రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనేక సమస్యలను ఎదుర్కుంటోంది. అందులో మెజారిటీ పక్షంలో ఉండాల్సిన క్రిస్టియన్లు మైనారిటీలుగా మారిపోయారు. నిజానికి ఇంగ్లండ్ వేల్స్ దేశాలలో మొదటి నుంచి మెజారిటీలుగా ఉండే క్రిస్టియన్ సమాజం ఇప్పుడు కాస్త మైనారిటీ సమాజంగా మారిపోయింది. బ్రిటన్ లో ఇప్పుడంతా ఏ మతానికి చెందనివారే ఎక్కువగా ఉన్నారు. విచిత్రంగా ఉంది కదూ.. మీరే చూడండి..
ఇంగ్లండ్, వేల్స్ మైనారిటీ క్రిస్టియన్ దేశాలుగా మారిపోయాయి
ప్రస్తుతం ఇంగ్లండ్, వేల్స్ మొత్తం జనాభాలో క్రిస్టియన్ల జనాభా సగం కన్నా తక్కువగా..అంటే 46.2 శాతంగా ఉంది. తాజాగా విడుదల చేసిన జనగణన డేటా ద్వారా ఈ వివరాలు వెలుగు చూసాయి. బహుళ సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన వారు ఉండే బ్రిటన్ లో మహోన్నత లౌకికవాద విలువలు విరబూస్తున్నాయని ఈ డేటా ద్వారా స్పష్టమవుతోంది.
ఇంగ్లండ్, వేల్స్ లో ఇంతకు ముందు క్రిస్టియన్లు అధికంగా ఉండేవారు. ఏ మతాన్నీ అనుసరించని వారు ఇప్పుడు విపరీతంగా పెరిగారు. క్రిస్టియన్ల తర్వాత ఏ మతాన్ని అనుసరించని వారే అధికంగా ఉన్నారని యూకే జాతీయ గణాంకాల కార్యాలయం తెలిపింది. 2021 జనగణనలో తేలిన మతపర అంశాలు ఇంగ్లండ్, వేల్స్ లో కీలక మార్పులు తెచ్చే అవకాశం ఉంది.
బ్రిటన్ లో క్రిస్టియన్ స్కూల్స్ ఉంటాయి. అయితే, సమాజంలో మతపర పాత్రపై పున:పరిశీలన చేయాల్సి ఉందని తాజా జనగణన ఫలితాల ద్వారా స్పష్టమవుతోంది. ఇంగ్లండ్, వేల్స్ లోని 46.2 శాతం మంది ప్రజలు..అంటే.. 2కోట్ల 75 లక్షల మంది తాము క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు.
2011తో పోల్చితే 2021లో క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న వారి సంఖ్య 13.1 శాతం తగ్గింది. ఏ మతాన్నీ అనుసరించడం లేదని చెబుతున్న వారి సంఖ్య 2011తో పోల్చి 2021లో 12 పాయింట్లు పెరిగింది. మొత్తం జనాభాలో 37.2 శాతానికి చేరింది. అంటే 2.22 కోట్ల మంది ఏ మతాన్నీ అనుసరించడం లేదన్నమాట. మొత్తం జనాభాలో ముస్లింల శాతం 6.5 శాతంగా ఉంది. అంటే.. 39 లక్షలుగా ఉంది. వీరి జనాభా 2011లో 4.9 శాతం మాత్రమే ఉంది.
బాధ్యతలు స్వీకరించిన రిషి సునక్

ఆ తర్వాతి విషయానికొస్తే హిందువులు 10 లక్షల మంది, సిక్కులు 5 లక్షలా 24 వేల మంది, బౌద్ధమతం వారు 2లక్షలా 73 వేల మంది, యూదులు 2లక్షలా 71 వేల మందిగా ఉన్నారు. 2021 జనగణన వివరాలను బ్రిటిష్ మొట్టమొదటి హిందూ ప్రధానిగా రిషి సునక్ బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల తర్వాత అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగానే ఇంగ్లండ్, వేల్స్ దేశాల్లో క్రిస్టియన్లు తగ్గిపోగా, ముస్లింల జనాభా బాగా పెరిగిందన్న విషయం వెల్లడైంది.
కొంతకాలంగా క్రిస్టియన్ల నిష్పత్తి తగ్గుతూ వస్తోందని, ఇందులో అంతగా ఆశ్చర్యపడే విషయం ఏమీ లేదని ఇంగ్లండ్ చర్చి ఆర్చ్ బిషప్ స్టీఫెన్ కాట్రెల్ చెప్పారు. అయితే, యూరప్ లో పెరిగిపోయిన జీవన వ్యయం, యుద్ధాలు వంటి పరిస్థితుల్లో ప్రజలకు ఇప్పటికీ ఆధ్యాత్మిక జీవనాధార అవసరం ఉందని చెప్పారు.
తాము సమాజానికి అందిస్తున్న సేవల్లో ఇప్పటికీ లక్షలాది మంది ప్రజలు పాలుపంచుకుంటున్నారని చెప్పారు. ఏ మతాన్నీ అనుసరించని వారి హక్కుల కోసం పోరాడుతున్న యూకేలోని మానవతావాదులు మాత్రం క్రైస్తవ మతంతో సంబంధం లేకుండా పాలసీలను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అయితే ఒకప్పుడు భారతదేశాన్ని 250 సంవత్సరాల పాటు పాలించిన ఇంగ్లీష్ దేశస్తులు.. భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తికి కృషిచేసిన ఆ ఇంగ్లీష్ దేశస్తులు.. ఇప్పుడు తమ మతం గురించి చెప్పుకునేందుకు నిరాకరిస్తున్నారు.. అందుకే ఇంగ్లాండ్ దేశంలో క్రైస్తవులు మైనార్టీలుగా మారిపోయారు.ఈ పరిణామం ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. నిజంగానే నేటి మారిన కాల పరిస్థితుల్లో మతం అంటే కొంతమందికి ఏవగింపు కలుగుతుంది.
మతపరమైన కార్యక్రమాలు వారికి ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఈ మతం వల్ల మనుషుల్లో వైషమ్యాలు పెరిగిపోయి రకరకాల గొడవలకు దారితీస్తున్నాయి.. ఇప్పుడు ఇరాన్ లో జరుగుతున్న హిజాబ్ గొడవ కు కారణం మతమే కదా అని అంటున్నారు అభ్యుదయవాదులు.
ఇన్నాళ్లూ ఇంగ్లండులో మెజారిటీగా ఉన్న క్రిస్టియానిటీలోనే జాతి పరమైన విభేదాలు ఉన్నాయి.. అమెరికా లాంటి దేశాల్లో శ్వేత జాతీయులు నల్లజాతీయులను చంపేస్తూ ఉంటారు.. ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి.. వ్యక్తుల మధ్య గొడవలను ఎగదోస్తూ, వాటిని జాతుల మధ్య ఉన్న వైరంగా అభివర్ణిస్తూ చలికాచుకునే వాళ్ళు ఎంతోమంది ఉండటమే ఇందుకు కారణం. జనం చాందసమైన విధానాల నుంచి క్రమంగా బయటపడుతున్నారు. ఇది ఓ సహజసిధ్దమైన మార్పుగా చెబుతున్నారు.