Homeజాతీయంపాకిస్థాన్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం !!!

పాకిస్థాన్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం !!!

ప్రస్తుతం పాకిస్థాన్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను దెబ్బతీసింది, రోగులకు అవసరమైన మందుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి కొనడానికి మందులు కూడా దొరకని పరిస్తితి పాకిస్తాన్ లో నెలకొని ఉంది. నిజానికి ఫార్మసీ మందులు కూడా పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటోంది. వాటిని ఖరీదు చేయాలంటే విదేశీ మారక ద్రవ్యం అవసరం ఉంటుంది. అవి జీరోకు మారడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు..

ప్రస్తుతం పాకిస్థాన్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను దెబ్బతీసింది, రోగులకు అవసరమైన మందుల కోసం ఇబ్బందులు పడుతున్నారు.తక్కువ విదేశీ మారక నిల్వలతో దేశీయ ఉత్పత్తిలో ఉపయోగించే అవసరమైన మందులు లేదా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్స్ దిగుమతి చేసుకునే సామర్థ్యం బాగా తగ్గిపోయింది. స్థానిక ఔషధ తయారీదారులు తమ ఉత్పత్తిని తగ్గించుకోవాలంటూ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ఫలితంగా రోగులు ఇబ్బందులకు గురువుతున్నారు. మందులు మరియు వైద్య పరికరాల కొరత కారణంగా వైద్యులు శస్త్రచికిత్స చేయడం మానివేసారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, పాకిస్తాన్‌లోని ఆపరేషన్ థియేటర్‌లలో రెండు వారాల కంటే సరిపోని స్థాయిలో అనెస్థేషియా మత్తుమందులు ఉన్నాయి.

గుండె, క్యాన్సర్ మరియు మూత్రపిండాల శస్త్రచికిత్సలతో సహా సున్నితమైన శస్త్రచికిత్సలకు మత్తుమందులు చాలా ముఖ్యమైనవి. పాకిస్తాన్ వద్ద చాలా తక్కువ స్థాయిలోనే విదేశీ మారక నిల్వలు మిగిలి ఉన్నాయి. దాంతో అది విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సామర్థ్యం కోల్పోయింది. అంతే కాదు దేశంలో ఔషధాల తయారీ ఎక్కువగా దిగుమతిపైనే ఆధారపడి ఉంటుంది. పాకిస్థాన్‌లో తయారయ్యే దాదాపు 95 శాతం ఔషధాలకు భారత్ లేదా చైనాతో సహా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి పదార్థాలు అవసరమవుతాయి. అంతేకాకుండా, ఔషధ తయారీదారులకు దిగుమతి ప్రయోజనాల కోసం కొత్త లెటర్స్ ఆఫ్ క్రెడిట్ లు జారీ చేయడంలో వాణిజ్య బ్యాంకులు కూడా వెనుకాడుతున్నాయి.పెరుగుతున్న ఇంధన ధరలు మరియు రవాణా ఛార్జీలు, పాకిస్తానీ రూపాయి విలువను బాగా తగ్గించాయి.

స్థానిక మీడియా నివేదికల ప్రకారం, పాకిస్థాన్‌లోని పంజాబ్‌లోని డ్రగ్ రిటైలర్లు ఎదుర్కుంటున్న మందుల కొరతను అంచనా వేసేందుకు ప్రభుత్వ సర్వే బృందాలు క్షేత్రస్థాయి పర్యటనలు చేశాయి. ప్రస్తుతం దేశంలో పనాడోల్, ఇన్సులిన్, బ్రూఫెన్, డిస్ప్రిన్, కాల్పోల్, టెగ్రల్, నిమెసులైడ్, హెపామెర్జ్, బస్కోపాన్ మరియు రివోట్రిల్ వంటి సాధారణ మందులు కూడా దొరకడం లేదు. జనవరిలో, పాకిస్తాన్ ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ సెంట్రల్ చైర్మన్ సయ్యద్ ఫరూక్ బుఖారీ మాట్లాడారు. దిగుమతులపై నిషేధం ఇలాగే కొనసాగితే “దారుణమైన ఔషధ సంక్షోభం” తలెత్తనుందని హెచ్చరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న దిగుమతులపై నిషేధం లాంటి విధానాలు రాబోయే నాలుగైదు వారాల పాటు అమల్లో ఉంటే దేశంలో ఔషధ సంక్షోభం తప్పదని ఆయన హెచ్చరించారు.

పాకిస్తాన్‌ దాదాపు దివాలా తీయడానికి సిద్దంగా ఉందని కొందరు, ఆల్ రెడీ దివాలా తీసిన దేశంలోనే బతుకుతున్నామని రక్షణమంత్రి చేసిన ప్రకటనతో జనం అయోమయంలో పడుతున్నారు. ఏం చేద్దామన్నా చేతిలో చిల్లి గవ్వలేదు. తాజాగా చైనా పాకిస్తాన్ కు 700 మిలియన్ డాలర్ల అప్పు మంజూరు చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్‌కు చైనా సుమారు 30 బిలియన్‌ డాలర్ల రుణం ఇచ్చింది. పాకిస్తాన్‌ సెంట్రల్‌ బ్యాంకు వద్ద విదేశీ మారకద్రవ్యం నిల్వలు కేవలం మూడు బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా సౌదీ అరేబియా అనామతు ఖాతా కింద అప్పుగా ఇచ్చింది. వాటిని ఖర్చు చేయరాదన్న షరతుపై అందజేసింది. కానీ పాకిస్తాన్ వాటిని కూడా కొరుక్కు తినడం మొదలుపెట్టింది. దీంతో పాకిస్తాన్‌ డిఫాల్ట్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఐఎంఎఫ్‌ కనికరించి 1.2 బిలియన్‌ బెయిలవుట్ ప్రాజెక్టు కింద రుణం ఇస్తే వాటిలో 750 మిలియన్‌ డాలర్లు అప్పులు చెల్లించి పరిస్థితిని తాత్కతాలికంగా నెట్టుకురావచ్చు. మొత్తానికి పాకిస్తాన్‌ పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్షులా తయారైందనే అంటున్నారు నిపుణులు. అయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ నుంచి రుణం కోసం పాకిస్తాన్ నానా తంటాలు పడుతోంది. ఇందులో భాగంగా ఐఎంఎఫ్ విధించిన నిబంధనలను దేశంలో అమలు చేస్తోంది. తాజాగా పాకిస్థాన్ ప్రభుత్వం.. పాలసీ వడ్డీ రేటును ఏకంగా 200 బేసిస్ పాయింట్లు.. అంటే.. ఏకంగా 2 శాతం పెంచేసింది. దీంతో ఆ దేశంలో కీలక పాలసీ వడ్డీ రేటు19 శాతానికి చేరింది. ఈ కారణంగా ఆ దేశంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న ప్రజలపై భారీగా అదనపు భారం పడనుంది. 1.1 బిలియన్ డాలర్ల ఎంఐఎఫ్ బెయిల్అవుట్ ప్యాకేజీ కోసం పాకిస్థాన్ తాజా చర్య తీసుకుంది.

Must Read

spot_img