Homeసినిమాపవర్ స్టార్ ఎప్పుడెప్పుడు సినిమా చేస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు..

పవర్ స్టార్ ఎప్పుడెప్పుడు సినిమా చేస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు..

“భీమ్లా నాయక్” సినిమాతో మంచి హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు సినిమా చేస్తారా అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు ఇఫ్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో పవన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో పవన్ ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ సినిమాను దర్శకుడు క్రిష్ అత్యంత ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో పవన్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, తాజాగా ఈ సినిమా షూటింగ్ విషయంలో చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, అంతే త్వరగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.అయితే ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేసే ఛాన్సులు ప్రస్తుతం కనిపించడం లేదేని తెలుస్తోంది. ఈ సినిమాను ఈయేడాది ప్రథమార్థంలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

కానీ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్నదానికంటే ఎక్కువ సమయాన్ని తీసుకుంటుండటంతో…ఈ సినిమాను ఈయేడు ద్వితీయార్థంలోనే రిలీజ్ చేసేందుకు పవన్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారట. నిర్మాత ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ పీరియాడికల్ ఫిక్షన్ మూవీలో పవన్‌‌తో పాటు అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఎంఎం.కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ వద్ద రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకుంటుంటా అనేది చూడాలి.

Must Read

spot_img