స్రుష్టిలో విశ్వం సహా అన్నీ కణనిర్మితాలే అన్నది సైన్స్ ఎప్పుడో దశాబ్దాల నాడే తెలిపింది. దుమ్ము ధూళితో సహా మానవ శరీరం కూడా కోట్లాది కణాలతో నిర్మితమైనదిగానే ఉంటుంది. అయితే అప్పటి టెక్నాలజీకి ఇప్పుడు అభివ్రుద్ది చెందిన టెక్నాలజీలకు తేడా ఉంది. నేటితరం శాస్త్రవేత్తలు ఆటం మాత్రమే కాదు..పరమాణువు కేంద్రకాన్ని కూడా వదలకుండా పరిశోధించారు. పరమాణువులోని కేంద్రమైన న్యూట్రినోలను పరిశోధించే పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. మీకు తెలుసా.

ఈ ప్రపంచం, ఈ విశ్వాంతరాలన్నీ న్యూట్రినోల మాయాజాలం వల్లే కొనసాగుతున్నాయి. ఇంతకీ న్యూట్రినోలు బయటకు కనిపించవు. కంటికి కనిపంచని ఈ అతి సూక్ష్మ కణం చేసే పని మామూలుగా ఉండదు. ఇప్పుడు వాటిపైనే రీసెర్చ్ జరుగుతోంది. అయితే న్యూట్రినోల గురించి తెలుసుకునే కన్నా ముందు ఆటం గురించి తెలుసుకోవాలి.. మన శరీరంలో మొత్తం ఎన్ని అణువులు ఉన్నాయో తెలుసా? గతంలో అయితే ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి తెలియలేదు కానీ సూపర్ కంప్యూటర్ యుగంలో ఆ పని సాకారం అయింది. సుమారు 700 కోట్ల కోట్ల కోట్ల కోట్లుగా ఉంటాయి. అంటే షార్ట్ గా చెప్పాలంటే 7 ఆక్టిలియన్లు..అయితే ఒకటి.. వీటి సంఖ్య బరువును బట్టి మారిపోవచ్చు. సాధారణంగా చిన్నవారిలో తక్కువ అణువులుంటాయి. పెద్దవారిలో కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇన్ని కణాలలో ఎన్నో రసాయనాలు, మరెన్నో పదార్థాలు..అన్నీ కణాల రూపంలోనే యాక్టివ్ గా ఉంటాయి.
సగటున మన శరీంలో 87% వరకూ హైడ్రోజన్ లేదా ఆక్సిజన్ అణువులే ఉంటాయి. వీటికి కార్బన్, నైట్రోజన్ అణువులనూ కలిపితే మొత్తం 90% ఇవే ఆక్రమిస్తాయి. అంటే శరీరంలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. నీరంటే హెచ్2 ఓ..అంటే రెండు హైడ్రోజన్ , ఒక ఆక్సిజన్ అని మనం చిన్నప్పుడే చదువుకున్నాం..మనలో చాలామందిలో 41 రసాయన మూలకాలుంటాయి.
తక్కువ మోతాదులో ఉండే మూలకాల అణువుల కచ్చితమైన సంఖ్య వయసు, ఆహారం, పర్యావరణాల మీద ఆధారపడి ఉంటుంది. శరీరంలో జరిగే రసాయన చర్యలకు ఇవి అవసరం. శరీరంలో మనకు తెలియకుండా జరిగే అనేక పరిణామాలకు ఈ కణాలే కీలకంగా ఉంటాయి. ఇవే కాదు..కొన్ని ప్రమాదకరమైన మూలకాలు కూడా ఉంటాయి.. సీసం, యురేనియం, రేడియం వంటివి శరీరంలో జరిగే ఎలాంటి పనుల్లోనూ పాల్గొనవు. పైగా ఇవి భయంకరమైన విషతుల్యాలు కూడా. అయితే శరీరంలో సహజంగానే స్వల్ప స్థాయిలో ఉంటాయి. కాబట్టి మనిషికి ఎలాంటి హాని జరగదు. అంతెందుకు ఓ అంచనా మేరకు శరీరంలో 250 రకాలైన ఫార్మా కంపెనీలుంటాయట.. శరీరానికి ఏదైనా జబ్బు చేసినప్పుడు దానికి కావలసిన మందులు శరీరమే తయారుచేసుకుంటుందట.. అయితే ఈలోగా మనం మాత్రలు వేసుకోవడం వలన శరీరం పెద్దగా కష్టపడే అవసరం లేదని భావిస్తుందట.
