Homeఅంతర్జాతీయంఫిన్లాండ్ అధికారికంగా NATOలో చేరింది...

ఫిన్లాండ్ అధికారికంగా NATOలో చేరింది…

నాటో సైనిక కూటమి ఎందుకు ఏర్పడింది..? ఆ కూటమి లక్ష్యం ఏంటి…? ఇందులో ప్రస్తుతం ఎన్ని దేశాలకు సభ్యత్వం ఉంది.. తాజాగా ఫిన్లాండ్ నాటోలో ఎందుకు చేరింది..? నాటో కూటమి కారణంగా రష్యా ఎందుకు ఆందోళన చెందుతోంది…?

ఐరోపా సమాఖ్యలోని కీలక దేశం ఫిన్లాండ్‌..

నాటో సైనిక కూటమిలో 31వ సభ్య దేశంగా అధికారికంగా చేరింది.. ఇందుకు సంబంధించిన చేరిక పత్రాలను ఆ దేశ విదేశాంగ మంత్రి పెక్కా హావిస్టో అమెరికా విదేశాంగ మంత్రి అంటోనీ బ్లింకెన్‌కు అందజేశారు. అంతకు ముందు ఫిన్లాండ్‌ చేరికను బ్లింకెన్‌ ప్రకటించారు. నాటో సభ్యత్వానికి సంబంధించిన పత్రాలను అమెరికా విదేశాంగ శాఖ భద్రపరుస్తుంటుంది. నాటోలో ఫిన్లాండ్‌ చేరేందుకు చివరగా అమోదం తెలిపిన దేశంగా తుర్కియే నిలిచింది. ఇక నాటోలో చేరిక కోసం స్వీడన్‌ చేసిన దరఖాస్తు ఇంకా పెండింగులో ఉంది. తాజా పరిణామం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ఎదురుదెబ్బేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రష్యాతో ఫిన్లాండ్‌కు 1,340 కి.మీ. సరిహద్దు కలిగి ఉండటమే అందుకు కారణం. ఈ సరిహద్దు ఇప్పుడు నాటోకు అందుబాటులోకి రావడం రష్యా భద్రతకు పెనుసవాలుగా మారనుంది. ఈ నేపథ్యంలో ఫిన్లాండ్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ తెలిపారు. నాటో విస్తరణ మా దేశ భద్రత, ప్రయోజనాల ఉల్లంఘనేనని అభివర్ణించారు. అంతేకాకుండా తాజా చర్య తాము ప్రతీకార చర్యలు తీసుకునేలా పురిగొల్పుతోందని పేర్కొన్నారు. ఫిన్లాండ్‌లోకి ఎటువంటి అదనపు బలగాలు లేదా పరికరాలనైనా నాటో పంపితే ఆ దేశ సరిహద్దుల్లో తమ బలగాలను బలోపేతం చేస్తామని హెచ్చరించారు. అయితే ఫిన్లాండ్‌తో తమకు ఎటువంటి ప్రాదేశిక తగాదాలు లేవని స్పష్టం చేశారు.

ఫిన్లాండ్‌ నాటోలో చేరడంతో ఆ దేశం సురక్షితంగా మారిందని, కూటమి బలోపేతమైందని నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ పేర్కొన్నారు. ”ఉక్రెయిన్‌పై సైనిక చర్యతో తమ దేశంతో నాటో సరిహద్దు కనిష్ఠమవుతుందని, ఐరోపాలో కొత్త సభ్యత్వాలు ఉండబోవని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పేర్కొన్న దానికి ఇప్పుడు పూర్తి భిన్నంగా జరిగింది” అని వివరించారు. అయితే తమ కూటమితో మాస్కోకు ఎటువంటి ముప్పు ఉండబోదని తెలిపారు. ఫిన్లాండ్‌ కోరితే తప్ప ఆ దేశానికి అదనపు బలగాలను పంపబోమని స్పష్టం చేశారు. ఫిన్లాండ్‌ ఇప్పుడు నాటో ఇనుప కవచపు భద్రత హామీలో ఉందన్నారు.

ఇదిలా ఉండగా తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ అభ్యంతరంతో స్వీడన్‌కు నాటో సభ్యత్వం నిలిచిపోయింది.

