HomeFinanceఎలాన్ మస్క్ అవుట్.. ప్రపంచపు నెంబర్ వన్ సంపన్నుడిగా బెర్నార్డ్ ఆర్నో..

ఎలాన్ మస్క్ అవుట్.. ప్రపంచపు నెంబర్ వన్ సంపన్నుడిగా బెర్నార్డ్ ఆర్నో..

ప్రస్తుతం ప్రపంచ సంపన్నుడు ఎవరు..బెర్నార్డ్ ఆర్నో..మరి ఇన్నాళ్లూ నెంబర్ వన్ గా పేరు తెచ్చుకున్న ఎలాన్ మస్క్ ఏమయ్యారు..? అనవసరంగా చక్కగా నడుస్తున్న ట్విట్టర్ ను పట్టింపులకు పోయి కొనుగోలు చేసి చిక్కుల్లో ఇరుక్కున్నారు. పడుకున్న జంతువును లేపి తన్నించుకోవడం అంటే ఇదే..హాయిగా ప్రపంచంలో మరెవరూ చేయలేని పనులను నిర్విఘ్నంగా పూర్తి చేస్తూ హాయిగా ఉన్న ఎలాన్ మస్క్..నిత్యం వివాదాలలో నిలుస్తున్నారు..ఇప్పుడు తను రెండో స్థానానికి పరిమితమయ్యారు.

ఎలాన్ మస్క్‌ను వెనక్కి నెట్టిన బెర్నార్ ఆర్నో ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ సంపన్నుడిగా నిలిచారు. సాక్షాత్తూ ఎలాన్ మస్క్‌ను వెనక్కి నెట్టిన బెర్నార్ ఆర్నో ఎవరు? టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థలతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మారిన అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ట్విటర్’ను కొనుగోలు చేశాక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుడు కాదు.

ఆయన స్థానాన్ని ప్రజలకు పెద్దగా తెలియని ఒక వ్యక్తి ఆక్రమించారు. ఫోర్బ్స్, బ్లూమ్‌బెర్గ్ ప్రకారం… 171 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఫ్రాన్స్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నార్డ్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ సంపద విలువ 164 బిలియన్ డాలర్లతో రెండో స్థానానికి పడిపోయారు.

భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ 125 బిలియన్ డాలర్ల ఆస్తులతో ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. అటు మరో కుబేరుడు అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ నాలుగో స్థానంలో, బిల్ గేట్స్ అయిదో స్థానంలో నిలిచారు. అయితే, ప్రపంచ కుబేరునిగా అవతరించిన ఈ బెర్నార్ ఆర్నో ఎవరు? ఆయన అంత సంపదను ఎలా ఆర్జించారు? బెర్నార్ ఆర్నో ఒక ఫ్రెంచ్ వ్యాపారవేత్త. ఆయన ఎల్‌వీఎస్‌హెచ్ గ్రూప్ చైర్మన్.

ఈ గ్రూపులో 70కి పైగా కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ ఉత్పత్తులను విక్రయిస్తాయి. ఈ గ్రూప్‌లో లగ్జరీ దుస్తులను విక్రయించే లూయిస్ విటన్, ఫెండీ కంపెనీలతో పాటు మేకప్ ఉత్పత్తుల విక్రయదారు ఫెంటీ బ్యూటీ, వైన్ కంపెనీ డామ్ పెరిగ్రెన్ తదితర కంపెనీలు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన విలాసవంతమైన ఉత్పత్తులను విక్రయించే కంపెనీలుగా వీటికి పేరుంది. ఇవే కాకుండా మార్క్ జాకబ్స్ నుంచి వర్జిల్ అబ్లో, రాఫ్ సిమన్స్, ఫీబీ ఫిలో వంటి ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్ల కంపెనీలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. 2019లో అమెరికా ప్రఖ్యాత జ్యూయెలరీ బ్రాండ్ ‘టిఫానీ’ని కొనుగోలు చేసినప్పుడు బెర్నార్ ఆర్నో పేరు చర్చల్లో నిలిచింది. ఆ సమయంలో ఆర్నో మొత్తం ఆస్తుల విలువ 106.9 బిలియన్ డాలర్లు..అంటే మన కరెన్సీలో అయితే అది 8 లక్షలా 74 వేల 860 కోట్ల రూపాయలన్నమాట. ఇది ఇప్పుడు 170 బిలియన్ డాలర్లను దాటింది.

అమెరికా మ్యాగజీన్ ఫోర్బ్స్ చెప్పినదాని ప్రకారం, బెర్నార్ ఆర్నోను ప్రపంచవ్యాప్తంగా ‘మాడ్రన్ లగ్జరీ ఇండస్ట్రీ’ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు.

లగ్జరీ దుస్తుల పరిశ్రమను ప్రారంభించాలనే ఆలోచన కూడా బెర్నార్‌దే..!

నేడు భారత్ నుంచి చైనా, అమెరికా, ఆఫ్రికా నగరాల్లోని ప్రజలు ఫ్రాన్స్ కంపెనీ లూయిస్ విటన్ సహా ఇతర బ్రాండ్లకు చెందిన దుస్తుల్ని ధరిస్తున్నారు. ఈ లగ్జరీ పరిశ్రమను ప్రారంభించాలనే ఆలోచన కూడా బెర్నార్‌దేనని ఒక కథనంలో న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఈ కథనం ప్రకారం, బెర్నార్ ఆర్నో తండ్రి నిర్మాణ రంగ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించారు.

కుటుంబ యాజమాన్యంలోని దుస్తుల కంపెనీలతో ఒక గ్రూపును ఏర్పాటు చేస్తే అసమాన శక్తిగా ఎదగవచ్చని చాలా చిన్న వయస్సులోనే బెర్నార్ ఆర్నో గుర్తించారు. వెంటనే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించే పనిలో పడ్డారు. బెర్నార్ ఆర్నోకు ట్రంప్, నికోలస్ సర్కోజీ వంటి ప్రపంచ నేతలతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి బెర్నార్ ఆర్నో, అమెరికా వ్యాపార ప్రపంచంలో మెళుకువలు నేర్చుకొని వాటిని యూరప్‌లో ఉపయోగించారు.

మొదటగా 1985లో ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి ఒక దివాలా తీసిన టెక్స్‌టైల్ కంపెనీ ‘బౌసెక్’ను ఆయన కొనుగోలు చేశారు. ఫ్రాన్స్‌కు చెందిన ‘డియా’ అనే పురాతన బ్రాండ్‌ను కూడా ఇందులో కలిపారు. బెర్నార్ ఆర్నో చాలా వరకు బౌసెక్ ఆస్తులను విక్రయించారు. కానీ ‘డియా’ బ్రాండ్‌ను మాత్రం వదల్లేదు.

న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, 1989లో ఆయన ఎల్‌వీఎంహెచ్‌ను టేకోవర్ చేశారు. దానికి ‘ద వోల్ఫ్ ఇన్ ద కశ్మీర్ కోట్’ పేరు పెట్టారు. ఆయన తనదైన శైళిలో లగ్జరీ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. బెర్నార్ ఆర్నో తన కంపెనీ దుకాణాలను ఆధునిక షాపింగ్ స్టోర్‌లుగా మార్చారు. వాటిలో యూరప్ చరిత్ర, వారసత్వాన్ని జోడించారు. ఈ బ్రాండ్లతో పాటు యువ ఫ్యాషన్ డిజైనర్లతో కలిసి పని చేయడం ప్రారంభించారు. ఈ కారణంగా ఈ బ్రాండ్లు యువతను ఆకర్షించాయి.

Must Read

spot_img