Homeఅంతర్జాతీయంభూకంపం కారణంగా వేలాది మంది దుర్మరణం

భూకంపం కారణంగా వేలాది మంది దుర్మరణం

విపరీతమైన ఆస్థినష్టం జరిగింది. అయితే ఇదే భూకంపం విడిపోయిన రెండు దేశాలను కూడా కలిపింది. మూడున్నర దశాబ్దాల క్రితం తెగిపోయిన బంధం మళ్లీ సరిహద్దులు దాటుకుని వచ్చేసింది. తుర్కియే పొరుగుదేశం ఆర్మేనియా నుంచి ఐదు ట్రక్కులు భూకంప బాధితులకు సాయాన్ని మోసుకు వచ్చాయి. వాటి కోసం ఇన్నాళ్లూ మూసివేసిన గుట్లు తెరచుకున్నాయి. ఇకపై తెరుచుకునే ఉండబోతున్నాయి.

ఆ రెండు దేశాలను మళ్లీ ‘భూకంప సాయమే’ కలిపింది.. 35 ఏళ్ల క్రితం మూసుకుపోయిన తుర్కియే ఆర్మేనియా సరిహద్దు కేంద్రం గేట్లు ఇప్పుడు తెరుచుకున్నాయి. దశాబ్దాల నాటి వైరం ఆ రెండు దేశాల మధ్య కొనసాగుతోంది. ఎప్పుడూ ఈ రెండు దేశాల మధ్య సరిహద్దులూ మూసే ఉంటాయి. అయితే, గతంలో ఆర్మేనియా దేశం భూకంపం బారిన పడగా.. తుర్కియే వివాదాలకు అతీతంగా వ్యవహరించి మానవతా సాయం అందించింది. ఇప్పుడు.. ఆర్మేనియా దేశం భూకంపంతో విలవిల్లాడుతున్న తుర్కియేకు రిటర్న్ గిఫ్టు అందించింది. నేనున్నానంటూ ఆర్మేనియా ఆపన్నహస్తం చాచింది. ఈ క్రమంలోనే దాదాపు 35 ఏళ్లకు ఆ రెండు దేశాల మధ్య మొదటిసారి సరిహద్దు పాయింట్‌ నుంచి రాకపోకలు మొదలయ్యాయి. ఇకపై ఈ రెండు దేశాల మధ్య సరిహద్దులు తెరుచుకునే ఉండబోతున్నాయి.

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, నీళ్లు, ఔషధాలు, ఇతర సామగ్రి చేరవేసేందుకు అర్మేనియాకు చెందిన ఐదు ట్రక్కులు ఇక్కడి అలికాన్ సరిహద్దు ప్రాంతంనుంచి తుర్కియేలోకి ప్రవేశించాయి. అర్మేనియాకు తుర్కియే ప్రత్యేక ప్రతినిధి సెర్దార్ కిలిక్ శనివారం ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. సాయానికి ధన్యవాదాలు తెలిపారు. 1988లో అర్మేనియాలో భారీ భూకంపం సంభవించి.. దాదాపు 25 నుంచి 30 వేల మంది మృతి చెందారు. ఆ విపత్కర సమయంలో బాధిత దేశానికి తుర్కియే సాయం అందించింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య సరిహద్దు పాయింట్‌ను తెరవడం ఇదే మొదటిసారని స్థానిక వార్తా సంస్థ తెలిపింది. ఇదిలా ఉండగా.. తుర్కియే, అర్మేనియాలు ఎప్పుడూ అధికారిక దౌత్య సంబంధాలను ఏర్పరచుకోలేదు. 1990ల నాటినుంచి వారి ఉమ్మడి సరిహద్దు మూసి ఉంది.

ఒట్టోమన్ సామ్రాజ్యంలో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అర్మేనియన్ల ఊచకోతతో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, ఈ ఆరోపణలను తుర్కియే కొట్టిపారేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే.. ఇరుదేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు వీలుగా 2021లో రెండు దేశాలు ప్రత్యేక దూతలను నియమించాయి. వాటి మధ్య పలుమార్లు చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తుర్కియే సిరియాల్లో పెను భూకంపం సంభవించింది. ముప్పై వేలకు పైగా జనం మ్రుతి చెందారు. దీంతో అంతర్జాతీయంగా సాయం అందుతోంది. ఈ సందర్భంగా ఆర్మేనియా, టర్కీకి సహాయాన్ని పంపింది. ఇది ఎందుకంత ప్రత్యేకం అంటే పాకిస్తాన్, భారత్ లాగే ఈ రెండు దేశాలు కూడా బద్ధ శత్రువులుగా ఉంటాయి. ఎప్పుడూ ఏదో వివాదం వీటి మధ్య కొనసాగుతూ ఉంటుంది.

అయితే టర్కీ, ఆర్మేనియాల శతృత్వం రాను రానూ మరింత పెరుగుతోంది. గత 35 ఏళ్లుగా ఈ రెండు దేశాల సరిహద్దులు మూసే ఉన్నాయి. చర్చలు ఎప్పుడూ అసంపూర్తిగానే ముగుస్తుంటాయి. దాదాపుగా 35 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఇరు దేశాల మధ్య సరిహద్దు మళ్లీ ప్రారంభం అయింది. ఆహారంతో కూడిన ఐదు ట్రక్కులు ఆర్మేనియా నుంచి టర్కీకి చేరుకున్నాయి. 1988 తర్వాత ఇప్పుడే తొలిసారిగా ఈ సరిహద్దులను తెరిచారు. ఆహారంతో పాటు మెడిసిన్స్ ను ఆర్మేనియా, టర్కీకి పంపింది. సాయం చేసినందుకు టర్కీ ప్రత్యేక రాయబారి సెర్దార్ కిలిక్, ఆర్మేనియా నేషనల్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ రూబెన్ రూబినియన్ కు ట్వీట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఒకరకంగా భూకంపం కారణంగా ఈ రెండు దేశాల మధ్య మంచే జరిగిందని అంటున్నారు విశ్లేషకులు.

2021 డిసెంబర్ లో నగోర్నో-కరాబాఖ్ ప్రాంతంపై ఆర్మేనియా, అజర్ బైజాన్ మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఆర్మేనియాకు వ్యతిరేకంగా అజర్ బైజాన్ కు టర్కీ మద్దతు ఇచ్చింది, అత్యాధుని ఆయుధాలు ఇవ్వడం ద్వారా అజర్ బైజాన్, ఆర్మేనియాపై గెలిచింది. ఈ యుద్ధం తరువాత రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొనేందుకు ప్రత్యేక రాయబారులను నియమించుకున్నాయి. రెండేళ్ల తరువాత టర్కీ, ఆర్మేనియా 2022 ఫిబ్రవరిలో తొలి వాణిజ్య విమానాల సర్వీసులను తిరిగి ప్రారంభించాయి. రెండు దేశాల సరిహద్దు వివాదం వల్ల 1993 నుంచి భూ సరిహద్దు మూసివేశారు. అయితే ఈసారి తెరచుకున్న తలుపులు ఇక మూసివేయకుండా కాపాడుకోవాలని రెండు దేశాలు భావిస్తుండటం విశేషం

Must Read

spot_img