అల్లు అర్జున్, సుకుమార్ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 యొక్క చిత్రీకరణ విషయంలో చాలా సైలెంట్ గా ఉంది. పుష్ప సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదు చేసిన నేపథ్యంలో పుష్ప 2 సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కచ్చితంగా భారీగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంతా నమ్మకంగా ఉన్నారు. అయితే బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఎందుకో నిరాశగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రతీ పండక్కి కొత్త సినిమాల అప్ డేట్ లతో మేకర్స్ హీరోలు హంగామా చేయడం ఆనవాయితీ. ఫెస్టివెల్ సందర్భంగా ఫ్యాన్స్ కి కొత్త కబుర్లు చెప్పడం.. కొత్త అప్ డేట్ లు అందించడం తరుచుగా జరుగుతుంటుంది. పండగ హంగామా మొదలైపోయింది. సంక్రాంతి పండక్కి కొత్త సినిమాలు సందడి చేయడం మొదలు పెట్టేశాయి. మరో రెండు రోజుల్లో పండగ రాబోతున్నా ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ లో మాత్రం ఎలాంటి హడావిడీ కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం పుష్పరాజ్ విషయంలో ఫ్యాన్స్ హ్యాపీగా లేరని తెలుస్తోంది.
పుష్పమూవీతో బన్నీ పాన్ ఇండియా వైడ్ గా సంచలన విజయాన్ని సొంతం చేసున్నాడు. పాన్ ఇండియా స్టార్ ల జాబితాలో చేరిపోయాడు.
పుష్పదేశ వ్యాప్తంగా ఐదు భాషల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పార్ట్ 2గా రానున్న
పుష్ప ది రూల్పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఫ్యాన్స్ అయితే
పుష్ప 2` పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ ల దగ్గరి నుంచి ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
రీసెంట్ గా పుష్ప 2
రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. సైలెంట్ గా షూటింగ్ మొదలు పెట్టిన సుకుమార్ కేవలం 5 రోజులు మాత్రమే షూటింగ్ చేసి బ్రేకిచ్చారు. అవతార్ 2
రిఈజ్ టైమ్ లో టీజర్ లేదా గ్లిమ్స్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ రష్యాలో ప్రమోషన్స్ కి వెళ్లడం వల్ల అది విరమించుకున్నారు. అయితే అప్పటి నుంచి పుష్ప 2
టీమ్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. కనీసం సంక్రాంతికి అయినా అప్ డేట్ ఇస్తారా? అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో మేకర్స్ ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం మొదలు పెట్టారు. అప్ డేట్ ఇస్తారా? లేదా? అంటూ నిలదీస్తున్నారు. పుష్ప
షూటింగ్ జరుగుతోందా?.. జరగడం లేదా?.. త్వరలో మొదలవుతుందా? అనే విషయాల్లో క్లారిటీ లేదు. అప్ డేట్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. దీంతో ఫ్యాన్స్ పుష్ప 2
విషయంలో హ్యాపీగా లేరని తెలుస్తోంది. ఇదిలా వుంటే మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సంక్రాంతికి బాలయ్యతో వీర సింహారెడ్డి
చిరుతో వాల్తేరు వీరయ్య
ఈ రెండు భారీ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు.