- ఇప్పటికే ప్రకృతి భీభత్సాలతో అల్లాడిపోతోన్న భూ గ్రహం.. మరో ప్రమాదంలో పడనుందా..?
- ఆకాశాన దూసుకొస్తోన్న ఓ గ్రహ శకలంతో ముప్పు రానుందా..?
- దీనిపై నాసా వెల్లడిస్తోన్న వాస్తవాలేమిటి..?
- ఈ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొంటే, ఏ ఏ దేశాలకు ప్రమాదం వాటిల్లనుంది..?
- ఆస్టరాయిడ్స్..భూమిపై పడడం కామనే గానీ..తాజాగా ఓ తోకచుక్క..మహా విధ్వంసాన్ని సృష్టించనుందన్న వార్తలు..ఇప్పుబు భూగ్రహ వాసులకు టెన్షన్ తెప్పిస్తోందా..?
- ఇంతకీ ఏమిటా గ్రహ శకలం.. ఇది భూమిని ఢీకొంటే, తలెత్తే ప్రమాదం ఏమిటి..?
- దీనిపై నాసా శాస్త్రవేత్తలు ఏమంటున్నారు..?
- దీని ఎఫెక్ట్ భూమిపైన మరీ ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాలపై కనపడనుందన్నది ఆసక్తికరంగా మారింది.
2046 .. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజును గ్రాండ్గా సెలబ్రేషన్ ప్లాన్ చేస్తున్నా రా? అయితే, విరమించుకోండి.. మీరు విన్నది నిజమే.. ఎందుకంటే.. ఆ రోజున ఓ గ్రహ శకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందట. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఈ మేరకు హెచ్చరించింది. మరి ఏమిటా గ్రహశకలం ? ఎక్కడ పడే అవకాశముంది? ఎంత నష్టం జరుగుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక భారీ గ్రహశకలం .. దాదాపు ఆరు కోట్ల ఏళ్ల కింద భూమిని ఢీకొడితే డైనోసార్లు సహా 90శాతానికిపైగా జీవరాశి తుడిచిపెట్టుకుపోయింది. తర్వాత మరికొన్ని గ్రహశకలాలు వాటి స్థాయిలో విధ్వంసం సృష్టించాయి.
ఇప్పుడూ అలాంటి ప్రమాదం ముంచుకు వస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా హెచ్చరించింది. 2046 ఫిబ్రవరి 14న సాయంత్రం 4.44 గంటలకు 2023డీడబ్ల్యూ గ్రహశకలం భూమిని ఢీకొనవచ్చని పేర్కొంది. ఫిబ్రవరి 15న తెల్లవారుజామున 3.14 గం టలకు .. ఇటలీలోని పీసా టవర్ కు కాస్త దగ్గరగా 165 అడుగుల పరిమాణంలో ఈ గ్రహ శకలం ఉందని తెలిపింది. 2023డీడబ్ల్యూ గ్రహశకలాన్ని కొన్ని వారాల క్రితమే గుర్తించారు. దాని ప్రయాణమార్గం, వేగం, ఇతర అంశాలను పరిశీలించిన ఓ ఇటాలియన్ ఆస్ట్రానమర్..భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసాను అలర్ట్ చేశారు. తొలుత 1,200 చాన్సుల్లో ఒకసారి అది ఢీకొట్టవచ్చని భావించారు. నిశితంగా పరిశీలించాక.. 710 చాన్సు ల్లో ఒకసారికి, తర్వాత 560 చాన్సు ల్లో ఒకసారికి మార్చారు.
అంటే ప్రమాద అవకాశం మరింత పెరుగుతోందన్న మాట. 2023డీడబ్ల్యూ గ్రహశకలం హిందూ మహా సముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రం దాకా ఎక్క డైనా పడొచ్చని నాసా అంచనా వేసింది. అమెరికాలోని హవాయి, లాస్ ఏంజెలిస్, వాషింగ్టన్ వంటి నగరాలూ ఈ మార్గంలో ఉన్నాయని పేర్కొంది. నాసా అంచనా వేసిన మ్యాప్ ప్రకారం .. తర్వాతి స్థానాల్లో ఇండోనేషియా, ఫిలిప్పీ న్స్, థాయ్ లాండ్, ఇండియా, గల్ఫ్ దేశాలు కూడా ఉన్నాయి. అయితే.. వీటికి ప్రమాదం
తక్కువ. భూకం పాలను రిక్టర్ స్కే ల్ తో కొలిచినట్టే.. గ్రహశకలాలు ఢీకొట్టే ప్రమాదాన్ని టొరినో స్కే ల్ తో కొలుస్తారు.
