ప్రస్తుతం ప్రపంచంలో ఆర్థిక మాంద్యం నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. బ్రిటన్ తరువాత అంతటి మరో యూరప్ దేశం అయిన ఫ్రాన్స్ లో అగ్నిజ్వాలలు రగులుతున్నాయి. బ్రిటన్ లో ఆహార సంక్షోభం ఉంటే అదే ఫ్రాన్స్ లో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోవడం వలన నిరసనలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ విషయాలేవీ..అంతర్జాతీయ మీడియాలకు కనపడవు. మన దేశంలో జరిగేవాటిపై చూపించినంత శ్రధ్ద యూరప్ దేశాలలోని వార్తలపై ఉండదు. వారెంత సేపూ మన దేశంలోని ప్రజాస్వామ్యంపైనే ఆసక్తిని పెంచుకోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది.
ప్రాన్స్ అధ్యక్షుడు మేకరాన్ కొత్త పెన్షన్ని బంధనలను తీసుకురావాలని ఆశిస్తూ కొత్త చట్టానికి రూపకల్పన చేస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఫ్రాన్స్ దేశంలో పదవీ విరమణ వయస్సును 62 ఏళ్ల నుంచి 64 ఏళ్లకి పెంచాలని చూస్తున్నారు అధ్యక్షుడు మెకరాన్. దీని వల్ల రిటైర్ అయ్యేవాళ్లకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ పెద్ద మొత్తంలో ఉంటాయి..దాంతో ఖజానా మోయలేదు కాబట్టి రిటైర్మెంట్ వయో పరిమితిని రెండేళ్లు పెంచడం వలన ఆ కాలనికి కేవలం జీతాలు ఇస్తే చాలని అనుకుంటున్నారు.
అయితే రిటైర్మెంట్ వయసు పెంచడం ఒక్కటే ఆందోళనలకి ప్రధాన కారణం అయినా కొత్త కార్మిక చట్టాలని తేవాలని ప్రతిపాదించడం కూడా ఆందోళనలకు దారి తీసింది. మెకరాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానపరమైన నిర్ణయాలపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. పదవీ విరమణ వయస్సును 62 నుంచి 64కు పెంచుతూ ప్రభుత్వం చట్టం తేవడం, ఓటింగ్ లేకుండా పార్లమెంటు ఆమోదించ డంతో పరిస్థితి మరింత జఠిలమైంది. పింఛన్ సంస్కరణలకు వ్యతిరేకంగా జనవరి నుంచి జరుగుతున్న ఆందోళనలు, సమ్మెలు, నిరసనలు, ప్రదర్శనలు మరింత తీవ్రంరూపం దాల్చాయి. అయితే పెన్షన్ బిల్లుని వ్యతిరేకిస్తూ ప్రదర్శన చేస్తున్న నిరసనకారులపై మాక్రాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. టియర్‌గ్యాస్‌తో పాటు డస్ట్‌బిన్‌లకు నిప్పటించినిరసనకారులను అణచివేయాలని చూస్తోంది అక్కడి ప్రభుత్వం..

ఇప్పటికే వందలాది మందిని అరెస్టు చేశారు. పార్లమెంట్ అనుమతి లేకుండా మాక్రాన్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ బిల్లును వ్యతిరేకిస్తూ శనివారం దక్షిణ పారిస్‌లోని ప్లేస్ డిఇటాలిలో వేలాది మంది ప్రదర్శన నిర్వహించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. రిఫైనరీల్లోని కార్మికులతో పాటు పారిశుధ్య కార్మికులు కూడా సమ్మెకు దిగారు. దీంతో పారిస్ వీధులు చెత్తమయమయ్యాయి.రిఫైనరీలు, డిపోలకు చెందిన 37 శాతం మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గన్నారని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. రైల్వే కార్మికులు కూడా ఆందోళన బాట పట్టారు. పెన్షన్ సంస్కరణ బిల్లుని అమలు చేసి తీరతామని, నిరసనలను సహించేది లేదని ఆర్థిక మంత్రి బ్రూనో మీడియాకు వివరించారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అమలు చేయతలపెట్టిన పెన్షన్ సంస్కరణల పట్ల దేశంలో ఆందోళనలు,నిరసనలు ఇలా దేశంలోని అన్ని చోట్లా కొనసాగుతునే వున్నాయి. గురువారం కూడా పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ రాజు చార్లెస్ 3 పర్యటన కూడా వాయిదా పడినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అధికారిక పర్యటనలో ఆదివారం రావాల్సి వుంది. శుక్రవారం ప్రధానమైన ఆందోళనలు ఎక్కడా జరగకపోయినా రైళ్ళ రాకపోకలకు మాత్రం అక్కడక్కడా అంతరాయం కలిగింది.