మన నిత్యజీవితంలో అనేక పనులు చేస్తుంటాం..ఆ పనులు జరిగేందుకు శరీరంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటాయి.. అవి బయటకు కనిపించవు.. కానీ కీలకంగా ఉంటాయి. ఇదంతా కణశాస్త్రం అవగాహనలోకి వచ్చిన తరువాత తెలిసిన విషయాలు.. బ్రిటన్ కు చెందిన రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త 1665లో ఓక్ అనే చెట్టుకు ఉండే పలుచని బెరడును మైక్రోస్కోప్ లో పరిశీలిస్తుండగా ఈ కణాలను గుర్తించారు. బెరడు ముక్కలో తేనెపట్టులో ఉండే ఖాళీ గదుల్లాంటి నిర్మాణాలకు ఆయన కణం అని పేరు పెట్టారు. దానినే ఇంగ్లీషులో సెల్ అంటారు. లాటిన్ భాషలో కణం అంటే చిన్న గది అని అర్థం. నిజానికి రాబర్ట్ హుక్ మొదటిసారిగా నిర్జీవ కణాలను పరిశీలించారు. ఈ ఆవిష్కరణ సైన్స్ చరిత్రలోనే అతి ముఖ్యఘట్టంగా చెప్పుకోవచ్చు. ఆయన పరిశోధన కణశాస్త్రానికి పునాదులు వేసింది. అందుకే ఆయనను కణశాస్త్ర పితామహుడిగా చెబుతున్నారు. ఆపై అంటన్ వాన్ అనే శాస్త్రవేత్త మొదటి సారిగా 1674లో సజీవ కణాలైన బాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్రరక్త కణాలను కనుగొన్నారు. దీంతో వైద్యశాస్త్రం తీరుతెన్నులు మారిపోయాయి.
మానవ శరీరాన్ని అర్థం చేసుకునే తీరే మారిపోయింది.
కణ నిర్మాణంలో ముఖ్యంగా 3 భాగాలుంటాయి. కణత్వచం, కణద్రవ్యం, కేంద్రకం.. కణం మధ్యభాగంలో ఉండే గుండ్రని నిర్మాణాన్ని రాబర్ట్ బ్రౌన్ అనే పరిశోధకుడు 1831లో కనిపెట్టారు. కణాలలో వైవిధ్యం ఉంటుంది. కణాల పరిమాణం, ఆకారం, సంఖ్యలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. అలాగే ఇతర జీవులను చూస్తే వాటిలో ఏక కణ జీవులు కూడా ఉంటాయి. ఇవి కేవలం ఒకే కణంతో నిర్మితమై ఉంటాయి. అలాగే ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మితమైన జీవులను బహుకణ జీవులని అంటారు. ఇందులో చూస్తే ఏకకణ జీవుల్లో ఒకే ఒక్క కణం ఆహార సేకరణ, శ్వాసక్రియ, విసర్జన, పెరుగుదల, ప్రత్యుత్పత్తి లాంటి జీవక్రియలన్నింటినీ చూస్తుంది. మరి ఏకకణ జీవులకు ఉదాహరణగా అమీబా, పారమీషియం, బ్యాక్టీరియా, క్లామిడోమోనాస్, స్పైరోగైరాలను చెప్పుకోవచ్చు. సరిగ్గా ఇదే విధంగా బహుకణ జీవుల్లో మనుషులు వస్తారు. వేర్వేరు పరిణామాలలో ఉండే కణాలు శరీరానికి అవసరమయ్యే భిన్న రకాల విధులను నిర్వహిస్తాయి.