దాని పరిమాణం, వేగం, భూమికి ఎంత దగ్గరగా ప్రయాణిస్తుందనే అంశాల ఆధారంగా లెవల్ రేటింగ్ ఇస్తారు. 2023డీడబ్ల్యూ తో ప్రమాదాన్ని లెవల్ –1 వద్ద సూచించారు. మరింత కచ్చితమైన పరిశీలన తర్వా త స్థాయిని పెంచుతారు. లెవల్ –3దాటితే ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తారు. 1908లో దాదాపు 160 అడుగుల గ్రహశకలం రష్యాలోని సైబీరియా గగనతలంలో ఐదారు కిలోమీటర్ల ఎత్తులో పేలిపోయింది. దీని ధాటికి సుమారు 2వేల చదరపు కిలోమీటర్లలో అడవి, జీవజాలం నాశనమైంది. జనావాసాలకు దూరంగా జరగడంతో మరణాలు నమోదు కాలేదు.
కానీ ఆ పేలుడు తీవ్రత జపాన్ లోని హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే వెయ్యి రెట్లు ఎక్కువని, నేరుగా భూమిని ఢీకొని ఉంటే భారీ విధ్వంసం జరిగేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నా రు. ఇప్పుడు 2023డీడబ్ల్యూ గ్రహశకలం జనావాసాలు ఉన్న చోట ఢీకొంటే, ఒక పెద్ద నగరమంత వైశాల్యంలో అంతా నామరూపాలు లేకుండా పోతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఓ కొత్త గ్రహ శకలం భూమి వైపు దూసుకొస్తోందని నాసా తెలిపింది. ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ సైజులో ఉన్న ఈ గ్రహ శకలం 2046 వాలెంటైన్స్ డే నాడు భూమిని తాకవచ్చని అంచనా వేసింది. అయితే, భూమిపై దీని ప్రభావం అంతగా ఉండదని నాసా ట్వీట్ చేసింది. ఈ గ్రహశకలం భూమికి సుమారు 18 లక్షల కిమీ చేరువగా రావచ్చని నాసా చెబుతోంది.
పరిశోధకులు మరింత డాటా సేకరిస్తున్నారు. కొత్త సమాచారం తెలుస్తున్న కొద్దీ అంచనాలు మారవచ్చు. ఈ గ్రహ శకలాన్ని 2023 DWగా పిలుస్తున్నారు. ఇది భూమిని ఢీకొనే అవకాశం 560 లో 1 గా ఉందని నాసా తెలిపింది. నాసా రిస్క్ లిస్ట్‌లో ఉన్న ఏకైక స్పేస్ రాక్ ఇది. టొరినో ఇంపాక్ట్ హజార్డ్ స్కేల్‌పై 1వ స్థానంలో ఉంది. ఈ స్కేలుపై 0 నుంచి 10 వరకు అంకెలు ఉంటాయి. స్పేస్ రాక్ భూమిని తాకే అవకాశాలకు ఈ స్కేలు కొలప్రమాణం. స్కేలుపై 0 వస్తే, భూమికి ఏ ముప్పూ లేదని అర్థం. స్కేలుపై 1 వస్తే భూమిని ఢీకొట్టే అవకాశాలు చాలా తక్కువ.
కంగారుపడాల్సి న అవసరం లేదని నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ తెలిపింది. 2023 డీడబ్ల్యూ భూమిని తాకినా పెద్దగా ప్రమాదం ఉండదని చెబుతున్నారు. సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం ఆకాశం నుంచి దూసూకొచ్చిన గ్రహ శకలం భూమిని తాకినపుడు డైనోసార్లు అంతమైపోయాయి. ఆ ఆస్టరాయిడ్ భూమికి 12 కిమీ దగ్గరకు వచ్చినప్పుడు 2023 డీడబ్ల్యూ కన్నా చాలా పెద్దగా ఉందని సైంటిఫిక్ అమెరికన్ తెలిపింది. అయితే, 2023 డీడబ్ల్యూ భూమిపై ఏదైనా ప్రధాన నగరాన్ని లేదా జనాభా ఎక్కువ గల ప్రాంతాన్ని తాకితే ప్రమాదం సంభవించవచ్చు.
