ఈ స్టేడియంలో ఇప్పటి వరకు ఎన్ని మ్యాచ్ లు జరిగాయి..?ఈ స్టేడియానికి ఉపయోగించిన ఉక్కును మరో ప్రధాన క్రీడకు ఉపయోగించవచ్చా…?
స్టేడియం 974 ప్రాజెక్ట్ పునర్వినియోగానికి ఎంత అర్హమైనది…? ఈ స్టేడియాన్ని ఎప్పుడు, ఎక్కడ తిరిగి ఉపయోగిస్తారు…? భవిష్యత్ ఎలా ఉండనుంది…?
974 స్టేడియాన్ని ఎక్కడికి తరలిస్తున్నారు..?
ప్రపంచకప్‌లో భాగంగా రెండు వారాల్లో ఈ స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు జరిగాయి. ఖతార్అం తర్జాతీయ టెలిఫోన్ కోడ్‌తో పాటు, ఈ స్టేడియం నిర్మాణంలో వాడిన షిప్పింగ్ కంటైనర్ల సంఖ్యను సూచించేలా దీనికి ‘‘స్టేడియం 974’’ అనే పేరును పెట్టారు. ప్రపంచకప్ టోర్నీ నిర్వహణ కోసం ఖతార్ 7 స్టేడియాలను కొత్తగా నిర్మించింది. మరో స్టేడియానికి అత్యాధునిక మెరుగులు అద్దింది. స్టేడియం 974 నిర్మాణంలో వాడిన ఉక్కును ఇదే పరిమాణంలో మరో వరల్డ్ కప్ కోసం లేదా మరో ప్రధాన క్రీడా ఈవెంట్ కోసం పునర్వినియోగించవచ్చు.
కార్బన్ న్యూట్రల్ వరల్డ్ కప్ నిర్వహణ కోసం తాము చేసిన ప్రతిజ్ఞలో భాగంగా ఈ స్టేడియాన్ని ‘‘సుస్థిరత దిశగా ధ్రువతార’’ అని ఖతార్ వర్ణించింది.
2వాయిస్: ఫుట్ బాల్ ప్రపంచకప్ నిర్వహణ కోసం కొత్తగా 7 స్టేడియాలతో పాటు ఒక కొత్త విమానాశ్రయాన్ని, మెట్రో వ్యవస్థను, రహదారులను, దాదాపు 100 కొత్త హోటళ్లను ఖతార్ నిర్మించింది. ఈ మౌలిక వసతుల నిర్మాణంలో పనిచేసిన వేలాదిమంది వలస కార్మికుల పట్ల ఖతార్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. దీనిపై తీవ్ర పరిశీలన జరిగింది.
స్టేడియం 974ను రాబోయే రోజుల్లో ఫ్యాషన్ షో, సంగీత కచేరీ వంటి కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. ఈ స్టేడియాన్ని ముక్కలుగా విడదీయడం, పునర్వినియోగం కోసం కచ్చితమైన సమయాన్ని ఇంకా నిర్ధారించలేదని ఖతార్ ఫుట్‌బాల్ కప్ నిర్వహణ కమిటీ అధికారి ప్రతినిధి వెల్లడించారు..
3వాయిస్: దోహా లోని తీరప్రాంత సమీపంలో 44,089 సీట్ల సామర్థ్యంతో ‘స్టేడియం 974’ను నిర్మించారు. ఉక్కు, షిప్పింగ్ కంటైనర్లను దీని నిర్మాణంలో వాడారు.
వరల్డ్ కప్ కోసం నిర్మించిన స్టేడియాల్లో ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ లేకుండా నిర్మించిన స్టేడియం ఇదొక్కటే. అందుకే కేవలం సాయంత్రం పూట మ్యాచ్‌లకు ఇది ఆతిథ్యమిచ్చింది. డిసెంబర్ 5న బ్రెజిల్, దక్షిణ కొరియా మధ్య జరిగిన ప్రిక్వార్టర్స్మ్యాచ్ ఈ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్.
ఇతర కొత్త స్టేడియాల నిర్మాణంతో పోలిస్తే 974 నిర్మాణంలో వాడిన షిప్పింగ్ కంటైనర్లు, రీసైక్లింగ్ చేసిన ఉక్కు వల్ల నిర్మాణ వ్యర్థాల ఉత్పత్తి, నిర్మాణ సమయం తగ్గింది. ఈవెంట్ తర్వాత భారంగా మారే నిర్మాణాలను నిరోధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఖతార్, ఫెన్విక్ ఇరిబారెన్ అర్కిటెక్ట్స్ సంస్థ డిజైనర్లు తెలిపారు..
ప్రపంచకప్ టోర్నీ ముగిశాక ఈ స్టేడియాలను అరుదుగా ఉపయోగిస్తుంటారు..!
కొన్ని సందర్భాల్లో వాటిని ఉపయోగించే అవసరం కూడా రాకపోవచ్చు. రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా ప్రపంచకప్ కోసం నిర్మించిన స్టేడియాల విషయంలో ఈ విషయం నిర్ధారితమైంది. ఇలా వివిధ భాగాలుగా విడదీయడానికి వీలున్న నిర్మాణాలను తిరిగి ఉపయోగించే విధానాన్ని విస్తృతంగా వినియోగంలోకి తెస్తే.. అభివృద్ధి చెందుతోన్న దేశాలు కూడా మెగా క్రీడా ఈవెంట్ల బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనే అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే ఆ దేశాలకు ఖర్చులు తగ్గుతాయి’’ అని పర్యావరణ వాచ్‌డాగ్ గ్రూప్ ‘కార్బన్ మార్కెట్వాచ్’ పేర్కొంది.
భవిష్యత్ లో నిరుపయోగంగా మారకుండా ఉండటం కోసం ఇతర స్టేడియాల్లోని 1,70,000 సీట్లను కూడా అభివృద్ధి చెందుతోన్న దేశాలకు విరాళంగా అందిస్తామని నిర్వాహకులు తెలిపింది.. అయితే, సీట్ల విరాళానికి సంబంధించి ఒక నిర్ధిష్ట ప్రణాళిక ఏదీ ఇంకా రూపొందలేదని కార్బన్ మార్కెట్ వాచ్ చెప్పింది.
వరల్డ్‌కప్ నిర్వహణ కార్బన్ న్యూట్రల్ గా ఉంటుందనే వాదన ప్రమాదకరమైనది, తప్పుదారి పట్టించేలా ఉందని పర్యావరణ వేత్తలు అంటున్నారు. ఎందుకంటే ఈ టోర్నీ పేర్కొన్నదానికంటే మూడు రెట్లు ఎక్కువగా కార్బన్ ఫుట్‌ఫ్రింట్ కలిగి ఉందని వారు వాదిస్తున్నారు.. ‘స్టేడియం 974’ నుంచి ఉత్పత్తి అయ్యే ఉద్గారాలను, 40-45వేల సీట్ల సామర్థ్యం ఉన్న శాశ్వత ప్రాతిపదికగా నిర్మించిన నాలుగు స్టేడియాలు ఉద్గారాల సగటును ఫిఫా నివేదిక పోల్చింది.
తాత్కాలిక స్టేడియం ప్రారంభ కాలంలో ఎక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుందని ఆ నివేదిక తెలిపింది. ఎందుకంటే కార్బన్ అధికంగా ఉండే
లోహాలు, ఉక్కు వంటి వాటిని ఉపయోగించడం వల్ల ఇలా జరుగుతుంది. శాశ్వత ప్రతిపాదికగా నిర్మించే స్టేడియాల్లో కాంక్రీట్ ప్రధానంగా వాడతారు.
కానీ ఉక్కు, లోహాలు ఎక్కువగా వాడటం వల్ల ఈ నిర్మాణాలను ఎక్కువ సార్లు విడదీయడానికి, తిరిగి కలపడానికి వీలవుతుంది. అందుకే తాత్కాలిక భవనాల్లో వీటిని ఎక్కువగా వాడతారు.