కుర్దిష్‌ ఉగ్రవాదులకు మద్దతు పలుకుతూ..వారు తమ వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించుకోవడానికి స్వీడన్‌ అనుమతిస్తుండటంపై ఎర్డోగన్‌ గుర్రుగా ఉన్నారు. హంగరీ కూడా స్వీడన్‌ సభ్యత్వానికి ఆమోదం పలకాల్సి ఉంది. ఇదిలా ఉండగా తదుపరి నాటో సభ్య దేశంగా స్వీడన్‌ మారనుందని స్టోలెన్‌బర్గ్‌ పేర్కొన్నారు. జులైలో జరిగే నాటో సదస్సులో స్వీడన్‌ సభ్య దేశంగా మారనుందని నాటో అమెరికా రాయబారి జూలియనే స్మిత్‌ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.

వాస్తవానికి ఫిన్లాండ్‌, స్వీడన్‌ తటస్థ విధానానికి కట్టుబడి ఉన్నాయి. అంటే ఈ దేశాలు ఎటువంటి కూటముల్లోను చేరబోవు. అయితే ఉక్రెయిన్‌ రష్యా సైనిక చర్య నేపథ్యంలో ఆ దేశాలు తమ విధానాన్ని మార్చుకున్నాయి. తమ దేశ భద్రతకు ఎదురయ్యే సవాళ్లను తప్పించుకునేందుకు నాటోలో చేరడమే పరిష్కారమని భావించాయి. ఈ క్రమంలో సభ్యత్వానికి దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం ఫిన్లాండ్‌కు సభ్యత్వం దక్కింది. త్వరలోనే స్వీడన్‌ నాటో సభ్య దేశంగా మారే అవకాశం ఉంది.

తాజా పరిణామాల నేపథ్యంలో తమ పార్లమెంట్‌ వెబ్‌సైట్‌ దాడికి గురైందని పార్లమెంట్‌ వర్గాలు వెల్లడించాయి. దీంతో సైట్‌ సరిగా పనిచేయడం లేదని తెలిపింది. దీనికి తమదే బాధ్యతని రష్యా అనుకూల హ్యాకర్‌ గ్రూపు ప్రకటించుకుంది. ఫిన్లాండ్‌ నాటోలో చేరినందుకే ఈ చర్యకు పాల్పడ్డామని వెల్లడించింది.

నాటో సైనిక కూటమిలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్‌ చేరింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యాతో సుదీర్ఘ సరిహద్దు కలిగిన ఫిన్లాండ్‌ నాటో కూటమిలో చేరడం కీలక పరిణామమని పరిశీలకులు భావిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో సోవియెట్‌ చేతుల్లో ఓటమి తర్వాత ఫిన్లాండ్‌ ఏ సైనిక కూటమిలోనూ చేరకుండా తటస్థ వైఖరితో వ్యవహరిస్తున్నది. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత రష్యాతో తమకు కూడా ముప్పు ఉండొచ్చని ఫిన్లాండ్‌ భావించింది. తన వైఖరి మార్చుకొని నాటో కూటమిలో చేరేందుకు నిర్ణయించుకొని గత మే నెలలో దరఖాస్తు చేసుకుంది. నాటోలో ఫిన్లాండ్‌ చేరడంపై రష్యా ఘాటుగా స్పందించింది. దీనిని తమ దేశ భద్రతపై దాడిగా భావిస్తున్నట్టు ప్రకటించింది. ఈ పరిణామం తమ భద్రతకు ఏర్పడతున్న ముప్పును ఎదుర్కొనేందుకు ప్రతీకార చర్యలకు పాల్పడేటట్టు చేస్తున్నదని పేర్కొంది.

ఫిన్లాండ్‌కు నాటో అదనపు దళాలు లేదా యుద్ధ సామాగ్రిని పంపితే తామూ ఫిన్లాండ్‌ సరిహద్దుల్లో సైనిక బలగాలను పెంచుతామని మాస్కో హెచ్చరించింది. కాగా, ఫిన్లాండ్‌ పార్లమెంటు వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయ్యింది. నాటోలో ఫిన్లాండ్‌ చేరినందునే హ్యాక్‌ చేశామని ఓ రష్యా అనుకూల హ్యాకింగ్‌ గ్రూప్‌ ప్రకటించింది.
ఫిన్లాండ్‌ నాటో కూటమిలో చేరడం రష్యాకు భారీ ఎదురుదెబ్బ. తమ సరిహద్దులకు నాటో విస్తరిస్తుండటాన్ని రష్యా మొదటి నుంచి ఆక్షేపిస్తున్నది. ఉక్రెయిన్‌పై దాడికి కూడా ఇదే కారణాన్ని చూపించింది. ఇప్పుడు నాటో కూటమిలో ఫిన్లాండ్‌ చేరికతో రష్యాతో నాటో కూటమికి ఉన్న సరిహద్దు దాదాపుగా రెట్టింపు అయ్యింది. రష్యాతో ఫిన్లాండ్‌కు 1,340 కిలోమీటర్ల సరిహద్దు ఉంది..

