Homeఅంతర్జాతీయంభూమి ఇన్నర్ కోర్ వేగం ఎందుకు తగ్గింది ?

భూమి ఇన్నర్ కోర్ వేగం ఎందుకు తగ్గింది ?

ఇంతకూ ఇన్నర్ కోర్..? ఔటర్ కోర్ అంటే ఏంటి… ?

భూమి ఇన్నర్ కోర్ లో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి..?

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుందనేది జగమెరిగిన సత్యం. అయితే, ఇన్నాళ్లు మనం భూమి మొత్తం దాని చుట్టూ అది తిరుగుతుందని భావించాం. అయితే, పరిశోధకులు మాత్రం.. భూమిలోని లేయర్స్ కూడా పరిభ్రమిస్తుంటాయని చెబుతున్నారు. అంటే, భూమి లోపలి భాగం పొరలు పొరలుగా ఉంటుందని, మనం జీవిస్తున్న భూమి ఉపరితలం మాత్రం కొండలు,కోనలు, మైదనాలు, సముద్రాలతో నిండి ఉంటుందని పేర్కొన్నారు. భూమిపైన పైన మనకు కనిపించే భాగాన్ని ఎర్త్ క్రస్ట్ అని అంటారు. ఈ ఎర్త్ క్రస్ట్ ఎక్కడి వరకూ ఉంటుందంటే..

సముద్రం లోపలికి వెళ్లిపోయి అక్కడ డ్రిల్లింగ్ చేసుకుంటూ ఓ వంద కిలోమీటర్ల వరకూ వెళ్లాం అనుకోండి. అక్కడ వరకూ ఎర్త్ క్రస్ట్ ఉంటుందనిఅనుకోవచ్చు. ఈ వంద కిలోమీటర్లలోనే డైమండ్స్, కోల్, రాళ్లు, రప్పలు అన్నీ ఉంటాయి. అంటే ఇందతా గడ్డకట్టిపోయిన పదార్థం అన్నమాట. ఔటర్ కోర్ కంటే ఇన్నర్ కోర్ తిరుగుతున్న వేగం తగ్గడానికి గల కారణాలు ఏంటి..? ఇంతకూ భూమిలో ఏం జరుగుతోంది..? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి..?

ఇంకా ఆ వంద కిలోమీటర్లు దాటి లోపలికి వెళితే వచ్చే లేయర్ ను మాంటెల్ అంటారు. ఈ లేయల్ సుమారు 2900 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. మళ్లీ ఇందులో చాలా సబ్ డివైడ్స్ ఉంటాయి.సాధారణంగా మాంటెల్ అనుకునేది సముద్ర గర్భం నుంచి 2900 కిలోమీటర్ల లోపల ఉండే పొర అన్నమాట. ఇక్కడే సిలికాన్, ఆక్సిజన్ కాంపౌండ్స్ అన్నీ తయారవుతాయని సైంటిస్టులు భావిస్తున్నారు.ఇంకా మాంటెల్ పొరను కూడా దాటేస్తే ఉండేది ఔటర్ కోర్.

ఇది సముద్ర గర్భం నుంచి 5100 కిలోమీటర్లు లోపలికి ఉంటుంది. ఈ ఔటర్ కోర్ అంతా కూడా లిక్విడ్ ఐరన్, నికెల్‌ తో నిండి ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తే 6378 కిలోమీటర్ల వరకూ ఉండేది ఇన్నర్ కోర్. దీని రేడియస్ సుమారు 1220 కిలోమీటర్లు ఉంటుంది. అంటే మన భూమి ఇన్నర్ కోర్ ప్లూటో గ్రహమంత ఉంటుందన్నమాట. ఇదంతా లిక్విడ్‌లా ఉంటుంది. అది కూడా ఐరన్ లిక్విడ్.

సాధారణంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రతకే మనం అల్లాడిపోతాం. అలాంటిది భూమి ఇన్నర్ కోర్‌లో ఉండే 5200 డిగ్రీల టెంపరేచర్‌ను భరించగలమా…? కనీసం బూడిద కూడా మిగలదు. ఇన్నర్ కోర్ ఆరంభానికి చేరుకొనేసరికే ఆవిరైపోతాం.ఇన్నర్ కోర్, ఔటర్ కోర్‌లు తిరిగే దిశలు వేరుగా ఉంటాయి.. భూమి ఎలా తిరుగుతుందో ఈ ఇన్నర్ కోర్ కూడా లోపల అలాగే తిరుగుతూ ఉంటుంది.

