Homeఅంతర్జాతీయంమనిషి మెదడులో ఎలక్ట్రానిక్ 'చిప్' పెడతానంటున్న ఎలాన్ మస్క్.!

మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ ‘చిప్’ పెడతానంటున్న ఎలాన్ మస్క్.!

ఇటీవల కాలంలో ఎలాన్ మస్క్ ఏం చేసినా అది చర్చనీయాంశంగానే మారుతోంది.. తాజాగా మస్క్ కు చెందిన న్యూరాలింక్ ప్రకటించిన ప్రాజెక్ట్ హాట్ టాపిక్ గా మారింది.. ఇంతకూ న్యూరాలింక్ ప్రాజెక్ట్ చేపట్టే ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటి..?

రాబోయే ఆరు నెలల్లోనే బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ టెక్నాలజీతో మనిషి మెదడులో చిప్‌ పెట్టే ప్రయోగాలను చేయబోతున్నట్టు మస్క్ ప్రకటించాడు. అసలు.. ఎలాన్ మస్క్ ఏం చేయాలనుకుంటున్నాడు..? ఆయన ఆలోచనలేంటీ….?

మనుషుల తలల్లో చిప్‌లు ఎక్కించడం మొదలుపెట్టేస్తానంటున్నారు మస్క్.

ఇంపాజిబుల్‌ని.. పాజిబుల్ చేసేందుకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కనీ వినీ ఊహించని టెక్నాలజీతో మనుషుల మెదళ్లలో చిప్ లు పెడతానంటున్నారు.. మరికొన్ని నెలల్లోనే.. మనిషి మెదడులోకి ఎలక్ట్రానిక్ చిప్‌ను చొప్పించటానికి అమెరికా గవర్నమెంట్ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా అనుమతులు రాగానే.. అలా మనుషుల తలల్లో చిప్‌లు ఎక్కించడం మొదలుపెట్టేస్తానంటున్నారు మస్క్.
మనిషి ఆలోచనలను, వాటికి తగ్గట్టు మనిషి జీవితాన్ని మార్చే అత్యాధునిక సాంకేతిక విధానం అందుబాటులో రాబోతోంది. దీనికి.. కౌంట్ డౌన్ కూడా మొదలైపోయింది.

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ ప్రాజెక్ట్… మరో కీలక ముందడుగు వేసింది. రాబోయే ఆరు నెలల్లోనే బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ టెక్నాలజీతో మనిషి మెదడులో చిప్‌ పెట్టే ప్రయోగాలను చేయబోతున్నట్టు మస్క్ ప్రకటించాడు. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ టెక్నాలజీ పరిజ్ఞానంపై కాలిఫోర్నియాలోని న్యూరాలింక్ హెడ్ ఆఫీసులో మస్క్‌ ప్రజంటేషన్ ఇచ్చారు.

ప్రయోగాల్లో భాగంగా ఓ కోతి మెదడులో చిప్ అమర్చారు. తర్వాత.. అదెలా వ్యవహరించిందో ఈ ప్రజంటేషన్‌లో చూపించారు. ఎలాంటి పరికరం, జాయ్ స్టిక్ లేకుండానే.. కోతి వీడియో గేమ్ ఆడుతున్నట్టు వీడియోలో ప్రదర్శించారు. మెదడులో అమర్చిన చిప్ ద్వారానే.. ఆ కోతి కంప్యూటర్‌కు ఆదేశాలిస్తున్నట్టు న్యూరాలింక్ తెలిపింది.

మనిషి మెదడులో పెట్టబోయే చిప్‌ తో పాటు దాన్ని పుర్రెలో అమర్చే రోబోను కూడా మస్క్ ప్రదర్శించారు.

అయితే.. మనిషి మెదడులో చిప్‌ ను చొప్పించి.. ప్రయోగాలు చేయాలంటే.. కచ్చితంగా అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ FDA అనుమతులు కావాల్సి ఉంటుంది. ఇందుకోసం న్యూరాలింక్ ఇప్పటికే అన్ని పత్రాలను సమర్పించింది.

వచ్చే ఆరు నెలల్లో దీనికి సంబంధించిన హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మనిషి మెదడుతో పాటు ఇతర శరీర భాగాల్లోనూ చిప్‌లు అమర్చడంపై న్యూరాలింక్ ఎప్పటి నుంచో ప్రయోగాలు చేస్తోంది. పక్షపాతం వచ్చిన వారిలో దెబ్బతిన్న అవయవాలను కదిలించగలిగేలా చేసేందుకు.. వెన్నుపూసలో అమర్చేందుకు వీలుగా రూపొందించిన చిప్‌ను కూడా మస్క్ ప్రదర్శించారు.

దీంతో పాటు చూపు కోల్పోయిన వారికి సాయపడేలా మరో పరికరాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ రెండింటిలోనూ కచ్చితంగా విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు.. హై బ్యాండ్‌విడ్త్‌ బ్రెయిన్ మిషన్‌ తో మనుషులను, యంత్రాలను లింక్ చేయడమే తమ ప్రాజెక్టు లక్ష్యమని న్యూరాలింక్ చెబుతోంది.