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా 12 దేశాలతో ఏర్పాటైన సైనిక కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ – నాటో.

ఈ సంస్థ 1949 ఏప్రిల్ 4 న సంతకం చేసిన ఉత్తర అట్లాంటిక్ ఒప్పందాన్ని అమలు చేస్తుంది… నాటో, తన సభ్య దేశాలకు ఒక సామూహిక భద్రతా వ్యవస్థను ఏర్పరుస్తుంది. దాని సభ్య దేశాలపై ఏదైనా బయటి దేశం దాడి చేస్తే దానికి ప్రతిస్పందనగా పరస్పర రక్షణకు సభ్యదేశాలు కట్టుబడి ఉంటాయి. నాటో ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో ఉంది. అయితే మిత్రరాజ్యాల కమాండ్ ఆపరేషన్స్ ప్రధాన కార్యాలయం బెల్జియంలోని మోన్స్ సమీపంలో ఉంది.

నాటోను స్థాపించిన సమయంలో సభ్యదేశాల సంఖ్య 12 ఉండేది. తదనంతరం కొత్త సభ్య దేశాల ప్రవేశంతో 31కి పెరిగింది. దీని లక్ష్యం వాస్తవంగా.. రెండో ప్రపంచ యుద్ధానంతరం యూరప్‌లో సోవియట్ రష్యా విస్తరణ ముప్పును అడ్డుకోవటం.

నాటో ఏర్పాటుకు ప్రతిస్పందనగా సోవియట్ రష్యా 1955లో తూర్పు యూరప్ కమ్యూనిస్టు దేశాలతో వార్సా ఒప్పందం చేసుకోవటం ద్వారా తన సొంత సైనిక కూటమిని ఏర్పాటు చేసింది.

1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలటంతో.. వార్సా ఒప్పందం సభ్య దేశాలు చాలా వరకూ నాటో సభ్య దేశాలయ్యాయి. నాటోలో తాజాగా ఫిన్లాండ్ చేరింది.. తాజాగా ఫిన్లాండ్ చేరికతో నాటో సభ్య దేశాల సంఖ్య 31కి పెరిగింది. నాటో ప్రస్తుతం బోస్నియా హెర్జెగోవినా, జార్జియా, ఉక్రెయిన్‌ లను ఔత్సాహిక సభ్యులుగా గుర్తిస్తోంది. అదనంగా 20 దేశాలు నాటో శాంతి భాగస్వామ్య కార్యక్రమంలో పాల్గొంటాయి. మరో 15 దేశాలు సంస్థాగత సంభాషణ కార్యక్రమాలలో పాల్గొంటాయి. 2020లో నాటో సభ్యులందరి సంయుక్త సైనిక వ్యయం ప్రపంచ మొత్తం వ్యయంలో 57% పైగా ఉంది. 2024 నాటికి తమ జీడీపీలో కనీసం 2% మొత్తాన్ని రక్షణ కోసం కేటాయించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం తమ లక్ష్యమని సభ్యులు అంగీకరించారు.. అదనపు 20 దేశాలు మరో 15 సంస్థాగత సంభాషణ కార్యక్రమాలలో పాలుపంచుకున్న దేశాలూ నాటో శాంతి భాగస్వామ్య కార్యక్రమంలో పాల్గొంటాయి.

ఒకవైపు ప్రస్తుత రష్యా, మరోవైపు యూరోపియన్ యూనియన్‌ సరిహద్దులుగా ఉన్న యుక్రెయిన్.. గతంలో సోవియట్ రిపబ్లిక్‌గా ఉండేది.

ఇది నాటో సభ్య దేశం కాదు కానీ ‘భాగస్వామ్య దేశం’గా ఉంది. అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ దేశానికి నాటో సభ్యత్వం ఇవ్వవచ్చుననే అవగాహన కుదిరింది.

ఇది ఎన్నటికీ జరగదని శక్తిమంతమైన పశ్చిమ దేశాలు హామీలు ఇవ్వాలని రష్యా కోరుతోంది.