మార్సెల్లె వాణిజ్య ఓడరేవులో సరుకుల ట్రక్కులను అడ్డుకున్నారు. గురువారం నాటి ప్రజా ఆందోళనల నేపథ్యంలో వెయ్యికిపైగా చెత్తబుట్టలనుతగలబెట్టడంతో పారిస్ వీధులన్నీ గందరగోళంగా వున్నాయి. వారాల తరబడి సాగుతున్న సమ్మెలతో పేరుకుపోయిన చెత్తబుట్టలన్నీ నిరసనలకు గుర్తుగా మారాయి. ఇప్పటివరకు 450మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తంగా 300కి పైగా ప్రదర్శనలు జరిగాయి. పెన్షన్ సంస్కరణలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో 10లక్షల మందికి పైగా ప్రజలు పాల్గన్నారు.

కాగా కొన్ని ప్రదర్శనల్లో హింస చెలరేగిందని, ఆ సందర్భంగా 440మంది పోలీసులు గాయపడ్డారని హౌం మంత్రి గెరాల్డ్ డర్మానిన్ తెలిపారు. పదవీ విరమణ వయస్సును 62 నుండి 64కి పెంచుతూ మాక్రాన్ ప్రభుత్వం తీసుకువచ్చిన పెన్షన్ బిల్లును మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అయితే వ్యవస్థను సుస్థిరంగా వుంచాలంటే ఈ చర్య తప్పదని మాక్రాన్ చెబుతున్నారు. అయితే అధ్యక్షుడు మెకరాన్.. కార్పోరేటు, వ్యాపార వర్గాలకు మేలు చేకూర్చే విధంగా కార్మిక చట్టాలను సవరించాలని చూస్తున్నాడని జనం ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కార్పోరేటు సంస్థల మీద పన్ను తగ్గింపుల్లాంటి చర్యలు దానికి ఊతమిస్తున్నాయి. ఇప్పుడు కొత్త చట్టానికి శ్రీకారం చుడితే అది కార్మికులకు అన్యాయం చేసినట్టవుతుందన్నది మరో ఆరోపణగా ఉంది.
నిజానికి అక్కడేం జరుగుతోందంటే..ఫ్రాన్స్ లో లాభాలు ఆర్జించలేని పెద్ద పెద్ద కార్పొరేటు సంస్థలు లేదా వ్యాపార సంస్థలు లాభాలు గడించలేక మూసివేయాల్సి వస్తే కార్మికులకు భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే అది తప్పించుకోవడానికి అవి మెకరాన్ పై వత్తిడి తెస్తున్నాయి. గత ఆరేళ్లలో ఫ్రాన్స్ లోని కార్పోరేటు పరిశ్రమల్లో, స్థానిక వ్యాపారాలలో విదేశీ పెట్టబడులు గణనీయంగా పెరిగాయి. దీనికి కారణం ఉంది. బ్రిటన్ దేశం బ్రెక్సిట్ పేరుతో యురోపియన్ కూటమి నుంచి వైదొలగడంతో చాలా దేశాలు బ్రిటన్ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుని ఫ్రాన్స్ లో పెట్టాయి.
అయితే వీరికో భయం కూడా ఉంది. తమ వ్యాపారాలు ఏ కారణంగానైనా నడవకపోతే ఎలా అన్న కోణంలో తమకు సాయం చేయాలని మెకరాన్ ని కోరుతున్నాయి. సంస్థ మూసివేస్తే కార్మికులకు ఇచ్చే నష్టపరిహారం విషయంలో కొంత వెసులుబాటు ఇవ్వాలని కోరాయి. ఇవన్నీ చూసిన మెకరాన్ కు ఈ విషయంలో సంస్కరణలు తేవడం తప్ప మరో మార్గం కనిపించలేదు. అయితే ఇది ప్రజలకు అస్సలు ఇష్టం లేదు. ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీలోని ఎగువసభలో చట్టం తేవడానికి ప్రతిపాదనలని సిద్ధం చేసి పార్లమెంటులో ఓటింగ్ కు పెట్టకుండా బిల్లు పాస్ చేయడానికి మెకరాన్ ప్రయత్నించారు.
