సినిమాలు తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి. దీంతో థియెట్రికల్ బిజినెస్ భారీగా జరిగింది.

2023 సంక్రాంతి సౌత్ హిస్టరీలో చాలా స్పెషల్ గా నిలవబోతున్నట్లు అర్థమవుతోంది. ఎందుకంటే ఒకవైపు తమిళంలో అగ్ర హీరోల మధ్య పోటీ జరుగుతుండగా…మరొకవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుంది అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఒక విధంగా అభిమానుల మధ్య కూడా తీవ్రమైన పోటీ అయితే కనిపిస్తూ ఉంటుంది.

సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలలో ఏ సినిమా ఎంత థియేటర్ బిజినెస్ చేసింది. ముందుగా విజయ్ వారసుడు సినిమా తెలుగు, తమిళంలో విడుదలవుతుంది. ముందుగా తమిళంలో అయితే జనవరి 11వ తేదీన విడుదల చేస్తున్నారు. ఇక తెలుగులో జనవరి 14 విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల వరకు బిజినెస్ అయితే చేసింది. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

జనవరి 13న రానున్న ఈ మాస్ కమర్షియల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 90 కోట్ల పైగా కలెక్షన్స్ అందుకుంటేనే టార్గెట్ పూర్తి చేసినట్లు లెక్కఇక అజిత్ నటించిన తునివు సినిమా కూడా రెండు భాషల్లో విడుదలవుతున్న విషయం తెలిసింది. ఈ సినిమా ప్రపంచం మొత్తంగా 85 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇక ఈ పండుగ సీజన్లో అయితే మాస్ ఆడియన్స్ ఫోకస్ ఎక్కువగా వీరసింహారెడ్డి సినిమా పైనే ఉంది.

నందమూరి బాలకృష్ణ మార్కెట్ కు తగ్గట్టుగా ఈ సినిమా 72 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. కాబట్టి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆ టార్గెట్ ను ఈజీగా పూర్తి చేస్తుంది అని చెప్పవచ్చు. తెలుగులో ఎక్కువగా బాలయ్య సినిమాపై అంచనాలు పెరుగగా.. తమిళ్ లో అజిత్ సినిమాపై బజ్ పెరిగింది. మరి ఈ నాలుగు సినిమాల్లో ఏది ఎక్కువ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

Must Read

spot_img