Homeసినిమాస్టార్ వార‌సుల ఎంట్రీ షురూ..?

స్టార్ వార‌సుల ఎంట్రీ షురూ..?

సినిమా ఇండస్ట్రీలో వారసులపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారి మొదటి సినిమాకు వచ్చే క్రేజ్ అంతా ఇంతా కాదు. చిన్న హీరోల వారసుల ఎంట్రీపై పెద్దగా అంచనాలు ఉండవు. కానీ ఇండస్ట్రీలో టాప్ హీరోల వారసుల ఎంట్రీపై ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురు చూస్తుంటారు. ఇక ప్రస్తుతం మన ఇండస్ట్రీలో రాబోయే వారసుల లిస్టు అయితే పెద్దగానే ఉంది. అయితే అందులో ఎక్కువగా మాత్రం మహేష్ బాబు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వారసులపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇక వారికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

బాలయ్య వారసుడు, పవన్‌ తనయుడు, మహేష్‌ కొడుకు, సుమ కుమారుడు టాలీవుడ్‌లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్‌ జరుగుతుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఉంటే వారి వారసులు కూడా అదే స్టార్ ఇమేజ్ తో సినిమాలలోకి వచ్చేస్తారు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఫ్యాన్ బేస్ తో వారు కూడా స్టార్స్ గా మారిపోతారు. అయితే కొందరు హీరోలు క్లిక్ అయితే మరికొంత మంది హీరోలు ఫెయిల్ అయిన సందర్బాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఎంట్రీ ఇచ్చిన సినిమా అందరి హీరోలకు అంతగా కలిసి రాదు. ఎవరో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. తరువాత సక్సెస్ రేట్ అనేది వారు ఎంచుకున్న సినిమా కథల బట్టి ఉంటుంది అనే సంగతి అందరికి తెలిసిందే. నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో చరిష్మాని మళ్ళీ సొంతం చేసుకున్నది అంటే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాలి. ఆ లిస్ట్లోకి బాలయ్య పుత్రుడు చేరుతాడా లేదా అనేది సందేహామే. ఇప్పటి వరకు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎక్కడ కూడా అంతగా హడావుడి చేయలేదు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ కాస్త టైం పట్టొచ్చని అంచనాలు.

మరోవైపు ఇటీవల పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కొడుకు అకిరా వార్తల్లో నిలిచారు. స్కూల్‌ గ్రాడ్యూయేషన్‌ పూర్తి కావడంతో సర్టిఫికేషన్‌ ఈవెంట్‌ స్కూల్‌ డే ఫంక్షన్‌ లో అకిరాతోపాటు పవన్‌ సందడి చేయడం విశేషం. ఆయన కూతురు ఆధ్య, అలాగే మాజీ భార్య రేణు దేశాయ్‌ కలిసి ఫోటోకి కూడా పోజులిచ్చారు. అయితే అందులో అకిర ఓ వయోలిన్‌ వాయించి ఆకట్టుకున్నారు. అప్పటి నుంచే త్వరలోనే అకిరా ఎంట్రీ ఉండబోతుందనే చర్చ మెగా అభిమానుల్లో మొదలైంది. అకిరా నందన్ లేటెస్ట్ ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ. అకిరా నందాన్ ఒక పవర్ఫుల్ లుక్ లోకి వచ్చేసాడు అని ఫ్యాన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వింటేజ్ ఫోటోలను జతచేస్తూ జూనియర్ పవర్ స్టార్ తప్పకుండా ఇండస్ట్రీలో రికార్డులు బ్రేక్ చేసేలా ఎంట్రీ ఇస్తాడు అని చెబుతున్నారు.

ఇక సూపర్ స్టార్ కృష్ణ ఇమేజ్ ని రమేష్ బాబు కొనసాగించలేకపోయాడు. అయితే మహేష్ బాబు మాత్రం తండ్రి ఇమేజ్ ని కొనసాగిస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ వారసుడు గౌతమ్ ఘట్టమనేని కూడా యుక్త వయస్సులోకి వచ్చేశాడు. దీంతో ఫ్యాన్స్ దృష్టి గౌతమ్ మీద పడింది. నెక్స్ట్ జెనరేషన్ స్టార్స్ అంటూ వారిని కీర్తించడం మొదలు పెట్టరు. పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ ఇప్పటికే అన్నలతో సమానమైన హైట్ తో మంచి ఎనర్జిటిక్ లుక్ తో కనిపిస్తున్నాడు. తాజాగా ఫార్ములా-ఈ రేసింగ్ చూడటానికి అకిరానందన్ కూడా వచ్చాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ కూడా ఫార్ములా-ఈ రేసింగ్ లో కనిపించాడు.

వీరిద్దరి ఫోటోలని పక్క పక్కన పెట్టి ఇప్పుడు నెక్స్ట్ జెనరేషన్ స్టార్స్ అంటూ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్యాన్స్. ఇద్దరు మంచి కలర్, హైట్ ఉండటంతో నెట్టింట్లో వారి పోటోలు తెగ వైరల్ గా మారాయి. ప్రస్తుతం మోస్టు ట్రెండింగ్ గా నిలిచారు. ఈ ఫోటోలని చూస్తున్న సూపర్ స్టార్ పవర్ స్టార్స్ ఫ్యాన్స్ అప్పుడే తమ ఫేవరేట్ హీరోల వారసుల గురించి వారు భవిష్యత్తులో చేయబోయే సినిమాల గురించి వారి మధ్య కాంపిటేషన్ ఎలా ఉండబోతుంది అనే విషయాలని ప్రిడిక్ట్ చేసి సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఈ ముగ్గరి రాక కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

Must Read

spot_img