దీని ప్రకారం, ఖతార్‌లో నిర్మించిన శాశ్వత స్టేడియాలతో పోలిస్తే ‘స్టేడియం 974’ ఎక్కువ కర్బన ఉద్గారాలను కలిగి ఉంది.. కాబట్టి శాశ్వత స్టేడియాల కంటే తాత్కాలిక స్టేడియాల కర్బన ఉద్గారాల జాడలు తక్కువగా ఉండటం అనేది… ఆ స్టేడియం ఎంత దూరం ప్రయాణించింది, ఎన్నిసార్లు పునర్వినియోగించారు? అనే అంశాలపై ఆధారపడి ఉంటుందని కార్బన్ మార్కెట్ వాచ్ చెప్పింది.
స్టేడియం 974 భవిష్యత్ ఉపయోగాలు, తరలించే స్థానాలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లు అనిపించడం లేదు.
‘‘నిర్వాహకులు, ఈ తాత్కాలిక స్టేడియాన్ని ముక్కలుగా విడదీసే స్వభావం గురించి హైలైట్ చేసినప్పటికీ, స్టేడియాన్ని ఎక్కడికి తరలిస్తారు? అని తెలిపే నిర్దిష్ట ప్రణాళికలు మా దృష్టికి రాలేదు’’ అని కార్బన్ మార్కెట్ వాచ్ వెల్లడించింది.. స్టేడియం 974ను ఉరుగ్వేకు పంపిస్తారని వార్తలు వచ్చాయి. 2030 ప్రపంచ కప్ కోసం పరాగ్వే, చిలీ, అర్జెంటీనాలతో కూడిన ఉమ్మడి బిడ్‌లో భాగంగా దీన్ని అక్కడికి పంపిస్తారని అంటున్నారు.
దోహా నుంచి దాదాపు 13 వేల కి.మీ దూరంలో ఉరుగ్వే ఉంటుంది. కాబట్టి ఈ తాత్కాలిక స్టేడియంను అక్కడికి తరలించినట్లయితే దాన్ని అక్కడ పునర్వినియోగించడంతోపాటు పర్యావరణపరంగా మరింత ప్రయోజనకరంగా ఉండటానికి దాన్ని మూడవ ప్రదేశంలో మళ్లీ ఉపయోగించాల్సి ఉంటుంది.. స్టేడియం 974 భవిష్యత్ ప్రణాళికలు, దాన్ని తరలించే స్థానాల గురించి నిర్వహణ కమిటీని అడిగినప్పుడు అది ఇలా చెప్పింది. ‘‘తొలి కార్బన్ న్యూట్రల్ ఫిఫా ప్రపంచ కప్ నిర్వహణలో మేం సరైన దారిలో ఉన్నాం.
8 స్టేడియాలతో సహా అన్ని మౌలిక ప్రాజెక్టులూ కఠినమైన సుస్థిరత బెంచ్‌మార్క్‌లకు అనుగుణంగా ఉండాలి. అందుకే వాటి నిర్మాణంలో సాధ్యమైన చోట రీసైకిల్చే సిన, ఇంతకుముందే వాడిన వస్తువులను తిరిగి ఉపయోగించాం. టోర్నీ కోసం నిర్మించిన సౌకర్యాలు తర్వాత మాకు భారంగా మారకుండా ఉండటం కోసం వినూత్న ప్రణాళికలను అమలు చేశాం’’ అని చెప్పింది.
స్టేడియం 974ను రాబోయే రోజుల్లో ఫ్యాషన్ షో, సంగీత కచేరీ వంటి కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. ఈ స్టేడియాన్ని ముక్కలుగా విడదీయడం, పునర్వినియోగం కోసం కచ్చితమైన సమయాన్ని ఇంకా నిర్ధారించలేదని ఖతార్ ఫుట్‌బాల్ కప్ నిర్వహణ కమిటీ తెలిపింది..