బహుకణాల జీవులలో మొక్కలు, జంతువులు కూడా వస్తాయి. సజీవంగా ఉన్న కణాల పరిమాణం మైక్రాన్లలో కొలుస్తారు. అంటే ఇది మీటరులో మిలియనవ వంతుగా చెప్పుకోవచ్చు. మీకు తెలుసా అతి చిన్న బాక్టీరియా కణం మరింత చిన్నగా 0.1 నుంచి 0.5 మైక్రాన్ సైజులో ఉంటుంది. అయితే మనిషి కాలేయం, మూత్రపిండాలలో ఉండే కణాలు మాత్రం 20 నుంచి 30 మైక్రాన్ సైజులో ఉంటుంది. అవి తమ విధులను సరిగ్గా నిర్వర్తిస్తుంటాయి కాబట్టి మనం జీవంతో ఉంటాం.. కణశాస్త్రం అభివ్రుద్ది చెందిన తరువాత వైద్యశాస్త్రంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో స్టెమ్ సెల్ చికిత్స ఒకటి.. నిజానికి స్టెమ్ సెల్స్ అనేది ఒక ప్రత్యేకమైన కణాలుగా చెప్పుకోవచ్చు. గర్భవతి అయిన తల్లి పొట్టలో శిశువుకు ఆహారం అందించే ప్రత్యేక నాళిక ఈ కణాలతో తయారవుతుంది. వీటినే మూలకణాలుగా చెబుతున్నారు వైద్యనిపుణులు.
ఈ కణాలు ఉపయోగిస్తే ఒక అవయవం లేదా కణజాలం యొక్క ఏదైనా దెబ్బతిన్న ప్రాంతాన్ని రిపేర్ చేసేందుకు వీలుంటుంది. అవసరమైన కణాల శరీరానికి అత్యవసర సహాయంగా ఉంటాయి. మూల కణాల యొక్క విస్తృత ప్రయోజనాల కారణంగా వీటిని చిన్నప్పుడే భద్రపరిచే సంస్థలు ఏర్పడ్డాయి. ఆ కణాలతో శిశువు పెరిగి పెద్దయ్యాక కూడా వైద్యచికిత్సలో వాడుకునే వీలుంటుంది. వాటి సహాయంతో చికిత్స చేసే అనేక కొత్త పద్ధతులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. నయం చేయలేని అనేక రకాల మొండి వ్యాధుల నుండి బయటపడటానికి ఇవి దోహదం చేస్తున్నాయి. కణాలు అవసరమైనంత ఉత్పత్తి అయినప్పుడు శరీరానికి మేలు జరుగుతుంది. అవసరాలు తీరిపోతాయి. కానీ అవి అవసరానికి మించి ఉత్పత్తి అయినప్పుడు అనేక దుష్ఫలితాలు ఏర్పడతాయి.
వాటినే క్యాన్సర్లంటున్నాం.. కాన్సర్ అంటే మరేదో కాదు..శరీరంలోని వివిధ భాగాలలో కణాల ఉత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా అడ్డూ అదుపు లేకుండా పుట్టుకురావడమే.. శరీరంలో మనం బ్రతకడానికి రోజువారీ జరిగే ప్రతీ జీవ ప్రక్రియనని ఒక్కొక్క జన్యువు నియంత్రిస్తూ ఉంటుంది. అలా ఒక్కో కణంలోని కొన్ని వేల జన్యువులు ఈ పనులను చేస్తుంటాయి. వాటిలో కొన్ని కణ పునరుత్పత్తిని నియంత్రిస్తాయి. ఈ జన్యువులలో లోపం ఏర్పడినప్పుడు కణ పునరుత్పత్తి నియంత్రణ కోల్పోవడంతో మనిషి జబ్బు పడతాడు. అది కొన్నిసార్లు పుట్టుకతోనే లోపంతో ఉంటాయి. వాటినే జన్యుపరమైన జబ్బులు అంటారు. కణాలు మనిషిని నడిపిస్తుంటాయి. ఎక్కడ ఏ జబ్బు చేసినా అక్కడ కణాల పాత్ర ఎక్కువగా ఉంటుంది. అవి లేనిదే ప్రాణం లేదు. ఈ స్రుష్టిలో మనకు ఇంకా తెలియని అనేక రహస్యాలలో కణం కూడా ఒకటి..దీని గురించి ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయంటారు శాస్త్రజ్నులు..