Homeసినిమాఆరోగ్య సమస్యల్లో స్టార్లు… ఆందోళనలో అభిమానులు

ఆరోగ్య సమస్యల్లో స్టార్లు… ఆందోళనలో అభిమానులు

సినిమా స్టార్లు​ అనగానే చాలా మందికి ఓ ఫీలింగ్ ఉంటుంది. వారికేంటి ఖరీదైన కార్లు బంగ్లాలు లైఫ్ మొత్తం బిందాస్​గా సాగిపోతుంది అని అనుకుంటారు. ఏ చిన్న సమస్య కూడా వారికి ఉండదు. ఇక అనారోగ్య సమస్యలు అసలే ఉండవు. ఒకవేళ ఉన్నా.. టాప్ డాక్టర్ల వద్దకు వెళ్లి క్యూర్ అవుతారు.. అవసరమైతే విదేశాల్లో చికిత్స చేయించుకుంటారు అని ఇలా ఎన్నో మనం అనుకుంటాం. కానీ వాళ్లూ మనలాంటి సాధారణ మనుషులే. వాళ్లకూ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అయినా కూడా ప్రేక్షకులను అలరించేందుకు తమ బాధను పంటి బిగువున భరిస్తూనే నటిస్తారు. ఇలాంటి హీరోయిన్స్‌ భారత దేశంలో చాలా మందే ఉన్నారు. ఓసారి ఆ జాబితా చూద్దాం.

సమంత రూత్ ప్రభు :

సినీ ఇండస్ట్రీలో వచ్చి రాగానే పెద్ద హిట్ కొట్టి టాప్ హీరోయిన్ల జాబీతాలో చేరింది సమంత. ఆ తర్వాత యువసామ్రాట్ అక్కినేని నాగర్జున తనయుడు నాగ ఛైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వారిద్దరి మద్య భేదాభిప్రాయాలు రావడంతో గత ఏడాది వారు విడాకులు తీసుకున్నారు. అయితే సామ్ కు 2012లో పాలిమార్ఫస్ లైట్ ఎరప్షన్‌తో బాధపడ్డారు. ఇది ఓ రకమైన చర్మ వ్యాధి. కొంచెం ఎండ వేడి తగలగానే చర్మంపై దురద మొదలవుతుంది. మంట పుడుతుంది. పది నిమిషాలకు మించి ఎండలో ఉండలేరు. దాదాపు రెండేళ్లపాటు దీంతో సతమతమైంది సామ్‌.. దీంతో సమంత ఇండస్ట్రీకి కొద్దీ రోజులు పూర్తిగా దూరం అయ్యింది. సోషల్ మీడియా వేదికగా తనకు ఉన్న హెల్త్ ఇష్యు గురించి చెప్పి మరింత షాక్ ఇచ్చింది. సామ్ గత కొన్నాళ్లుగా మయోసైటీస్ అనే వ్యాధితో పోరాడుతున్నానని సోషల్ మీడియా వేదికగా చెప్పి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి కొలుకుంటున్నది సమంత.

దీపికా పదుకొనే :

దీపికా పదుకొనే చాలా రోజుల నుండి డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు అందరితో ధైర్యంగా పంచుకుంది. కెమెరా ముందు ఏడ్చి అందరినీ కదిలించిన కొద్దిమంది తారల్లో ఆమె కూడా ఒకరు. ఆరేడేళ్ల కిందట ప్రేమ వైఫల్యాలు, పని ఒత్తిడితో తీవ్ర మానసిక కుంగుబాటుకు గురయ్యారు. దాని నుంచి బయటపడటానికి కౌన్సెలింగ్‌ తీసుకున్నారు. దీపికా తన సమస్యను పంచుకోవడమే కాకూండా తనలా బాధపడుతున్న ఇతరులకు సహాయం చేయడానికి ‘లైవ్ లవ్ లాఫ్’ అనే సంస్థను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె రికవరీ అయి కేరీర్ పై దృష్టి పెట్టింది.