కానీ నాటో నుంచి యుక్రెయిన్‌ను నిషేధించటానికి అమెరికా తిరస్కరిస్తోంది. ఒక స్వతంత్ర దేశంగా తన రక్షణ పొత్తుల గురించి తానే నిర్ణయించుకునే స్వేచ్ఛ యుక్రెయిన్‌కు ఉండాలని అంటోంది.

యుక్రెయిన్‌లో రష్యా సంతతి జనాభా పెద్ద సంఖ్యలో ఉంది. రష్యాతో సన్నిహిత సామాజిక, సాంస్కృతిక సంబంధాలూ ఉన్నాయి. వ్యూహాత్మకంగా చూసినపుడు.. యుక్రెయిన్‌ను రష్యా తన ఇంటి వెనుక దొడ్డిగా పరిగణిస్తుంది. రష్యాను చుట్టుముట్టటానికి పశ్చిమ శక్తులు నాటో కూటమిని వాడుకుంటున్నాయని పుతిన్ వాదిస్తున్నారు. తూర్పు యూరప్‌లో నాటో సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని కోరుతున్నారు పుతిన్.. నాటో తూర్పు దిశగా విస్తరించబోదంటూ అమెరికా 1990లో స్వయంగా ఇచ్చిన హామీని ఉల్లంఘించిందని పుతిన్ చాలా కాలంగా వాదిస్తున్నారు.

రష్యా వాదనను నాటో తిరస్కరిస్తోంది. తన సభ్య దేశాల్లో అతి కొద్ది దేశాలకు మాత్రమే రష్యాతో సరిహద్దులు ఉన్నాయని, అసలు తమది స్వీయ రక్షణ కోసం ఏర్పాటైన కూటమి అని వాదిస్తోంది.

యుక్రెయిన్ ప్రజలు 2014లో రష్యాకు అనుకూలంగా ఉన్న తమ అధ్యక్షుడిని గద్దె దించినపుడు.. యుక్రెయిన్‌ తూర్పు భాగంలోని క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా తనలో కలిపేసుకుంది. తూర్పు యుక్రెయిన్‌లో చాలా భాగాన్ని ఆక్రమించుకున్న రష్యా అనుకూల వేర్పాటు వాదులకు కూడా మద్దతిచ్చింది.

నాటో జోక్యం చేసుకోలేదు కానీ.. దీనికి ప్రతిస్పందనగా తొలిసారిగా పలు తూర్పు యూరప్ దేశాల్లో సైనిక బలగాలను మోహరించింది.

ఎస్టోనియా, లాత్వియా, లితువేనియా, పోలండ్‌లలో నాలుగు బెటాలియన్ల బహుళజాతి సైన్యాలను మోహరించిన నాటో.. రొమేనియాలో ఒక బ్రిగేడ్‌ను మోహరించింది.

నాటో సభ్య దేశాల సరిహద్దులను ఉల్లంఘించే రష్యా విమానాలను అడ్డుకోవటానికి.. గగనతలంలో తన పోలీస్ గస్తీని బాల్టిక్ దేశాలకు, తూర్పు యూరప్‌కు విస్తరించింది. ఈ సైనిక బలగాలను ఆయా దేశాల నుంచి ఉపసంహరించాలని రష్యా డిమాండ్ చేస్తోంది.
తాజాగా, నాటో కూటమిలో 31వ సభ్యదేశంగా ఫిన్‌లాండ్ వచ్చి చేరింది. అమెరికా, ఫిన్‌లాండ్ విదేశాంగ మంత్రులు ఈ మేరకు అధికారిక పత్రాన్ని మార్చుకున్నారు. దీంతో నాటోలో ఫిన్‌లాండ్ అధికారికంగా చేరినట్లయింది. నాటో విస్తరణను మొదట్నుంచి వ్యతిరేకిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు తాజా పరిణామం ఎదురుదెబ్బగా తగిలినట్లయింది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా 12 దేశాలతో ఏర్పాటైన సైనిక కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ – నాటో. నాటో, తన సభ్య దేశాలకు ఒక సామూహిక భద్రతా వ్యవస్థను ఏర్పరుస్తుంది. దాని సభ్య దేశాలపై ఏదైనా బయటి దేశం దాడి చేస్తే.. దానికి ప్రతిస్పందనగా పరస్పర రక్షణకు సభ్యదేశాలు కట్టుబడి ఉంటాయి.

Must Read

spot_img