Homeసినిమాప్రతీ నిర్మాత ప్రభాస్ తో సినిమా చెయ్యాలని..!

ప్రతీ నిర్మాత ప్రభాస్ తో సినిమా చెయ్యాలని..!

ప్రభాస్ తో సినిమా చెయ్యాలని ప్రతీ నిర్మాతకు ఉంటుంది. అయితే అందుకు చాలా సమీకరణాలు, లెక్కలు సెట్ కావాల్సి ఉంటుంది. అందుకు తగ్గ ప్రపోజల్స్ పెడుతూంటారు. ఈ లోగా కొన్ని వార్తలుగా సోషల్ మీడియాలో వచ్చేస్తూంటాయి. అలాంటిదే ప్రభాస్,సుకుమార్ కాంబినేషన్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు గురించిన వార్త నిన్నంతా మీడియాలో హల్ చల్ చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చింది అభిషేక్ అగర్వాల్ నిర్మాణ సంస్థ.

ప్రస్తుతం సుకుమార్ ‘పుష్ప 2’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాత సినిమా ప్రభాస్ తో ఉండొచ్చనే టాక్ కొంతకాలంగా వినిపిస్తోంది. అయితే ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నట్టుగా కొత్త ప్రచారం ఊపందుకుంది.

అయితే అలాంటిదేమీ లేదని అది ఫేక్ న్యూసే అని ఆ నిర్మాణ సంస్థ తేల్చి చెప్పారు. అంత గొప్ప ప్రాజెక్టు సెట్ అయితే ముందు తామే ఉత్సాహంగా చెప్తాము కదా అని అంటున్నారు. అది న్యూస్ ఎలా పుట్టింది అనేది గెస్ చేయటం కష్టమేమీ కాదని అన్నారు.

సుకుమార్, అభిషేక్ అగర్వాల్ కాంబినేషన్ లో ప్రాజెక్టు ఉండబోతుందని ఆ మధ్యన సోషల్ మీడియా ఓ ఫొటో షేర్ చేసి మరీ వార్త ఇచ్చారు. అయితే హీరో ఎవరో చెప్పలేదు. గతంలో సుకుమార్ తో ప్రభాస్ సినిమా చేస్తాను అన్నారు కాబట్టి…ఆ న్యూస్ ఆ గెస్సింగ్ లోంచి పుట్టే అవకాశం ఉంది.

అయితే సుకుమార్, ప్రభాస్ కాంబినేషన్ చూడాలని చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారనేది నిజం. అందులోనూ పుష్ప2 చిత్రం తర్వాత ఏ హీరోతో సుకుమార్ చేస్తారు అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఖచ్చితంగా ప్యాన్ ఇండియా ఫిల్మ్ చేస్తారనేది మాత్రం నిజం.

కథకి ప్రభాస్ ఓకే చెప్పడం కూడా జరిగిపోయాయని అన్నారు. అయితే అప్పటి నుంచి ప్రభాస్ బిజీగా ఉన్నారు. సుకుమార్ పుష్ప ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ఏదైమైనా ఈ కాంబిలో సినిమా ప్రకటన కోసం ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే దిల్ రాజు,మైత్రీ మూవీ మేకర్స్‌తో కూడా ప్రభాస్ కమిట్‌మెంట్స్‌తో ఉన్నాడు. సరైన డైరక్టర్స్ ని… ప్రభాస్ కు సెట్ చేయటం, ఆ నిర్మాతలకు కష్టంగా మారడంతో ప్రాజెక్టులు ఇంకా కార్యరూపం దాల్చలేదు.

ఏడాది ముగింపు శుక్రవారంకు ఇంకా మూడు రోజులే సమయం ఉంది. శుక్రవారం అంటే సినిమా సందడి తప్పనిసరి. లక్ష్మీదేవి కళకళలాడాలని అదే రోజు ఎక్కువగా సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. ఆ రోజు కొన్నేళ్లగా పరిశ్రమలో సెంటిమెట్ గా మారిపోయింది. 2022 ఏడాది ముగింపు వారం కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ వివరాలు మీకోసం..

టాలీవుడ్ లో ప్రతి శుక్రవారం చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.

ఈ శుక్రవారం కూడా చాలానే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.సంఖ్య పరంగా చాలా సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. కానీ అవన్ని లో బడ్జెట్ చిత్రాలు. కంటెంట్ పరంగా పోటీ ఉంటే తప్ప.. బాక్సాఫీస్ వద్ద వార్ కనిపించదు. అయితే ఆయా చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి గానీ..వాటికి సరైన ప్రచారం కనిపించలేదు.

స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం….భారీ బడ్జెట్ సినిమాలు కాకపోవడంతో ఆ సినిమాలపై పెద్దగా బజ్ లేదు. కనీసం కంటెంట్ తోనైనా మార్కెట్లో హడావుడి చేస్తారంటే? అదీ కనిపించలేదు. ఆయా సినిమాలకు మౌత్ టాక్ తోనే మార్కెట్లో నిలబడాలి.

బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ నటించిన లక్కీ లక్ష్మణ్ ప్రచారం సోసోగా కనిపిస్తుంది. టూర్లు తిరుగుతూ హైప్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. యూత్ లో ఫాలోయింగ్ నటుడు కాబట్టి సినిమాకి రీచ్ పర్వాలేదనిపిస్తుంది. ఇక ఆది సాయికుమార్ టాప్ గేర్ లో దూసుకుపోవాలని రెడీగా ఉన్నాడు.

కొంత కాలంగా హిట్ అందని ద్రాక్షలా మారిపోయింది. చేసిన ఏ ప్రయత్నం ఫలించడం లేదు. దీంతో మీడియా అటెన్షన్ కూడా ఆదిపై అంతగా లేదు. సినిమాలు చేస్తున్నాడనే పేరు తప్ప…సౌండింగ్ మిస్ అవుతుంది.

ఇక తారకరత్న ప్రధాన పాత్ర పోషించిన ‘S5థ్రిల్లర్ జానర్ లో రూపొందిన సినిమా రిలీజ్ అవుతుంది.అమరావతి` లాంటి సినిమా తారకరత్నకి మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో అదే సెంటిమెంట్ తో ఈ సినిమా చేస్తున్నాడు. చాలా కాలం తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. మరోవైపు రాజయోగం అనే మరో మూవీ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.

ఇంకా ప్రేమదేశం, నువ్వే నా ప్రాణం,ఉత్తమ విలన్, కేరాఫ్ మహదేవపురం,కోరమీను లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీళ్లంతా కూడా శుక్రవారం సత్తా తేల్చుకోవడానికి రెడీ అవుతున్నారు. మరి ఏ సినిమాకి 2022 ఎలాంటి ముగింపు ఇస్తుందో చూడాలి.

Must Read

spot_img