అది గుర్తించిన ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఆందోలనలు యధేచ్చగా సాగాయి. పోలీసులు అడ్డుకుని ఉక్కుపాదం మోపడానికి ప్రయత్నించడంతో హింస ప్రజ్వరిల్లింది. ఫ్రాన్స్ అధ్యక్షుడికి ప్రత్యేక అధికారం ఉన్న నేపథ్యంలో బిల్లును కనుక పార్లమెంటు వ్యతిరేకించే అవకాశం లేకుండా పోతుతంది. దాంతో ఓటింగ్ అనేదే లేకుండా మెకరాన్ తాననుకున్నది చేసేందుకు అవకాశం ఉంది. అందుకే ప్రజలలో వ్యతిరేకతలు పెరిగాయి. కేవలం ఈ అంశం ప్రజలలో నిరసనలు, ధర్నాలకు ట్రిగ్గరింగ్ పాయింటుగా మారింది. రష్యా ఉక్రెయిన్ యుధ్దం కూడా ఫ్రాన్స్ లో అల్లర్లు అశాంతికి కారణమవుతోంది. ఇంధనం దొరక్క అది పరోక్షంగా ద్రవ్యోల్బణానికి దారి తీసిన స్థితిలో ఆర్థిక పరిస్థితిని దారిలో పెట్టాలన్న మెకరాన్ ఉద్దేశ్యం మంచిదే కానీ ప్రజలు ఇష్టపడనప్పుడు అది సఫలం అవదని అంటున్నారు నిపుణులు. ఒకవైపు అమెరికాలో ఒకదాని తరువాత మరొకటిగా బ్యాంకులు మూతపడుతున్నాయి.
అయినా ఫెడరల్ రిజర్వ్ డాలర్లు ప్రింటు చేస్తూనే ఉంది. దాంతో తాత్కాలిక ఉపశమనం లభించినా దానిలా ఫ్రాన్స్ కూడా తమ దేశంలో యూరోలను ప్రింటు కొట్టలేదు..కాబట్టి వేరే మార్గం వెతుక్కోవాల్సిందే..బ్యాంకింగ్ రంగం సంక్షోభంలో పడకూడదని మెకరాన్ ఆశిస్తున్నారు కానీ అది నెరవేరేలా కనిపించడం లేదు. ఇప్పుడు అధ్యక్షుడు ప్రవేశపెట్టాలనుకున్న సంస్కరణలు ప్రజలకు మేలు చేసేవిధంగానే ఉన్నాయి. కానీ ఆ విషయాన్నా ప్రజలు నమ్మడం లేదు.
యుధ్దం కారణంగా ఇంధనాన్ని ఎక్కువ ధర పెట్టి కొనాల్సి వచ్చేసరికి ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థలోని లోపాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. దీని ప్రకారం యూరప్ ని భారతదేశంతో పోల్చి చూస్తే మనం ఎంత ఎక్కువగా డాలర్లు చెల్లించి ఇన్నాళ్లూ మనుగడ సాధించామన్నది అంతా తెలుసుకోవాలి. అమెరికా సహా యూరప్ ఇష్టానుసారం క్రూడ్ ఆయిల్ ధరలను నియంత్రిస్తూ అభివ్రుద్ది చెందుతున్న దేశాలు తమను తాము కంట్రోల్ చేస్తూ వచ్చాయి. ఇక మిగిలింది పెట్రో డాలర్ల ఆధిపత్యానికి చెల్లుచీటీ రాయడమేనని నిపుణులు భావిస్తున్నారు. అది జరిగేంత వరకు అభివ్రుద్ది చెందుతున్న దేశాలు శతాబ్దాలు గడచినా ఎప్పటికీ అభివ్రుద్ది చెందుతున్న దేశాల క్యాటగిరీలోనే ఉండిపోవడం ఖాయం..