Homeఅంతర్జాతీయంఈజిప్టులోని పిరమిడ్లలో గ్రేట్‌ గిజా పిరమిడ్‌ ఓ అద్భుతం

ఈజిప్టులోని పిరమిడ్లలో గ్రేట్‌ గిజా పిరమిడ్‌ ఓ అద్భుతం

పిరమిడ్‌ అంటే ఠక్కున గుర్తు కొచ్చే దేశం ఈజిప్ట్… అతిపురాతన నాగరికతకు పేరుగాంచింది ఈజిప్టు.. పిరమిడ్స్, మమ్మీల తో పాటు ఎన్నో రహస్య ప్రదేశాలకు కూడా కేరాఫ్ అడ్రస్.. ప్రపంచంలో అత్యంత గొప్ప, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన కట్టడాల్లో ఈజిప్టు పిరమిడ్లు ప్రముఖమైనవి.. ప్రపంచవ్యాప్తంగా పేరొందినవి. ఇవి ప్రపంచ వింతల్లో ఒకటి. ప్రాచీన, మధ్య యుగపు ఈజిప్టు నాగరికతలకు ఇవి ప్రతిబింబంగా నిలిచిపోయిన ఈ పిరమిడ్ల గురించి ఎన్నో రహస్యాలు దాగున్నాయి. క్రీ.పూ. 2886-2160 నాటి ఈ పిరమిడ్ల రహస్యాలను ఛేదించాలని పురవాస్తు పరిశోధకులు వారి పరిశోధనలను కొనసాగిస్తునే ఉన్నారు. ఈజిప్టులో గ్రేట్‌ గిజా పిరమిడ్‌ ఉత్తరభాగంలో భారీ సొరంగాన్ని కనుగొన్నారు. ఈ సొంరంగం సుమారు 30అడుగుల పొడవున.. ఆరు అడుగుల వెడల్పుగా ఉంది.

ఈజిప్టులోని పిరమిడ్లలో గ్రేట్‌ గిజా పిరమిడ్‌ ఓ అద్భుతం. అంతులేని మిస్టరీ. ఈ మిస్టరీలను ఛేధించటానికి నిరంతరం పరిశోధనలు జరుగుతునే ఉన్నాయి. ఈక్రమంలోనే పరిశోధకులు ఈజిప్టులో గ్రేట్‌ గిజా పిరమిడ్‌ ఉత్తరభాగంలో భారీ సొరంగాన్ని కనుగొన్నారు. ఈ సొంరంగం సుమారు 30 అడుగుల పొడవున..ఆరు అడుగుల వెడల్పుగా ఉంది. పిరిమిడ్‌లోని గుర్తించని భాగాలను కనిపెట్టడమే లక్ష్యంగా చేపట్టిన అంతర్జాతీయ ప్రాజెక్టు ‘స్కాన్‌ పిరమిడ్స్‌ ప్రాజెక్టు’లో భాగంగా తాజా సొరంగాన్ని గుర్తించామని ఈజిప్టు పర్యాటక శాఖ మంత్రి అహ్మద్‌ మార్చి3,2023న ప్రకటించారు. ఈజిప్టులో నైలునదీ లోయకు 51 వ మైలు వద్ద, నైలు నదికి పశ్చిమంలో, ప్రాచీన మెంఫిసిన్ వద్ద సుమారు 700 కి పైగా పిరమిడ్ లు కనిపిస్తాయి. ఈ పిరమిడ్లలో ఈజిప్టు రాజులను సమాధి చేశారు. ఈ పిరమిడ్ల నిర్మాణానికి దాదాపు 1000 సంవత్సరాలు పట్టి ఉండవచ్చునని చరిత్ర కారుల అంచనా.

ఈజిప్ట్ లోని పిరమిడ్ లలో ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా లేదా ఖుఫు పిరమిడ్ అత్యంత ప్రాచీనమైనది. ఇది అతి పెద్ద పిరమిడ్లలో మూడవది. భూమిపైన ఉన్న భారీ పురాతన నిర్మాణాలలో గిజా పిరమిడ్ కూడా ఒకటి. ఇది “ఛెఫ్‌రాన్” పిరమిడ్ కు నైఋతి దిశలో ఉంది. దీనిని పిరమిడ్ మైసిరిసన్ అని గూడా పిలుస్తారు. ఇది 354 అడుగుల ఎత్తు ఉంటుంది.. ఈ పిరమిడ్ ముఖతలాలు పింక్ రంగు గ్రానైట్,సున్నపు రాయి మిశ్రమ ఫలకాలతో నిర్మాణమైనవి. ప్రాచీన ప్రపంచ ఏడు వింతల్లో ఈ పిరమిడ్ ఒకటి.

నాలుగవ ఈజిప్ట్ ఫారో అయిన ఖుఫు మరణానంతరం దీనిని 20 ఏళ్ళ పాటు నిర్మించి… క్రీ.పూ. 2560లో పూర్తి చేసారని చెబుతుంటారు.. ఈ నిర్మాణం పూర్తి అయిన నాటికి దీని ఎత్తు 146.6 మీటర్లు. ఈ పిరమిడ్ ఒక్కో భుజం 225 మీటర్లకు పైగా పొడవు కలిగి ఉంది. ఈ పిరమిడ్ బరువు 59 లక్షల టన్నులు అనిఅంచనా. ఈ పిరమిడ్ నిర్మాణం ఎంత ఖచ్చితంగా జరిగిందంటే 225 మీటర్ల పొడవు ఉన్న నాలుగు భుజాల మధ్య కేవలం 58 మిల్లీ మీటర్ల తేడా మాత్రమే ఉన్నది. ఈ పిరమిడ్ నిర్మాణానికి దాదాపు రెండు లక్షల మంది పనిచేసారట.ఈ పిరమిడ్ లోపల రెండో అతిపెద్ద ఖాళీ ప్రదేశాన్ని మ్యూరోగ్రఫీ సాయంతో 2017లో గుర్తించారు.

