Homeఅంతర్జాతీయంభారత్‌లోనూ భూకంప ప్రళయం తప్పదా..?

భారత్‌లోనూ భూకంప ప్రళయం తప్పదా..?

టర్కీ సిరియా భూకంపాలను గురించి జోస్యం చెప్పిన శాస్త్రవేత్త మనదేశం గుండెలు జల్లుమనిపించే హెచ్చరికలు చేసారు. నెదర్లాండ్ కు చెందిన ఈ పరిశోధకుడు మూడు రోజులకు ముందే టర్కీ సిరియా భూకంపాలను గురించి స్పష్టంగా తన ట్విట్టర్ లో వివరించారు.ఇప్పుడు తాజాగా భారత్ తో పాటు ఆఫ్గనిస్తాన్ , పాకిస్తాన్ లో కూడా తీవ్రమైన భూకంపాలు వస్తాయని చెప్పడం సంచలనం స్రుష్టిస్తోంది..

  • టర్కీ భూకంపాన్ని ముందుగానే చెప్పిన శాస్త్రవేత్త భారత్‌లోనూ భూకంప ప్రళయం తప్పదని మరో హెచ్చరిక చేసారు..

ఫిబ్రవరి 6వ తేదీన టర్కీలో సంభవించిన భారీ భూకంప దాదాపు 40వేల మందిని మింగేసింది. అయితే నెదర్లాండ్స్‌కు చెందిన ఒక పరిశోధకుడు 3 రోజుల ముందుగానే అంటే ఫిబ్రవరి 3వ తేదీనే ఇదంతా ఊహించారు. ఆయన ఇప్పుడు మరో బాంబులాంటి విషయం వెల్లడించారు. భారతదేశంతో పాటు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లో కూడా తీవ్రమైన భూకంపాలు వస్తాయని చెప్పిన మాటలు సంచలనం రేపుతున్నాయి.

ఈ భూకంప హెచ్చరికకు సంబంధించి పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్‌బీట్స్‌ ఫిబ్రవరి 3, 2023 రోజున అతడు చెప్పిన మాటల మేరకు.. టర్కీ, సిరియాలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పట్లో ఆయన మాటలను జనం పెద్దగా పట్టించుకోలేదు. కానీ 3 రోజుల తర్వాత టర్కీ, సిరియాలో తీవ్రమైన భూకంపం సంభవించినప్పుడు, ప్రజలు హఠాత్తుగా ఫ్రాంక్ హగ్గర్‌బీట్స్‌ను గుర్తు చేసుకున్నారు. ఆయన కనీసం 72 గంటల ముందే ఈ హెచ్చరికలు చేసారు.. ఆ హెచ్చరికలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే ఇంత ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదని అంటున్నారు.

నిజానికి ఆయన గతంలో చెప్పిన జోస్యాలేవీ నిజం కాలేదు. అందుకే జనం ఆయన ట్విట్టర్ హెచ్చరికలను పట్టించుకోలేదు. తాను ఈ భూకంపాలను గురించి గ్రహాల కదలికల ఆధారంగా అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఆయన సోలార్ సిస్టమ్ జామెట్రీ సర్వే కోసం పనిచేస్తున్నారు. ఈ కంపెనీ భూకంప కార్యకలాపాలను అంచనా వేయడానికి ఖగోళ వస్తువులను పర్యవేక్షించే పరిశోధనా సంస్థ. అయినప్పటికీ, చాలా మంది శాస్త్రవేత్తలు ఫ్రాంక్ వాదనలపై ప్రశ్నలను కూడా లేవనెత్తారు.

ప్రతిస్పందనగా, ఫ్రాంక్ భూకంపానికి మూడు రోజుల ముందు చేసిన ట్వీట్ గురించి వివరించారు. తాను ఆ ప్రాంతంపై విస్తృతంగా పరిశోధన చేసారు. విస్తృత పరిశోధన ఆధారంగానే అక్కడ భూకంపం వస్తుందని ఊహించానని చెప్పారు. కాబట్టి ఏదైనా సంఘటన జరగకముందే ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలని అనుకున్నట్టుగా చెప్పారు. కానీ, 3 రోజుల తర్వాత ఇంత పెద్ద భూకంపం వస్తుందని తనకు కూడా తెలియదనే అంటున్నారు హగ్గర్ బీట్స్.

తన సంస్థ చరిత్రలో తీవ్రమైన భూకంపాల గురించి కూడా సవివరమైన పరిశోధన చేసిందని ఆయన చెప్పారు. సదరు సంస్థ ప్రత్యేకంగా గ్రహాల స్థితిని చూసి అంచనాలు వేస్తుంది. చరిత్రలో ప్రధాన భూకంపాలు అధ్యయనం చేయబడతాయి. తద్వారా శాంపిళ్ల సేకరణ ద్వారా విషయాన్ని కనుగొనడం ద్వారా భవిష్యత్తులో పెద్ద భూకంపాలను అంచనా వేయవచ్చని చెప్పారు.

  • ఫ్రాంక్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారతదేశంతో పాటు హిందూ మహాసముద్ర ప్రాంతం వరకు పెద్ద భూకంపాలు వస్తాయని అంచనా వేశారు..

అయితే, అంచనాలకు సంబంధించి ఇంకా కొంత గందరగోళం ఉంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ నుండి భూకంపం ప్రారంభమై హిందూ మహాసముద్రంలోకి వెళ్తుందని ఇంకా స్పష్టంగా తెలియలేదని ఆయనే స్పష్టం చేశారు.ఈ భూకంపం 2001 లాగా భారత్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ తాను చెప్పిన మాటలు, లెక్కల్లో ఖచ్చితత్వం ఉండదన్నారు. అంటే కచ్చితంగా ఏ ప్రాంతంలో భూమి కంపిస్తుంది లాంటివి చెప్పేటప్పుడు వందకు వందశాతం అని చెప్పడానికి వీలు లేదని అంటున్నారు. నిజానికి తమకు తెలిసిన భూకంప అంచనాకు సంబంధించిన ఈ టెక్నాలజీని ఇతర దేశాలతో పంచుకోవడం సవాలుగానే ఉంటుందని ఫ్రాంక్ చెప్పారు.

ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించే స్తోమత వారి వద్ద లేదు. తాను టర్కిష్ శాస్త్రవేత్తను సంప్రదించానని, కొంతమంది శాస్త్రవేత్తలు దీనిపై ఆసక్తి చూపుతున్నారని ఫ్రాంక్ చెప్పాడు. అతనికి సిరియా నుండి కొంత సానుకూల స్పందన వచ్చిందన్నారు. భారత శాస్త్రవేత్తల గురించి అడగ్గా, భారత ప్రభుత్వం తమను సంప్రదిస్తే, వారితో తమ పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఫ్రాంక్ చెప్పారు.

రాబోయే రోజుల్లో భారత్ పాకిస్తాన్ ఆఫ్గనిస్తాన్ దేశాలలో భూకంప ప్రళయం గురించిన వార్తలు సంచలనం స్రుష్టిస్తున్నాయి. ఇప్పటికే వాటిపై చర్చోపచర్చలు, టీవీల్లో డిబేట్లు కొనసాగుతున్నాయి. అటు బల్గేరియాకు చెందిన బాబా వంగా కూడా 2023 సంవత్సరంలో భారతదేశం పెను బీభత్సాన్ని చూసే అవకాశం ఉందని ఇదివరకు ఎప్పుడో తెలిపింది. మరి ఇవి ఎంత వరకు నిజమవుతాయన్నది కాలమే తేల్చాలని అంటున్నారు.

Must Read

spot_img