ఇన్నర్ కోర్ పైన ఉన్న ఔటర్ కోర్ మాగ్నటిక్ ఫీల్డ్ వల్ల ఈ ఇన్నర్ కోర్ తిరుగుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. ఆ ఔటర్ కోర్ మీద మాంటెల్ గ్రావిటీ కారణంగా.. ఆ ఔటర్ కోర్ మాగ్నటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తోందట. సాధారణంగా భూమి ఊపరితలం ఏ దిశలో తిరుగుతుంటే.. అదే దిశలో ఇన్నర్ కోర్ తిరగాలి కదా. కానీ, అలా కాదు.. అది దాని ఇష్ట ప్రకారం తిరుగుతుందట.అసలు సమస్య ఇదే… తాజాగా పరిశోధకులు ఓ షాకింగ్ విషయాన్ని కనిపెట్టారు.

యాంగ్ యీ, సాంగ్ షియా డాంగ్ అని చైనాలోని పెర్కింగ్ యూనివర్సిటీ చెందిన ఇద్దరు సైంటిస్టులు నేచుర్ జియో సైన్స్ అనే జర్నల్ కి ఓ ఆర్టికల్ రాశారు. ఈ ఇన్నర్ కోర్ పైన తిరుగుతున్న భూమి కంటే స్లోగా తిరుగుతుంది అని. 2009 నుంచి ఇలా స్లోగా తిరుగుతోందని పేర్కొన్నారు. అప్పటి నుంచి వస్తున్న భూకంపాల కారణంగా గ్రాఫ్స్ గీస్తే ఇది స్పష్టమైందని తెలిపారు. అది తిరగటం మానేస్తే పైన భూమి కూడా తిరగటం మానేస్తుందా అనే కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు.

ఇలా ఇన్నర్ కోర్ స్లో డౌన్ అవ్వటం… పైన భూమి తిరుగుతున్న దానికి వ్యతిరేక దిశలో జరగటం అనేది ఓ సైకిల్‌లా ప్రతీ 70 ఏళ్లకు ఓ సారి జరుగుతోంది.. 1970కు ముందు ఈ ఇన్నర్ కోర్ అనేది భూమి వేగం కంటే ఎక్కువగా ఉండేదని, ఆ తర్వాత తగ్గిందని అంచనా వేస్తున్నారు. మళ్లీ 2040 తర్వాత అంటే 70 ఏళ్ల తర్వాత ఈ ఇన్నర్ కోర్ వేగం పెరుగుతుందని భావిస్తున్నారు.

ఇప్పుడు ఈ వేగం పెరిగి తగ్గే టైంలో ప్రతీ 70 ఏళ్లకు ఓసారి ఇన్నర్ కోర్ కాసేపు ఆగిపోతుంది. దీనివల్ల ప్రజల ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు. కానీ, మన టైమ్ లో తేడాలు వస్తాయి. కొన్ని మిల్లీ సెకండ్లు తగ్గిపోతాయి. పగటి పూటలు తగ్గిపోతాయి. అయితే, ఇలా కోర్ ప్రతీ 70 ఏళ్లకు ఎందుకు వేగం పెంచుకుని తగ్గించుకుంటుందనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ రహస్యం సైంటిస్టులకు కూడా అంతు చిక్కడం లేదు.

భూమి లోపలి ప్రాంతం ఒక రహస్య ప్రదేశం. అయితే ఇందుకు సంబంధించిన ఓ సీక్రెట్‌ ను కనుగొన్నారు పరిశోధకులు. తాజా అధ్యయనం ప్రకారం దశాబ్దాల సుదీర్ఘ చక్రంలో భాగంగా భూమి అంతర్గత కోర్ తిరగడం ఆగిపోయిందని గుర్తించారు. ఈ కోర్ సూపర్ అయానిక్ ఐరన్ అల్లాయ్‌గా ఉండే అవకాశం ఉందంటున్నారు… భూమి ఉపరితలంతో పోలిస్తే, దాని లోపలి కోర్ 2009లో తిరుగుతూ ఆగిపోయింది.