బ్రెయిన్‌ – కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌.. బీసీఐలో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన N1 అనే చిప్‌ ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకతో పోలిస్తే వాటి మందం 20వ వంతు మాత్రమే ఉంటుంది. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్1 సాధనాన్ని అమరుస్తారు. ఒక్క చిప్‌లో 3 వేలకు పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు.

అవి సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. అందువల్ల సమీపంలోని కణజాలానికి నష్టం ఉండదు. మనిషి పుర్రెలో చొప్పించిన చిప్.. చెవిపై ఉండే ఒక సాధనంతో వైర్‌లెస్‌ పద్ధతిలో అనుసంధానమై ఉంటుంది. అది బ్లూటూత్‌ సాయంతో సమీపంలోని స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ అవుతుంది.

ఎన్1 చిప్‌ని.. మెదడుకు దూరంగా పెడితే.. అది ఇచ్చే సంకేతాలను కచ్చితత్వంతో గుర్తించడం సాధ్యం కాదు. అందువల్లే పుర్రెలో అమర్చాల్సి వస్తోంది. ఎలక్ట్రోడ్లు, మెదడులోని న్యూరాన్ల మధ్య సందేశాలను గుర్తించి ఎన్‌1 చిప్‌కు పంపుతాయి. ఒక చిప్‌లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి.

మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్‌లను ప్రవేశపెట్టొచ్చు. ఇన్‌స్టాల్‌ అయ్యాక ఈ బీసీఐ.. మెదడు నుంచి విద్యుత్‌ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గారిథమ్‌లుగా మారుస్తుంది. ఇలా మనిషి ఆలోచనలను ఎలక్ట్రానిక్ డివైజెస్‌ తో నియంత్రించొచ్చు. న్యూరాలింక్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే కోతులు, పందులపై ప్రయోగాలు విజయవంతమయ్యాయి.

ఈ సాధనం సేఫ్ అని.. నమ్మదగినదని తేలినట్లు.. న్యూరాలింక్ సంస్థలోని నిపుణులు చెబుతున్నారు. దీంతో.. తర్వాతి దశలో మనిషి మెదడుపై ప్రయోగం చేసేందుకు మస్క్ టీమ్‌ రెడీ అవుతోంది.

మనిషి మెదడు, శరీరంలోని మిగతా అవయవాలకు న్యూరాన్ల ద్వారా సంకేతాలను పంపడం, అందుకోవడం జరుగుతుంది. ఈ కణాలు పరస్పరం అనుసంధానమై.. న్యూరో ట్రాన్సిమీటర్లనే రసాయన సాంకేతికతో కమ్యూనికేట్ చేస్తాయి. ఈ ప్రక్రియ జరిగే సమయంలో ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఏర్పడుతుంది.

మెదడులోని వివిధ న్యూరాన్లకు సమీపంలో ఎలక్ట్రోడ్లను ఉంచడం ద్వారా.. వాటిలోని విద్యుత్ సంకేతాలను రికార్డు చేయడం న్యూరాలింక్ ప్రాజెక్టు ఉద్దేశం. మనిషి మెదడులోని ఆలోచనా శక్తి సాయంతో చిప్‌ల ద్వారా యంత్రాలతో అనుసంధానం కావొచ్చు. అలాగే.. నాడీ కదలికలకు సంబంధించిన వ్యాధులకు కూడా చికిత్సలు చేయవచ్చు.

వినడానికి ఇదంతా.. సైన్స్ ఫిక్షన్ స్టోరీలా అనిపించినా.. ఈ మహాద్భుతాన్ని ఆవిష్కరించే దిశగా న్యూరాలింక్ ముందుకు సాగుతోంది. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్.. బీసీఐ టెక్నాలజీని.. మానవులపై ప్రయోగించే దాకా న్యూరాలింక్ ప్రాజెక్ట్ చేరుకుంది. మనిషి మెదడులో చిప్ అమర్చే మస్క్ ప్రయోగాలు ఫలిస్తే.. మానవ చరిత్రలోనే అతిపెద్ద విజయంగా రికార్డులకు ఎక్కనుంది.

మెదడులోని వివిధ న్యూరాన్లకు సమీపంలో ఎలక్ట్రోడ్లను ఉంచడం ద్వారా.. వాటిలోని విద్యుత్ సంకేతాలను రికార్డు చేయడం న్యూరాలింక్ ప్రాజెక్టు ఉద్దేశం. వినడానికి ఇదంతా.. సైన్స్ ఫిక్షన్ స్టోరీలా అనిపించినా..

ఈ మహాద్భుతాన్ని ఆవిష్కరించే దిశగా న్యూరాలింక్ ముందుకు సాగుతోంది.

Must Read

spot_img