సుమారు 30 మీటర్ల పొడవు, 7 మీటర్ల ఎత్తున ఈ ఖాళీ ప్రదేశం ఉంది..ఎండోస్కోప్ స్కానింగ్ వీడియోలో గిజా పిరమిడ్ లోపలి భాగంలో 9 మీటర్ల పొడవు, 2.1 మీటర్ల వెడల్పు ఉన్న ఒక కారిడార్ ఉన్నట్లు కనిపించింది. ప్రవేశ ద్వారం చుట్టూ పిరమిడ్ బరువును సమంగా పంచేందుకు వీలుగా ఏర్పాటు చేసిన సొరంగమైనా అయ్యుండచ్చు లేదా వివరాలు తెలియని చాంబర్ అయినా అయ్యుండొచ్చని ఈజిప్టు అధికారులు తెలిపారు.స్కాన్ పిరమిడ్స్ ప్రాజెక్ట్‌కు చెందిన కొందరు శాస్త్రవేత్తల బృందం పరిశోధన చేస్తున్న సమయంలో పిరమిడ్‌లో సాంద్రత మార్పులను పసిగట్టింది.గ్రేట్ పిరమిడ్ ఉత్తర వైపు, ప్రధాన ప్రవేశ ద్వారానికి 7 మీటర్ల పై భాగాన రాతి చెక్కడాలు ఉన్న చోట లోపల భాగంలో ఈ ఖాళీ ప్రదేశాన్ని గుర్తించారు.

అనంతరం రాడార్, అల్ట్రా సౌండ్ టెక్నిక్స్‌తో మరికొన్ని పరీక్షలు చేశారు. ఆ తరువాత 6 మిల్లీమీటర్ల ఎండోస్కోప్‌ను ఆ రాళ్ల మధ్య ఉన్న ఖాళీలలోంచి లోనికి పంపించారు. ఎండోస్కోపీ తరువాత దానికి సంబంధిన వీడియో ఫుటేజ్‌ను శాస్త్రవేత్తల బృందం విడుదల చేసింది. రాతిగోడల మధ్య ఖాళీగా ఉన్న కారిడార్ అందులో కనిపించింది. ‘‘పిరమిడ్‌ను ఇంకా స్కాన్ చేస్తాం. దానివల్ల లోపల ఇంకా ఏమేం ఉన్నాయి.. ఈ కారిడార్ చివరన ఏముందనేది తెలుసుకోవడానికి ఏం చేయాలో అర్థమవుతుంది’’ అని ఈజిప్ట్ సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యాంటిక్విటీస్ హెడ్ మొస్తాఫా వాజిరీ వెల్లడించారు.. గీజాతో పాటు, “స్ఫినిక్స్” చాలా ప్రసిద్ధమైనవి. ఇవి రాతి శిల్పాలు. మనుష్యుని తల, మిగిలిన శరీర భాగంలో సింహం ఆకృతిలో ఉంటాయి. ఇది “ఛిఫ్‌రాన్” ఆకారంగా చెప్పబడుతోంది. ఈ స్ఫినిక్స్ ను సూర్య దేవునిగా భావించి, పూజచేయడం, ఆరాధించడం ఈజిప్షియన్ల ఆచారం..

ఈజిప్ట్‌లోని ‘గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా’ ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా పేరుగాంచాయి. ఈ పిరమిడ్‌లు సుమారు 4 వేల సంవత్సరాల నాటివి. ఈ దేశంలోని పిరమిడ్స్‌ ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ పిరమిడ్‌లు మృతదేహాల సంరక్షణ కోసం నిర్మించబడినప్పటికీ నేలమాళిగలో రాజు మమ్మీ/రాణి మమ్మీలను కనుగొనబడలేదు. గిజా పిరమిడ్ల లోపల ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంటుంది. బయట ఎంత వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా లోపల ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్‌ మాత్రమే ఉంటుంది.

ఇది కూడా మిస్టరీనే. ఈ పిరమిడ్‌ల కట్టడాలకు ఉపయోగించిన రాళ్ళ బరువు 2 నుంచి 30 టన్నుల వరకు ఉంటుంది. కొన్ని రాళ్ళు 40-45 వేల కిలోల బరువు కలిగి ఉంటాయి. వీటి నిర్మాణ సమయంలో ఎటువంటి టెక్నాలజీ లేకుండా ఇంత పెద్ద రాళ్లను ఎలా పిరమిడ్ పైన పేర్చారన్నది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగా ఉంది.. గిజా పిరమిడ్ లోపల ఉన్న మొత్తం బేస్మెంట్లలో ఎన్ని సెలార్లు ఉన్నాయో ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయారు. ప్రస్తుతానికి మూడు సెల్లార్లు మాత్రమే కనుగొన్నారు. వీటిని బేస్ సెల్లార్, కింగ్స్ సెల్లార్, క్వీన్స్ సెల్లార్ అని పిలుస్తారు.

Must Read

spot_img