ఇది సాధ్యమే అంటున్న సైంటిస్టులు.. ఎందుకంటే ఇన్నర్ కోర్ అనేది లిక్విడ్ ఔటర్ కోర్‌ లో తేలియాడే సాలిడ్ ఐరన్ బాల్ లాంటిదని చెప్తున్నారు. భ్రమణం తప్పనిసరిగా మిగిలిన గ్రహంతో ముడిపడి ఉండదని వివరించారు పెకింగ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు. 1960ల నుంచి అంతర్గత కోర్ గుండా భూకంపాల నుంచి వచ్చే భూకంప తరంగాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. ఆ తరంగాలు ఎలా కనిపిస్తున్నాయి? అవి ప్రోపగేట్ అయ్యేందుకు ఎంత సమయం పట్టింది…? అనే తేడాలను పరిశోధించారు.

ఆశ్చర్యకరంగా దశాబ్దాలుగా ఈ తరంగాల ప్రయాణ సమయాలు నిర్దిష్ట మార్గాల్లో మారుతున్నాయని కనుగొన్నారు. కానీ, దాదాపు 2009 తర్వాత ఆ వైవిధ్యం పూర్తిగా అదృశ్యమైంది. ప్రయాణ సమయాలు స్థిరంగా ఉన్నాయి. ఇది కోర్ భ్రమణం ‘పాజ్ చేయబడింది’ అని సూచిస్తుందని బృందం పేర్కొంది. అలాగని అసలు స్పిన్నింగ్ ఉండదని అర్థం కాదన్న శాస్త్రవేత్తలు..

అంతర్గత కోర్ మందగించే భ్రమణం ఉపరితలంతో పోలిస్తే వెనక్కి కూరుకుపోతున్నట్లు కనిపిస్తుంది.. పరిశోధకుల ప్రకారం.. ఇదంతా 70 సంవత్సరాల చక్రంలో భాగం. మునుపటి తిరోగమనం 1970ల ప్రారంభంలో జరిగింది. ఇది భూమి చక్రాలలో అయస్కాంత క్షేత్రం, రోజు పొడవు వంటి ఇతర గమనించిన మార్పులతో కూడా సమానంగా ఉండవచ్చు. ఈ చక్రం కారణం అనేక ప్రధాన పోటీ శక్తులు కావచ్చు. బాహ్య కోర్ ద్వారా ఉత్పత్తి చేయబడిన అయస్కాంత క్షేత్రం లోపలి కోర్ స్పిన్‌ను వేగవంతం చేస్తుంది. అయితే మాంటిల్ భారీ గురుత్వాకర్షణ ప్రభావం దానిపైకి లాగి, స్పిన్‌ను నెమ్మదిస్తుంది.

భూమి యొక్క అంతర్గత కోర్ భూమి గ్రహం యొక్క అంతర్గత భూగర్భ పొర.. ఇది ప్రాథమికంగా 1,220 కి.మీ వ్యాసార్థంతో ఘనమైన బంతి, ఇది భూమి యొక్క వ్యాసార్థంలో 20% లేదా చంద్రుని వ్యాసార్థంలో 70% ఉంటుంది. భూమి యొక్క మాంటిల్ కు ఉన్నట్లుగా, ప్రత్యక్ష కొలత కోసం భూమి యొక్క కోర్ యొక్క నమూనాలు అందుబాటులో లేవు. భూమి యొక్క కోర్ గురించిన సమాచారం ఎక్కువగా భూకంప తరంగాలు, భూమి యొక్క అయస్కాంత క్షేత్రం యొక్క విశ్లేషణ నుండి వస్తుంది.. లోపలి కోర్ కొన్ని ఇతర మూలకాలతో ఇనుము – నికెల్ మిశ్రమంతో కూడి ఉంటుందని నమ్ముతారు. లోపలి కోర్ ఉపరితలం వద్ద ఉష్ణోగ్రత సుమారుగా 5,700 K గా అంచనా వేయబడింది

భూమి లోపలి ప్రాంతం ఒక రహస్య ప్రదేశం. అయితే ఇందుకు సంబంధించిన ఓ సీక్రెట్‌ ను కనుగొన్నారు పరిశోధకులు. తాజా అధ్యయనం ప్రకారం దశాబ్దాల సుదీర్ఘ చక్రంలో భాగంగా భూమి అంతర్గత కోర్ తిరగడం ఆగిపోయిందని గుర్తించారు.

Must Read

spot_img