ఇలియానా :

ఇక మరో అందాల తార, నాజుకు నడుము ఇలియానా కూడా ఒక రకమైన డిప్రెషన్ వ్యాధితో తెగ బాధపడుతుంది. బాడీ డిస్మోర్ఫిక్ డిజార్డర్ మరియు డిప్రెషన్‌తో చాల కాలంగా బాధపడుతుంది ఇలియానా. తనకు తాను నేనేం అందంగా లేను, నాలో చాలా లోపాలున్నాయి అనుకుంటూ తనలో తనే కొన్నేళ్లపాటు బాధను అనుభవించింది ఇల్లీ బేబీ. పలువురు మానసిక వైధ్యులు, ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితుల అండతో ఆ సమస్య నుంచి బయటపడింది.

నయనతార :

లేడి సూపర్ స్టార్ నయనతార చర్మంకు సంబందించిన వ్యాధి మిస్టరీ స్కిన్ డిజార్డర్‌తో సతమతమయ్యారు. తనకు మేకప్ వేసుకుంటే స్కిన్ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చి భరించలేని నొప్పి వచ్చేదట. ఆ నొప్పి తట్టుకోలేక చాలా సార్లు షూటింగ్‌ సైతం రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేదని సమాచారం. ఇది అరుదైన చర్మ సమస్యగా డాక్టర్లు గుర్తించారు. ముఖ్యంగా మాంసాహారం తిన్నప్పుడు ఈ సమస్య తీవ్రంగా ఉండేదట. మందులతో పాటు ఏడాదిన్నరపాటు కేరళ ఆయుర్వేద మందులు వాడిన తర్వాత ఆమె కోలుకున్నారు. ప్రస్తుతం ఆమె వరస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది.

స్నేహ ఉల్లాల్ :

తెలుగు సినిమాలో ఒకప్పుడు మొరిసిన హీరోయిన్ స్నేహ ఉల్లాల్. ఉల్లాసంగా..ఉత్సాహంగా మూవీ ద్వారా అందరికి డ్రీమ్ గర్ల్ గా మారింది. కొంచెం ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ లాగా ఉండటంతో చాలా మందికి కలల రాణిగా మారింది. కానీ తన కేరీర్ ను సరిగ్గా నిలబెట్టుకోలేకపోయింది. మనల్ని రోగాల బారి నుంచి కాపాడాల్సిన రక్షణ వ్యవస్థ ఆమెను వ్యాధి బారీన పడేలా చేసింది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్..అనే అరుదైన వ్యాధితో స్నేహా ఉల్లాల్‌ చాలా బాధపడుతోంది. ఇదీ రక్తానికి సంబంధించిన వ్యాధి. కెరీర్‌ ఊపందుకుంటున్న దశలో ఈ జబ్బుతో బాధపడ్డది ఈ ముద్దగుమ్మ. దీర్ఘకాలిక చికిత్స తీసుకోవడంతో ఆమె కొన్నాళ్ల పాటు నటనకే దూరం కావాల్సి వచ్చింది.

మమతా మోహన్ దాస్ :

యమ దొంగ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మమతా మోహన్ దాస్ కూడా పలు వ్యాధుల భారీన పడ్డారు. ఇటీవలే క్యాన్సర్, హాడ్కిన్స్ లింఫోమా నుంచి కోలుకున్న ఆమెను మరో సమస్య కూడా వెంటాడుతోంది. తనకు చర్మంకు సంబంధించిన ఓ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది మమతా. తాజాగా ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.

రేణు దేశాయ్ :

తెలుగు ఇండస్ట్రీలోకి బద్రి మూవీతో అడుగుపెట్టిన రేణు దేశాయ్ గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకు ఆరోగ్యం సరిగా లేదని చికిత్స చేయించుకుంటున్నాని త్వరలోనే కోలుకుంటానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే గుండేకు సంబంధించిన అన్ని రకాల టెస్టులు చేయించుకుంటుంది. తను పవన్ కళ్యాణ్ తో విడాకులు అయిన తర్వాత ఒంటరిగానే ఉంటుంది. దీంతో కొంత మానసింగా ఇబ్బందులు పడుతున్నట్లు సినీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Must Read

spot_img