2023 డీడబ్ల్యూలో సగం కన్నా తక్కువ పరిమాణంలో ఉన్న ఒక ఉల్కాపాతం 10 సంవత్సరాల క్రితం రష్యాలోని చెల్యాబిన్స్క్ ప్రాంతాన్ని వేగంగా తాకింది. దీని ప్రభావం 200 చ.మైళ్ల దూరం వరకు విస్తరించింది. అక్కడున్న ఇళ్ల కిటీకీలన్నీ పగిలిపోయాయి. సుమారు 1,500 మంది గాయపడ్డారు. అయితే, 2023 డీడబ్ల్యూ ఆస్టరాయిడ్ భూమిని తాకకుండా పక్క నుంచి వెళ్లిపోవచ్చని చెబుతున్నారు. కాగా, ఎప్పుడైనా ఏదైనా గ్రహ శకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని ఊహిస్తున్న సైంటిస్టులు, దాన్ని ఎదుర్కొనేందుకు చాలా కాలం నుంచి సన్నాహాలు చేస్తున్నారు.
గత అక్టోబర్‌లో నాసా చేపట్టిన డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ ప్రయోగం విజయవంతమైందని ఆ సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా ఒక స్పేస్‌క్రాఫ్ట్‌ను గాల్లోకి పంపి, భూమి వైపు వస్తున్న ఓ చిన్న ఆస్టరాయిడ్ మార్గాన్ని తప్పించారు. ఇలాంటిది జరుగుతుందని ఊహించే ఆ ప్రయోగం చేశామని, ఆది గొప్ప విజయం సాధించిందని నిపుణులు చెబుతున్నారు. భూమికి అత్యంత సమీపంలోకి రానున్న ఐదు గ్రహ శకలాలపై నాసా సహా పలు అంతరిక్ష పరిశోధన సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. కాగా.. Asteroid 2023 CA3 అనే పేరున్న ఈ గ్రహ శకలం భూమికి ఫిబ్రవరి 17న అత్యంత సమీపంలోకి అంటే, సుమారు 22 లక్షల కిలోమీటర్ల సమీపంలోకి రానుంది. ఈ ఆస్టరాయిడ్ 32 నుంచి 75 అడుగుల విస్తీర్ణంతో ఉంది.
గ్రహానికి సంభవించే ప్రమాదం భూమిపై సంభవించే అత్యంత చెత్త ప్రకృతి వైపరీత్యాల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రీసెర్చర్లు, ఖగోళ శాస్త్రవేత్తలు, నాసా సమీపంలోని గ్రహశకలాలను పర్యవేక్షిస్తారు. గ్రహంపై ఏదైనా ముప్పు ఉందో లేదో తెలుసుకోవడానికి వాటి గమనాన్ని లెక్కిస్తారు. CW2 అనే ఈ చిన్న
ఆస్టరాయిడ్ కూడా ఫిబ్రవరి 17వ తేదీననే భూమికి సమీపంగా రానుంది. కేవలం 11 అడుగుల నుంచి 23 అడుగుల మధ్య ఉన్న వెడల్పుతో ఇది గంటకు 8112 వేగంతో భూమివైపు వస్తోంది. DG4 భూమిని సమీపిస్తున్న మరో గ్రహ శకలం ఇది.
దీని సైజు సుమారు 20 అడుగుల నుంచి 45 అడుగుల మధ్య ఉంటుంది. CC1 గ్రహ శకలం ఫిబ్రవరి 18వ తేదీన భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. భూమి వైపు ఒక భారీ గ్రహ శకలం దూసుకొస్తున్నదని నాసా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది ఎంతో వేగంగా భూమివైపునకు వస్తున్నదని తెలిపారు. భూమిపై పడితే ఎంతో ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ప్రకృతి ప్రకోపాలతో అల్లాడిపోతోన్న భూమి .. ఇప్పుడు ఆకాశం నుంచి కూడా ముప్పును ఎదుర్కోవాల్సి వస్తోందన్న వార్తలు భయాందోళనలకు కారణమవుతున్నాయి. దీనిపై నాసా శాస్త్రవేత్తల సూచనలు సైతం .. సర్వత్రా అలజడికి కారణమవుతున్నాయి.